
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. మధ్యాహ్నం తర్వాత టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. నిఫ్టీ సైతం ఇదే దొరణి కొనసాగించింది. చివరకు బీఎస్ఇ సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 53,000 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు పైకిచేరి 15,879 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిస్తే.. టైటన్, మారుతీ, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి.