చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు అని మరోసారి తేలిపోయింది. ఆయన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. అక్రమ మార్గంలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్న చంద్రబాబు అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.. అడ్డంగా దొరికిపోయినా సమాధానం లేకుండా చంద్రబాబు ఎందుకు బుకాయిస్తున్నారు?. ఆ దమ్ము ఉంటే పరువు నష్టం కేసు ఎందుకు వేస్తాననడం లేదు?. అసలు ఈ పది పశ్నలకు చందబాబు వద్ద సమాధానాలు ఉన్నాయా?
►పెండ్యాల శ్రీనివాస్.. నీ సెక్రెటరీగా పని చేసింది నిజం కాదా? ఆయనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసింది నిజం కాదా? ఆయన వద్ద 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల క్లూస్ దొరికింది నిజం కాదా ?. ఎంవీపీ అనే అతను ఆదాయపు పన్ను అధికారులకి ఇచ్చిన వాంగ్మూలంలో మీ పేరు చెప్పింది నిజం కాదా ?. దాని మీద మీకు నోటీసులు ఇస్తే మీరు నాలుగు సార్లు సమాధానం చెప్పింది నిజం కాదా ? ఆ సమాధానాలను అధికారులు రిజెక్ట్ చేయడం నిజం కాదా ?
►నిన్న హిందుస్తాన్ టైమ్స్.. ఈ రోజున డెక్కన్ క్రానికల్ మీ బండారం బయట పెట్టింది నిజం కాదా?.. దుష్ప్రచారం చేస్తున్నారని కూసే అయ్యా, కొడుకులు ఎందుకు వాటిపై మాట్లాడటం లేదు? పరువు నష్టం దావా అంటూ గోల ఎందుకు చేయడం లేదు?
►అమిత్ షాని జూన్‌లో కలిసినప్పటి మీ చర్చల సారాంశం ఏమిటి? ఎందుకు బయటకి చెప్పలేదు ?
►మీ ఆత్మకూరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాంట్రాక్టర్ ఎవరు? డబ్బు ఎలా చెల్లించారు? ఈ వివరాలు బయట పెట్టగలరా ?
►ఎంవీపీ చెప్పినట్లు ఆ కిలారు రాజేష్ ఎవరు? 2016కి ముందు అతని ఆర్ధిక పరిస్థితి ఏమిటి? 2019 నాటికి ఏమిటి? తన కొడుకు మొదటి పుట్టిన రోజున వేడుకలకు విదేశీ మద్యం ఎన్ని కేసులు ఎవరు పంపించారు? అతనికి లోకేష్‌కి ఉన్న సంబంధం ఏంటి?
►పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, బీజేపీలో ఉండి తెలుగుదేశం కోసం పని చేసే పురంధరేశ్వరితో సహ ఎవరూ ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇందులో వెళ్లాయి?
►2019 వరకు ప్రతి ఏడాది మీరు విదేశీ పర్యటనలు చేసేవారు. ఎవరికీ చెప్పకుండా ఒక వారం వెళ్లే వారు. ఎక్కడికి వెళ్లారు ?
►23 మంది ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బు ఎవరు సమకూర్చారు?
►ప్రతిపాటి పుల్లారావుకు చెందిన గోల్డ్ స్టోన్, ఎల్లో స్టోన్ ఇన్ఫ్రా కంపెనీలకు ఎవరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ పనులు పుల్లారావు చేశారు? ఎన్నికల ముందు ఆ కంపెనీలో లావాదేవీలు ఎంత జరిగాయి?
►నవయుగ వాళ్లకి పవర్ ప్రాజెక్ట్ అప్పజెప్పడం వెనుక ఒప్పందం ఏంటి? రాష్ట్ర ఖజానా నుండి ఎంత మొబైలేషన్ అడ్వాన్స్ ఇచ్చారు ? ఆ పనులు ఎక్కడైనా చేశారా ? ప్రధాని పోలవరాన్ని ఏటిఎంగా వాడుకున్నారన్నారు. ఆ విషయం తప్పు అయితే ఎందుకు ప్రధానిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిలదీయలేదు?
చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే!
Comments
Please login to add a commentAdd a comment