Income Tax (IT)
-
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్‌లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -
ఏదీ వదలిపెట్టరు: తుది గడువు మే 31
ఆర్థిక సంవత్సరం 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకున్న అన్నీ బ్యాంకు అకౌంట్లలో వ్యవహారాలు జమలు/ఖర్చులు.. అంటే క్రెడిట్లు/డెబిట్లు.. అన్నీ విశ్లేషించిన తర్వాత మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.➤ఏఏ ఆదాయం వచ్చింది? ➤జమ ఆదాయమా కాదా? ➤ఆదాయం అయితే దాని స్వభావం ఏమిటి? ➤జీతమా.. అద్దె? వ్యాపారం మీద వచ్చిందా., వృత్తి వలన వచ్చిందా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిందా? ఇతర ఆదాయమా? ➤ఆదాయం కాకపోతే దేని నిమిత్తం వచ్చింది? ➤ఎవరు ఇచ్చారు? లేదా మీరే చెల్లించారా? ➤వారి వివరాలు.. ఎవరు.. ఎందుకు, ఎలా కావాలి..? ఇక విషయానికొద్దాం..చట్ట ప్రకారం ప్రతి బ్యాంకు దగ్గర ఉన్న కస్టమర్ పొదుపు ఖాతా(సేవింగ్ బ్యాంకు)లో జమలు.., నగదు ఖాతాలు, నగదు డిపాజిట్లు ఒక ఆర్థిక సంవత్సర కాలంలో రూ.10,00,000 దాటితే ఈ వ్యవహారాలన్నీ ఇన్‌కం టాక్స్ వారికి ఒక రిటర్ను ద్వారా తెలియజేయాలి. డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం ప్రతి జమ పంపాల్సిన అవసరం లేదు. కానీ సంవత్సర కాలం నగదు, జమ వెరసి మొత్తం ఎంతో తెలియజేయమన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి ఈ సమాచారం పంపుతారు. దానికి తుది గడువు తేదీ 31.5.2025.ఇవన్నీ డిపార్ట్మెంట్కి చేరిన తర్వాత వారు ఒక పట్టిక తయారుచేస్తారు. ఇది మామూలు పట్టిక కాదు. మిమ్మల్ని పూర్తిగా పట్టించే పట్టిక. దీనినే ఏఐఎస్(యాన్యువల్ ఇన్‌కం స్టేట్మెంట్) అంటారు. ఇందులో ఏమి ఉంటాయంటే జీతం, ఇంటి అద్దె, నగదు జమలు, రూ.50వేలు బ్యాలెన్స్ దాటిన ప్రతి బ్యాంకు అకౌంట్ నిల్వలు, నగదు చెల్లింపులు, క్రిడెట్ కార్డు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు, డివిడెండ్లు, బ్యాంకు ద్వారా వచ్చిన వడ్డీ, మీరు చేసిన డిపాజిట్లు, డిపాజిట్ల మీద వడ్డీ, షేర్ల క్రయవిక్రయాలు, మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు, అమ్మకాల వడ్డీ, చెక్కులతో ఏం కొన్నారో వివరాలు, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చింది, ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చింది, ఇన్‌కం టాక్స్ రిఫండ్ మీద వచ్చిన వడ్డీ, అద్దె చెల్లింపులు, విదేశీ ప్రయాణ చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు, విదేశాల నుంచి వచ్చిన డబ్బులు, ఇతర ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, లాటరీలు, గవర్నమెంట్ బాండ్లు, నాన్ రెసిడెంట్ల మీద వచ్చిన ఆదాయం, ల్యాండ్ అమ్మకాలు, ఆఫ్‌లైన్ డెబిట్లు, క్రెడిట్లు వ్యాపార ఆదాయం, వృత్తి మీద ఆదాయం, వ్యాపార ఖర్చులు, చిల్లర చెల్లింపులు, వాహన కొనుగోలు, ట్రస్ట్ మీద ఆదాయం..ఇలా ఇదో పెద్ద జాబితా.. మీ ఖాతా.., ఏదీ వదలిపెట్టరు. ‘పన్ను ఎగవేత’ ప్లానింగ్‌కు తిలోదకాలు ఇవ్వాలి. సుందరకాండలో హనుమంతుల వారు సీతాదేవీ అన్వేషణలో నాలుగు అంగుళాల జాగా కూడా వదిలిపెట్టలేదు అలా ఉంటుంది డిపార్ట్మెంట్ వైఖరి. వారి వద్ద ఉన్న సమాచారం కాగితాల ప్రకారం కొన్ని వేల కోట్ల కాగితాలు.బైనరీ కోడ్ యూనిట్లలో చెప్పాలంటే కిలో బైట్లు, మెగా బైట్లు, గిగా బైట్లు.., ఇన్ని బైట్లుంటే మన పాట్లు ఏమని చెప్పాలి? అరకొర సిబ్బందే కానీ కోరలు తీయించే సాధనాలు. వేగం, ఖచ్చితత్వం, భద్రత, నిజం, ఋజువుల సహితం సంకట పరిస్థితి. మళ్లీ అందులోనే ఆటవిడుపు. జాలి గడువు. హెచ్చరిక, బోధన, శోధన, మనకు రోదన. దీనికి తగ్గట్లుగా మనం కూడా అన్ని వ్యవహారాలూ ఆన్లైన్ చేస్తున్నాం. గురుత్వాకర్షణ శక్తి రాయి కిందకు పడినట్లు సమాచారం పడవలిసిన వారి చేతుల్లోనే పడింది. మనం బయట పడాలంటే ‘విషయానికి’ మన నిజాయితీ జతకట్టాలి.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చాలా మందికి ఆదాయపన్ను పన్ను భారం తొలగిపోయింది. 2025 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులతో వేతన జీవులు, పెన్షనర్లకు రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల వరకు ఆదాయం మించనప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయం ఈ పరిమితి దాటినప్పుడే వారు తమ మొత్తం ఆదాయంపై నిర్ణీత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.7–7.75 లక్షలుగా ఉన్న పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచేసింది. పాత విధానంలో పన్ను ఆదా కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. వీటికితోడు బీమా ప్రీమియం, ఇంటి రుణం చెల్లింపులు ఇలా ఎన్నో క్లెయిమ్ చేసుకుంటే గానీ పన్ను భారం గణనీయంగా తగ్గేది కాదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఈ తలనొప్పులేవీ లేకుండానే గణనీయమైన ప్రయోజనం కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోకి మారడం, లేదంటే పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించే కథనమిది... ‘‘మన దేశంలో పన్ను రిటర్నులు వేస్తున్న వారిలో 90 శాతం మంది ఆదాయం రూ.13 లక్షల కంటే తక్కువే ఉంది. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి మందే 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించనున్నారు. భారత్‌ను ఆదాయపన్ను రహితంగా మార్చడమే ఇది’’ అంటూ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన విమర్శనాత్మక పోస్ట్ తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. 2023–24 సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మన దేశంలో వేతన జీవుల సగటు ఆదాయం రూ.20,039గా ఉంది. కనుక మెజారిటీ వేతన జీవులే కాదు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలోనూ అధిక శాతం మంది ఆదాయం రూ.12 లక్షల్లోపే ఉంటుంది. కనుక వారికి కొత్త పన్ను విధానమే లాభదాయకం. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుబడులు అన్నవి ఎప్పుడూ తమ లక్ష్యాలు, ఆశించే రాబడి, రిస్క్ సామర్థ్యం వీటన్నింటికీ సరిపోయే సాధనాలతో ఉండాలి. అంతే కానీ పన్ను ఆదా కోసమని చెప్పి మెరుగైన రాబడుల్లేని చోట ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకోవడం కఠినతరం అవుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదా కోసం పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలు కొని జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్, ఎన్సీఎస్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎన్నో సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా పన్ను ఆదా పెట్టుబడులకు మూడు నుంచి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ (అప్పటి వరకు ఉపసంహరణ కుదరదు) కూడా ఉంటుందని మర్చిపోవద్దు. పీపీఎఫ్ అయితే 15 ఏళ్లు. కొత్త పన్ను విధానంలో ఇలాంటి షరతులేవి లేకుండా రూ.12 లక్షలకు మించని ఆదాయం ఉన్న అందరికీ సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కల్పించారు. కనుక తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛ కొత్త విధానం కల్పిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఇతర సాధనాల కంటే ఈక్విటీలే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి మెరుగైన రాబడిని అందిస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. పాత పన్ను విధానంలో పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే పన్ను ఆదా కోసం చూడకుండా ప్యాసివ్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, బంగారంలోనూ పెట్టుబడులకు వీలు కల్పించే మల్టీ అస్సెట్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు ఇలా ఎన్నో విభాగాల నుంచి తమకు అనుకూలమైన వాటిని నిపుణుల సూచనల మేరకు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొత్త.. కొందరికి పాత పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను పెట్టుబడులు, మినహాయింపుల రూపంలో రూ.5,75,000.. వేతనంలో 30 శాతాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి (వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు) నూతన పన్ను విధనామే మెరుగైనది. ఈ కింది టేబుల్లో దీన్ని గుర్తించొచ్చు. ఒకవేళ ఆదాయం రూ.12 లక్షలు మించితే (వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయం దాటితే).. పాత పన్ను విధానంలో అన్ని మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. కొత్త విధానం కంటే పాత విధానంలోనే కొంత అదనంగా ఆదా అవుతుంది. ఉదాహరణబ్యాంక్ ఉద్యోగి మోనాలీ దేవ్ ఆదాయం రూ.20.5 లక్షలు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు ఆమె కారు లేదా ట్యాక్సీ వినియోగించడం లేదు. దీంతో రూ.1.2 లక్షల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌పై పూర్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. నెలల శిశువు కారణంగా ఎలాంటి పర్యటనలకూ వెళ్లే వీలు లేకపోవడంతో రూ.30,000 ఎల్‌టీఏ ప్రయోజనాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఎన్పీఎస్, సెక్షన్ 80సీ, గృహ రుణం చెల్లింపులు రూ.1.6 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.11,500 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో తన ఆదాయంపై ఈ మినహాయింపులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాత విధానంలో ఆమె 2023–24 సంవత్సరానికి రూ.3.15 లక్షల ఆదాయం చెల్లించాల్సి వచి్చంది. నిపుణుల సూచనలతో కొత్త విధానంలో మదింపు చేయగా చెల్లించాల్సిన పన్ను రూ.2.86 లక్షలుగా తేలింది. ఒకవేళ సెక్షన్ 80సీసీడీ (2) కింద కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో.. మూలవేతనంలో 14 శాతం చొప్పున ప్రతి నెలా రూ.15,156ను పనిచేసే సంస్థ నుంచి జమ చేయించుకుంటే అప్పుడు మోనాలీ దేవ్‌కు పన్ను భారం మరో రూ.57,000 తగ్గిపోతుంది. 2025–26 సంవత్సరం నుంచి అమల్లోకి వచి్చన కొత్త పన్ను విధానం శ్లాబుల ప్రకారం అయితే మోనాలీదేవ్ చెల్లించాల్సిన పన్ను (ఎన్పీఎస్ లేకుండా) కేవలం రూ.1.98 లక్షలే. ముందటి ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే రూ.88 వేలు ఆదా అవుతోంది. పనిచేసే సంస్థ నుంచి ఎన్పీఎస్ (కార్పొరేట్ ఎన్పీఎస్) జమ కూడా చేయించుకుంటే ఈ పన్ను ఇంకా తగ్గిపోనుంది. కనుక అధిక ఆదాయం పరిధిలోని వారు పాత–కొత్త విధానంలో మదింపు చేసుకుని తుదిగా తమకు ఏ విధానం లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది గృహ రుణం తీసుకుని ఉండపోవచ్చు. అలాంటి వారు కేవలం హెచ్ఆర్ఏ మినహాయింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది.ఆదాయాన్ని బట్టి మార్పు.. ‘‘కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, అన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటే పాత విధానంలో పన్ను తక్కువ. రూ.60 లక్షలు ఆర్జించే వారు రూ.8.5 లక్షల మినహాయింపు/రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే పాత విధానంలోనే రిటర్నులు వేసుకోవచ్చు’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ సీఈవో సు«దీర్ కౌశిక్ సూచించారు. → రూ.13.75 లక్షల ఆదాయం కలిగి కేవలం రూ.5.25 లక్షల పన్ను మినహాయింపుల వరకే క్లెయిమ్ చేసుకున్నా సరే పాత విధానంలో రూ.57,500 చెల్లించాల్సి వస్తే, కొత్త విధానంలో రూ.75,000 పన్ను పడుతోంది. → రూ.15.75 లక్షల ఆదాయం ఉంటే హెచ్ఆర్ఏ ప్రయోజనం లేకుండా మిగిలిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలోనే పన్ను తక్కువ. → రూ.20 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో (వేతన జీవులు అయితే రూ.20.75 లక్షలు) మళ్లీ ఇది మార్పునకు గురవుతుంది. హెచ్ఆర్ఏను పక్కన పెట్టి చూస్తే పాత విధానంలో రూ.5.25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.2,40,000 కాగా, కొత్త విధానంలో రూ.2 లక్షలే కావడం గమనించొచ్చు. అలాగే రూ.24 లక్షల ఆదాయంపై కొత్త విధానంలో రూ.60 వేలు ఆదా చేసుకోవచ్చు. → రూ.24.75 లక్షలపైన ఆదాయం కలిగిన వారు, మొత్తం మినహాయింపులు/తగ్గింపులు/రాయితీలు అన్నీ రూ.7.75 లక్షలకు మించితే అప్పుడు పాత విధానాన్ని పరిశీలించొచ్చు. → గ్రాంట్ థార్న్టన్ అంచనా ప్రకారం రూ.1.5 కోట్ల ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ ప్రయోజనాలను వినియోగించుకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.40.09 లక్షలు కాగా, కొత్త విధానంలో రూ.48.52 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → పన్నుకు అదనంగా సెస్సు చెల్లించాలి. రూ.50లక్షల ఆదాయం మించిన వారు సర్‌చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ విషయంలో షరతులు గృహ రుణం ఈఎంఐలో అసలు మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బీ కింద పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్ఆర్ఏ రాయితీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే అందరికీ అని చెప్పలేం. ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. → వేతనంలో హెచ్ఆర్ఏ ప్రయోజనం తప్పకుండా ఉండాలి. పనిచేసే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ అద్దె చెల్లించాలి. → తన పేరు లేదా తన జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా రుణం తీసుకుని పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుని చెల్లింపులు చేస్తుండాలి. → రుణంపై ఇల్లు సమకూర్చుకుని అందులోనే నివసిస్తూ.. వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏ ప్రయోజనం తీసుకుంటున్న వారు.. గృహ రుణానికి చెల్లిస్తున్న అసలు, వడ్డీపైనే మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. అద్దె చెల్లించడం లేదు కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అవకాశం లేదు. → ఒకవేళ మీరు పనిచేసే పట్టణంలోనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నారు. కానీ, ఆ ఇంటిలో కాకుండా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటప్పుడు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కార్యాలయానికి, రుణంపై సమకూర్చుకున్న ఇల్లు మరీ దూరంగా ఉంటే తప్పించి హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అర్హులు కారు. కనుక హెచ్ఆర్ఏతోపాటు గృహ రుణంపై గరిష్ట ప్రయోజనం పొందాలంటే పనిచేసే ప్రాంతంలో కాకుండా దూరంగా సొంతిల్లును సమకూర్చుకోవడం ఒక మార్గం. హెచ్ఆర్ఏ సూత్రం → యాజమాన్యం నుంచి స్వీకరించిన వాస్తవ హెచ్ఆర్ఏ → ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం ఇంటి అద్దె నుంచి.. ఏడాదిలో స్వీకరించిన మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలినది. → మూలవేతనం, డీఏలో 40 శాతం (నాన్ మెట్రోలు)/50 శాతం (మెట్రోల్లో నివసించే వారు) → ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకుని పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు పాత విధానంతో పోల్చి చూస్తే నూతన పన్ను విధానంలో చాలా వరకు మినహాయింపులు, రాయితీల్లేవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యయాలను క్లెయిమ్ చేసుకోలేరు. పన్ను ఆదా పెట్టుబడులూ లేవు. గృహ, విద్యా రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకూ ఎలాంటి పన్ను మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. కార్పొరేట్ ఎన్పీఎస్: సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం ఉంది. ఉద్యోగి తరఫున ఎన్పీఎస్ ఖాతాకు యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. మూల వేతనం, డీఏ మొత్తంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట జమ రూ.7.5 లక్షలకే ఇది వర్తిస్తుంది. సర్‌చార్జ్: రూ.5 కోట్లకు పైన ఆదాయం కలిగిన వారికి పాత విధానంలో చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 37 శాతం సర్‌చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇది 25 శాతమే. అలవెన్స్‌లు: దివ్యాంగులకు రవాణా భత్యం, ఉద్యోగులకు అధికారిక ప్రయాణాలు లేదా బదిలీ కోసం చెల్లించే అలవెన్స్, ఆఫీస్‌కు దూరంగా వేరే ప్రాంతంలో డ్యూటీ చేయాల్సి వస్తే చెల్లించే అలవెన్స్‌లకు పన్ను మినహాయింపులున్నాయి. సెక్షన్ 80సీసీహెచ్: అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది.ఏటా మారిపోవచ్చు..!రెండు పన్ను విధానాల్లోనూ తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వేతన జీవులకు ఉంది. ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మారిపోవచ్చు కూడా. వేతనం/పింఛనుతోపాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఈ సదుపాయం లేదు. వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు ఒక్కసారి నూతన విధానంలోకి మారితే.. తిరిగి పాత విధానంలోకి మళ్లేందుకు ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఇక వేతన జీవులు, పెన్షనర్లు సైతం గడువులోపు (జూలై 31) ఐటీఆర్‌లు దాఖలు చేసినట్టయితేనే పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చింది ఎంపిక చేసుకోగలరు. గడువు దాటిన తర్వాత సమర్పించే బీలేటెడ్ రిటర్నులు కొత్త విధానంలోనే సమర్పించడానికి అనుమతి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘వెదర్ ఆప్టింగ్ అవుట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ సెక్షన్ 115బీఏసీ?’’ అని అడుగుతుంది. యస్ అని క్లిక్ చేస్తే పాత విధానంలో పన్ను రిటర్నులు దాఖలవుతాయి. నో అని క్లిక్ చేస్తే ఐటీఆర్ నూతన విధానం కింద సమరి్పంచినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత పన్ను విధానంలో కొనసాగాలా లేక కొత్త విధానంలోకి వెళ్లాలా అనేది ఎంచుకునే పనిలో ఉన్నారు. డిడక్షన్లు, మినహాయింపులకు ప్రసిద్ధి చెందిన పాత పన్ను విధానం గణనీయమైన పెట్టుబడులు, ఖర్చులు ఉన్నవారికి ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది. కానీ దీనికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి.జీతం పొందే ఉద్యోగులుపాత పన్ను విధానం కింద ట్యాక్స్ పేయర్స్ సుమారు 70 డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు, గృహ రుణ వడ్డీకి రూ.2 లక్షల వరకు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) కోసం మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ విధానాన్ని ఎంచుకోవడానికి త్వరపడాల్సిన అవసరం ఉంది. జీతం పొందే ఉద్యోగులు తాము ఈ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తమ యజమానులకు తెలియజేయాలి. తద్వారా టీడీఎస్ (TDS) సరిగ్గా లెక్కించేందుకు వీలుంటుంది. ఈ సమాచారం ఇవ్వకపోతే యజమాన్యాలు కొత్త విధానాన్ని డిఫాల్ట్‌గా అప్లయి చేస్తారు. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ డిడక్షన్లు తక్కువగా ఉంటాయి.వ్యాపారులువ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. వారు పాత విధానాన్ని ఎంచుకోవడానికి ఐటీఆర్ గడువు జూలై 31 లోపల ఫారం 10-IEA ను ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారిని పాత విధానంలో లాక్ చేస్తుంది. కొత్త విధానానికి తిరిగి మారడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గడువు తప్పడం లేదా ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి డీఫాల్ట్‌గా వెళతారు. ఇది వారికి విలువైన డిడక్షన్లను కోల్పోయేలా చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..పన్ను ప్రణాళిక సౌలభ్యంపాత విధానం ఆకర్షణ దాని పన్ను ప్రణాళిక సౌలభ్యంలోనే ఉంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80సీ పెట్టుబడుల వంటి సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించిన డిడక్షన్లు ఉన్న అధిక ఆదాయ వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువ మినహాయింపు పరిమితుల (60–79 సంవత్సరాల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు) నుండి ప్రయోజనం పొందుతారు. అయితే, ఇది అదనపు డాక్యుమెంటేషన్, ఉదాహరణకు అద్దె రసీదులు, పెట్టుబడి రుజువులు, ఐటఆర్ దాఖలు సమయంలో లేదా ఆడిట్ సమయంలో ధ్రువీకరించడానికి అవసరం.రెండూ పోల్చుకోండి..ఆదాయపు పన్ను విభాగం ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి రెండు పన్ను విధానాలనూ పోల్చిచూసుకోవాలని ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాత విధానం ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడతాయి. కొత్త విధానం డిఫాల్ట్‌గా ఉన్నందున, పాత విధానం ప్రయోజనాలను పొందడానికి పన్ను చెల్లింపుదారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. -
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు
నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లు, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు. -
తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. రేపటి నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెగ్యులేటరీ అప్డేట్లు, పన్ను సంస్కరణలు, విధాన మార్పులతోపాటు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపిన కొన్ని విభాగాల్లో మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి కింద తెలుసుకుందాం.ఆదాయపు పన్ను సంస్కరణలుకొత్త పన్ను శ్లాబులు, మినహాయింపులువార్షికంగా రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులను కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది గతంలో రూ.7 లక్షల పరిమితి నుంచి భారీగా పెరిగింది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దాంతో పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది.సెక్షన్ 87ఎ కింద పన్ను మినహాయింపు రూ .25,000 నుంచి రూ.60,000కు పెరుగుతుంది. ఇది రూ.12 లక్షల పన్ను రహిత పరిమితికి మద్దతుగా నిలుస్తుంది. అయితే ప్రత్యేక పన్ను రేట్లు (ఉదా.మూలధన లాభాలు) ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయానికి ఇది వర్తించదు.అధిక టీడీఎస్/ టీసీఎస్ పరిమితులుడిపాజిట్లపై వడ్డీ: సాధారణ పౌరులకు రూ.50,000 (గతంలో రూ.40,000), సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష (గతంలో రూ.50,000) వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు లేదు.టీడీఎస్ మినహాయింపును నెలకు రూ.20,000 (వార్షికంగా రూ.2.4 లక్షలు) నుంచి రూ.50,000 (వార్షికంగా రూ.6 లక్షలు)కు పెంచారు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఆర్ఎస్ కింద విదేశీ రెమిటెన్స్‌లపై టీడీఎస్ రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇది చిన్న లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది.ఐటీఆర్-యూ గడువు: అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్-యూ) దాఖలు చేయడానికి విండో సంబంధిత మదింపు సంవత్సరం చివరి నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు గత ఫైలింగ్‌లను సరిదిద్దడానికి మరింత వెసులుబాటును ఇస్తుంది.పెన్షన్, రిటైర్మెంట్యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్): ఏప్రిల్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ భర్తీ చేస్తుంది. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.డిజిటల్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్యూపీఐ నిబంధనలు: మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడీలను (12 నెలలు ఉపయోగించనివి) డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది. మార్చి 31, 2025లోగా బ్యాంక్ రిజిస్టర్డ్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలి. యూపీఐ లైట్ వినియోగదారులు మెరుగైన భద్రత కోసం తప్పనిసరి పిన్, పాస్ కోడ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో వాలెట్ అమౌంట్‌ను తిరిగి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు.మినిమమ్ బ్యాలెన్స్ఎన్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఏప్రిల్ 1, 2025 నుంచి సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.ఏటీఎం ఛార్జీలునాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు (ఉదా.బ్యాలెన్స్ తనిఖీలు, మినీ స్టేట్మెంట్లు) రుసుము రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రూ.2 వరకు పెరిగే అవకాశం ఉంది.యులిప్‌లపై మూలధన లాభాలువార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) నుంచి ఉపసంహరణలు బడ్జెట్ 2025 ప్రతిపాదనలకు అనుగుణంగా మూలధన లాభాల్లోకి వస్తాయి.వస్తు సేవల పన్ను (జీఎస్టీ)హోటల్ రెస్టారెంట్ సేవలు: రోజుకు రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌తో కలిపి) పరిధిలోకి వస్తాయి. ఇది లగ్జరీ ఆతిథ్య ఖర్చులను ప్రభావితం చేస్తుంది.ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టమ్: రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ఐఎస్డీ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయడం, జీఎస్టీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుఆటోమొబైల్ ధరలుమారుతీ సుజుకి (4% వరకు), హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా (2-4%) వంటి కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి కొనుగోలుదారులను ప్రభావితం చేస్తుంది. -
కొత్త విధానంలో పీపీఎఫ్‌పై ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను నిలిపివేసి, ఆ పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. ఎక్స్పెన్స్ రేషియోని ఆ పెట్టుబడుల నుంచి వసూలు చేస్తూనే ఉంటారా? – అనిల్ మిశ్రామ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినంత కాలం వాటి విలువపై ఎక్స్పెన్స్ రేషియోని అమలు చేస్తుంటారు. ఎక్స్పెన్స్ రేషియో అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ వసూలు చేసే వార్షిక చార్జీ. పెట్టుబడుల నిర్వహణ కోసం అయ్యే వ్యయాలు, ఇతర నిర్వహణ వ్యయాలను చార్జీల రూపంలో వసూలు చేసుకుంటాయి. వార్షిక చార్జీ అయినప్పటికీ.. దీన్ని ఏరోజుకారోజు పెట్టుబడుల విలువ నుంచి మినహాయించుకుంటాయి. మనకు రోజువారీగా మార్పునకు గురయ్యే ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ తెలుసుకదా.చార్జీలను మినహాయించుకున్న తర్వాతే ఈ ఎన్ఏవీ ఖరారవుతుంది. సిప్ నిలిపివేశారంటే అప్పటి నుంచి ఆయా పథకంలో మీరు తాజా పెట్టుబడులు పెట్టరనే అర్థం. కానీ, అప్పటికే చేసిన పెట్టుబడులను ఆ ఫండ్ సంస్థ నిర్వహించాలి కదా. అందుకని తమ నిర్వహణలోని మొత్తం ఆస్తులపై (ఏయూఎం) ఎక్స్పెన్స్ రేషియోని వసూలు చేసుకుంటాయి. కాకపోతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రాబడులను మరింత వృద్ధి చేసుకోవచ్చు. నేను పన్ను ఆదా కోసం ప్రజా భవిష్యనిధి పథకంలో (పీపీఎఫ్) క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపన్నులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలోనూ నేను పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రయోజనం గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది? – బల్లూ నాయక్ఆదాయపన్ను పాత విధానంలో పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే పెట్టుబడి గరిష్టంగా రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా వడ్డీ ఆదాయం, గడువు తీరిన తర్వాత చేతికి వచ్చే మొత్తంపైనా పన్ను లేదు. ఒకవేళ కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టయితే.. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌లో చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ఆదాయపన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది. ఇందులో చాలా వరకు పన్ను మినహాయింపులను తొలగించేశారు.పీపీఎఫ్‌లో పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కూడా కొత్త విధానంలో లేదు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక పాత విధానమా? అన్నది మీ ఆదాయం, మినహాయింపులను ఎంత మేర క్లెయిమ్ చేసుకోగలరన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో పీపీఎఫ్, ఇన్సూరెన్స్, గృహ రుణం చెల్లింపులు.. ఇలా అన్ని రకాల మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అదే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కొత్త విధానం సులభతరంగా, తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది.సమాధానాలు : ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్మెంట్ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్ వ్యక్తులు 👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
నేడు, రేపు తెరిచే ఉండనున్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున జీఎస్టీ, వ్యాట్‌ను వచ్చే 2 రోజుల్లో చెల్లించాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు శనివారం కోరారు. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను మార్చి 30, 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కోసం తెరిచే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో అయితే www.apct.gov.in వెబ్సైట్లో ఈ–పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
వాట్సప్ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ
పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్క్రిప్టెడ్ సందేశాలు, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అక్రమ సిండికేట్ నుంచి రూ.90 కోట్లకు పైగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వాట్సాప్ సందేశాలను డీక్రిప్ట్ చేయడం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్లో ఆమె మాట్లాడారు.ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల దుర్వినియోగం పెరుగుతోందని, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల కోసం నేరగాళ్లు వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘1961 ఆదాయపు పన్ను చట్టంలో ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, లెడ్జర్లు, మాన్యువల్ రికార్డుల గురించే ప్రస్తావించారు. డిజిటల్ రికార్డులను ప్రస్తావించలేదు. ఫిజికల్ లెడ్జర్లను చూపించినప్పటికీ డిజిటల్ రికార్డులు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఎంతో అవసరం. ఈ రెండింటి మధ్య లోటును పూడ్చడమే కొత్త బిల్లు లక్ష్యం’ అని ఆమె పార్లమెంటులో అన్నారు.‘ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు, మొబైల్ ఫోన్లలోని వివరాలు స్కాన్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ.250 కోట్లు లెక్కల్లోకి రాని నిధులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.200 కోట్ల బోగస్ బిల్లులకు పాల్పడిన సిండికేట్లు, తప్పుడు పత్రాలతో భూముల అమ్మకంలో మూలధన లాభాలను తారుమారు చేసిన ఉదంతాలున్నాయి. ఇవి వాట్సాప్ ద్వారా బట్టబయలయ్యాయి. లెక్కల్లోకి రాని లావాదేవీలను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీలను కూడా ఉపయోగించాం. బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రొఫైల్స్ సహాయపడ్డాయి’ అని ఆమె అన్నారు. అయితే ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఎలా యాక్సెస్ అయ్యాయో మాత్రం ఆమె వివరించలేదు.ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల(300 కోట్ల) మంది యూజర్లు ఉన్నారని చెప్పుకునే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కేంద్ర ప్రతిపాదిత చట్టంపై స్పందించలేదు. మెటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి, మీకు మధ్య వ్యక్తిగత సందేశాలను షేర్ చేస్తుంది. దీన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరూ చదవలేరు, వినలేరు, షేర్ చేయలేరని కంపెనీ గతంలో తెలిపింది. కానీ ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదువాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మెసేజ్ ముందుగా షేర్ చేసిన మూలకర్తను గుర్తించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆదేశాలను సవాలు చేస్తూ వాట్సాప్ 2021లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది. తన ఎన్క్రిప్షన్ ప్రమాణాల విషయంలో రాజీపడవలసి వస్తే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకై వెనుకాడబోమని 2024 ఏప్రిల్‌లో వాట్సప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.2222233334223311233 -
జ్యూస్ అమ్మే వ్యక్తికి రూ.7.79 కోట్ల ట్యాక్స్ నోటీస్
2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో అందరూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన ఒక జ్యూస్ వ్యాపారి.. తనకు వచ్చిన ట్యాక్స్ నోటీస్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన మొహమ్మద్ రహీస్ జ్యూస్ అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నారు. మార్చి 18న అతనికి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ నోటీస్ పంపించింది. అందులో రూ. 7.79 కోట్లు ట్యాక్స్ చెల్లించాలని ఉంది. ఇది చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. దీనిపై మార్చి 28 లోపల స్పందించాలని ఉండడంతో అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు.భారీ మొత్తంలో చెల్లించాలని వచ్చిన ట్యాక్స్ నోటీసు గురించి కనుక్కోవడానికి.. స్నేహితులను సంప్రదించారు. వారు సంబంధిత అధికారులను కలుసుకోమని సలహా ఇచ్చారు. అధికారులు సైతం అతనికి వచ్చిన ట్యాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. తాను రోజుకు కేవలం రూ. 500 నుంచి రూ. 600 మాత్రమే సంపాదిస్తానని, పెద్ద లావాదేవీలు ఎప్పుడూ చేయాలని.. అధికారులతో చెప్పాడు.ఇదీ చదవండి: మార్చి 31 డెడ్‌లైన్.. ఇవన్నీ పూర్తి చేశారా?బాధితుని పాన్ కార్డు వివరాలు ఎవరో వినియోగించి ఉండవచ్చని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. తన వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించి జైలుకు పంపాలని రహీస్ కోరుకున్నాడు. -
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు (సెలవు రోజుల్లోనూ) తెరిచే ఉంటాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో ఆదాయపన్నుకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఇదీ చదవండి: నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్షిప్మార్చి 30న ఉగాది ఆదివారం, 31న రంజాన్ కారణంగా సెలవు కావడం తెలిసిందే. ఆదాయపన్ను శాఖకు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయాలను తెరిచి ఉంచుతున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న ప్రభుత్వ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంక్‌లు మార్చి 31న కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆర్బీఐ సైతం ఆదేశించడం గమనార్హం. -
పార్లమెంట్లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు(IT Notices Case) ప్రస్తావన ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖను గురువారం ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు పై చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు. చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు. బోగస్ ఇన్వాయిస్ల ద్వారా రూ.2,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఐటీ సోదాలలో మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ డబ్బును పీఎస్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పారిపోయాడు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మరి ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?. ఈ కేసుపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేంద్రాన్ని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటోంది. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు. వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల.. స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పునరుద్ధరణకు అవసరమైన నిధులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాట్ ను పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి అని వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. -
ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే. -
ఆదాయపు పన్ను బిల్లుపై వర్షాకాల సమవేశాల్లో చర్చలు
లోక్‌సభలో కేంద్రబడ్జెట్ 2025-26 సమయంలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న మదింపు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం..వంటి నిబంధనలను విలీనం చేస్తూ పన్ను సంవత్సరం అనే ఏకీకృత భావనను ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు ద్వారా కొన్ని నిబంధనలు, సంస్కరణ చర్యలను ప్రవేశపెట్టామని, వర్షాకాల సమావేశాల్లో ఇవి చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించడం ద్వారా భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక బిల్లు వివిధ నిబంధనలను హేతుబద్ధీకరిస్తుంది. వీటిలో పన్ను మినహాయించబడిన మూలం(టీడీఎస్), పన్ను సేకరించిన మూలం(టీసీఎస్) నిబంధనలపై పరిమితులను తగ్గించడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..విలీన కాలాన్ని ఐదేళ్లు పొడిగించడం వల్ల స్టార్టప్‌లు కూడా ప్రయోజనం పొందుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. విలీన కాలం అనేది ఒక కంపెనీ అధికారికంగా స్థాపించబడి చట్టబద్ధ సంస్థగా నమోదు చేసేందుకు పట్టే సమయాన్ని సూచిస్తుంది. ఫైనాన్స్ బిల్లు 2025 సవరణలలో భాగంగా ఆన్లైన్ ప్రకటనలపై 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కస్టమ్ డ్యూటీ నిర్మాణాల హేతుబద్ధీకరణ, కోతలను ఆమె పునరుద్ఘాటించారు. కస్టమ్స్ హేతుబద్ధీకరణ వల్ల దిగుమతిదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. -
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు
రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. 2020-21, 2021-22 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నట్లు సోమవారం సంస్థ తెలిపింది. ముంబైలోని సెంట్రల్ సర్కిల్ 6(2)లోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ నోటీసు పంపినట్లు ఆర్ఈఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.ట్యాక్స్ కన్సల్టెంట్ల సలహా మేరకు కేర్ హెల్త్ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులపై ఫోరమ్ ముందు అప్పీల్ దాఖలు చేస్తుందని ఆర్ఈఎల్ స్పష్టం చేసింది. ఈ డిమాండ్ నోటీసులకు దారితీసిన కచ్చితమైన లెక్కలు లేదా వివాదాల వెనుక ఉన్న వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆర్డర్‌ను అంతిమంగా అంగీకరించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. నిర్ణీత గడువులోగా ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ ప్రకటించడంతో ఇది నిర్ధారణ అవుతుంది.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా సేవలందిస్తోంది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పన్ను డిమాండ్‌ను సవాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాని ఆర్థిక, చట్టపరమైన విధానాలపై విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ నోటీసుపై కంపెనీ ప్రతిస్పందనను పరిశ్రమ వాటాదారులు, రెగ్యులేటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్‌ఛార్జ్‌పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
విదేశీ ఆస్తులు, ఆదాయం చూపించలేదా..
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్‌లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్‌పోర్ట్‌లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్‌ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.వెంటనే తమ స్టేటస్‌ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్‌ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
బోట్‌వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
లక్నో: మహాకుంభమేళా (maha kumbh 2025) పడవ వ్యాపారి పింటు మహరా (pintu mahara) రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్ చేసుకుంది. తాను ఒక్కబోటు మీద రూ.30 కోట్లు సంపాదించలేదని, పదుల సంఖ్యలో పడవలు ఉండగా.. కుంభమేళా కోసం అదనంగా మరిన్ని పడవలు కొనుగులో చేసినట్లు పింటు మహరా చెబుతున్నారు. ఇందుకోసం తన ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. అయితే, ఐటీ అధికారులు తనకు నోటీసులు (12.8 Crore Rupees Tax Notice) జారీ చేయడంపై.. ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నాడు. ఇదే అంశం విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుకను ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ప్రభుత్వం విజయ వంతం చేసింది. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహా కుంభమేళా భక్తితో పాటు ఆర్థికంగా కొన్ని కోట్లాది మంది జీవితాల్ని మార్చేసింది. వారిలో ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం తీరాన ఉన్న అరైల్ గ్రామానికి చెందిన పడవ వ్యాపారి పింటు మహరా.సీఎం యోగి నోట.. కుంభమేళా జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగిసింది. అయితే, పడవ వ్యాపారం చేసుకునే పింటు మహరా 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించారు. దీంతో పింటు పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి ఆధిత్యనాథ్ (Yogi Adityanath) పింటు పేరును ప్రస్తావించారు. కుంభమేళా వల్ల పింటు రూ.౩౦కోట్లు సంపాదించడమే కాదు,౩౦౦ మందికి పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పించామని చెప్పాడు. సీఎం యోగి ప్రకటనతో ఐటీ శాఖ నోటీసులు? సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రకటన ప్రకారం.. పింటు మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. జనవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు ఒక్కో పడవ సగటున రూ. 23 లక్షల లాభాల్ని అర్జించారని పేర్కొన్నారు. అంతే, సీఎం యోగి ప్రకటనతో ఆదాయపు పన్ను శాఖ పింటు మహరా రూ. 12.8 కోట్ల పన్ను నోటీసు జారీ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రూ.12.8కోట్లు ట్యాక్స్ అంటే ఎలా?ఆదాయపు పన్నుశాఖ పింటు మహ్రాకు నోటీసులు పంపిందనే సమాచారంపై సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఏకే నందన్ స్పందించారు. పింటు మహరా రోజుకు రూ. 500 సంపాదించే సాధారణ పడవ వ్యాపారి. మహాకుంభమేళాతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. భక్తుల రద్దీతో ఒక్కో ప్రయాణానికి ఛార్జీ వేలల్లో వసూలు చేశారు. ఫలితంగా తన మొత్తం ఆదాయం రూ. 30 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ రూ.12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందించడంతో ఆందోళన చెందుతున్నాడని అన్నారు. పన్నుల గురించి తెలియని ఒక సామాన్యుడు ఇప్పుడు పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని ఎదుర్కోవడం బాధాకరం’ అని అన్నారు. పింటూ మహర కుటుంబం ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. అయితే, ఈ అధిక ఆదాయం పన్ను చట్టాల ప్రకారం పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టిందన్నారు. ఆస్తుల్ని తాకట్టు పెట్టిమరోవైపు, పింటు మహర రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్ చేసుకుంది. 42 రోజుల్లో తాను ఒక్క పడవమీదే రూ.౩౦ కోట్లు సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. అదేం లేదు.కుంభమేళాకు ముందు తన వద్ద 60 బోట్లు ఉండేవి. కుంభమేళా రద్దీని అంచనా వేసి మరో 70 బోట్లు అప్పు చేసి కొన్నా. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినట్లు పలు మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. -
అమెరికాలోనూ నో ట్యాక్స్..! ట్రంప్ భారీ పన్ను ప్రణాళిక
భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. -
ఇంద్రుడిలా.. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు..
ఇంద్రుడికి వేయి కళ్లున్నాయి అనేది నాటి కథ. పురాణ కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది నేటి కథ. జరగబోయే కథ. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాలను వాడుతూ, ఎన్నో రాళ్లు రువ్వుతున్నారు రతనాల కోసం. ప్రతి రాయీ రత్నం అవుతోంది. ఆదాయాన్ని తెస్తోంది. వారి దగ్గర ఉన్నది ‘‘డేటా’’ కాదు .. మీ బ్యాంకు బ్యాలెన్సు. ఆదాయాన్ని అసెస్ చేసి, వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ మైమరచిపోయే రోజులు పోయాయి. అరకొర సిబ్బంది ఏమీ చేయలేరని అనుకోకండి. అర కొర సిబ్బందికి కొత్త కోరలు వచ్చాయి. ఇక జాగ్రత్త.‘‘సంసారం గుట్టు .. రోగం రట్టు’’ అనేది ఒక సామెత. ‘‘సంపాదన గుట్టు, రోగం గుట్టు’’ అనే వాళ్లూ ఉన్నారు. మగవాడి జీతం అడగకూడదనే నానుడి ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. సీక్రెసీ లేదు. ప్రైవసీ లేదు. ఇనుపపెట్టెలో రొక్కం, బీరువాలో నగలు, లాకర్లో బంగారం, స్విస్ బ్యాంకులో జమలు.. ఇవన్నీ తెలుసుకుంటున్నారు.మనం మన వంటికి ‘కవచకుండలం’లాగా భావించే సెల్‌ఫోన్ నిజానికి కవచ కుండలం కాదు. డేటాను వెదజల్లే కుండ. మన సంభాషణలు, వాట్సప్‌లో సందేశాలు, ఈమెయిళ్లు, గూగుల్ చెల్లింపులు, పేటీఎం చెల్లింపులు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు, స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు, విదేశీ ప్రయాణాలు, పండగ ఆఫర్లు, బంగారం కొనుగోళ్లు ప్రతీదీ తెలిసిపోతుంది. అలాగే బిల్డర్లతో, బ్రోకర్స్‌తో, బ్యాంకర్లతో, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్‌తో, వ్యాపారవేత్తలతో స్నేహితులతో, పిల్లలతో, భాగస్వాములతో జరిపే ఈమెయిల్స్ సంభాషణలు, మన ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, లింక్డిన్ ఖాతాలు మొదలైన వివరాలన్నీ తెలిసిపోతాయి.2026 ఏప్రిల్ 1 నుంచి అంటే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు ఇంద్రుడిలాగా విస్తృత అధికారాలు ఇచ్చారు. మీ సోషల్ మీడియా అకౌంటు, బ్యాంకు అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు ... ఇలా అన్నీ చెక్ చేయొచ్చు. బ్యాంకు లాకర్లు పగలకొట్టడం విన్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ సిస్టంను బ్రేక్ చేస్తారు. వర్చువల్ డిజిటల్ స్పేస్‌లో ప్రవేశిస్తారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్స్ని ఇన్వాల్వ్ చేసి మన సమాచారం తప్పని, తక్కువని, పూర్తిగా జరిపిన వ్యవహారాలన్నీ చూపించి మన జాతక విశ్వరూప ప్రదర్శనం చేసి వారి ‘‘విశ్వరూపాన్ని’’ చూపిస్తున్నారు. మేఘాల్లో (క్లౌడ్) నుంచి కూడా సమాచారాన్ని సంగ్రహించి, అసెస్మెంట్ చేస్తున్నారు. వెబ్సైట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు దేన్నీ వదలడం లేదు. ‘‘ఇందుగలడందు లేడ’’ని చెప్పినట్లు, ఎక్కడికైనా వెళ్తారు. ఆగమేఘాల మీద రావడం అంటే ఇదేనేమో.అధికార్లు ఎందుకు వస్తారు... నా ప్రైవసీలోకి రావచ్చా.. ఇది రాజ్యాంగబద్ధమా.. ఇది హక్కులు నేలరాయటం కాదా లాంటి ప్రశ్నలు వెయ్యకండి. కొత్త బిల్లులో నిర్వచనం చాలా పకడ్బందీగా రాశారు. ఉద్యోగి సిస్టం ద్వారా యజమాని వివరాలు తెలుసుకుంటారు. అంతే కాకుండా కొన్న సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లు వెనక్కు వెళ్తారు. అందుకని జాగ్రత్త వహించండి. మనం ఎవరికీ తెలియకుండా వ్యాపారం/వ్యవహారం చేస్తున్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగుకి, అన్నదమ్ములకు తప్ప అందరికీ తెలుస్తుంది. ‘కాగల కార్యం గంధర్వులే’ తీర్చినట్లుగా తెలియకూడని వాళ్లకే సర్వం తెలిసిపోతోంది. ‘సర్వం జగన్నాధం’.అయితే, ఈ అధికారాలు దుర్వినియోగం కాకూడదు. అందరికీ సమానంగా, అంటే పన్ను ఎగవేసే ప్రతి బడాబాబుకీ వర్తించేలా, బంధుప్రీతి లేకుండా, కక్ష సాధింపులా కాకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగితే ఎంతో మంచిది. అదే విశ్వకల్యాణం.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
ఐటీ అధికారులకు కొత్త అధికారాలు
ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అనుమానం వస్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇ-మెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారు మీ ఖాతాలను దర్యాప్తు చేయవచ్చు.ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకానమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 132 ప్రకారం, పన్ను ఎగవేత ఉద్దేశంతో ఎవరైనా తన ఆదాయం, ఆస్తులు లేదా ఆర్థిక వివరాలను దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే పన్ను అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేయవచ్చు.అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్ లు, లాకర్లు పగులగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారాలు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావవంతంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనలను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఇలా కూడా ఆరా తీస్తారు.. పన్ను వేస్తారు!
ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారు, ఒక్కో అస్సెస్సీకి సంబంధించిన అసెస్మెంట్ పూర్తి చేసినప్పుడు సమాచారం అడగడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 142 (1) సెక్షన్ కింద విస్తృత అధికారాలు ఉన్నాయి. ఈ మధ్యే ఒక అస్సెస్సీకి నోటీసులు వచ్చాయి. ‘‘మీరు మీ ఇంటి ఖర్చుల నిమిత్తం, సొంత వాడకాలు లేదా విత్‌డ్రాయల్స్ చాలా తక్కువగా చూపించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్ వివరాలు, వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్లు, వారి వార్షికాదాయం వివరాలు ఇవ్వండి’’ అనేది దాని సారాంశం. ఇవే కాకుండా ఈ కింది వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది.⬩నెలవారీ రేషన్ వివరాలు. ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు.⬩గోధుమ పిండి ఎంత కొన్నారు.. ⬩బియ్యం ఎంత? ⬩పప్పు ధాన్యాలెంత కొన్నారు..ఎంతకి కొన్నారు? ⬩నూనె ఎంత వాడారు.. ఎంతకు కొన్నారు? ⬩వంట గ్యాస్ వినియోగం వివరాలు. ⬩కరెంటు బిల్లెంత ⬩కొన్న బట్టల వివరాలు ⬩షూస్, పాలిష్, జోళ్లు వివరాలు ⬩క్షవరానికి ఎంత ఖర్చుపెట్టారు ⬩కాస్మెటిక్స్, స్ప్రేలు ⬩ఏయే వేడుకలు చేసుకున్నారు. ఖర్చెంత? ⬩పిల్లల చదువులు, పుస్తకాలు, ⬩స్కూల్ ఫీజుల వివరాలు ⬩మీరు చెల్లించే అద్దె వివరాలు ⬩కారు నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఎంత? ⬩హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు ⬩బిల్డింగ్ నిర్వహణ, ఇన్సూరెన్స్ వివరాలు ⬩జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ⬩చుట్టాలకు, స్నేహితులకు బహుమతులు ఏమిచ్చారు. వాటి విలువెంత? ⬩రెస్టారెంట్ల ఖర్చులెంత? ⬩గెట్టు గెదర్ లాంటి కార్యక్రమాల ఖర్చులు ⬩సంఘంలోని కార్యకలాపాలు, ఖర్చులు ⬩రోజువారీ ఖర్చులు➤ఇలా అన్నింటి వివరాలూ ఇవ్వాలి. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో, వారందరి ఆదాయపు వివరాలు, ఖర్చుల వివరాలు, రుజువులతో సహా ఇవ్వాలి.➤చివర్లో కొసమెరుపు.. కాదు కాదు.. బెదిరింపు ఏమిటంటే, ‘‘ఈ వివరాలు ఇవ్వకపోతే మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లుగా భావిస్తాము’’ అని.➤అలా భావిస్తే.. భావించారు.. అక్కడితో ఊరుకోరు. ఆ మొత్తం మీద పన్ను కూడా వేస్తారు.అయితే, సాక్షి పాఠకలోకానికి ఈ అంశం కొత్త కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఖర్చుకైనా ‘‘సోర్స్’’ ఉండాలి. సోర్స్‌కు సరైన వివరణ లేకపోతే ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
పాత vs కొత్త పన్ను విధానం: ఎప్పుడు ఏది ఎంచుకోవాలంటే..
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో శ్లాబులురూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5 శాతంరూ.8-12 లక్షలు - 10 శాతంరూ.12-16 లక్షలు - 15 శాతంరూ.16-20 లక్షలు - 20 శాతంరూ.20-24 లక్షలు - 25 శాతంరూ.24 లక్షల పైన 30 శాతంపాత పన్ను విధానంలో పన్ను శ్లాబులురూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతంరూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతంరూ.10,00,000 ఆపైన - 30 శాతంఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
కొత్త ఐటీ బిల్లు వచ్చే వారమే..
ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) లోక్‌సభలో వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగువసభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సంప్రదాయ సమావేశంలో ప్రసంగించిన తర్వాత సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్‌కు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారని మంత్రి చెప్పారు. బిల్లు విషయంలో తనకు ఇంకా మూడు క్లిష్ట దశలు ఉన్నాయని అన్నారు.‘రెండు సంవత్సరాల క్రితం కూడా కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కొన్ని హేతుబద్ధీకరించాం. భారత్‌ను మరింత పెట్టుబడిదారులు, వాణిజ్య స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్‌తో సమతుల్యం చేయాలనుకుంటున్నాం. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. -
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ క్లారిటీ
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. -
ఐటీ ఆఫీస్‌లో ముగిసిన దిల్ రాజు విచారణ
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట విచారణలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన్ను ఐటీ అధికారులు విచారించారు. ఈ మధ్య కాలంలో తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాల అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయం నుంచి దిల్ రాజు తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆయన్ను మరోసారి విచారిస్తారా..? లేదా..? అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
ఇక దేశానికి ఆ కోటి మందే దిక్కు!
కొత్త పన్ను విధానాన్ని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా స్టార్ అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) విమర్శించారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో కోటి మంది మాత్రమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లిస్తారని, తద్వారా భారత్ ఆదాయ పన్ను రహిత దేశంగా మారుతుందని ఎద్దేవా చేశారు.కేంద్ర బడ్జెట్లో (Union budget 2025-26) రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించిన అనంతరం కొత్త పన్ను విధానాన్ని విమర్శిస్తూ అనుపమ్ మిట్టల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. దేశంలో పన్ను దాఖలు చేసేవారిలో 90% మంది రూ. 13 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారేనని చెప్పుకొచ్చారు. అంటే ఆ మిగిలిన కొద్ది మంది మాత్రమే దేశానికి ట్యాక్స్ ఆదాయం అందిస్తారనేది ఆయన భావన.భారత్ "ఆదాయపు పన్ను రహిత దేశం" అవుతుందంటూ అనుపమ్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు కొత్త పన్ను విధానంలోని పన్నుల వ్యవస్థ హేతుబద్ధతపై చర్చను రేకిస్తున్నాయి. "భారతదేశంలో దాదాపు 90% ట్యాక్స్ ఫైలర్లు రూ.13 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారేనని తేలింది. అంటే 140 కోట్ల మందిలో కోటి మంది మాత్రమే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశాన్ని ఆదాయపు పన్ను రహితంగా మారుస్తారు" అని మిట్టల్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.కొత్త పన్ను విధానం కేవలం పన్ను కోత కాదని, "వ్యవస్థాగత దిద్దుబాటు" అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక వేదిక లింక్డ్ఇన్లో చర్చకు తెరతీశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ సాధికారత కలిగిన మధ్యతరగతిపైనే ఆధారపడుతుందని, అధిక పన్నుల భారం మోపడం సరికాదని వాదించారు. ఈ సందర్భంగా అమెరికా, చైనాలతో దేశ పన్ను విధానాన్ని పోలుస్తూ భారత్‌లో గతంలో వేతనజీవులను అధిక పన్నులతో పిండేశారని ఆరోపించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్ దేశ పన్ను శ్లాబ్‌లలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని మంత్రి ప్రకటించారు.20 ఏళ్లకే కోటీశ్వరుడుజీవితం ఎప్పుడూ సాఫీగా సాగకపోవచ్చు. ఎన్నో బాధలు.. కష్టాలు.. అనుభవించాల్సి రావొచ్చు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు సంపాదించిన సొమ్మంతా కోల్పోవాల్సి రావొచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుపమ్ మిట్టల్. 20 ఏళ్లకే కోటీశ్వరుడైన ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొని పడిలేచారు.'కొద్దికాలంలోనే గొప్ప విజయాలు సాధించా. 20 ఏళ్లకే కోటీశ్వరుడిని అయిపోయా. మైక్రోస్ట్రాటజీలో నేను ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బాగానే డబ్బులు సంపాదించా. తర్వాత పరిస్థితి మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అంతా కోల్పోయా. అప్పుల్లో కూరుకుపోయా. తర్వాత ధైర్యం తెచ్చుకుని షాదీ.కామ్ స్టార్ట్ చేశా. మళ్లీ పూర్వవైభవం సాధించా' అంటూ అనుపమ్ గతంలో లింక్డ్ఇన్లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
లక్కీ భాస్కర్ లెక్కలివి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!. శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక కొత్త పన్ను చట్టంఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభంకొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్‌ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.సీనియర్ సిటిజన్లకు ఊరటవడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారురెమిటెన్స్లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్లై టీసీఎస్‌ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అధిక టీడీఎస్‌ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని. అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఉదాహరణకు... మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క. ఇది మరిచిపోకండి... జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
ఉద్యోగులకు శుభవార్త.. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్‌లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.తలసరి ఆదాయంలో నంబర్‌వన్..దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్‌లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలుఎవరికి మినహాయింపు ఉంటుంది?ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. -
‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్‌లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.భారత్, చైనాలపై టారిఫ్లుఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్‌లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసంఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్‌లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు. -
Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) కొత్త పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చూడవచ్చు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను (new tax slab)ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రకటించబోతున్నారు. రెండు పన్ను విధానాలలో రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 7.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30% పన్ను శ్లాబ్ కిందకు వస్తారు. వీటిలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది."రెండు అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. బడ్జెట్ అనుమతించినట్లయితే, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టవచ్చు" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా నివేదిక ఉటంకించింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రభావంతో రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినట్లు వివరించింది.కీలక ప్రతిపాదనలుకేంద్ర బడ్జెట్ 2025-26 నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) కీలకమైన పన్ను సంస్కరణలను సిఫార్సు చేసింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలని సూచించింది. 2025 నాటికి పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీకి ఇస్తున్న రూ. 10,000 మినహాయింపును రూ. 19,450కి పెంచడం, బీమా ప్రీమియంలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి రూ. 1.5 లక్షల మినహాయింపును రూ. 2.6 లక్షలకు సర్దుబాటు చేయడం వంటి చర్యలను జీటీఆర్ఐ ప్రతిపాదించింది.ఇదీ చదవండి: డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?గత ఏడాది మాదిరిగా కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచడంలో ఆశ్చర్యం కలిగించకపోవచ్చని చాలా మంది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వృద్ధి దెబ్బ తిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను ప్రకటించినప్పటికీ, వృద్ధి లేదా ఆదాయాలను పునరుద్ధరించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే విషయంలో బడ్జెట్ పరిమిత ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని వారు నమ్ముతున్నారు. -
డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?
కేంద్ర కొత్త బడ్జెట్-2025 (Union Budget 2025) మన ముందుకు వచ్చేందుకు ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇదిలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయనున్నారు. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం.ఆయా వర్గాల సమాచారం నిజమైతే.. ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయవచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, మినహాయింపు పరిధిని పెంచవచ్చు. మొదటి ప్రయోజనం స్టాండర్డ్ డిడక్షన్‌లో కాగా, రెండోది రూ.15-20 లక్షల పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి ఇవ్వవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు?కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75,000 లుగా ఉంది. మూలాల ప్రకారం.. ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచవచ్చు. గత బడ్జెట్లో కూడా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50000 నుండి రూ. 75000కి పెంచింది. ఈ మార్పు జరిగితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో రూ.లక్ష వరకు పన్ను ఆదా అవకాశాన్ని పొందుతారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.20% పన్ను శ్లాబ్ పరిధి పెంపు?రెండవ పెద్ద శుభవార్త ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచవచ్చు. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధించేవారు. కానీ, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షల ఆదాయానికి పెంచవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మార్పు మధ్య, అధిక ఆదాయ సమూహానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?పీఎంవోదే తుది నిర్ణయం 2025 బడ్జెట్లో పన్ను సంబంధిత మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం పీఎంవో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది.ఆర్థిక లోటును తగ్గించడమే సవాలుదేశ సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తి బడ్జెట్. ఆర్థిక లోటును అదుపులో ఉంచుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంటుందని పెద్ద ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యం 4.9%. దీనిని 2026 నాటికి 4.5% కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్‌ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్‌లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్‌పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్‌లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్‌ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్‌యూఎఫ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్‌పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్‌ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్‌గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
ఐటీఆర్ ఫైలింగ్: రేపటి నుంచి రూ.5000 ఫైన్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇచ్చిన గడువు నేటితో (జనవరి 15) ముగియనుంది. ఇక రేపటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఆ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో (Budget 2025) మూలధన వ్యయాలు, పన్ను చట్టాల సరళతరం, వ్యక్తిగత ఆదాయపన్ను (income taxe) తగ్గింపు ప్రతిపాదనలకు చోటు కల్పించొచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు పన్నుల ఉపశమనం తప్పనిసరి అని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను వచ్చే నెల 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. దీంతో బడ్జెట్ అంచనాలతో ఈవై ఇండియా ఒక నోట్‌ను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.31 లక్షల కోట్ల మేర ఆదాయపన్ను వివాదాల రూపంలో చిక్కుకుపోయినట్టు చెప్పింది. ఆదాయపన్ను కమిషనర్ (అప్పీళ్లు) సత్వరమే వీటిని పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాలను తీసుకురావాలని సూచించింది.‘‘ప్రత్యక్ష పన్నుల కోడ్ సమగ్ర సమీక్షకు సమయం తీసుకోవచ్చు. కాకపోతే ఈ దిశగా ఆరంభ నిర్ణయాలకు బడ్జెట్లో చోటు ఉండొచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గించొచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనంతోపాటు డిమాండ్‌కు ఊతం ఇచ్చేందుకు వీలుగా చర్యలు ఉండొచ్చు’’అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సమీర్ గుప్తా తెలిపారు.ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా వ్యూహాత్మక సంస్కరణలపై బడ్జెట్లో దృష్టి సారించొచ్చన్నారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి తగిన నిర్మాణాత్మక చర్యలు ఉండొచ్చన్నారు.పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు.. ముఖ్యంగా పన్నుల విధానాన్ని సులభంగా మార్చడం, కస్టమర్ల సేవలను మెరుగుపరచడం, వివాదాలను తగ్గించడం, పన్ను నిబంధనల అమలును పెంచడం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించొచ్చని ఈవై ఇండియా అంచనా వేస్తోంది. పన్ను చట్టాల సులభీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కీలకంగా దృష్టి సారించాలని పేర్కొంది. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల విధానాన్ని హేతుబద్దీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతూ.. ఈ దిశగా మరిన్ని చర్యలు రాబోయే బడ్జెట్లో ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎస్ఎంఈలకు పన్నుల సంక్లిష్టతను తగ్గించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. -
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో గడువు మరో 15 రోజులు ముందుకు సాగింది.నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఈ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు.. వారి ఫైలింగ్‌లను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.సాధారణంగా ప్రతి ఏటా ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఈ తేదీ లోపల ఐటీఆర్ ఫైల్ చేయనివారు.. జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపల ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గడువును కూడా మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 లోపల ఐటీఆర్ ఫైల్ చేయని వారు మాత్రమే కాకుండా.. ఫైల్ చేసిన వారు కూడా ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 6.68 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలియజేశారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసుకునే మొత్తం వ్యక్తుల సంఖ్య 8,09,03,315 అని ఆయన పేర్కొన్నారు.CBDT extends the last date for furnishing Belated/ Revised return of income for AY 2024-25 in the case of Resident Individuals from 31st December, 2024 to 15th January, 2025.✅Circular no. 21/2024 dated 31/12/2024 issued-https://t.co/DedADMfnGX pic.twitter.com/sBVdGZqxRF— Income Tax India (@IncomeTaxIndia) December 31, 2024 -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్‌లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డీ గుకేశ్‌కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్‌లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.ఐపీఎల్ వేలంలో కూడా..ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట. -
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 డెడ్‌లైన్!
ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించడంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి.ఆన్లైన్లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?● ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి.● అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి. ● ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.● ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ● 'ఇన్కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.● అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి. ● ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి. ● ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి. -
రూ.27 కోట్లలో రిషబ్ పంత్ చేతికి వచ్చేది ఎంతంటే..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్‌కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. -
పన్ను చెల్లింపుదారులు పెరిగారు
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పెరిగారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆదాయపు పన్ను ఫైల్ బేస్ వాటా పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా.. బిహార్, ఏపీ, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. 2023–24 అసెస్మెంట్ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను సోమవారం విడుదల చేసింది. 2023–24 అసెస్మెంట్ ఏడాదిలో వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో మహిళలు 15 శాతం ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. మహిళలు వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన టాప్ రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపింది. -
భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: గడచిన దశాబ్దకాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. 2014లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య కేవలం 40వేలు ఉండగా, 2024లో ఐదు రెట్లు.. అంటే 2.2 లక్షలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది.అలాగే దేశంలో 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5.0 లక్షల వరకు ఉండగా 2024లో మధ్యతరగతి ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.10.0 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. దేశంలో గత పదేళ్లలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 4.8 కోట్లు పెరిగిందని నివేదిక వివరించింది. 2014లో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్ల పెరిగిందని ఎస్బీఐ వెల్లడించింది. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
గడువు తేదీ గడిచిపోయిందా..
రెండు రోజులు ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అందరికీ అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటూ.. ‘‘గడువు తేదీ’’ని కేవలం ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు వేసే కోణంలోనే పరిశీలిద్దాం. 2024 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరపు రిటర్నులు వేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. మీలో చాలా మంది సకాలంలో వేసి ఉంటారు. ఈసారి రిటర్నులు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపార్టుమెంటు వారు చెప్తున్నారు. అనారోగ్యం కానివ్వండి. విదేశాయానం కానివ్వండి. కారణం ఏదైనా కానివ్వండి. మీరు రిటర్ను ఇంకా వేయలేదా? చింతించకండి. బెంగ వద్దు. ఇలాంటి వారికి చక్కని రాజమార్గం ఉంది. లేటు ఫీజు కట్టాలి. ఇలా లేటు ఫీజు చెల్లించినవారికి 2024 డిసెంబర్ 31 వరకు గడువు తేదీ ఉన్నట్లు లెక్క. అంటే మరో రెండు నెలల పదిహేను రోజులు. అలా అని ఆలస్యం చేయకండి.ఎంత లేటు ఫీజు చెల్లించాలి.. ఆలస్యమైన నెలలతో సంబంధం లేకుండా రెండు రకాల నిర్దేశిత రుసుములు ఉన్నాయి. పన్నుకి గురయ్యే ఆదాయం.. రూ. 5,00,000 లోపల ఉంటే రూ. 1,000 చెల్లించాలి. పన్నుకి గురయ్యే ఆదాయం రూ. 5,00,000 దాటి ఉన్నట్లయితే, ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఇవి మారవు. అంటే మీరు ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 లోపల ఎప్పుడు దాఖలు చేసినా రుసుములంతే. అయితే, పన్ను చెల్లించాల్సి ఉంటే వడ్డీ విధిస్తారు. ఇది నెలకు 1 శాతం చొప్పున వడ్డిస్తారు.రిఫండు క్లెయిమ్ చేసినా అప్పటికి పన్ను చాలా చెల్లించినట్లయితే, ఈ వడ్డీ పడదు. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే మీరు తొందరపడాల్సి ఉంటుంది. వడ్డీని తగ్గించుకోవచ్చు. మీరు బయటి నుంచి 1 శాతం వడ్డీతో అప్పు తెచ్చి పన్ను భారం చెల్లించే బదులు ఆ వడ్డీ మొత్తం ఏదో ‘సీతమ్మగారి పద్దు’లో పడేలా ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక వనరులను ప్లాన్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఈ వెసులుబాటనేది ‘తత్కాల్’ టిక్కెట్టు కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అయితే, రిటర్ను గడువు తేదీలోగా దాఖలు చేయకపోవడం వల్ల రెండు పెద్ద ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు. గడువు తేదీ లోపల రిటర్ను వేసేవారికి డిపార్టుమెంటు రెండు ప్రయోజనాలు పొందుపర్చింది. ఆ రెండు ప్రయోజనాలూ లేటు విషయంలో వర్తించవు. ఇంటి మీద ఆదాయం లెక్కింపులో మనం లోన్ మీద వడ్డీని నష్టంగా పరిగణిస్తాం.ఆ నష్టాన్ని పరిమితుల మేరకు సర్దుబాటు చేసి, ఇంకా నష్టం మిగిలిపోతే దాన్ని రాబోయే సంవత్సరాలకు బదిలీ చేసి, నష్టాన్ని.. ఆదాయాన్ని సర్దుబాటు చేస్తాం. దీని వల్ల రాబోయే సంవత్సరంలో పన్ను భారం తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపశమనంగా ఉంటుంది. లేటుగా రిటర్ను వేస్తే ఈ ‘బదిలీ’ ప్రయోజనాన్ని ఇవ్వరు. ఈ సదుపాయాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది.ఇక రెండోది.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతి లేదా కొత్త పద్ధతుల్లో.. మనం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సాధారణంగా పన్ను తగ్గే పద్ధతి ఎంచుకుంటాం. మనం గడువు తేదీ లోపల రిటర్ను వేయకపోతే, ఇలా ఎంచుకునే అవకాశం ఇవ్వరు. కంపల్సరీగా కొత్త పద్ధతిలోనే పన్నుభారాన్ని లెక్కించాలి. అయినా, రిటర్ను వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.1. ఇది మీ ఆదాయానికి ధృవపత్రం అవుతుంది 2. రుణ సౌకర్యం లభిస్తుంది 3. విదేశీయానం అప్పుడు వీసాకి పనికొస్తుంది 4. చట్టంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు 5. పెనాల్టీ మొదలైనవి ఉండవు కాబట్టి రిటర్నులు వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 1 నుంచి ‘వివాద్ సే విశ్వాస్ 2.0’
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024–25 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.రూ.35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో, న్యాయ వేదికల వద్ద అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. వీటికి పరిష్కారంగా గతంలో అమలు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని మరో విడత కేంద్రం తీసుకురావడం గమనార్హం. -
దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ
దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. -
కొత్త పన్ను విధానంలో మార్పులు..
-
ఐటీ పోర్టల్‌లో అప్డేట్.. ఆ మినహాయింపు దూరం!
ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఇటీవలి అప్డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అసలేమైంది? మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్‌లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది. -
‘మూర్తి సార్.. మీ ఇన్ఫోసిస్ వాళ్లకు చెప్పండి’
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్‌ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్ల కోసం ఏఐఎస్, టీఐఎస్‌లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్‌కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
కట్టిన ఇన్కమ్ టాక్స్ కి సులభంగా రిఫండ్ పొందండి ఇలా
-
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అప్రకటిత లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారి సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇటీవల నాందేడ్ లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తరువాత తాజాగా నాసిక్‌లో ఈ దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ చర్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా ఆ తర్వాత బయటకు వచ్చిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. Income Tax Department launched a raid on Surana Jewellers in Nashik, in response to alleged undisclosed transactions by the proprietor. About Rs 26 crore in cash and documents of unaccounted wealth worth Rs 90 crore have been seized in raids carried out by the Income Tax… pic.twitter.com/XJ0wyuI8HQ— ANI (@ANI) May 26, 2024 -
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
ఐటీ రిటర్న్స్.. కీలక మార్పులు
ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ఐటీఆర్-1 ఫారంఅత్యధిక పన్ను రిటర్న్స్ ఐటీఆర్-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.ITR-1కి చేసిన కీలక మార్పులు2024-25 అసెస్మెంట్ ఇయర్‌కి గానూ ఐటీఆర్-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..ITR-1 ఫారమ్‌ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్యూఎఫ్లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్‌ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది. -
బ్యాంకు ఉద్యోగులకు షాక్.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్ బెనిఫెట్స్) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది.ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది. ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్‌మార్క్‌ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్‌గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
రూ. 200 కోట్ల హవాలా గుట్టు రట్టు.. ఆ పార్టీ పనేనా..?
చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్‌కుమార్ జోసెఫ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్టాప్, మొబైల్‌ఫోన్, ఐ పాడ్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్‌లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత -
ఐటీ నోటీసులు.. కాంగ్రెస్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయ పన్ను శాఖ రూ.135 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందుగా హైకోర్టు ఆశ్రయించగా అక్కడ ఊరట లభించకపోవటంతో అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీకి ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగదని సుప్రీంకోర్టు తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేసింది. ఇక.. 2017-2018 నుంచి 2020-2021 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని శుక్రవారం నోటీసు పంపిన ఆదాయపన్న శాఖ...నిన్న(ఆదివారం) రూ. 1744 కోట్లు కట్టాలని మరో నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 2014-15 నుంచి 2016-17 అసెస్మెంట్ సంవత్సారాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఆ నోటీసులో పేర్కొంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వేళ.. పన్ను ఉగ్రవాదంతో ప్రధాన ప్రతిక్షాలను ఆర్థికంగా తీవ్రం ఇబ్బందికి గురిచేస్తోందని ఆరోపణల చేసింది. ఇక.. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈసీకి కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. -
ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ సమాచారంపై చాలామందికి సరైన అవగాహనలేక తప్పుదారి పట్టిస్తుంటారు. తాజాగా ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్‌లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దాంతో కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ మంత్రిత్వశాఖ తన ‘ఎక్స్’ ఖాతాలో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. ఇదీ చదవండి: పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి? కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. It has come to notice that misleading information related to new tax regime is being spread on some social media platforms. It is therefore clarified that: 👉 There is no new change which is coming in from 01.04.2024. 👉 The new tax regime under section 115BAC(1A) was… pic.twitter.com/DtKGkK0D5H — Ministry of Finance (@FinMinIndia) March 31, 2024 -
కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ‘ ఐటీ’.. రూ.3 వేల కోట్లకు చేరిన నోటీసులు
న్యూఢిల్లీ: తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి ఆదాయపన్ను శాఖకు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన రికవరీ సొమ్ము మొత్తం రూ.3567 కోట్లకు చేరింది. 2014-15,2015-16, 2016-2017,2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.3567 కోట్ల ట్యాక్స్ రికవరీ నోటీసులను రెండు విడతల్లో ఐటీ శాఖ కాంగ్రెస్‌కు పంపింది. రాజకీయ పార్టీలకు ట్యాక్స్ రాయితీలు తొలగించడం కారణాంగానే కాంగ్రెస్ సేకరించిన మొత్తం విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించడంతోనే నోటీసుల్లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం డిమాండ్ నోటీసులను ఐటీ శాఖ తమ పార్టీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, మళ్లీ ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు మరో 2 ఐటీ నోటీసులు -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
కాంగ్రెస్‌కు మరో రెండు ‘ఐటీ’ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖ(ఐటీ) వెంటాడుతోంది. శుక్రవారమే(మార్చ్ 29)రూ.1800 కోట్ల మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రెండు నోటీసులను ఐటీ శాఖ పంపిందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఈ నోటీసులు శనివారం రాత్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ట్యాక్స్ టెర్రరిజానికి కాంగ్రెస్ టార్గెట్‌గా మారిందని జైరామ్ ఫైర్ అయ్యారు. కాగా, 2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీని కలిపి రూ.1800 కోట్ల పన్ను కట్టాలని శుక్రవారం ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. నాలుగేళ్ల రిటర్న్స్‌పై రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఐటీ రికవరీ నోటీసులు పంపింది. 2014-15, 2015-16,2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్మెంట్ చేసే చర్యలు ఐటీ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 135 కోట్ల మేర నగదును ఫ్రీజ్ చేసింది. ఇదీ చదవండి.. రూ.1823 కోట్లు చెల్లించండి -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
Income Tax Department: రూ.1,823 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాహుల్ గ్యారంటీ ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు. -
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్‌ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్‌ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
ఐటీ దాడులు.. ఆ కార్ల విలువే 60 కోట్లు!
ఢిల్లీ: ఇన్కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్‌కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాన్పూర్‌కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్‌లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. -
ఐటీ రిటర్న్స్‌లో తప్పులు.. ట్యాక్స్ పేయర్లకు అప్డేట్
ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. -
ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్ రిఫండ్!
ఫిబ్రవరి 14, 2024న ఆదాయపు పన్ను శాఖ నుంచి సుమారు రూ.21,740 కోట్ల మొత్తాన్ని రిఫండ్ పొందినట్లు ఎల్ఐసీ తెలిపింది. 2012-13, 2013-14, 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఎల్ఐసీ రీఫండ్ ఆర్డర్లను పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రీఫండ్ మొత్తం విలువ రూ.25,464.46 కోట్లు. దీనికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నిన్న రూ.21,740.77 కోట్లను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం నుంచి మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్‌తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి. -
పాన్-ఆధార్ లింక్ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!
నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్యాక్స్ పేయిర్స్కి డెడ్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. -
పాత పన్ను బకాయిలు రద్దు.. సీతమ్మ పద్దు...
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్‌నే ప్రస్తావిద్దాం. అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం. పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్‌లో కేవలం ఇన్‌కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం. మినహాయింపులు లేవు తగ్గింపులు లేవు తాయిలాలు లేవు బేసిక్ లిమిట్ పెంచలేదు శ్లాబులు, రేట్లు యధాతథం ఒక పక్కన ట్యాక్స్‌పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్‌పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి. వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్‌పేయర్స్‌కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త. ➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు.. ➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు. ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి. రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్ : ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు!
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్ ఫైలింగ్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఐటీఆర్-2, ఐటీఆర్ -3 ఫారమ్స్ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఆడిట్ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్ 31, 2024 లోపు ఐటీఆర్-3 ఫైల్‌ను తప్పని సరిగా చేయాలని కోరుంది. ఐటీఆర్-2 ఫైలింగ్ ఎవరు చేయాల్సి ఉంటుంది? ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్‌పోర్టల్ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్‌యూఎఫ్.. అంటే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్‌యూఎఫ్‌కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్ కట్టేవారు ఐటీఆర్-2ని తప్పని సరిగా ఫైల్ చేయాలి. ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-2లో మార్పులు రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. -
Union Budget 2024: ట్యాక్స్ పేయర్స్‌కు నిరాశే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్‌ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా ఉంటాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి రూ. 7 లక్షలు ఉంది. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని రూ.8 లక్షలకు పెంచుతారని భావించారు. కానీ ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో నిరాశే మిగిల్చింది. ఇక పన్ను శ్లాబులకు విషయానికి వస్తే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 5 పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇవి గతంలో ఆరు శ్లాబులు ఉండగా గతేడాది ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గతేడాది గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. అయితే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో పన్నుచెల్లింపుదారులకు ఎటువంటి ఊరటలను కేంద్రం ప్రకటించకపోవడంతో నిరాశ తప్పలేదు. కాస్త ఊరట.. పన్ను బకాయిల రద్దు పన్ను రేట్ల విషయంలో నిరాశ పరిచినప్పటికీ పాత పన్ను బకాయిలు రద్దు చేస్తూ ఈ బడ్జెట్ కాస్త ఊరటనిచ్చింది. 2009-10 కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.25,000, అలాగే 2014-15కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.10,000 వరకూ రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
పన్ను ఆదా.. చేద్దాం ఇలా!
ఆదాయపన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిల్లో పెట్టుబడులకు నిరీ్ణత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితోపాటు రిస్‌్కను కూడా ఆహా్వనించాల్సి వస్తుంది. తమ లక్ష్యాలు, రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. ► రాబడులు 5–6 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆరి్థక లక్ష్యాలకు రక్షణ కలి్పంచే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే, బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసి తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని, టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్లలోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.12,000–14,000 ప్రీమియం కింద చెల్లించాలి. అదే వ్యక్తి రూ.50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.5 లక్షలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాల్లో వచ్చే పరిహారం, కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్‌పై పూర్తిగా పన్ను మిహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వా ర్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లు అయినా ఉండాలి. ► రాబడులు 7–8 % మధ్య ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు వీటిల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది. కానీ, రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తన ఆదాయంలో చూపించి, ఏ శ్లాబులో ఉంటే ఆ ప్రకారం రేటు చెల్లించాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5 శాతం కంటే తక్కువే. కాకపోతే వేగంగా, సులభంగా ఇన్వెస్ట్ చేసుకోగల సౌలభ్యం ఇందులో ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఎన్ఎస్సీలో పెట్టుబడిని ఐదేళ్లకు ముందే ఉపసంహరించుకోవడం కుదరదు. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే దీనికి మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత మెరుగ్గా వడ్డీ రేటు 7.7 శాతం ఉంది. ► ప్రస్తుత రాబడి 7.1% ► లాకిన్: 15 ఏళ్లు ఇది రిస్‌్కలేని డెట్ సాధనం. ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. పీపీఎఫ్ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఈ పథకంలో ప్రస్తుత రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ సాధనంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సీ కింద పూర్తి పరిమితి (రూ.1.5 లక్షలు) మేరకు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, రాబడిపైనా పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్యకు దీన్ని పరిశీలించొచ్చు. ఇందులో పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంటుంది. ప్రారంభించి ఐదేళ్లు నిండిన తర్వాత ఇందుకు అనుమతిస్తారు. ప్రముఖ బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో దీన్ని ప్రారంభించొచ్చు ► ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రిస్‌్కలేని రాబడి సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ప్రస్తుతం ఇందులో రాబడి 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రాబడి ఎక్కువ. పెట్టుబడి కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున కాల వ్యవధి పెంచుకుంటూ వెళ్లొచ్చు. పొడిగించుకునే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. ఒక వ్యక్తి ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపన్ను చట్టం కింద వృద్ధులకు ఉంది. అంటే రూ.6.25 లక్షల వరకు పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను మినహాయింపు అయిన రూ.50 వేలలోపే ఉంటుంది. 60 ఏళ్లు నిండిన వారు, ముందస్తు పదవీ విరమణ పొందిన వారు 58 ఏళ్ల తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ సిబ్బందికి వయో పరిమితి లేదు. ► గడిచిన ఐదేళ్లలో కనిష్ట రాబడి: 8.16% ► పెట్టుబడులకు లాకిన్: 60 ఏళ్లు వరకు పన్ను ఆదాకు మెరుగైన సాధనాల్లో ఇదీ ఒకటి. ఒకవైపు విశ్రాంత జీవనం కోసం నిధిని సమకూర్చుకూర్చుకుంటూ, మరోవైపు పన్ను ఆదా చేసుకునే ప్రయోజనంతో వస్తుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.2 లక్షల పెట్టుబడిపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ(1బి)కింద రూ.50వేలపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి పరిధిలోకే సెక్షన్ 80సీసీడీ (1) కూడా వస్తుంది. దీనికి అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ (1బి) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే.. ఉద్యోగి వేతనంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో యాక్టివ్ ఆప్షన్ కింద ఈక్విటీలకు గరష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదిలో పెట్టుబడుల కేటాయింపులను (ఈక్విటీ, డెట్, ఏఐఎఫ్) నాలుగు పర్యాయాలు సవరించుకోవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజర్లనూ మార్చుకోవచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ/క్రమానుగతంగా ఉపసంహరణ)ను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. దీనివల్ల గడువు తీరిన తర్వాత ఒకే విడత కాకుండా, నెలవారీగా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎన్పీఎస్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ ఇదే పనితీరు ఉంటుందని అంచనా. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స్ అధిక శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తాయి. కనుక రిస్క్ దాదాపు చాలా తక్కువ. ► ఐదేళ్లలో వార్షిక రాబడి 7–14 శాతం ► లాకిన్ పీరియడ్: రిటైర్మెంట్ వరకు బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే చార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పీఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్‌ల మాదిరి పనిచేస్తాయి. కానీ, ఎన్పీఎస్, యులిప్‌లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనం కలి్పంచాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పీఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే, మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొసాగాల్సి వస్తుంది. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ► రాబడులు: గత ఐదేళ్లలో 7–9 % ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విట్లీలోనే పెట్టేస్తాయి. కానీ, రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతోపాటు డెట్ సాధనాల్లోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కలి్పస్తుంది. సెక్షన్ 80సీ కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ రిస్‌్కతో, మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40 శాతంలోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ, విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ ఐదేళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చార్జీలు విధిస్తోంది. ► ఇందులో రాబడి ప్రస్తుతం 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఇటీవలే ఈ పథకంలో వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాదిరే వడ్డీ రేటు, కేంద్ర సర్కారు గ్యారంటీతో కూడిన రిస్క్ లేని సాధనం ఇది. తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరి పేరిట గరిష్టంగా ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పథకాన్ని ప్రారంభించాలంటే కుమార్తెల వయసు 10 లోపు ఉండాలన్నది నిబంధన. పోస్టాఫీసులు, బ్యాంక్‌ల్లో ఈ స్కీమ్ కింద ఖాతాను ప్రారంభించొచ్చు. ఆర్బీఐ వచ్చే ఆరి్థక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం ఆరంభంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర సర్కారు సవరిస్తుంటుంది. కనుక సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత రేటు 8.2 శాతం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశించరాదు. కాకపోతే ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేనందున, కుమార్తెల భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రిస్‌్కలేని ఈ పథకానికి కేటాయించుకోవచ్చు. ► గడిచిన ఐదేళ్ల కాలంలో కనిష్ట వార్షిక రాబడి 8.15 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు యూనిట్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యులిప్‌లు) పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈఎల్ఎస్ఎస్ మాదిరిగా పెట్టుబడులకు అంత సౌకర్యవంగా ఉండవు. పోర్ట్‌ఫోలియో వివరాలు తెలుసుకోవడం కూడా సౌకర్యంగా కష్టమే. కాకపోతే యులిప్‌ల నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆశించొచ్చు. పైగా పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. బీమా రక్షణ కూడా కొంత లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడిపై పన్ను మిననహాయింపు ఉంటుందే కానీ, లాభాల ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో లాభం రూ.లక్షకు మించితే 10 శాతం పన్ను చెల్లించాలి. కానీ, యులిప్‌లలో రాబడి ఎంత వచి్చనా కానీ, గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను ఉండదు. ఈ ప్రయోజనం కోసం చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ కనీసం 10 రెట్లు అధికంగా ఉండాలని సెక్షన్ 10(10డి) చెబుతోంది. యులిప్ పాలసీలోనూ ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య ఇన్వెస్టర్ తన స్వేచ్ఛ ప్రకారం పెట్టుబడుల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. అలా మార్చుకున్నప్పటికీ పన్ను బాధ్యత ఉండదు. యులిప్ ప్లాన్లలో ఐదేళ్ల తర్వాత నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ పరిమితంగానే ఉండడం ప్రతికూలం. వార్షిక ప్రీమియానికి 10–12 రెట్ల వరకే రక్షణ ఎంపిక చేసుకోగలరు. అంటే ఏడాదికి రూ.1–1.20 లక్షలు చెల్లించినా, లభించే రక్షణ రూ.10–12 లక్షలకు మించదు. కనుక తగినంత జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. యులిప్‌ను రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. ► గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటా సగటు రాబడి 17 శాతం ► లాకిన్ పీరియడ్: మూడేళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ కూడా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. కనుక సమీప కాలంలో వీటిల్లో రాబడులు మెరుగ్గానే ఉంటాయని అంచనా. రాబడులు, భద్రత, లాకిన్ పీరియడ్ తదితర అంశాల పరంగా చూస్తే ఎన్పీఎస్ తర్వాత, ఎన్‌పీఎస్‌తో సమానంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పైగా పారదర్శకత ఎక్కువ. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెట్టుబడికి లాకిన్ కేవలం మూడేళ్లుగానే ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్‌్కను సమర్థవంతంగా అధిగమించొచ్చు. సెక్షన్ 80సీ కింద ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో సగటు రాబడులు ఏడాది కాలంలో 19 శాతం, మూడేళ్లలో 18.50 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 15.46 శాతం, పదేళ్లలో ఏటా 16.60 శాతం చొప్పున ఉన్నాయి. -
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది. ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి. -
అయోధ్య రామ మందిరం : పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువ జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం రామనామ స్మారణ మారుమ్రోగుతుంది. భక్తులు భారీ ఎత్తున రాములోరికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో విరాళాల సేకరణకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక నిబంధనలకు అనుగుణంగా అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌కు చేసే విరాళంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అయోధ్య రామమందిరాన్ని ప్రజల ప్రార్థనా స్థలంగా ప్రకటించింది. మే 8, 2020 నాటి సీబీడీ సర్క్యులర్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం' (పాన్: AAZTS6197B) చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రజల ఆరాధనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్య రామమందిర మరమ్మతు, నిర్వహణ కోసం అన్ని విరాళాలు సెక్షన్ 80జీ కింద మినహాయింపు పొందవచ్చు’ అని తెలిపింది. ఈ విరాళంలో 50 శాతం సెక్షన్ 80G (2)(B) కింద పేర్కొన్న షరతులకు లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 జీ కింద రూ. 2000 కంటే ఎక్కున నగదు విరాళం పన్ను మినహాయింపు పరిధిలోకి రాదు. -
స్టార్టప్‌లకు ఆదాయపన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్‌లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్‌లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు. అర్హత సరి్టఫికెట్లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం. అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్లను స్టార్టప్‌లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్‌లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్‌లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్‌లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్‌ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. -
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
రూ.284 కోట్ల పన్ను చెల్లించండి.. జైడస్‌కు ఐటీ శాఖ నోటీసులు
న్యూఢిల్లీ: జైడస్ లైఫ్ సైన్సెస్ అనుబంధ సంస్థ జైడస్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి రూ.284.58 కోట్ల మేర నోటీసు జారీ అయింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143(1) కింద జారీ అయిన ఈ డిమాండ్ నోటీసు, 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి చెందినదని సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. రిటర్నుల్లో స్పష్టమైన తప్పుల కారణంగానే ఇది చోటు చేసుకుందని, తప్పొప్పులను సరిదిద్దిన అనంతరం మొత్తం పన్ను డిమాండ్ తొలగిపోతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ సూచనలు కాగా, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లోని సమాచారం, రిపోర్టింగ్ ఎంటెటీల (బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, బ్రోకరేజీలు తదితర) నుంచి అందిన సమాచారం మధ్య పోలిక లేని కేసుల్లో.. వారికి సూచనలు పంపినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. టీడీఎస్/టీసీఎస్‌కు, దాఖలు చేసిన ఐటీఆర్‌లోని సమాచారం మధ్య వ్యత్యాసం ఉన్న వారికి కూడా సూచనలు పంపింది. -
ట్యాక్స్‌ను ఆదా చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఆప్షన్
అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు మెరుగైన రాబడి, మరోవైపు పన్ను ఆదాకు వీలు కల్పించేవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు. సెక్షన్ 80సీ పరిధిలో ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలనుకునే వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. పన్ను ఆదా కోరుకునే వారు, రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్న వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం మంచి పనితీరు చూపిస్తోంది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 22 శాతానికి పైగా రాబడులు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలంలో చూస్తే ఈ పథకంలో సగటు వార్షిక రాబడులు 20.52 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 16.59 శాతం, ఏడేళ్లలో ఏటా 16.47 శాతం, పదేళ్లలో 17.33 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం తెచ్చి పెట్టింది. దీర్ఘకాలంలో ఈ పథకం అందించిన రాబడులు ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం డైవర్సిఫైడ్ విధానంలో వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. మార్కెట్ ర్యాలీల్లో లాభాలను స్వీకరిస్తుంటుంది. మార్కెట్లు అస్థిరంగా మారితే సురక్షిత విధానంలోకి మారిపోతుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,699 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.56 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 4.44 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. ఇక ఈక్విటీల్లోనూ బ్లూచిప్ కంపెనీలకే 67 శాతం కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 23.42 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 9.31 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 54 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్దపీట వేసింది. 30 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. 8.63 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.41 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 7.62 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 7.50 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 5.58 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 5.44 శాతం, సేవల రంగ కంపెననీలకు 4.93 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 ఆఖరి తేదీ!
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. మరో రెండు రోజుల్లో అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించాల్సిన గడువు ముగియనుంది. ట్యాక్స్ పేయర్స్ వెంటనే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే జరిమానా, అదనంగా వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ పే అంటే ఏమిటి? రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఈ ముందస్తు పన్నును ఒకే సారి సంవత్సరం చివర కాకుండా దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పేని ఎవరు చెల్లించాలి? సెక్షన్ 208 ఇన్ కం ట్యాక్స్ యాక్ట్, 1961 ప్రకారం.. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయపన్ను రూ.10వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ విభాగంలో వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పే ఎవరికి మినహాయింపు ఉంటుంది? ఉద్యోగులకు చెల్లించే జీతంలో టీడీఎస్ కట్ అవుతుంది. అయితే, ఉద్యోగులు జీతం కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతుంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అనేది తప్పని సరి. 60 సంవత్సరాలు పైబడి ఎలాంటి వ్యాపార, వృత్తిగత ఆదాయం లేని సీనియర్ సిటిజన్స్‌కు కూడా దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఎలా లెక్కించాలి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-2023) అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. ఇలా అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే కట్టాల్సిన జరిమానాలు సెక్షన్ 234బీ,234 సీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స పేమెంట్ చేసేందుకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సెక్షన్ల కింద నెలకు 1 శాతం లేదా దానిలో కొంత వడ్డీ పడుతుంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన తేదీలు జూన్ 15 కంటే ముందు : 15 శాతం అడ్వాన్స్ ట్యాక్స్‌ను తప్పని సరిగా చెల్లించాల్సి సెప్టెంబర్ 15 కంటే ముందు : మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45 శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. డిసెంబర్ 15 కంటే ముందు - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. చివరిగా :: మరో రెండు రోజుల్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే తేదీ గడువు ముగియనుందని, చెల్లింపు దారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. -
దోచుకున్న డబ్బులో ప్రతి రూపాయి వెనక్కి రప్పిస్తా: మోదీ
ఢిల్లీ: ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు బటయటపడింది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఐటీ దాడుల్లో సుమారు రూ.220 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై మూడు రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. అయితే ఆ మద్యం వ్యాపారికి జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకి సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. देशवासी इन नोटों के ढेर को देखें और फिर इनके नेताओं के ईमानदारी के 'भाषणों' को सुनें... 😂😂😂 जनता से जो लूटा है, उसकी पाई-पाई लौटानी पड़ेगी, यह मोदी की गारंटी है। ❌❌❌💵 💵 💵❌❌❌ pic.twitter.com/O2pEA4QTOj — Narendra Modi (@narendramodi) December 8, 2023 ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులో ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది ‘మోదీ హామీ’ అంటూ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఈ కరెన్సీ నోట్ల కట్టలను చూసిన తర్వాత కొందరు నాయకుల( కాంగ్రెస్) నిజాయితీ ‘ప్రసంగాలను’ వినాలని వ్యగ్యంగా అన్నారు. అదే విధంగా నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన ఓ క్లిపింగ్ జత చేశారు. -
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, అతని ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్
ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. గడిచిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు, అసెస్మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం. -
కాంట్రాక్టర్ ఇంట్లో రూ.40 కోట్ల నగదు..
కర్ణాటక: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సిలికాన్ సిటీలో కాంట్రాక్టర్ల ఇళ్లలో వెతికే కొద్దీ నగదు కుప్పలు బయటపడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి రాజాజీనగర కేతమారనహళ్లిలో కాంట్రాక్టర్ సంతోష్ కృష్ణప్ప అపార్టుమెంట్‌లోని ఫ్లాటులో ఐటీ అధికారులు సోదాలు చేయగా, రూ.40 కోట్ల నగదు లభించింది. 32 బాక్సుల్లో ఈ నగదు దొరికింది. ఆయనను ప్రశ్నించగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ సీ.కాంతరాజుకు చెందినదని చెప్పారు. ఆ నగదను గట్టి భద్రత మధ్య వ్యానులో తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అపార్టుమెంటు 5వ అంతస్తులోని సంతోష్ కృష్ణప్ప ఫ్లాట్‌లో రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తుండగా నగదు పెట్టెలు కనిపించాయి. దీంతో మరో 10 మందికి పైగా అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీల్లో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ ప్రకటన వెలువడగానే బెంగళూరుపై ఐటీ అధికారులు దండయాత్ర చేపట్టారు. బడా సంపన్నుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. పాలికె కాంట్రాక్టర్ ఆర్.అంబికాపతి ఫ్లాటులో రూ.42 కోట్లు పట్టుబడడం తెలిసిందే. నాకేమీ తెలియదు: కాంతరాజు కాంట్రాక్టర్ సంతోష్ కృష్ణప్ప అపార్టుమెంట్లో లభ్యమైన నగదుతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ కాంతరాజు చెప్పారు. తనకు అధికారులు ఎవరూ ఫోన్ చేయలేదని, నెలమంగల ఇంట్లో ఉన్నానని తెలిపారు. సంతోష్ కృష్ణప్ప ఎవరో తనకు తెలియదని, ఇందులో అనవసరంగా నా పేరు లాగుతున్నారని అన్నారు. నా తల్లిదండ్రులకు నేనొక్కడే కొడుకు, ఇంకెవరూ లేరన్నారు. నగదుపై సీబీఐ విచారణ చేయాలి కాంట్రాక్టర్ల వద్ద ఐటీ దాడుల్లో లభ్యమైన కోట్లాది రూపాయల నగదుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ మాజీ మంత్రి సీటీ.రవి డిమాండ్ చేశారు. ఆదివారం మల్లేశ్వరంలోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి అస్థిపంజరాలు ప్రతినిత్యం వెలుగుచూస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సంగీత కళాకారుని నుంచి రూ. 3 లక్షలు కమీషన్ అడిగారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్లు, మరో బిల్డర్ సంతోష్ కృష్ణప్ప ఇంట్లో రూ.40 కోట్లు లభించాయని, దీని వెనుక ఉన్నది ఎవరని అన్నారు. వీరిద్దరూ ఇద్దరు ప్రముఖులకు బినామీలని, సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చలవాదినారాయణస్వామి, భాస్కర్‌రావ్ పాల్గొన్నారు. జిల్లాల్లో నేడు నిరసనలు ● బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని, దీనికి వ్యతిరేకంగా సోమవారం అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ తెలిపారు. బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ప్రతి పనికీ రేటు ఖరారు చేసి, అధికారులతోనే అవినీతి ప్రారంభించిన ప్రభుత్వం, కళాకారులను కూడా వదిలిపెట్టలేదని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల ఇళ్లలో దొరికిన డబ్బుకు– కాంగ్రెస్‌కు కచ్చితంగా సంబంధం ఉందన్నారు. ఇది లూటీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఇక్కడి నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బును పంపిస్తున్నారని ఆరోపించారు. -
డబ్బులే డబ్బులు! భారీగా పన్ను వసూళ్లు.. ఈసారి ఏకంగా..
న్యూఢిల్లీ: భారత్ ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు అక్టోబరు 9 నాటికి 21.82 శాతం పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ వసూళ్లు నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23 ఆర్థిక సంవత్సరం వసూళ్లతో (రూ.16.61 లక్షల కోట్లు) పోల్చితే ఇది 9.75 శాతం అధికం. కాగా, తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ 9 నాటికి నికర వసూళ్లు బడ్జెట్ లక్ష్యంలో 52.5 శాతానికి చేరాయి. అయితే ప్రస్తుతం విడుదల చేస్తున్నవి తొలి తాత్కాలిక గణాంకాలనీ, తుది గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు ఇలా.. స్థూల వసూళ్లు అక్టోబర్ 9 నాటికి రూ.11.07 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 17.95 శాతం అధికం. కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో 7.30 శాతం వృద్ధి, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) 29.53 శాతం వృద్ధి నమోదయ్యాయి (ఎస్టీటీ సహా) అక్టోబర్ 9 వరకూ రిఫండ్స్ విలువ రూ.1.50 లక్షల కోట్లు. -
పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో సోదాలు
-
HYD: వంద టీమ్‌లతో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ (IT) సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా వంద బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే టీమ్‌లుగా విడిపోయి.. కొన్ని కంపెనీలతో పాటు కొందరి ఇళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.ప్రధానంగా ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీలే ప్రధానంగా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆయా కంపెనీల డైరెక్టర్లు, బోర్డు మెంబర్ల ఇళ్లలోనూ తనిఖీలు సాగుతున్నాయి. అమీర్‌పేట్, శంషాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు శివారుల్లోని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి గూడ లోని పూజ కృష్ణ చిట్ ఫండ్స్‌పై 20 టీమ్స్ తనిఖీలు చేపట్టింది. ఈ చిట్‌ఫండ్ డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండి కృష్ణ ప్రసాద్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జీవన్ శక్తి చిట్ ఫండ్, ఈ కామ్ చిట్ ఫండ్ లపై సోదాలతో పాటు దాదాపు 60 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి హోసింగ్ బోర్డ్ 7వ ఫేజ్‌లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్ కంపెనీ ఓనర్ అరికేపుడి కోటేశ్వర రావుతో పాటు రైల్వే కాంట్రాక్టర్ వర ప్రసాద్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాగంటి వజ్రనాథ్‌తో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, రఘ్వీర్(శంషాబాద్) ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. చెన్నై: మరోవైపు తమిళనాడులోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. నలభై చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది ఐటీ. డీఎంకే జగత్ రక్షకన్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. -
20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..
అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్ (TCS) పన్ను అక్టోబర్ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్ 1 నుంచి 20 శాతం ఉంటుంది. LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది. కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. -
కేంద్రానికి కాసుల వర్షం! భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్..
కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ( Direct Tax Collection) 23.51 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను (సీఐటీ) రూ. 4,16,217 కోట్లు. వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్ ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ. 2.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 16 నాటికి వసూలైన రూ. 3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రూ. 2.80 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 74,858 కోట్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్లను ట్యాక్స్ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) -
అడ్వాన్స్‌గా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
ఆదాయపు పన్నుని మూడు పద్ధతుల్లో చెల్లించాలి. ఆర్థిక సంవత్సరాంతం ముగిసే లోపలే పూర్తి భారాన్ని చెల్లించడం .. అంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం వీటిలో మొదటిది. రెండోది టీడీఎస్. నిర్దిష్ట డిడక్టర్ మీకు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి నిర్దేశిత శాతాన్ని మినహాయించుకుని, దాన్ని మీ పేరున ట్యాక్స్ కడతారు. టీడీఎస్ చేసే మొత్తానికి మీ ఆదాయంతో సంబంధం లేదు. ఇది డిడక్టర్ బాధ్యత. మీ ప్రమేయం ఉండదు. ఇక రిటర్ను వేసేటప్పుడు, చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్‌లు మీరు చెల్లించాల్సిన పన్ను భారానికి సరిపోని పరిస్థితి తలెత్తినప్పుడు కట్టే మొత్తాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటారు. నాలుగో పద్ధతి ఏమిటంటే, అసెస్మెంట్ చేసినప్పుడు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ మొత్తాన్ని చెల్లించడం. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ విషయానికొస్తే.. ►ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ► టీడీఎస్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత పన్ను భారం రూ. 10,000 లేదా అంతకన్నా అధికంగా ఉంటేనే చెల్లించాలి. ► సాధారణంగా కేవలం జీతం ఆదాయంగా ఉండి, టీడీఎస్ బాధ్యతని యజమాని సక్రమంగా నిర్వహించి ఉంటే, సదరు ఉద్యోగి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ►కానీ, సదరు ఉద్యోగికి ఇతర ఆదాయాలు ఉండి, వాటి వల్ల పన్ను భారం రూ. 10,000 దాటితే మాత్రం ఈ పరిధిలోకి వస్తారు. ►చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తం.. నాలుగు గడువు తేదీల్లోగా చెల్లించాలి. 15–06–2023 లోపల 15 శాతం 15–09–2023 లోపల 30 శాతం 15–12–2023 లోపల 30 శాతం 15–03–2024 లోపల 25 శాతం ఇలా చేస్తూ వెడితే 2024 మార్చి 15 నాటికి నూటికి నూరు శాతం పన్ను భారాన్ని చెల్లించినవారవుతారు. మీరు ఈ పరిధిలోకి వచ్చే వారయితే, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం మొదలుపెట్టాలి. సకాలంలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. ఏ వాయిదాకి ఆ వాయిదా చెల్లింపులో జాప్యం జరిగినా ఆ మేరకు వడ్డీ విధిస్తారు. కట్టాల్సిన పన్ను భారంలో చెల్లించిన మొత్తం 90 శాతం కన్నా తక్కువ ఉంటే వడ్డీ విధిస్తారు. ఈ చెల్లింపులు చాలా ముఖ్యం. తప్పనిసరి. ముందుగా మీ ఆదాయాన్ని నిర్ధారించే వారికి ఇది ప్రయోజనకారి. ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ చేసుకోవచ్చు. చివరి క్షణంలో ఉరుకులు పరుగుల అవసరం ఉండదు. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. -
రూ. 118 కోట్ల దోపీడీ చేసి దొరికినా నిప్పేనట..!
మనోడి దొంగతనాన్ని దర్యాప్తు సంస్థలు బయట పెట్టి నోటీసులిస్తే అవి చెల్లని నోటీసులట. 118కోట్లకు పైగా అడ్డంగా ఎలా తిన్నావయ్యా? చెప్పని నిలదీస్తే అవి మామూలు నోటీసులట. కంగారు పడాల్సింది ఏమీ లేదట. చంద్రబాబు నాయుడి అడ్డగోలు లూటీ ని కేంద్ర ఐటీ శాఖ నోటీసులు బయట పెట్టడంతో ఏం మాట్లాడాలో తెలీక నోటికి తాళాలు వేసుకున్న పచ్చ బ్యాచ్ కాస్త గ్యాప్ ఇచ్చి అబ్బే అవేం సీరియస్ నోటీసులు కావండీ బాబూ అని బుగ్గలు నొక్కేసుకుంటోంది. చంద్రబాబును ఎలా కాపాడాలా అని నానా తంటాలూ పడుతూ తమ చెత్త లాజిక్ తో దొరికిపోతున్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాల ముసుగులో శాంపిల్ కింద 118 కోట్ల రూపాయలకు పైగా డొల్ల కంపెనీల ద్వారా తన ఖాతాలోకి రప్పించుకున్న చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల్లో అయ్యా చంద్రబాబు గారూ మీరు ..మీ తనయుడు..మీ పిఏ శ్రీనివాసు.. కలిసి మీ డొల్ల కంపెనీల ద్వారా ఫేక్ ఇన్వాయిస్ లద్వారా 118 కోట్ల 90లక్షలకు పైగా లూటీ చేశారు కదా...దానికి సంబంధించి మీ వివరణ ఏంటో చెప్పండి సార్ అని ఐటీ అధికారులు ఆరా తీశారు. నోటీసులు రావడంతోనే పక్షవాతం వచ్చినట్లు టీడీపీ నేతలు వారి అనుబంధ పత్రికలు, సంస్థల ప్రతినిథుల నోళ్లు పడిపోయాయి. కొద్ది రోజులుగా అన్ని వర్గాల ప్రజలూ చంద్రబాబు దోపిడీ గురించే కథలు కథలు గా చెప్పుకుంటున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. ప్రజల నుండి సానుభూతిని కొట్టేయడానికి నన్ను రేపో మాపో అరెస్ట్ చేస్తారంటూ ఆయనే బేలగా వ్యాఖ్యానించారు. అయితే అనుకున్న సానుభూతి ఎక్కడి నుండీ రాలేదు. పై పెచ్చు లూటీ చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దులు పెట్టుకుంటారా అని ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో ఈ లోకం అంతా చంద్రబాబు నాయుడిపై కక్షగట్టేసిందన్నట్లు ఎల్లో బ్యాచ్ ఆరున్నొక్క రాగం అందుకుంది. అందులో బాబు జేబు మీడియాలో చిత్ర విచిత్ర కథనాలు వచ్చేశాయి. అసలు అవి ముడుపులే కావట. ఐటీ జారీ చేసిన నోటీసులు అసలు చెల్లనే చెల్లవట. చాలా రొటీన్ గా ఇచ్చే నోటీసులే తప్ప సీరియస్ గా తీసుకోవలసిన అవసరమే లేదట. ఇవీ ఘనత వహించిన ఎల్లో పత్రికల కుళ్లు రాతలు. ఇక చంద్రబాబు నాయుడైతే అడ్డంగా దొరికిపోయి కూడా నేను నిప్పులా బతికాను అని పాత రికార్డు మళ్లీ ప్లే చేసేశారు. తనని ఇంత వరకు ఏ ఒక్క కేసులోనూ జైలుకు పంపలేకపోయారన్న చంద్రబాబు.. ఏ కేసులోనూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవుగా అని అనేశారు. అంటే తానేం చేసినా సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తగానే లూటీ చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. సరే ఎల్లో మీడియా అంటేనే చంద్రబాబు అక్రమ సంపాదనతో నడిచేవి కాబట్టి అవి బాబును నిర్దోషిగా చిత్రీకరించడానికి విఫలయత్నాలు చేస్తాయి. ఏపీలో టీడీపీకి ప్రత్యర్ధి పార్టీ అయిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు రక్షణ కవచంలా అడ్డు పడిపోయారు. బాబుకు వచ్చిన ఐటీ నోటీసులు రొటీనే అంటూ ఆమె కూడా దాన్ని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. ఆ నోటీసులు పంపింది బిజెపి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఐటీ శాఖ అధికారులేనని ఆమె మర్చిపోయినట్లున్నారని ఆర్ధిక రంగ నిపుణులు సెటైర్లు వేస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఏవైనా నోటీసులు వస్తే వాళ్లు అవినీతి పరులనీ తామే తీర్పులు ఇచ్చేసి దుర్మార్గంగా వ్యవహరించే ఎల్లో బ్యాచ్ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఆయన్ను నిజాయితీ పరుడిగా చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ బ్యాచ్ లో ఇపుడు కొత్తగా పురంధేశ్వరి కూడా వచ్చి చేరడమే కొసమెరుపు అంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీయార్ పేరిట నాణెం విడుదల కార్యక్రమం ముసుగులో చంద్రబాబు-నడ్డాల భేటీ ఏర్పాటు చేసిన పురంధేశ్వరి ఇపుడు చంద్రబాబు నాయుడి నిజాయితీ నిరూపించే పనిలో పడ్డారని బిజెపిలోని ఒరిజనల్ నేతలు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి -
చంద్రబాబు.. ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా?
సాక్షి, తాడేపల్లి: ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా చంద్రబాబు అంటూ సవాల్ విసిరారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి. ఐటీ నోటీసులపై మౌనం దాల్చడం వెనుక కారణం ఏమిటి చంద్రబాబు అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన వెంకటరెడ్డి.. ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం అర్ధాంగీకారమేనని తేల్చిచెప్పారు. ‘తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. లక్షల కోట్లు దోచేసిన బాబు అడ్డంగా దొరికేశాడు. అవినీతిపై ఎవిడెన్స్ లేదంటాడు కానీ, తప్పు చేయలేదని చెప్పడు. దర్యాప్తు ఆలస్యం కావ్వొచ్చు. కానీ బాబు జైలుకు పోవటం ఖాయం. తేలు కుట్టిన దొంగల్లా దుష్ట చతుష్టయం’ అని విమర్శించారు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఆ దావా వేయగలవా? అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. లెక్కలు చూపని రూ. 118 కోట్లపై ఐటీ శాఖ నోటీసు ఇస్తే, చంద్రబాబు దానిపై స్పందించడం లేదు. ఒక వేళ ఐటీ శాఖ తప్పుడు నోటీసులు ఇచ్చిందని భావిస్తే.. ఆ శాఖ మీద పరువు నష్టం దావా వేయగలవా?. కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చి కోర్టులో విచారణ కోరవచ్చు. కానీ చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే.. భయంతోనా?.. లేక ఇంకా లోతుగా వెళ్తే.. మరింత అడ్డంగా దొరికిపోతామన్న ఆందోళనా? బాబు బీద అరుపులు ఐటీ నోటీసులు తప్పుడుగా ఇస్తే.. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి అబద్ధం చెబితే అందరిపైనా పరువు నష్టం దావా వేయాలి. సోషల్ మీడియాలో తప్పుడు వార్త పెట్టారని యువగంగాళం యాత్ర చేస్తున్న లోకేశ్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై మాట్లాడడం లేదు. స్పందించడం లేదు. చంద్రబాబు కూడా కోర్టుల్లో కేసులు వేయడం లేదు. కానీ చంద్రబాబుకు అరెస్టు అవుతాననే భయం పట్టుకుంది. కాబట్టే ఇంటికి ఒకరు వచ్చి రక్షణ వలయంగా ఉండాలని.. చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. బాబు మౌనం అర్థాంగీకారం చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో ఐటీ నోటీసుల ద్వారా బట్టబయలైంది. అయినా ఆయన ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై స్పందించడం లేదంటే.. మౌనం అర్థాంగీకారం భావించాలి. లక్షల కోట్లు ఉండొచ్చు ఏదైనా అంశం వస్తే.. చంద్రబాబు ఉదయం, మధ్యాహ్నం ప్రెస్మీట్లు పెడతారు. వాటిపై ఎల్లో మీడియాలో సాయంత్రం డిబేట్లు నిర్వహిస్తారు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పత్రికల్లో రకరకాలుగా రాస్తారు. ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటిపోయింది. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ. 118 కోట్ల లంచాన్ని షెల్ కంపెనీల ద్వారా తీసుకున్నట్లు, ఐటీ నోటీసుల ద్వారా తేటతెల్లమైంది. అయితే వెలుగులోకి రాని ఇలాంటివి చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఉండొచ్చు. కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబు మెక్కిన లంచాలన్నీ బయటకు వస్తే, అది లక్షల కోట్లు ఉంటుంది. మింగలేక.. కక్కలేక తన అవినీతిపై ఏ ఎవిడెన్స్ లేదంటాడు తప్ప, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడు. తన మీద ఎన్నో ఎంక్వైరీలు చేయించినా, ఏమీ పీకలేకపోయారని, తాను నిప్పులాంటి వాడినని చంద్రబాబు చెబుతుంటారు. నిజంగా ఆయన నిప్పు లాంటి వ్యక్తి అయితే.. ఏ ఎంక్వైరీకి అయినా సిద్ధంగా ఉండాలి. వారికి సహకరించాలి. ఇప్పుడు ఐటీ నోటీసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ఏదేదో మాట్లాడుతున్నాడు. తన అవినీతి బండారం అంతా బయటపడడంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. తేలు కుట్టిన దొంగల్లా.. ఐటీ నోటీసులపై తేలు కుట్టిన దొంగల్లా పచ్చ బ్యాచ్, దుష్ట చతుష్టయం ఉండిపోయింది. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, దత్తపుత్రుడు, పురంధేశ్వరీతో పాటు, కమ్యూనిస్టులు కూడా ఏం మాట్లాడడం లేదు. అంతా గప్‌చుప్‌గా ఉన్నారు. గతంలో కమ్యూనిస్టులు ‘బాబు జమానా అవినీతి ఖజానా’ అని పుస్తకం కూడా వేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా రూ. 118 కోట్లు లంచంగా తీసుకున్నాడని, ఐటీ శాఖ నోటీసులు ఇస్తే.. కమ్యూనిస్టులు రామకృష్ణ, నారాయణ నోర్లు మూగబోయాయి. వారికి కూడా ఎన్నికల ఫండ్ కింద రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు చంద్రబాబు ముట్టజెప్పాడా? అనిపిస్తోంది. ఊ అంటే, ఇంట్లోంచి లాక్కొచ్చి తంతా అంటూ మాట్లాడే దత్తపుత్రుడు కూఆ ఐటీ నోటీసులపై ఎందుకు మాట్లాడటం లేదు?. దానికి కారణం చంద్రబాబు ఇచ్చిన ముడుపులే అని అందరూ అనుకుంటున్నారు. బీజేపీ నోటికీ తాళాలా! చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే, తానెందుకు స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటున్నారు. గతంలో ఏలేరు స్కాంపై బీజేపీ వారు ఉదయ కమలం అనే పుస్తకం వేశారు. అలాంటి బీజేపీ ఇప్పుడు నోరు మెదపడం లేదంటే.. ఆ పార్టీ రాష్ట్ర పెద్దలు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు అని ప్రజలకు అర్థమౌతోంది. తప్పులు చేయకపోతే.. చంద్రబాబు ఒకవేళ తప్పులు చేయకపోతే కేసులపై కోర్టుల్లో స్టేలు ఎందుకు? వాటిని తొలగింప చేసుకుని, దర్యాప్తును ఎదుర్కోవాలి. చంద్రబాబు నువ్వెన్ని ఎత్తులు, జిత్తులు వేసినా, కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. బోనులో నిలబడకా తప్పదు. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన కేసులో కూడా స్టే కొనసాగుతోంది. ఏలేరు స్కాంకేసుపైనా కోర్టు స్టే ఉంది. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. పాపం పండినప్పుడు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇన్నాళ్లు వ్యవస్థల్లో వ్యక్తులను అడ్డం పెట్టుకుని అవినీతిని మేనేజ్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు విచారణ ఎదుర్కోక తప్పదు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఈనాడు ఏది రాస్తే అది జనం నమ్మేస్తారనుకునేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఎవ్వరూ నమ్మరు. ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెల్సు. జగన్ వ్యక్తిగత పర్యటన చేశారు. గతంలో అమెరికా, పారిస్ వెళ్లారు. ఎక్కడా ప్రభుత్వ ధనాన్ని వినియోగించుకోలేదు. ఫ్లైట్ ఖర్చు కూడా జీఓల రూపంలో విడుదల చేస్తారు కదా. అధికారంలో ఉన్నా, లేకపోయినా స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరుగుతోంది చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు. వాళ్లేమో స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరగొచ్చు. ప్రతిపక్ష నాయకుడుగా అందరితో పాటు విమానాల్లో జగన్ గారు ప్రయాణించారు. లండన్ పర్యటనకు తన సొంత ఖర్చుతో సీఎం జగన్ వెళ్లారు. మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే.. ప్రతిపక్ష పార్టీలు సింగిల్‌గా వచ్చి సత్తా చూపించొచ్చు కదా. మా ప్రభుత్వం మీద ప్రజల మద్దతు పెరిగింది. 2019 కంటే ఓటింగ్ పెరిగింది. 2014 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాం. సీఎం పదవి ముఖ్యం కాకపోతే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆ పదవి ఎందుకు లాక్కున్నారు. సీఎం పదవి కోసమే కదా. సీఎం పదవి కోసమే కదా.. ఎన్టీఆర్ మీద నీచమైన కేరికేచర్లు గీయించారు. ఇదే నా ఆఖరి ఎన్నికలని చంద్రబాబు అడుక్కుంటున్నారు. అడుక్కునేవారికి ఓటేయరు. మంచి చేసినవారికి మాత్రమే ఓట్లేస్తారు. చంద్రబాబు ఎన్నిరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసినా టీడీపీకి ఒక్క సీటు వచ్చే అవకాశం లేదు. 2024లో మళ్లీ సీఎం జగన్‌గారే. మా పార్టీ మొత్తం 175 సీట్లు గెల్చుకుంటుంది. చంద్రన్న తోఫా, అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ అడిగాం. సీబీఐ ఎంక్వైరీ చేస్తే.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు. దర్యాప్తు నాలుగు నెలల్లో ఆలస్యం అవ్వొచ్చు కానీ.. చంద్రబాబు జైలుకు పోవటం ఖాయమని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. -
చంద్రబాబు ఐటీ స్కామ్.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ నోటీసుల సమాచారం తెలుసుకుని ఇద్దరు నిందితులు విదేశాలకు పరారయ్యారు. ఈనెల 5న దుబాయ్‌కు మనోజ్ వాసుదేవ్ పారిపోయారు. సాయంత్రం 7.10 గంటలకు దుబాయ్‌కు వెళ్లిపోయారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస రావు కూడా హైదరాబాద్ నివాసంలో లేరు. శ్రీనివాసరావు ఈనెల 6న అమెరికాకు పరారయ్యారు. షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా ఐటీ విచారణకు హాజరవుతానని తెలిపారు. కాగా అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో గత వారం తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు -
‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను రేపో, మాపో అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ.. ప్రజలే తనను రక్షించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆయన పాలన సాగినప్పుడు జరిగిన కొన్ని స్కాములలో కాని, తాజాగా ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులోని అంశాల ఆధారంగా వచ్చే అవినీతి కేసులలో కాని, లేదా పుంగనూరు, అంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసానికి కారణమైన కేసులో కాని అరెస్టు కావచ్చన్న భయం ఆయనకు ఉండవచ్చు. దానినంతటిని డైవర్ట్ చేయడం కోసం ఆయన సహజంగానే యత్నిస్తారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎలాగైతేనేమి ఒక కధనాన్ని వండి చంద్రబాబు కు సర్టిఫికెట్ ఇచ్చేసింది. అందులోనే వారి ఆందోళన అర్ధం అవుతుంది. 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలాగే తనపై కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టు చేస్తుందేమోనని ఆయా సభలలో వాపోతుండేవారు. అప్పుడు కూడా జనం తనచుట్టూ నిలబడి రక్షించాలని అంటుండేవారు. ఆ వెంటనే సీబీఐ ఏపీకి రావటానికి వీలు లేదని ఒక ఆర్డర్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు నిజంగా అవినీతికి పాల్పడి ఉండకపోతే చర్య తీసుకోవాలని చెప్పజాలం. కానీ, ఆయన కుంభకోణాలు చేయలేదని ఎవరు చెప్పాలి? అయితే దర్యాప్తు సంస్థలు తెలపాలి. లేదంటే కోర్టులు అయినా తీర్పు ఇవ్వాలి. ఇప్పటికే ఆయనపై రాజధాని అమరావతిలో భూముల కేసు, స్కిల్ డెవలప్మెంట్ నిధుల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్ మొదలైన ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఏపీ సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. తాజాగా ఆదాయపన్ను శాఖ సాక్ష్యాలు చూపుతూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగం మోపింది. చంద్రబాబు మాత్రం ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే చేయిస్తున్నారని చిత్రమైన వాదన చేస్తున్నారు. ✍️ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తే దానిని జగన్‌కు చుట్టి మాట్లాడుతున్నారు. అంతేగానీ బీజేపీ అగ్రనేతలను ఒక్క మాట అనడానికి సాహసించలేకపోతున్నారు. కేంద్రం నోటీసులు ఇస్తే జగన్ ప్రభుత్వంపై పోరాడుతానని అంటున్నారు. దీనికి కూడా జగన్ పాలననే తప్పు పడుతున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుల ఆధారంగా సీబీఐ, ఈడీ.. అలాగే ఏపీ సీఐడీ రంగంలో దిగితే చంద్రబాబుకు చిక్కులు తప్పవన్నవి నిపుణుల అభిప్రాయంగా ఉంది. చంద్రబాబుకు శిక్షలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది వారి అంచనా. అయినా చంద్రబాబు తనను అరెస్టు చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్కాములు చేస్తే ప్రజలు రక్షించాలట. అది ప్రజాస్వామ్యామట. చంద్రబాబు మాదిరి ఎవరూ కూడా తమపై వచ్చిన కేసులలో ఇలా రక్షణ పొందలేకపోయారన్నది చాలా మంది భావన. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడం లో కూడా దిట్ట అని పేరొందారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు ఈ సమస్య గడ్డుగా మారినట్లు ఉంది. గతంలో మాదిరి ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయలేమేమోనని భయపడుతున్నారేమో తెలియదు కాని , ఆయన మాటల తీరు చూస్తే తాను అన్నిటికి అతీతుడను అన్న ఫీలింగ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోకాని, దేశంలో కాని ప్రభుత్వాలు నడిపినవారు అవినీతి ఆరోపణలకు, ఇతరత్రా అభియోగాలకు గురై అరెస్టు కాలేదా అంటే చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలే తీసుకోండి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో పలు కేసులలో చిక్కుకుని అరెస్టు అయి బెయిల్ పై విడుదల అయ్యారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న అభియోగాలపై అరెస్టు అయి జైలులో ఉండవలసి వచ్చింది. ఇలా వీరేమిటి! ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉన్నత స్థానాలలో ఉన్నవారు జైలుకు వెళ్లిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. కొందరికి అయితే ఏకంగా ఉరి శిక్షే పడింది. ✍️ మన దేశంలో కూడా బీహారు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డిదాణా కుంభకోణంలో జైలు పాలయ్యారు. కేంద్ర మంత్రిగా ఆయన ఉద్యోగాల స్కామ్ లో ఇరుక్కుని విచారణను ఎదుర్కుంటున్నారు. ఆయన పిల్లలు సైతం సీబీఐ, ఈడీల విచారణకు హాజరవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా టీచర్ల నియామకాలలో అక్రమాలపై జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సి.ఎమ్. హోదాలోనే కేసులు ఎదుర్కుని రెండుసార్లు జైలు కు వెళ్లవలసి వచ్చింది. తమిళనాడులోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరు ఈడీ కేసులో జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ కు చెందిన ఇద్దరు మంత్రులు జైలుపాలయ్యారు. ఎవరిపైన అయినా అక్రమంగా కేసులు పెట్టరాదు. అందులో సందేహం లేదు. అదే సమయంలో నిజంగానే స్కాములకు పాల్పడి ఉంటే వారిని వదలివేయాలా? అన్నది కూడా ఆలోచించాలి. తనపై కేసులు వస్తే అవన్ని కక్ష సాధింపు అని, తాను ఎవరిపైన అయినా కేసులు పెడితే అవన్ని కరెక్టు అని ప్రచారం చేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది. సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం ఎంపీగా.. ఉన్నప్పుడు కేసులు వేయించి విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. ఒక సీబీఐ అధికారిని అడ్డం పెట్టుకుని విచారణ పేరుతో పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చేశారు. అప్పట్లో జగన్ పై చేసిన ఆరోపణలు ఏమిటి?ఆయన తన కంపెనీలలో తండ్రి పలుకుబడి ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని. అందుకు గాను ఆయా పరిశ్రమలకు నీటి సదుపాయం, భూ వసతి తదితర సదుపాయాలు ఇచ్చారన్నది ఆరోపణ.ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభుత్వాలు పరిశ్రమలకు నీరివ్వడం అవినీతి ఎలా అవుతుందో ఎప్పటికీ అంతుపట్టదు. ఆమాటకొస్తే.. కియా కార్ల పరిశ్రమ కు చంద్రబాబు టైమ్ లో ఎన్నివేల కోట్ల రాయితీలు ఇచ్చారు?. మరి అది కూడా తప్పే అవుతుంది కదా!. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ షేర్ విలువ పెరుగుతుందన్న వాదన ఉంది. ముందస్తు సమాచారంతో ఆయన రిటైల్ విభాగాన్ని అమ్మివేశారు.దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో క్విడ్ ప్రోకో ఉన్నట్లా?లేనట్లా? ఆ రోజుల్లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ పై కేసులు పెట్టారు. జగన్ సంస్థలు స్థాపించినప్పుడు ఆయన ఎంపీ కూడా కాదు. ఆయన తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లకు కేసులు పెట్టారు. కాని చంద్రబాబు విషయంలో అలాకాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కాములు. వాటిలో మాత్రం ఎవరూ ఏమి చేయకూడదని ఆయన వాదిస్తున్నారు. ✍️ ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి చంద్రబాబుపై కేసులు పెడతారా? అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యవహరిస్తున్నాయి. అవినీతిని అంకుశంతో పొడవాలని చెప్పిన రామోజీరావు ఇప్పుడు చంద్రబాబు అవినీతి జోలికి ఎవరూ వెళ్లరాదని అంటున్నారు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చి 118 కోట్ల ముడుపుల ఆరోపణ చేస్తే కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాయలేకపోయారు. ఆంధ్రజ్యోతి ఆదాయపన్ను శాఖ నోటీసులు చెల్లవన్న చంద్రబాబు వాదనను భుజాన వేసుకుని కథలు ఇస్తున్నారు. టీవీ5ది మరీ విడ్డూరం. నెలకు ఏభై రూపాయల వ్యాపారం చేసే వారికి కూడా ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తుందని, అందువల్ల చంద్రబాబు కు వచ్చిన ఐటి నోటీసులను పట్టించుకోనవసరం లేదని నిస్సిగ్గుగా ప్రచారం చేసింది. ✍️ ఈ మీడియా సంగతి పక్కనబెడితే.. చంద్రబాబు ఎందుకు ఐటీ నోటీసులలోని వివిధ అంశాలపై నిర్దిష్ట సమాధానం ఇవ్వలేకపోతున్నారు?ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ కేసు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. గతంలో వైఎస్ విజయమ్మ హైకోర్టులో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, కోర్టు అంగీకరించింది. కాని అప్పట్లో సీబీఐ తనవద్ద సిబ్బంది లేదని చర్యలు తీసుకోలేదు. దీనిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ అర్ధం చేసుకోవచ్చని చాలా మంది చెబుతారు. ఈలోగా చంద్రబాబు సుప్రింకోర్టుకు వెళ్లడం, మళ్లీ హైకోర్టులో విచారణ జరిగి కేసు లేకుండా చేసుకోగలడం జరిగాయి. నిజంగానే చంద్రబాబు ఆస్తులలో ఎలాంటి తేడా లేకపోతే విచారణకు ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్న వస్తుంది. తాను ఏ విచారణకు అయినా సిద్దం అని ఆయా సందర్భాలలో చెప్పే ఈయన తీరా విచారణ దశకు ఏదైనా కేసు వస్తే దానిని ఎలాగోలా మేనేజ్ చేసుకుని బయటపడుతుంటారని చాలా మంది నమ్ముతారు. చాలా కేసులలో అలాగే జరిగింది. పైగా తనపై ఈ నలభై ఐదేళ్లలో అసలు కేసులే లేవని బుకాయించడం ఆయన స్పెషాలిటీ. ✍️ అంతదాకా ఎందుకు నిజంగానే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులోని అంశాలు అన్నీ తప్పు అయితే ఏకంగా ఆ శాఖ పైన ఎందుకు పరువు నష్టం దావా వేయరు? అని అడిగితే దానికి జవాబు ఇవ్వరు. గతంలో CBIని పంపుతారని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటి నోటీసులు వచ్చినా, మోడీపైకాని,కేంద్రంపై కాని పన్నెత్తు మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు. ఐటి శాఖ ఇచ్చిన నోటీసును మొదటగా ప్రచురించింది హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల పత్రిక అయితే.. సాక్షి ప్రచారం చేస్తోందని ఆయన అంటారు. ప్రజలకు ఆయన ఈ కేసులపై వివరణ ఇవ్వాలి. కనీసం టీడీపీ కార్యకర్తలకైనా అనుమానాలు నివృత్తి చేయాలి కదా?అలాకాకుండా డబాయించుకుంటూ మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు మాత్రం నమ్ముతారా?పైకి మాట్లాడలేకపోయినా, లోపల వారి మనసులకు తెలియదా చంద్రబాబు స్కాములకు పాల్పడింది ,లేనిది?. చంద్రబాబును వారు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకున్నా అడగలేకపోతుండవచ్చు. ఐటీ ఇచ్చిన నోటీసులలోని వ్యక్తులు మనోజ్, కిలారి రాజేష్ తదితరులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయా?లేదా?.. మనోజ్ ను పిలిచి మాట్లాడిన విషయం నిజమా?కాదా?.. పీఏ శ్రీనివాస్ కు వసూళ్ల బాధ్యతను అప్పగించింది నిజమా?కాదా?.. ఐటి శాఖ వారు మొత్తం చిట్టా అంతటిని విప్పిన దాని ప్రకారం దుబాయిలో కూడా డబ్బులు తీసుకున్నారా?లేదా?.. వీటన్నిటికి చంద్రబాబు పూర్తిగా వివరణ ఇస్తే అప్పుడు దానిపైన ఆలోచించవచ్చు. అలాకాకుండా ఎలాగూ స్కామ్ బయటపడింది. కనుక.. దాని నుంచి తప్పించుకునే యత్నాలు చేస్తూనే ,మరోవైపు ప్రజలలో సానుభూతి సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే అధికారిక హోదాలో ఆయన చేసిన అవినీతిపై వస్తున్న ఆరోపణలు కనుక. కాపురం చేసే కళ కాలు తొక్కినపుడే తెలుస్తుంది ఒక సామెత. అలాగే చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయింది ఎలాగో అందరికి తెలుసు. వైస్రాయి హోటల్ లో ఎమ్మెల్యేలను పెట్టి వారిని మేనేజ్ చేయడానికి ఎంతెంత ఖర్చు చేసింది కథలు, కథలుగా చెబుతుంటారు. తన మామ ఎన్.టి.రామారావును పదవి నుంచి దించివేసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఏ వ్యవస్థలను ఎలా ఆకట్టుకున్నది ఈ తరంవారికి తెలియకపోయినా, ఆనాటి తరానికి తెలుసు. కనుక చంద్రబాబుకు ఇలాంటి స్కామ్ లు అసలు తెలియవని ఎవరైనా అనుకుంటే వారు ఉత్త అమాయకులని అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆదాయపన్ను శాఖ గట్టిగా వ్యవహరించింది. ఇంకో విషయం చెప్పాలి. జగన్ తనను సీబీఐ పిలిస్తే ఎన్నడూ విచారణకు రానని చెప్పలేదు. వాళ్లు అరెస్టు చేస్తారని తెలిసినా, సోనియాగాంధీ కక్ష కడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విచారణకు సిద్దపడ్డారు. పదహారు నెలలు బెయిల్ రాకుండా అడ్డుకున్నా సహనంతో ఎదుర్కున్నారు. ఈ విషయాలలో ప్రజలంతా తన చుట్టూ ఉండాలని ఎన్నడూ కోరలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా ఒకవైపు కేసులకు వణికి పోతూ,మరో వైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఈ కేసులలో అరెస్టు అవుతారో లేదో చెప్పలేం కాని, అరెస్టు కాక తప్పదని భయపడుతున్నట్లుగా ఆయన ముఖ కవళికలను బట్టి తెలిసిపోతోంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి విచిత్ర భాష్యం
-
చంద్రబాబు అసలు బాగోతం బయటపడింది
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రశ్నించారు. ఎంపీ మాట్లాడుతూ అవినీతి కుంభకోణంలో మెల్లగా చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని తప్పించుకునే దారిలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్బంగా ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పవన్‌కు ఏమైనా ముడుపులు అందాయా ఏమిటని ప్రశ్నించారు. ఐటీ శాఖ నోటీసులు పంపించడంతో చంద్రబాబు బాగోతం వెలుగులోకి వచ్చిందని చంద్రబాబు ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగలా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు ఎంపీ నందిగం సురేష్. ఇప్పటికైనా ఆలస్యం కాలేదని చంద్రబాబు తన తప్పును ఒప్పుకుంటే మంచిదన్నారు. అవకాశం దొరికితే తెలుగువారి ఆత్మగౌరవం అంటూ లెక్చర్లు ఇచ్చే టీడీపీ అధినేత ఇప్పుడు దానిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. బహుశా ఆయనకు తన భవిష్యత్తు కనిపించి ఉంటుందన్నారు. నారా లోకేష్ తన తండ్రికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై స్పందించాలన్నారు. పరిపక్వత లేని రాజకీయం చేస్తూ రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసలు ఆయన చేసేది పాదయాత్ర అంటారా? అని ప్రశ్నించారు. లోకేష్ కూడా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు? -
బలమైన సాక్ష్యాలు..చంద్రబాబుకు జీవిత ఖైదు..లేదా 10 ఏళ్ల జైలు శిక్ష!?
-
ఐటీ కేసు..ఈ సారి తప్పించుకోలేను..శ్రీలంక పారిపోతున్న బాబు
-
రేపో, మాపో నన్ను అరెస్ట్ చేస్తారు..! వణికిపోతున్న బాబు
-
బాబు నోట అరెస్ట్ మాట
-
ఐటీ నోటీసులతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పాపం పండినప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఖాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్ సీపీ కాదని, ఐటీశాఖ అని పేర్కొన్న సజ్జల.. ఐటీకి సమాధానం చెప్పాల్సిందిపోయి తనను రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ చేసి నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు బాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్ట్ కూడా చేయాల్సి ఉందన్నారు. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ముడుపులన్నీ ఎటు ఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో.. ఐటీశాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. ‘తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు. పాపం పండినప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం. చంద్రబాబు చట్టానికి అతీతులు కారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లటమే ఎల్లో మీడియా విధానం. చంద్రబాబు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నది అందుకే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సానుభూ పొందాలనేది చంద్రబాబు కుట్ర. పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం’ అని సజ్జల మండిపడ్డారు. చదవండి: ఆ క్రెడిట్ కూడా బాబుకే దక్కుతుంది.. విజయసాయిరెడ్డి సెటైర్లు -
ఐటీ నోటీసులతో కంటిమీద కునుకు కరవైన చంద్రబాబు
‘ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం మొదలైంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయచ్చన్న భయంతో కుత కుత లాడిపోతున్నారు. అరెస్టే కాదు 118 కోట్ల రూపాయల మేరకు బయట పడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ.. సీబీఐ దాడులు కూడా జరగచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలానే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశాలున్నాయని ప్రజల సాక్షిగానే అన్నారు. తనని అరెస్ట్ చేస్తే తనకి సంఘీభావంగా రక్షణ వలయంలా మీరే ఉండాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇపుడు మళ్లీ ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది. వెలుగులోకి నిజస్వరూపం కేంద్ర ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల లూటీ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ నోటీసులు రావడంతోనే దేశ వ్యాప్తంగా చంద్రబాబు నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. ఐటీ నోటీసుల్లోని అంశాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా చంద్రాబును దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి. దుబాయ్‌లో అక్కడి కరెన్సీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు అందుకున్న చంద్రబాబుపై ఈడీ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. ఏం చేయాలో పాలుపోక.. రేపో మాపో అరెస్ట్ అంటూ మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు జరుగుతాయంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఊహించుకుంటోన్న చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా మౌన వ్రతంలో ఉండిపోయారు. అయితే రోజు రోజుకీ తనపై వచ్చిన ఆరోపణలకు సరిపడ సాక్ష్యాలు కూడా బయట పడ్డంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని ఆయనకు సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తోన్నట్లుంది. అందుకే నన్ను రేపో మాపో అరెస్ట్ చేయచ్చు అంటూ చంద్రబాబు చాలా ఆందోళనగా భయం భయంగా అంటున్నారు. చదవండి: ‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’ అప్పుడు కూడా అదే మాట 2019 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కొత్తలో కూడా తనపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగే అవకాశాలున్నాయని ప్రతీ సభలోనూ భయం వ్యక్తం చేసేవారు. తనను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తానని కూడా అన్నారు. తనకు రక్షణ వలయంగా ఉండి కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని దబాయించారు కూడా. రూ. 118 కోట్లు పైనే లూటీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇంచుమించు 400 కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేయించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ నోటీసుల్లో చంద్రబాబు అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టులు అప్పగించిన షాపూర్ జీ పల్లోంజీ నుంచి డొల్ల కంపెనీల ద్వారా రూ. 118 కోట్లు పైనే లూటీ చేసినట్లు సాక్ష్యాలు బయటకు వచ్చాయి. చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ అవినీతికి సాక్ష్యాలు లేకుండా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా చంద్రబాబు తాను నిప్పే అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను దొరక్కపోడానికి కారణం తనపై ఆరోపణలకు సాక్ష్యాలు పట్టుకోలేకపోవడమేనని చంద్రబాబు గడుసుగా అన్నారు. తద్వారా తాను అరెస్ట్ కాకపోడానికి కారణం తాను తన అవినీతికి సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడటమేనని చాటి చెప్పారు. సీబీఐ అడుగు పెట్టకుండా ప్రత్యేక జీవో తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు గత ఎన్నికల ముందు తన అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందేమోనని భయపడ్డారు. ఎందుకైనా మంచిదని ఏపీలో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేకుండా ప్రత్యేక జీవో జారీ చేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఆయన ఏ తప్పూ చేయకపోతే సిబిఐ అంటే అంత భయం దేనికని ఆర్ధిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో తన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇక తనను అరెస్ట్ చేయచ్చని చంద్రబాబుకు అర్ధం అవుతోన్నట్లుంది. అందుకే ఆయన ముందస్తుగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అరెస్టు చేస్తారని.. ఈడీ, సీబీఐ దాడులు కూడా చేయించవచ్చునని ముందస్తుగానే భయపడుతున్నారుని విశ్లేషకులు అంటున్నారు. -యాజులు, సీనియర్ జర్నలిస్టు -
‘తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సాక్షి టీవీతో బుధవారం సజ్జల మాట్లాడుతూ.. ‘రూ. 118 కోట్లు చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్సీపీ కాదని , ఐటీ శాఖ అని విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఐటీకీ సమాధానం చెప్పాల్సింది పోయి తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంత చేస్తున్నారు. దోపిడీ చేసి, తాను నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు చంద్రబాబు యత్నం. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు కూడా చేయాల్సింది. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావటం లేదు. ముడుపులన్నీ ఎటుఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటీ శాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొంది . తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు. పాపం పండినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయటం ఖాయం. ‘ఐటీ ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదు. బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి. తాను చట్టానికి అతీతుడు అయినట్లు చంద్రబాబు మాట్లాడటం బరితెగింపు కాక మరేంటి?, దొంగతనాన్ని సాధారణం అంశంగా చూస్తున్న పురంధేశ్వరి తీరు చూస్తుంటే మరిదిని రక్చించాలన్న ఆమె ఎత్తుగడ అర్థం అవుతుంది. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లడమే ఎల్లోమీడియా విధానం. చంద్రబాబు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నది అందుకే. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి సానుభూతి పొందాలనేది చంద్రబాబు కుట్ర. పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం’ అని మండిపడ్డారు. చదవండి: ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. ఖబడ్ధార్ నారా లోకేష్ -
బాబుకే లేదట గ్యారెంటీ
-
‘చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర’
సాక్షి, విశాఖపట్నం: ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సంబంధం లేని సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రెండు రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర. ఆయన ఎదుగుదల.. ముందు వెనుక ఆస్తుల గురించి జనానికి తెలుసు. బాబు రాజకీయం అంతా కుట్రలు.. కుతంత్రాలే. చంద్రబాబు నేరుగా నాయకుడిగా ఎదగలేదు. వెన్నుపోటు ద్వారానే రాజకీయంగా ఎదిగారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునిపై ఇన్ని కుంభ కోణాలు లేవు. నారా వారి పల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఆయనదో అవినీతి సామ్రాజ్యం. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. బాబు మీరు దొరికి పోయారని మీకు తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ.. ఇంక డొంక కదలాలి. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి అంటూ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ 2020 నుంచి జూన్ వరకు నాలుగు నోటీసులు ఇచ్చారు...సంబంధం లేని వివరణ ఇస్తారు. 46 పేజీల షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదునేను మీ జూరిడిక్షన్ లో లేను అంటారు. ఎంవిపి అనే వ్యక్తి కంపెనీ ల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు మీడియేటర్ గా పని చేసినట్టు తేలింది. 2019లో చంద్రబాబుని ఎంవీపిని కలవడం ఆయన పీఏ శ్రీనివాస్ ప్రకారం పని చేయమని చెప్పడం జరిగింది. మొత్తం 118 కోట్లు చంద్రబాబు అందినట్టు నోటీసుల్లో వుంది. మీ పీఏ శ్రీనివాస్ మీ అక్రమాల గురించి చెబితే నా పేరు లేదంటారు. మీ కొడుకు పేరు కూడా నోటీసులో వుంది. చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్ .అన్ స్కిల్డ్ పొలిటీషియన్ ఆధాయ పన్నుశాఖ దర్యాప్తులో విషయం బయట పడింది. సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా రూ. 3,356 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి ప్రభుత్వ వాటా రూ. 350 కోట్లు మళ్లించారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారు. ఈ 350 కోట్లు అత్యవసర క్యాబినెట్ ద్వారా మళ్లించారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ..అమరావతి పేరిట ఎన్నో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి.. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలి అని మంత్రి అమర్నాథ్ కోరారు. -
ఐటీ నోటీసులతో చంద్రబాబుకు హైటెన్షన్
సాక్షి, అమరావతి: ఐటీ షోకాజ్ నోటీసులపై విచారణను తప్పించుకోవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఐటీ నోటీసులపై నాలుగు సార్లు సెంట్రల్ హైదరాబాద్ ఆఫీస్‌కు లేఖలు రాసిన చంద్రబాబు.. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విధానాన్ని తప్పుబడుతున్నారు. జ్యూరిడిక్షనల్ అధికారి కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి.. ఐటీ నోటీస్ రావడంపై చంద్రబాబు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలను తెలుపుతూ ఐటీ ఆఫీస్‌కు రాసి లేఖలను.. ఐటీ అధికారులు తోసిపుచ్చారు. మరోసారి ఇటీవల తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా, టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే! చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
రూ.1.59 లక్షల కోట్లకు.. జీఎస్టీ కలెక్షన్లు
ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,59,069 కోట్ల జీఎస్టీ వసూలైంది. అందులో సెంట్రల్ జీఎస్టీ రూ.28,328 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.35,794 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.83,251 కోట్లుగా (దిగుమతి వస్తువుల నుంచి వసూలైన రూ.43,550 కోట్లు సహా) నమోదైంది. సెస్ రూ.11,695 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా సమకూరిన రూ.1,016 కోట్లు సహా) వసూలయ్యాయి. ‘ఆగస్టు 2023 నెల ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 11 శాతం ఎక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం (దిగుమతి, సేవలు) కంటే ఎక్కువ. గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయాల కంటే 14 శాతం ఎక్కువ’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గత ఏడాది ఆగస్టు నెలలో వసూలైన మొత్తం జీఎస్టీ రూ.1.43 లక్షలు కోట్లు -
ఒక ఐటీ నోటీస్.. 10 ప్రశ్నలు.. ఇవి నిజం కాదా చంద్రాలు..?
చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు అని మరోసారి తేలిపోయింది. ఆయన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. అక్రమ మార్గంలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్న చంద్రబాబు అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.. అడ్డంగా దొరికిపోయినా సమాధానం లేకుండా చంద్రబాబు ఎందుకు బుకాయిస్తున్నారు?. ఆ దమ్ము ఉంటే పరువు నష్టం కేసు ఎందుకు వేస్తాననడం లేదు?. అసలు ఈ పది పశ్నలకు చందబాబు వద్ద సమాధానాలు ఉన్నాయా? ►పెండ్యాల శ్రీనివాస్.. నీ సెక్రెటరీగా పని చేసింది నిజం కాదా? ఆయనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసింది నిజం కాదా? ఆయన వద్ద 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల క్లూస్ దొరికింది నిజం కాదా ?. ఎంవీపీ అనే అతను ఆదాయపు పన్ను అధికారులకి ఇచ్చిన వాంగ్మూలంలో మీ పేరు చెప్పింది నిజం కాదా ?. దాని మీద మీకు నోటీసులు ఇస్తే మీరు నాలుగు సార్లు సమాధానం చెప్పింది నిజం కాదా ? ఆ సమాధానాలను అధికారులు రిజెక్ట్ చేయడం నిజం కాదా ? ►నిన్న హిందుస్తాన్ టైమ్స్.. ఈ రోజున డెక్కన్ క్రానికల్ మీ బండారం బయట పెట్టింది నిజం కాదా?.. దుష్ప్రచారం చేస్తున్నారని కూసే అయ్యా, కొడుకులు ఎందుకు వాటిపై మాట్లాడటం లేదు? పరువు నష్టం దావా అంటూ గోల ఎందుకు చేయడం లేదు? ►అమిత్ షాని జూన్‌లో కలిసినప్పటి మీ చర్చల సారాంశం ఏమిటి? ఎందుకు బయటకి చెప్పలేదు ? ►మీ ఆత్మకూరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాంట్రాక్టర్ ఎవరు? డబ్బు ఎలా చెల్లించారు? ఈ వివరాలు బయట పెట్టగలరా ? ►ఎంవీపీ చెప్పినట్లు ఆ కిలారు రాజేష్ ఎవరు? 2016కి ముందు అతని ఆర్ధిక పరిస్థితి ఏమిటి? 2019 నాటికి ఏమిటి? తన కొడుకు మొదటి పుట్టిన రోజున వేడుకలకు విదేశీ మద్యం ఎన్ని కేసులు ఎవరు పంపించారు? అతనికి లోకేష్‌కి ఉన్న సంబంధం ఏంటి? ►పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, బీజేపీలో ఉండి తెలుగుదేశం కోసం పని చేసే పురంధరేశ్వరితో సహ ఎవరూ ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇందులో వెళ్లాయి? ►2019 వరకు ప్రతి ఏడాది మీరు విదేశీ పర్యటనలు చేసేవారు. ఎవరికీ చెప్పకుండా ఒక వారం వెళ్లే వారు. ఎక్కడికి వెళ్లారు ? ►23 మంది ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బు ఎవరు సమకూర్చారు? ►ప్రతిపాటి పుల్లారావుకు చెందిన గోల్డ్ స్టోన్, ఎల్లో స్టోన్ ఇన్ఫ్రా కంపెనీలకు ఎవరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ పనులు పుల్లారావు చేశారు? ఎన్నికల ముందు ఆ కంపెనీలో లావాదేవీలు ఎంత జరిగాయి? ►నవయుగ వాళ్లకి పవర్ ప్రాజెక్ట్ అప్పజెప్పడం వెనుక ఒప్పందం ఏంటి? రాష్ట్ర ఖజానా నుండి ఎంత మొబైలేషన్ అడ్వాన్స్ ఇచ్చారు ? ఆ పనులు ఎక్కడైనా చేశారా ? ప్రధాని పోలవరాన్ని ఏటిఎంగా వాడుకున్నారన్నారు. ఆ విషయం తప్పు అయితే ఎందుకు ప్రధానిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిలదీయలేదు? చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే! -
ఎల్లో మీడియాకు మింగుడుపడని నిజం
మామూలుగా అయితే ఇలాంటి స్కామ్ బయటపడితే మీడియాలో అల్లరల్లరిగా వార్తలు ఇస్తారు. ఒకవేళ ఆ స్కామ్ లు నిజం కాకపోతే దాని గురించి అయినా వాదనలు వినిపిస్తూ టివీలు హోరెత్తేవి. కానీ, చిత్రంగా తెలుగుదేశం పార్టీని భుజాన మోసుకుంటూ ఊరేగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి సంస్థలు తేలుకుట్టిన దొంగల మాదిరి సైలెంట్ అయిపోయాయి. అదేమిటో తెలుసుకదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇవ్వడం.. ఎంత పెద్ద సంచలనం!. అందులోనూ ఆయన రూ. 118 కోట్ల మేర ప్రకటించని- వెల్లడించని ఆదాయంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంటే ఆ మేర చంద్రబాబుకు బ్లాక్ మనీ రూపంలో డబ్బు అందిందని అర్దం అని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఈనాడు అసలు వార్త ఇవ్వకుండా.. లోపలి పేజీలో ఎక్కడో మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యను చిన్నగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే పాత కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులు వచ్చాయని, ఎప్పుడో చంద్రబాబు సమాధానం ఇచ్చేశారని, ఇంతకాలం ఏమీ జరగకుండా ఇప్పుడు మళ్లీ నోటీసు రావడం వెనుక వైఎస్సార్సీపీ ఒత్తిడి ఉందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయంటూ వార్తను ఇచ్చింది. ఒక ఆంగ్ల పత్రిక మాత్రం ఈ కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు విశ్వయత్నాలు చేస్తున్నారని ఐటీ శాఖ చెబుతున్నట్లు పేర్కొంది. ఏ సాంకేతిక కారణాలతో దీనిని అడ్డుకోవాలా అన్న ఆలోచనలో ఆయన ఉన్నారట. నోటీసు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి.. తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పాలని చూస్తున్నారట. ✍️ ఈ తాజా నోటీసుకు నేపథ్యం చూద్దాం. అమరావతి రాజధాని పేరుతో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేసే యత్నం చేశారు. అదైనా శాశ్వతపనులకు ఖర్చు చేశారా అంటే లేదు. కేవలం తాత్కాలిక భవనాలకు భారీ ఎత్తున ధన వ్యయం చేయడంపై అప్పట్లోనే అంతా ముక్కున వేలేసుకున్నారు. చదరపు అడుగుకు పదివేల రూపాయల చొప్పున వెచ్చించినా ప్రమాణికమైన భవనాలు రాలేదు.. అవి కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. వర్షం కురిస్తే అవికారుతూ బక్కెట్లతో నీళ్లను తోడి బయట పోయవల్సిన పరిస్థితి ఉంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాల నిర్మాణాలలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు దబాయిస్తూ కథ నడిపారు. పైగా అమరావతి రాజధాని ఉద్యమం అంటూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి అవినీతి అభియోగాలను దారిమళ్లించే ప్రయత్నం చేశారు. అయినా ఏదో ఒకరోజు అవినీతి వాసన బయటకు రాకుండా ఉంటుందా?.. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ✍️ ఎంత తాను లీగల్ గా , టెక్నికల్ గా దొరకనని ఇంతకాలం చెబుతూ వచ్చినా ఎప్పుడో అప్పుడు దొరకకపోరా? చంద్రబాబు విషయంలోనూ అదే జరిగినట్లు అనిపిస్తుంది. ఇంతకాలం ఆయా వ్యవస్థలలో తన మనుషులను పెట్టుకుని ఎక్కడా ఇబ్బంది రాకుండా చేసుకుంటూ , న్యాయ వ్యవస్థ ద్వారా స్టేలు పొందుతూ , కేసులు లేకుండా చేసుకుంటూ తనకు ఉన్న మానిప్యులేషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి నెట్టుకువస్తున్నారు. ఆయా వ్యవస్థల నుంచి తన మనుషులు నిష్క్రమిస్తున్నట్లుగా ఉంది. అందువల్లే ఎలాంటి ప్రభావానికి లోనుకాని అధికారులు ఎవరో రాజీపడకుండా కేసును క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు పేర్కొన్న అభ్యంతరాలను తోసిపుచ్చి తాజా నోటీసు ఇచ్చారనుకోవాలి. గతంలోనే ఐటీ శాఖ నోటీసు ఇచ్చినా, ఏదో రకంగా ఇంతకాలం అది ముందుకు కదలకుండా జాగ్రత్తలు పడ్డారని అనుకోవాలి. కాని ఇప్పుడు మొహమాటం లేకుండా రూ. 118 కోట్ల రూపాయల డబ్బు పొందారన్న అభిప్రాయం తెలుపుతూ మరో నోటీసును అధికారులు ఇచ్చారు. నిజానికి మూడున్నర ఏళ్ల క్రితమే చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటీ, ఈడీ వంటి సంస్థలు సోదాలు జరిపి రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు అధికారికంగానే ప్రకటించాయి. కాని ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ కేసులు ఏమయ్యాయో ఎవరికి తెలియలేదు. కేంద్ర ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రచారం అయ్యింది. కాని మేనేజ్ మెంట్ ప్రభావం తగ్గుతూ వచ్చిందేమో తెలియదుకాని, ఆదాయపన్ను శాఖ మళ్లీ ఆ కేసు విచారణ కొనసాగించి అమరావతి రాజధాని లో వివిధ భవన నిర్మాణాల కాంట్రాక్టు పొందిన షాపూర్జీ ఎల్లొంజి సంస్థ వారిపైన, అలాగే సబ్ కాంట్రాక్టర్ మనోజ్ తదితరులపై కూడా సోదాలు నిర్వహించారు. అప్పుడు వారు ఆశ్చర్యపోయేలా బ్లాక్ మనీ బాగోతం బయటకు వచ్చింది. దానిని నిర్ధారించుకున్న తర్వాత రూ. 118 కోట్లకు సంబంధించిన నోటీసును ఐటి శాఖ జారీ చేసింది. ఈ నోటీసు గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఆంగ్ల పత్రిక హిందూస్తాన్ టైమ్స్ దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో అసలు విషయం బయటపడింది. ✍️ ఇది నిజం కాకపోతే చంద్రబాబుగారు ఒంటికాలుపై ఇంతెత్తున లేచేవారు. టీడీపీ నేతలంతా ఆ పత్రికపైన, ఆ వార్తను ప్రచారం చేసిన సాక్షి, వైఎస్సార్సీపీ నేతలపై ఎగెరిగి పడేవారు.కాని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. 1995 సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భాన్ని గతంలో పలుమార్లు ఒక పెద్ద కార్యక్రమంగా జరుపుకున్నారు. కాని ఈ ఐటీ నోటీసు బహిర్గతం కావడంతో ఎక్కడా కిక్కురుమన్నట్లు కనిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోగలుగుతారన్నది ఆసక్తికర విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దలతో స్నేహం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఒకసారి కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపించారు. అవేవి సత్పలితాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. అందుకు తన మామ ఎన్.టి.ఆర్. పేరుతో నాణేల విడుదల కార్యక్రమానికి హాజరైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తో చంద్రబాబు మంతనాలు జరిపారు. అదంతా కేవలం బిజెపితో ఎన్నికల పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు అంతా అనుకున్నారు. కాని దాని వెనుక అసలు కారణం ఈ కేసు అన్న సంగతి ఇప్పుడు అర్దం అవుతోంది. తన జోలికి ఐటి అధికారులు రాకుండా చూడాలని కోరి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆ క్రమంలో ఎపిలో ఒకశాతం ఓట్ల బలం కూడా లేని బిజెపికి ఏకంగా 25 అసెంబ్లీ సీట్లు, ఐదు లోక్ సభ సీట్లు ఇవ్వబానికి చంద్రబాబు ముందుకు రావడంలో ఉన్న లోగుట్టు కూడా ఇదే అయి ఉండవచ్చన్న అనుమానం బలపడుతోంది. ✍️ చంద్రబాబుకు దత్తపుత్రుడు అనే విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని, చీటికి మాటికి టిడిపిని వెనుకేసుకు వచ్చే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కాని దీనిపై మౌనం దాల్చారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో సుమారురూ. 370 కోట్ల, ఫైబర్ గ్రిడ్ కేసులో రూ. 300 కోట్లు ఇలా పలు అభియోగాలు చంద్రబాబు టీమ్ పై వచ్చాయి. వాటిని విచారించాలని ఏపీ ప్రభుత్వం ఈడి వంటి సంస్థలను కోరింది. అవి ఎంతవరకు ముందుకు వెళ్లింది తెలియదు. కాని ప్రస్తుతం ముందుగా రూ. 118 కోట్ల కేసు నోటీసు రావడంతో ఈ స్కామ్ లపై కదలిక మొదలైందని అర్ధం అవుతుంది. ✍️ దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చంద్రబాబు, రామోజీ,రాధాకృష్ణ,టివి 5 నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు.హిందుస్తాన్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేయాలని చాలెంజ్ చేశారు. లేదా ఇదంతా కుట్ర అని భావిస్తే గతంలో విమర్శించినట్లు ప్రధానమంత్రి మోదీపై మరోసారి విరుచుకుని పడి ఉండవచ్చు. కాని అవేవి చేయలేదు.అంటే ఏమిటి దాని అర్ధం?.. ఈ నోటీసులో ఉన్నదాని ప్రకారం రూ. 118 కోట్ల బ్లాక్ మనీ అనండి...ముడుపులు అనండి ..మరే పేరైనా పెట్టండి.. అంత మొత్తం ముట్టినట్లు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా!. కనీసం టీడీపీ అధికార ప్రతినిది ఎవరితోనూ దీనిపై మాట్లాడించలేదు. ✍️ స్కిల్ కేసు, పైబర్ గ్రిడ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కక్షతో పెట్టిందని ఆరోపించిన తెలుగుదేశం ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు గురించి నోరు విప్పడం లేదు. గతంలో ఓటుకు నోటు కేసులో ఏభై లక్షల రూపాయలతో చంద్రబాబు అనుచరుడుగా అప్పట్లో ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుబడినా, ఆ చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ముప్పైసార్లుకు పైగా ప్రస్తావించినా, తనపై కేసు రాకుండా చూసుకోగలిగారు.చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో అన్నాకూడా.. కేంద్ర స్థాయిలో ముఖ్యస్థానాలలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ కేసునుంచి చంద్రబాబును రక్షించడానికి నడుం కట్టారు. దాంతో కేసీఆర్ కూడా అంగీకరించి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబుకు షరతు పెట్టారు. ఆ రకంగా ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కూడా తన పద్దతి మార్చుకోకుండా అమరావతి రాజధాని పేరుతో మళ్లీ స్కామ్ కు శ్రీకారం చుట్టారు. దాని ఫలితమే అమరావతిలో ఆర్ధిక అరాచకం. వందల కోట్ల కుంభకోణాలు. ఇవి జరిగిన తీరును ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో పూసగుచ్చినట్లు వివరించారు. మరో ఎనిమిది,తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు పరిణామాలు ముందుకు వెళితే టీడీపీకి, చంద్రబాబుకు పెద్ద షాక్ అని చెప్పాలి. కేవలం భూమి కొన్నారని ఆరోపణ చేసినందుకే చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. ఇప్పుడు ఇంత పెద్ద అభియోగం వచ్చినందున ఆయన తండ్రి ఇంకెంత పెద్ద పరువు నష్టం దావా వేయాలి?.. అలా దావా వేయకపోతే అవినీతికి పాల్పడినట్లు, ముడుపులు తీసుకున్నట్లు , తాను నిప్పు కాదని ఒప్పుకున్నట్లేనా!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక రాజధాని అమరావతి పేరుతో బడా కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున అయాచిత లబ్ధి పొందారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. ఆ అక్రమార్జనకుగానూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం అందుకున్నారు కూడా. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు పొందారని ఐటీ శాఖ సాక్ష్యాధారాల్ని చూపుతోంది. కానీ, ఐటీ శాఖ సరిగా పరిశీలన చేయలేదని బుకాయిస్తున్నారు చంద్రబాబు. పైగా మనుగడలో లేని ఐటీ నిబంధనలను సాకుగా చూపి దర్యాప్తు ఆలస్యం చేసే ప్రయత్నం చేశారాయన. అయితే.. చంద్రబాబు లేవనెత్తిన టెక్నికల్ అభ్యంతరాలను ఇప్పటికే ఐటీ శాఖ తిరస్కరించింది. దీంతో కేసు మెరిట్స్ లోపలికి వెళ్లకుండా.. మరిన్ని టెక్నికల్పాయింట్స్ తెరపైకి తెచ్చి దర్యాప్తు ఆలస్యం చేయడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని సాకుల కోసం వెతుకుతోంది చంద్రబాబు అండ్ కో. లోకేష్ సన్నిహితుడికి కూడా.. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. -
అడ్డంగా బుక్కైనా.. నోరు విప్పని CBN
సాక్షి, గుంటూరు: అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఫలితంపై పొలిటికల్ రియాక్షన్లు వస్తున్నాయి. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం అంటూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2023 ► చంద్రబాబు ముడుపుల వ్యవహారం పై అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. అమరావతి నిర్మించాలంటూ ఎల్&టీ,షాపూర్ జీ పల్లోంజి ,ఇతర ఇన్ ఫ్రా సంస్థల నుంచి లంచాలు వసూలు చేశారు. వివిధ వ్యక్తుల ద్వారా,వివిధ రూపాల్లో రూ. 118 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదంతా మేం పనిగట్టుకుని చేసే ఆరోపణలు కాదు. ఎన్నికల ముందే ఇన్ కంటాక్స్ అధికారులకు అందిన ఫిర్యాదు. దీని పై మాట్లాడమంటే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడు. చంద్రబాబు చేసే పనులన్నీ అవినీతి అరాచకంతో కూడిన కుట్రలే. తాజాగా ఐటీ నోటీసులు ఇవ్వడమే దీనికి ఉదాహరణ. :::విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ► పశ్చిమగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ మొత్తం.వేల కోట్లు అతను దోచేసాడు. స్కిల్ డెవలప్మెంట్ సీమన్స్ కంపెనీ ద్వారా 300 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, ఇసుక మీద కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు మేనేజ్మెంట్ లో ఎక్సపర్ట్ కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన దోపిడీకి ఇది శాంపిల్ మాత్రమే. టిడ్కో ఇళ్ల ద్వారా పేదవాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు చొప్పున దోచుకున్నారు. డబ్బులు రాని ఆరోగ్య శ్రీ, 108 లాంటి వ్యవస్థ లను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలిసి గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్ళబేరానికి చూస్తున్నారు. :::ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ► సాక్షి, తాడేపల్లి: హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు. లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు. తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. :: మాజీ మంత్రి పేర్ని నాని. -
బాబు అవినీతి చిట్టా విప్పిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మోసకారి చంద్ర బాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు.. దొరికిన కాడికి దొరికినంత, అణువంత కూడా వదలకుండా ప్రజల సొమ్మును సాంతం దోచేశారు. ఆ అవినీతి పుట్టలో కొంత భాగాన్నే ఐటీ శాఖ దులుపుతోంది. ఏకంగా చంద్రబాబుకు నోటీసులతో షాక్ ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. కానీ, బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. అయితే చంద్రబాబు అవినీతి చిట్టా ఏ స్థాయిలో ఉందో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అదీ అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. అదీ రాష్ట్ర ప్రజలకు బాబు అవినీతి స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీ ఇన్‌కంట్యాక్స్ రైడ్స్‌తో బయట పడింది. ఐటీ అప్రైజల్ రిపోర్టులో షాపూర్జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు ఏపీ శ్రీనివాస్, రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు, మరికొంతమంది కలిసి ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారు. మనోజ్, శ్రీనివాస్ ఇళ్లలో ఐటీ సోదాల అనంతరం ఇన్విస్టిగేషన్ వింగ్ అప్రైజల్ రిపోర్ట్ ఇచ్చింది. దీని ఆధారంగానే భారీగా డబ్బు చేతులు మారినట్టు గుర్తించింది ఐటీ శాఖ. అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు దోచుకున్నారు. చెయిన్ సిస్టమ్ ఇలా.. ‘‘2019 జనవరి-ఫిబ్రవరి ప్రాంతంలో షాపూర్జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ని చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు. తన పీఏ శ్రీనివాస్‌ను కలవు అని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. తద్వారా శ్రీనివాస్ ద్వారా రూ. 143 కోట్ల రూపాయలు కలెక్ట చేసుకునేందుకు అడుగులు వేశారు. ఏడు వేల కోట్ల పనుల్లో.. ఐదుశాతం ఇది. శ్రీనివాస్.. మనోజ్‌ను వినయ్, విక్కీని మనోజ్‌కు అటాచ్ చేశాడు. వినయ్.. మూడు కంపెనీలు, విక్కీ మరో రెండు కంపెనీలు మనోజ్‌కు అప్పజెప్పారు. ఈ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడం ద్వారా డబ్బులు వసూలు చేశారు. అటు నుంచి చంద్రబాబు నాయుడికి డబ్బులు ఎలా చేరిందనే ఒక చెయిన్ సిస్టమ్‌లో జరిగిందనేది సీఎం జగన్ వివరించారు. ఇదంతా ఐటీ అప్రైజల్రిపోర్ట్లోనే ఉందని, అందుకే చంద్రబాబుకు సైతం ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కేవలం షాపూర్జీ పల్లోంజీ మాత్రమే కాదు.. ఎల్ అండ్ టీ బాధ్యతలు కూడా మనోజే తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఫైర్ మొత్తం 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందని, ఇప్పటికే శ్రీనివాస్, మనోజ్‌ను విచారించిన ఐటీ శాఖ.. చంద్రబాబుకు కూడా నోటీసులు పంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆఖరికి పవిత్రంగా భావించాల్సిన హైకోర్టు నిర్మాణంలో కూడా డబ్బులు చేతులు మారాయని జగన్ మండిపడ్డారు. దీంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, టిడ్కో హౌసింగ్ సహా అన్ని నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడ్డారని దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రజల్లో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దుబాయిలో కూడా దిర్హామ్స్ రూపంలో మనీ చేతులు మారినట్టు తెలిపారు. -
బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్‌లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్ చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 2017లో బాబు మయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్షీట్లు, కీలకమైన మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్మెంట్ ఇచ్చారు. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా? -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
పన్ను ఎగవేతకు పాల్పడ్డాయా?, యూనికార్న్ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు?
దేశీయ ఆదాయపు పన్ను శాఖ అధికారులు యూనికార్న్ సంస్థలు పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మూడు యూనికార్న్ సంస్థలు ఫస్ట్ క్రై డాట్ కామ్, గ్లోబల్బీస్ బ్రాండ్స్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్బీస్లు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డాయని గుర్తించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ దేశీయ యూనికార్న్ జాబితాలో ఉన్న ఫస్ట్ క్రై డాట్ కామ్ ఫౌండర్ సుపమ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీలపై 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ట్యాక్స్ ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నిస్తూ సుపమ్కు జారీ చేసినట్లు నోటీసుల్లో ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కో, ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబ సభ్యుల కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలో ఆరుగురు ఇన్వెస్టర్లు సైతం ఈ నోటీసులు అందుకున్నారని నివేదికలు హైలెట్ చేశాయి. నోటీసులతో సుపమ్ ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఆదాపు పన్ను శాఖ నోటీసులు, ట్యాక్స్ ఎగవేత అంశాలపై సుపమ్ మహేశ్వరి, క్రిస్ కేపిటల్, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం విడుదల కావాల్సి ఉంది.