మా సంస్థలో ఈ రాశి వారికి ఉద్యోగం లేదు! చైనా కంపెనీ ప్రకటన | China Company Bans Applicants Born Under Specific Zodiac Signs | Sakshi
Sakshi News home page

మా సంస్థలో ఈ రాశి వారికి ఉద్యోగం లేదు! చైనా కంపెనీ కీలక ప్రకటన

Published Fri, Aug 9 2024 2:33 PM | Last Updated on Fri, Aug 9 2024 4:21 PM

China Company Bans Applicants Born Under Specific Zodiac Signs

చైనాలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే కాకుండా.. రంగులు, తేదీలు ఇతరత్రా అన్నింటికీ ఇక్కడి ప్రజలు జాతకాలను విశ్వసిస్తారు. ఆఖరికి ఉద్యోగాల్లో చేరాలంటే కూడా రాశి చక్రం తప్పనిసరి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇటీవల దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని 'శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్' అనే సంస్థ ఓ ప్రకటన చేసింది. డాగ్ సంవత్సరంలో (చైనా జాతక చక్రంలోని ఓ సంవత్సరం) జన్మించినవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు, అలాంటి వారు ఉద్యోగానికి అప్లై చేసుకోవద్దు అని స్పష్టంగా వెల్లడించారు. ఇది చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటంటే.. కుక్క రాశిచక్రం కింద జన్మించిన వారు డ్రాగన్ సంస్థ అధిపతి దురదృష్టానికి మూలం కావొచ్చని భావిస్తారు. డ్రాగన్ & కుక్కల మధ్య 12 సంవత్సరాల రాశిచక్ర చక్రంలో వైరుధ్యం చైనీస్ జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే చైనాలో మూఢనమ్మకాలను ఎంతగా విశ్వసిస్తారో స్పష్టంగా అర్థమవుతోంది. డ్రాగన్‌లో నీటి మూలకం ఉందని, కుక్కలో అగ్ని మూలకం ఉందని జ్యోతిష్యులు చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement