‘తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు’ | Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి: సజ్జల

Published Wed, Sep 6 2023 4:33 PM | Last Updated on Wed, Sep 6 2023 5:08 PM

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సాక్షి టీవీతో బుధవారం సజ్జల మాట్లాడుతూ.. ‘రూ. 118 కోట్లు చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్‌సీపీ కాదని , ఐటీ శాఖ అని విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఐటీకీ సమాధానం చెప్పాల్సింది పోయి తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంత చేస్తున్నారు. దోపిడీ చేసి, తాను నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు చంద్రబాబు యత్నం.

ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు కూడా చేయాల్సింది. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావటం లేదు. ముడుపులన్నీ ఎటుఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటీ శాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొంది . తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు. పాపం పండినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయటం ఖాయం. ‘ఐటీ ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదు. బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి. 

తాను చట్టానికి అతీతుడు అయినట్లు చంద్రబాబు మాట్లాడటం బరితెగింపు కాక మరేంటి?, దొంగతనాన్ని సాధారణం అంశంగా చూస్తున్న పురంధేశ్వరి తీరు చూస్తుంటే మరిదిని రక్చించాలన్న ఆమె ఎత్తుగడ అర్థం అవుతుంది. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లడమే ఎల్లోమీడియా విధానం.  చంద్రబాబు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నది అందుకే. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి సానుభూతి పొందాలనేది చంద్రబాబు కుట్ర. పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం’ అని మండిపడ్డారు. 

చదవండి: ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. ఖబడ్ధార్ నారా లోకేష్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement