
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.