గత కొద్ది రోజులుగా మీలో కొంత మంది గమనించే ఉంటారు. 31-3-2020తో పూర్తయిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో కొంత మందికి నోటీసులు వచ్చాయి. సెక్షన్ 139(9) ప్రకారం డిపార్టుమెంటు వారు నోటీసులు ఇవ్వొచ్చు. ఈ నోటీసుకి బదులుగా రిటర్నుని సరిచేస్తూ 15 రోజుల్లో తెలియజేయాలి.
ఏ సందర్భంలో తప్పులు జరిగే అవకాశం ఉందంటే..
- సరైన ఫారంలో రిటర్న్ ఫైల్ చేసి ఉండకపోతే.. ఉదాహరణకు ఫారం 2కి బదులుగా ఫారం 3 ఫైల్ చేయడం వంటివి.
- రిటర్నుల్లో అంశాలకు సంబంధించి వివరాలు పొందుపర్చకపోవడం. నింపకపోవడం. తప్పుగా రాయడం.
- ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. ప్రతీ కాలమ్‌కి బదులివ్వాలి. కొన్ని మీకు వర్తించవు. కొన్ని మీకు ఉండకపోవచ్చు. వర్తించకపోతే ‘నాట్ అప్లికేబుల్’ అని రాయాలి. ఉండకపోతే ‘నిల్’ అని రాయాలి. ఆన్‌లైన్ ఫైలింగ్‌లో చిన్న తప్పు జరిగినా, రిటర్ను డిఫెక్టివ్ అయిపోతుంది.
- ఆదాయం వివరాలను తప్పుగా డిక్లేర్ చేసినా, టీడీఎస్ మొత్తానికి.. ఆదాయానికి పొంతన లేకపోయినా.. అంటే ఉదాహరణకు వడ్డీకి సంబంధించిన టీడీఎస్ చూపించి ఆ ఆదాయాన్ని చూపించకపోవడం లాంటి తప్పిదాలు.
- అకౌంట్ బుక్స్ కంపల్సరీ అయిన చోట ‘అవసరం లేదు’ అని రాయడం. ఆడిట్ అవసరం అయిన చోట ఆ వివరాలు రాయకపోవడం, వివరాలను తప్పుగా రాయడం .. ట్యాక్స్ ఆడిట్ వివరాలు రాయకపోవడం లేదా తప్పుగా రాయడం మొదలైనవి
- ఊహాజనిత పన్ను చెల్లించినప్పుడు వివరాలు ఇవ్వకపోవడం, తప్పుగా రాయడం
- పన్నులు చెల్లించిన వివరాలు పొందుపర్చకపోవడం, పన్నుల వివరాలు సరిపోలకపోవడం
- సమాచారం తప్పుగా రాయడం.. వ్యత్యాసాలు కనిపించడం, షెడ్యూల్‌లో వివరాలు తప్పుగా రాయడం వంటి తప్పిదాలు
ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు నోటీసులు రావచ్చు. అయితే, ఆ నోటీసులు రాగానే..
- భయపడనవసరం లేదు.
- ‘డిఫెక్ట్’ ఏమిటో తెలుసుకోండి. వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
- నోటీసు కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేయండి
- ‘డిఫెక్ట్’ని అర్థం చేసుకోండి.
- వారు పేర్కొన్న ‘డిఫెక్ట్’ని అంగీకరించిన పక్షంలో, ఒప్పుకున్నామని తెలియజేస్తూ దాన్ని సరిచేయండి.
- ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ‘నో’ అని జవాబు ఇవ్వండి. ఇందుకు తగిన కారణాలు చెప్పాలి.
- జవాబు 15 రోజుల్లోగా ఇవ్వాలి
- అలా ఇవ్వకపోతే రిటర్ను రద్దు అయిపోతుంది. మీరు రిటర్నులు దాఖలు చేసినట్లుగా పరిగణించరు.
- డిఫెక్ట్‌ని సరిచేసినప్పుడు సమగ్ర సమాచారం ఇవ్వాలి. రిటర్నుని మళ్లీ నింపాల్సి రావచ్చు.
- రిఫరెన్సులు ఇవ్వాలి. స్క్రీన్ మీద అన్ని వివరాలు వస్తాయి. ఓపిగ్గా.. జాగ్రత్తగా సరిచేయండి.
ట్యాక్సేషన్ నిపుణులు:
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూరి
కె.వి.ఎన్ లావణ్య
Comments
Please login to add a commentAdd a comment