అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువ జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం రామనామ స్మారణ మారుమ్రోగుతుంది. భక్తులు భారీ ఎత్తున రాములోరికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ తరుణంలో విరాళాల సేకరణకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక నిబంధనలకు అనుగుణంగా అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌కు చేసే విరాళంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అయోధ్య రామమందిరాన్ని ప్రజల ప్రార్థనా స్థలంగా ప్రకటించింది. మే 8, 2020 నాటి సీబీడీ సర్క్యులర్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం' (పాన్: AAZTS6197B) చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రజల ఆరాధనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్య రామమందిర మరమ్మతు, నిర్వహణ కోసం అన్ని విరాళాలు సెక్షన్ 80జీ కింద మినహాయింపు పొందవచ్చు’ అని తెలిపింది. ఈ విరాళంలో 50 శాతం సెక్షన్ 80G (2)(B) కింద పేర్కొన్న షరతులకు లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 జీ కింద రూ. 2000 కంటే ఎక్కున నగదు విరాళం పన్ను మినహాయింపు పరిధిలోకి రాదు.
Comments
Please login to add a commentAdd a comment