
సాక్షి, అమరావతి: మోసకారి చంద్ర బాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు.. దొరికిన కాడికి దొరికినంత, అణువంత కూడా వదలకుండా ప్రజల సొమ్మును సాంతం దోచేశారు. ఆ అవినీతి పుట్టలో కొంత భాగాన్నే ఐటీ శాఖ దులుపుతోంది. ఏకంగా చంద్రబాబుకు నోటీసులతో షాక్ ఇచ్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. కానీ, బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. అయితే చంద్రబాబు అవినీతి చిట్టా ఏ స్థాయిలో ఉందో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అదీ అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. అదీ రాష్ట్ర ప్రజలకు బాబు అవినీతి స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం జగన్ మాట్లాడుతూ..
‘‘చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీ ఇన్‌కంట్యాక్స్ రైడ్స్‌తో బయట పడింది. ఐటీ అప్రైజల్ రిపోర్టులో షాపూర్‌జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు ఏపీ శ్రీనివాస్, రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు, మరికొంతమంది కలిసి ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారు. మనోజ్, శ్రీనివాస్ ఇళ్లలో ఐటీ సోదాల అనంతరం ఇన్విస్టిగేషన్ వింగ్ అప్రైజల్ రిపోర్ట్ ఇచ్చింది. దీని ఆధారంగానే భారీగా డబ్బు చేతులు మారినట్టు గుర్తించింది ఐటీ శాఖ. అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు దోచుకున్నారు.
చెయిన్ సిస్టమ్ ఇలా..
‘‘2019 జనవరి-ఫిబ్రవరి ప్రాంతంలో షాపూర్‌జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ని చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు. తన పీఏ శ్రీనివాస్‌ను కలవు అని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. తద్వారా శ్రీనివాస్ ద్వారా రూ. 143 కోట్ల రూపాయలు కలెక్ట చేసుకునేందుకు అడుగులు వేశారు. ఏడు వేల కోట్ల పనుల్లో.. ఐదుశాతం ఇది. శ్రీనివాస్.. మనోజ్‌ను వినయ్, విక్కీని మనోజ్‌కు అటాచ్ చేశాడు. వినయ్.. మూడు కంపెనీలు, విక్కీ మరో రెండు కంపెనీలు మనోజ్‌కు అప్పజెప్పారు. ఈ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడం ద్వారా డబ్బులు వసూలు చేశారు. అటు నుంచి చంద్రబాబు నాయుడికి డబ్బులు ఎలా చేరిందనే ఒక చెయిన్ సిస్టమ్‌లో జరిగిందనేది సీఎం జగన్ వివరించారు. ఇదంతా ఐటీ అప్రైజల్‌రిపోర్ట్‌లోనే ఉందని, అందుకే చంద్రబాబుకు సైతం ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కేవలం షాపూర్‌జీ పల్లోంజీ మాత్రమే కాదు.. ఎల్ అండ్ టీ బాధ్యతలు కూడా మనోజే తీసుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై ఫైర్
మొత్తం 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందని, ఇప్పటికే శ్రీనివాస్, మనోజ్‌ను విచారించిన ఐటీ శాఖ.. చంద్రబాబుకు కూడా నోటీసులు పంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆఖరికి పవిత్రంగా భావించాల్సిన హైకోర్టు నిర్మాణంలో కూడా డబ్బులు చేతులు మారాయని జగన్ మండిపడ్డారు. దీంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, టిడ్కో హౌసింగ్ సహా అన్ని నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడ్డారని దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రజల్లో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దుబాయిలో కూడా దిర్హామ్స్ రూపంలో మనీ చేతులు మారినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment