
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్‌స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్‌లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్‌పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్‌రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.