బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్‌ | BDMA to establish technology and training centre at Jeedimetla | Sakshi
Sakshi News home page

బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్‌

Published Fri, Mar 3 2023 12:41 AM | Last Updated on Fri, Mar 3 2023 12:41 AM

BDMA to establish technology and training centre at Jeedimetla - Sakshi

హెటిరో గ్రూప్‌ చైర్మన్‌ బి.పార్థ సారథి రెడ్డి నుంచి రూ.1 కోటి చెక్‌ను అందుకుంటున్న బీడీఎంఏ ప్రతినిధులు ఆర్‌.కె.అగ్రవాల్, సీహెచ్‌ ఏపీ రామేశ్వర రావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (బీడీఎంఏ) టెక్నాలజీ, ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ జీడిమెట్ల ఫార్మా క్లస్టర్‌లో 2023 ఏప్రిల్‌ నుంచి ఈ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. టీఎస్‌ఐఐసీ ఒక ఎకరం స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పద్ధతిన సమకూర్చింది. ఈ ఫెసిలిటీ కోసం హెటిరో గ్రూప్‌ రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ఇతర సంస్థలు సైతం ఆర్థిక సాయానికి ముందుకు వస్తాయని అసోసియేషన్‌ భావిస్తోంది.

ఔషధ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులకు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్‌లో శిక్షణ ఇస్తారు. అలాగే బీడీఎంఏ సభ్య కంపెనీలు నూతనంగా నియమించుకున్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్‌ కల్పిస్తారు. ఆధునిక పరిశోధన, పరీక్షలకు కేంద్ర స్థానంగా ఇది నిలుస్తుందని బీడీఎంఏ తెలిపింది. పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఈ విధంగా సాంకేతిక, శిక్షణ కేంద్రం నెలకొల్పడం దేశంలో తొలిసారి అని పేర్కొంది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యం పెంచుకోవడానికి నాలెడ్జ్‌ సెంటర్‌గా కూడా పని చేస్తుందని అభిప్రాయపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement