ఢిల్లీ: ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు బటయటపడింది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఐటీ దాడుల్లో సుమారు రూ.220 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై మూడు రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. అయితే ఆ మద్యం వ్యాపారికి జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకి సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
देशवासी इन नोटों के ढेर को देखें और फिर इनके नेताओं के ईमानदारी के 'भाषणों' को सुनें... 😂😂😂
— Narendra Modi (@narendramodi) December 8, 2023
जनता से जो लूटा है, उसकी पाई-पाई लौटानी पड़ेगी, यह मोदी की गारंटी है।
❌❌❌💵 💵 💵❌❌❌ pic.twitter.com/O2pEA4QTOj
ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులో ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది ‘మోదీ హామీ’ అంటూ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఈ కరెన్సీ నోట్ల కట్టలను చూసిన తర్వాత కొందరు నాయకుల( కాంగ్రెస్) నిజాయితీ ‘ప్రసంగాలను’ వినాలని వ్యగ్యంగా అన్నారు. అదే విధంగా నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన ఓ క్లిపింగ్ జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment