BSE Sensex
-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
చిన్న షేర్ల పెద్ద ర్యాలీ
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –24)లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా కొనసాగింది. దేశంలో దృఢమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లును కొనేందుకు ఆధిక ఆసక్తి చూపారు. 2023–24లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 62%, స్మాల్ క్యాప్ సూచీ 60% రాణించాయి. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 25% పెరిగింది. ‘‘ఆదాయాలు గణనీయంగా పెరగడం, అధిక వృద్ధి అవకాశాలతో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా షేర్లను కొనుగోలుకు ఆసక్తి చూపారు. లార్జ్ క్యాప్ షేర్ల పట్ల విముఖత చూపారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక విస్తరణ సమయంలో చిన్న, మధ్య తరహా షేర్ల వృద్ధి వేగంగా ఉంటుందనే సంప్రదాయ సూత్రాన్ని వారు విశ్వసించారు. అంతేకాకుండా స్మాల్, మిడ్ సైజ్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు వారిని కొనుగోళ్ల వైపు ఆకర్షితం చేశాయి’’ అని హెడ్జ్ ఫండ్ హెడోనోవా సీఐఓ సుమన్ బెనర్జీ తెలిపారు. ► 2023–24లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫిబ్రవరి 8న 40,282 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి 31న 23,881 వద్ద ఏడాది కనిష్టానికి తాకింది. ► ఇదే కాలంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫిబ్రవరి 7న 46,821 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేయగా, గతేడాది మార్చి 31న 26,692 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ► సెన్సెక్స్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల అత్యుత్తమ ప్రదర్శన భారత ఈక్విటీ మార్కెట్ క్రియాశీలక స్వభావాన్ని, ఇన్వెస్టర్ల అపార వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ తెలిపారు. ► వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య తరహా షేర్ల ర్యాలీ కొనసాగుతుందని న్యాతీ అభిప్రాయపడ్డారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చనే అంచనాలతో వ్యాపార అనుకూల వాతావరణం పెంపొంది స్థిరమైన వృద్ధి కొనసాగొచ్చు. దీనికి తోడు భారత వృద్ధి బలమైన అవుట్‌లుక్ అంచనాలు ఈ రంగాల షేర్లకు డిమాండ్‌ను పెంచుతాయి’’ న్యాతీ తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ అనిశి్చతులు, లాభాల స్వీకరణ వంటి అంశాలు స్వల్పకాలిక ఒడిదుడుకులకు దారితీయొచ్చన్నారు. ఐపీవో బాటలో ఆఫ్కన్స్ ఇన్ఫ్రా ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లి క్ఇష్యూ బాట పట్టింది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఐపీవోతో రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనుంది. రూ. వెయ్యి కోట్లకు జిరోధా ఫండ్ విలువ జిరోధా, స్మాల్‌కేస్ జేవీ జిరోధా ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తుల విలువ కేవలం 40 రోజుల్లో రూ. 500 కోట్ల మేర ఎగిసింది. దీంతో సంస్థ ఏయూఎం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. మార్కెట్లు మరిన్ని సంగతులు ► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఐఆర్డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్‌గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్‌టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల సంపద.. ఆల్‌టైమ్ గరిష్టం మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
మార్కెట్‌కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
5 కంపెనీల్లో రూ.1,67,936 కోట్ల ఆవిరి
ముంబై: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి 10 కంపెనీల్లో అయిదింటి విలువ గతవారం భారీగా క్షీణించింది. గడిచిన వారం రోజుల్లో ఈ అయిదు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,67,936 కోట్లు హరించుకుపోయాయి. గతవారం సెన్సెక్స్ 1,144 పాయింట్లు (1.57%) నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సాధారణ ట్రేడింగ్ నిర్వహించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. ► అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో ఈ షేరు బుధ, గురు, శుక్రవారాల్లో 12% నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54% లాభ పడింది. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్ యూఎల్) మార్కెట్ క్యాప్ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589. 24 కోట్ల వద్ద ముగిసింది. ► ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎస్బీఐని దాటేయడంతో పాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31, 679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్‌ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
టాటా టెక్ సూపర్ హిట్.. గాంధార్ ఆయిల్ ఘనం
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది. గాంధార్ సెంచరీ... గాంధార్ ఆయిల్ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది. ఫెడ్ ఫినా.. ప్చ్! ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్‌తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్డీఎఫ్సీ వీలినం, గిఫ్ట్‌నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్డీఫ్సీ–హెచ్డీఫ్సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్‌లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్‌లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
5 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్‌లో టోకు ధరలు మైనస్‌కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్‌చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి. టాటా మోటార్స్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది. సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లు మళ్లీ ప్రారంభం స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ తాజాగా సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లను సోమవారం పునఃప్రారంభించింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజును తగ్గించడంతో పాటు ఎక్స్పైరీ రోజును కూడా గురువారం నుంచి శుక్రవారానికి మార్చినట్లు సంస్థ ఎండీ సుందరరామన్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. సెన్సెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజు 15 నుంచి 10కి, బ్యాంకెక్స్ లాట్ సైజును 20 నుంచి 15కి తగ్గించారు. అధిక రాబడులిచ్చేందుకు ఆస్కారమున్న అత్యంత రిస్కీ సాధనాలుగా డెరివేటివ్స్‌ను పరిగణిస్తారు. 2000లో బీఎస్ఈ తొలిసారిగా సెన్సెక్స్–30 డెరివేటివ్స్ (ఆప్షన్స్, ఫ్యూచర్స్)ను ప్రవేశపెట్టింది. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్‌తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్ దిగ్గజం ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.80 వద్ద లాకయ్యింది. ► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది. -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
టెక్నాలజీ వైపు.. స్టాక్ బ్రోకర్ల చూపు!
న్యూఢిల్లీ: వ్యాపార సేవల్లో టెక్నాలజీ వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవడంపై అత్యధిక శాతం స్టాక్ బ్రోకర్లు దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) బృందంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నారు. బ్రోకరేజి సంస్థల సమాఖ్య అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) నిర్వహించిన సర్వేలో సుమారు 71 శాతం బ్రోకరేజీలు ఈ అభిప్రాయాలను వెల్లడించాయి. ఏఎన్ఎంఐలో 900 సంస్థలకు సభ్యత్వం ఉంది. స్టాక్‌బ్రోకింగ్ పరిశ్రమలో ఆర్థిక సాంకేతికతల పాత్ర, వాటి వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఏఎన్ఎంఐ గత నెలలో స్టాక్టెక్ సర్వేను నిర్వహించింది. అధునాతన రీతుల్లో సైబర్ దాడులు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా తమను, కస్టమర్లను రక్షించుకునేందుకు ఆర్థిక సంస్థలు టెక్నాలజీపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోందని ఇందులో వెల్లడైంది. దీని ప్రకారం గతేడాది 39 శాతం స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలు ఐటీ సంబంధ సమస్యలు ఎదుర్కొన్నాయి. ఫిన్‌టెక్ కంపెనీల బాట... ఎక్కువగా సాంకేతికతతో పని చేసే ఫిన్‌టెక్ కంపెనీలు పెరుగుతుండటంతో ..వాటితో దీటుగా పోటీపడేందుకు సాంప్రదాయ ఆర్థిక సంస్థలు కూడా తమ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తోంది. 2022–23లో సగటున 30 శాతం పెట్టుబడులు సాంకేతికతపైనే వెచ్చించవచ్చని అంచనాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వ్యాపార ప్రక్రియల్లో 33 శాతం భాగం ఫిజికల్ నుంచి డిజిటల్‌కు మారాయి. డిజిటల్‌కు మారడం వల్ల ట్రేడింగ్ లావాదేవీల సమర్ధత, వేగం పెరగడం.. వ్యయాల తగ్గుతుండటం, అందుబాటులో ఉండే పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితిలోనూ కమ్యూనికేషన్‌కు ఆటంకం కలగకుండా పరిశ్రమ నిలబడేలా టెక్నాలజీ తోడ్పడిందని సర్వే నివేదిక పేర్కొంది. సైబర్ దాడుల నుంచి వ్యాపారాలు సురక్షితంగా ఉండేలా కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనలు దోహదపడగలవని 92 శాతం సంస్థలు ఆశాభావంతో ఉన్నట్లు వివరించింది. -
స్టాక్ మార్కెట్లో లాభాల పంట,బుల్ రంకెలేసింది..రికార్డుల మోత మోగించింది
ముంబై: ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందనే ఆశలతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఎనిమిదో రోజూ కొనసాగింది. సానుకూల పీఎంఐ గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ర్యాలీ వేగం తగ్గింది. ముఖ్యంగా ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 483 పాయింట్లు ఎగిసి 63,583 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 18,813 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 130 పాయింట్లు దూసుకెళ్లి 18,888 వద్ద కొత్త గరిష్టాన్ని నెలకొల్పింది. ఇంధన, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ అరశాతం ర్యాలీతో 1.36 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.289.86 కోట్లకు చేరింది. డిసెంబర్ తొలి ట్రేడింగ్ సెషన్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1566 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2665 కోట్ల షేర్లను కొన్నారు. డిసెంబర్లో వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటన తర్వాత ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 81.22 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►సిమెంట్ షేర్లలో గురువారం ర్యాలీ చోటు చేసుకుంది. ఇన్పుట్ వ్యయాలు తగ్గడంతో పాటు వర్షాకాలం ముగియడంతో డిమాండ్ పుంజుకొని కంపెనీల మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లకు డిమాండ్ లభించింది. దాల్మియా భారత్, బిర్లా కార్పొరేషన్, జేకే సిమెంట్, ఇండియా సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1–5 శాతం ర్యాలీ చేశాయి. ► జొమాటో షేరు రెండున్నర శాతం పెరిగి రూ.67 వద్ద స్థిరపడింది. ఆలీబాబాకు చెందిన ఆలీపే సింగపూర్ హోల్డింగ్ సంస్థ బుధవారం జొమాటోకు చెందిన 3.07 శాతం వాటా విక్రయించింది. దీంతో గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఆరుశాతం ర్యాలీ చేసింది. -
రంకెలేస్తున్న బుల్..దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత మోగింది. స్టాక్ సూచీలు సోమవారం సరికొత్త శిఖరాలకు చేరి కొత్త రికార్డు నెలకొల్పాయి. వరుసగా అయిదోరోజూ లాభాలు కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడం కలిసొచ్చింది. భవిష్యత్తుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుదల నెమ్మదించవచ్చనే అంచనాలు బుల్స్‌కు బలాన్నిచ్చాయి. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగుశాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఇంధన, ఆటో, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. సెన్సెక్స్ తాజా జీవిత గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిని లిఖించింది. అయితే గరిష్టాల స్థాయి వద్ద లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గి ముగిశాయి. మెటల్, టెలికం, ఐటీ, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చైనాలో కోవిడ్ లాక్డౌన్ విధింపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. నష్టాల్లోంచి రికార్డు స్థాయిలకి... సెన్సెక్స్ ఉదయం 278 పాయింట్ల నష్టంతో 62,016 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 18,431 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలోనే నష్టాల్లోంచి తేరుకున్న సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదిలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 407 పాయింట్లు దూసుకెళ్లి 62,701 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు బలపడి 18,614 వద్ద కొత్త ఆల్‌టైం హై స్థాయిని తాకింది. దీంతో గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 జీవితకాల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆఖరి గంటలో లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 211 పాయింట్ల లాభంతో 62,505 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 18,563 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు స్థాయిలు కూడా రికార్డు గరిష్టాలు కావడం విశేషం. మార్కెట్లో మరిన్ని సంగతులు ►గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 ఆల్‌టైం హై స్థాయిని అధిగమించేందుకు నిఫ్టీకి 275 ట్రేడింగ్ సెషన్ల సమయం పట్టింది. అలాగే ఈ ఏడాది(2022) జూన్ 17న ఏడాది కనిష్ట స్థాయి(15,183) నుంచి 22% ర్యాలీ చేసింది. ►క్రూడాయిల్ ధరల పతనం రిలయన్స్‌కు కలిసొచ్చింది. బీఎస్ఈలో నాలుగుశాతం లాభపడి రూ.2,722 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి మూడున్నర శాతం లాభంతో రూ.2,708 వద్ద స్థిరపడింది. -
మార్కెట్లో మాంద్యం భయాలు
ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,093 పాయింట్లు క్షీణించి 58,840 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 347 పాయింట్లను కోల్పోయి 17,531 వద్ద నిలిచింది. నిఫ్టీ 50 షేర్లలో సిప్లా, ఇండస్ ఇండ్ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మూడు శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండుశాతం చొప్పున క్షీణించాయి. ట్రెజరీ బాండ్లపై రాబడులు, డాలర్ ఇండెక్స్ పెరగడంతో పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో సూచీలు ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 952 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లను కోల్పోయాయి. ట్రేడింగ్ ఆద్యంత అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 59,585 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 17,797 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 1247 పాయింట్లను కోల్పోయి 58,687 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 17,497 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. కాగా, సెన్సెక్స్ భారీ నష్టంతో శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.6.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే సూచీ గడిచిన మూడు రోజుల్లో 1,730 పాయింట్లను కోల్పోవడంతో మొత్తం రూ.7 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.285.90 లక్షల కోట్ల నుంచి రూ.279.80 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించడంతో భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన అమలుకు సిద్ధమతున్న వేళ.., వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముంచుకురావచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయంగా ఆగస్టులో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టడం ఆందోళన కలిగించింది -
‘ఈ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో మీరే మెగాస్టార్లు!’
1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఓ సందర్భంల్లో స్టాక్ మార్కెట్లో రాణించేందుకు ఆయన చెప్పిన విజయ సూత్రాల్ని ఒక్కసారి చూద్దాం. ► మహిళలు, మార్కెట్లు, మరణం, వాతావరణం గురించి ఎవరూ అంచనా వేయలేరు. ► కెరటాలకు ఎదురెళ్లండి. అంతా అమ్మేస్తున్నప్పుడు కొనండి, అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి. ► నష్టాలకు సిద్ధపడి ఉండండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు జీవితంలో నష్టాలు కూడా భాగమే. ► మార్కెట్‌ను గౌరవించండి. ఎంత ఒడ్డాలి. నష్టపోతే ఎప్పుడు తప్పుకోవాలి గుర్తెరగాలి. బాధ్యతగా ఉండాలి. ► అసమంజసమైన వేల్యుయేషన్లలో ఇన్వెస్ట్ చేయొద్దు. ప్రస్తుతం వెలుగులో ఉన్న కంపెనీల వెంట పరుగులు తీయొద్దు. ► తొందరపాటు నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టాలే తెచ్చిపెడతాయి. తగినంత సమయం తీసుకుని, అధ్యయనం చేశాకే ఏ షేరులో ఇన్వెస్ట్ చేయాలి. ► ఎల్లప్పుడూ స్టాక్ మార్కెట్లే కరెక్ట్. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దు. ► భావోద్వేగాలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, కచ్చితంగా నష్టాలే మిగులుతాయి. ► నష్టాలను భరించే సత్తా లేకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందలేరు. ► సమర్ధమైన, పోటీతత్వం ఉన్న మేనేజ్మెంట్ గల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ► మంచి ట్రేడరు, ఇన్వెస్టరుగా ఉండదల్చుకుంటే.. రెంటినీ వేర్వేరుగానే ఉంచాలి. ► ట్రేడింగ్ చేయాలంటే మనిషి తన అహాన్ని తగ్గించుకోగలగాలి. అలాంటి సామర్థ్యాలు చాలా కొద్దిమందికే ఉంటాయి. కాబట్టే 10 లక్షల మందిలో 9.99 లక్షల మంది నష్టపోతుంటారు. అందుకే ట్రేడింగ్ చేయొద్దన్నది నా వ్యక్తిగత సలహా. ► ఆర్థికవేత్తల మాటలను పట్టించుకుని ఉంటే నేను ఇంత సంపద ఆర్జించి ఉండేవాణ్ని కాను. ► మార్కెట్ అసంబద్ధమైనదని, మీరే శ్రేష్ఠమైన వారు అని మీకు మీరు అనుకుంటే తప్పుల నుంచి ఎన్నటికీ నేర్చుకోలేరు. చదవండి👉 రాకేష్ ఝున్‌ఝున్‌వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు! -
రాకేష్ ఝున్‌ఝున్ వాలా విజయ రహస్యం అదే!
స్టాక్ మార్కెట్ . కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా. రాతలు మార్చుకోవాలన్నా. అన్నీ అక్కడే సాధ్యం. కోట్లాది మంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. అలాంటి కేపిటల్ మార్కెట్‌కు మెగస్టార్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసి హీరో అనిపించుకున్నారు. ఆయన మరెవరో కాదు ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్ ఝున్ వాలా. కేవలం రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లను సంపాదించారు. అలాంటి దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ గురించి ప్రత్యేక కథనం. స్టాక్ మార్కెట్లో అతను పట్టిందల్లా బంగారమే. నిమిషాల్లో పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదించిన ఘనాపాఠీ. డబ్బును డబ్బుతో సంపాదించిన రాకేష్ ఝున్‌ఝున్ వాలా జులై 5, 1960లో హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి రాధేశ్యామ్ ఝున్‌ఝున్ వాలా ఇన్ కం ట్యాక్స్ అధికారి. విధుల నిమిత్తం రాకేష్ ఝున్ ఝున్ వాలా కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రి ఒప్పుకోలేదు లెక్కల్లో ఆరితేరిన రాకేష్ ఝున్‌ఝున్ వాలా.. కాలేజీ రోజుల్లో ఆయన తండ్రి రాధేశ్యామ్ తన స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువగా చర్చించే వారు. దీంతో రాకేష్‌కు స్టాక్ మార్కెట్ పై మక్కువ పెరిగింది.ఆ రంగంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆయన తండ్రి అందుకు ఒప్పుకోలేదు. తండ్రి మాట విన్నారు అయినా పట్టువదలకుండా స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఝున్ ఝున్ వాలా సిద్ధమయ్యారు. అదే సమయంలో తన తండ్రి ఝున్ ఝున్ వాలాకు ఓ సలహా ఇచ్చారు. ప్రతి రోజూ న్యూస్ పేపర్ చదవాలని, ఎందుకంటే స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులకు ఆ వార్తలే కారణమని సూచించారు. తండ్రి చెప్పిన ఆ మాటే రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లు సంపాదించేలా చేసిందని, ఇదే తనన విజయ రహస్యమని పలు మార్లు మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు.అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. అందుకు ఓ షరతు విధించారు. తనని వద్ద నుంచి (తండ్రి) కానీ, తన స్నేహితులు దగ్గర డబ్బులు అడగకూడదని షరతు విధించారు. రాకేష్ అందుకు ఒప్పుకున్నారు. తమ్ముడి స్నేహితురాలే ఆసర తండ్రి మాట జవదాటని రాకేష్ ఝున్ ఝున్ వాలా వద్ద కేవలం 5వేలు మాత్రమే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మొత్తంలో కావాల్సి వచ్చింది. అందుకే రాకేష్ తన తమ్ముడి స్నేహితురాలి వద్ద డబ్బులు ఉన్నాయని, ఇంట్రస్ట్ ఎక్కువ ఇస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తుందని తెలుసుకున్నాడు. బ్యాంకులు ఏడాదికి 10శాతం ఇంట్రస్ట్ ఇస్తే ఝున్ ఝున్‌వాలా ఆమెకు 18శాతం వడ్డీ ఇచ్చేలా రూ.5లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. తొలి ఫ్రాఫిట్ అదే రాకేష్ ఝున్‌ఝున్ వాలా 1986లో రూ.43పెట్టి 5వేల టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్ రూ.43 నుంచి రూ.143కి పెరగడంతో మూడు రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ తర్వాత మూడేళ్లలో రూ.20లక్షల నుంచి 25 లక్షలు సంపాదించారు. అలా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టిన ఝున్‌ఝున్ వాలా అప్రతిహాతంగా ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు. 37స్టాక్స్ ఖరీదు రూ.20వేల కోట్లు 2021,మార్చి 31 నాటికి రాకేష్ ఝున్ ఝున్ వాలా టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, క్రిసిల్,లుపిన్,ఫోర్టిస్ హెల్త్ కేర్,నజారా టెక్నాలజీస్,ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్పొరేషన్, డీబీ రియాలిటీ, టాటా కమ్యూనికేషన్లో 37స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. వాటి విలువ అక్షరాల 19695.3కోట్లుగా ఉంది. -
నష్టాల నుంచి కోలుకున్నాయ్
ముంబై: అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో జోరు మీదున్న బుల్స్ మంగళవారం తడబడ్డాయి. తొలి సెషన్లో విక్రయాల ఒత్తిడికిలోనైన స్టాక్ సూచీలు.., మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకొని ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 370 పాయింట్లు క్షీణించింది. చివరికి 21 పాయింట్ల లాభంతో 58,136 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 125 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్లు పెరిగి 17,345 దగ్గర స్థిరపడింది. సూచీలకిది ఇది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఐటీ, మెటల్, ఆర్థిక, రియల్టీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటో, ఇంధన షేర్లు రాణించి సూచీల రికవరీకి సహకరించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.825 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.118 కోట్ల షేర్లను కొన్నారు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా చైనాల మధ్య తైవాన్ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► తొలి త్రైమాసికంలో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గడంతో జొమాటో షేరు 20% లాభపడి రూ. 55.60 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. జొమాటోలోని మొత్తం వాటాను వదిలించుకునేందుకు ఉబెర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్లాక్ డీల్ ద్వారా 7.8% వాటాకు సమానమైన షేర్లను రూ.48–54 ధర శ్రేణిలో రూ.2,939 కోట్లకు విక్రయించనుందని మర్చెంట్ బ్యాంకింగ్ వర్గాల సమాచారం. ► క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో యూపీఎల్ షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.737 వద్ద స్థిరపడింది. ► హెచ్డీఎఫ్సీ మాజీ ఎండీ ఆదిత్య పురి యస్ బ్యాంక్ బోర్డులోకి రావొచ్చనే అంచనాలతో యస్ బ్యాంక్ 13% లాభపడి రూ.17.14 వద్ద క్లోజైంది. రూపాయికి విదేశీ నిధుల దన్ను 53 పైసలు లాభంతో 78.53కు అప్ డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 53 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 53 పైసలు బలపడి, 78.53 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల గరిష్ట స్థాయికాగా, 11 నెలల్లో ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలోపేతం కావడం ఇదే తొలిసారి. జూలై 20వ తేదీన రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 80.06ను చూసిన సంగతి తెలిసిందే. -
మూడు నెలల గరిష్టంలో ముగింపు
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు ఆరోరోజూ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 56వేల స్థాయిపైన 56,072 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,700 స్థాయిని అందుకొని 114 పాయింట్లు పెరిగి 16,719 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు మూడునెలల గరిష్టం. రూపాయి రికవరీతో డాలర్ల రూపంలో లాభాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.675 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.739 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదు పైసలు పతనమై 79.90 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.9.08 లక్షల కోట్లు: స్టాక్ మార్కెట్ ఈ వారమంతా లాభాలను గడించింది. సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4% దూసుకెళ్లడంతో బీఎస్ఈలో రూ.9.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు ఎగసింది. సెన్సెక్స్ ఉదయం 119 పాయింట్ల లాభంతో 55,801 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 16,661 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో తడబడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలతో తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 501 పాయింట్ల రేంజ్లో 55,685 వద్ద కనిష్టాన్ని, 56,186. వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 141 పాయింట్ల పరిధిలో 16,752 – 16,611 శ్రేణిలో ట్రేడైంది. -
ఇన్వెస్టర్ల పంట పండింది..2రోజుల్లో రూ.4.73 లక్షల కోట్ల సంపద సృష్టి!
ముంబై: అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో పాటు అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో సోమవారం స్టాక్ సూచీలు నెల రోజుల గరిష్టంపై ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఐటీ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 760 పాయింట్లు బలపడి 54,521 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,250 స్థాయిపైన 16,279 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.844 కోట్ల షేర్లను కొన్నారు. ఆద్యంతం కొనుగోళ్ల కళకళ ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 308 పాయింట్లు లాభంతో 54,069 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 16,151 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 796 పాయింట్లు ఎగసి 54,556 వద్ద, నిఫ్టీ 239 పాయింట్లు దూసుకెళ్లి 16,288 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. సూచీలకు లాభాలు ఇందుకే...! యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 2.50% లాభపడ్డాయి. ఆసియాలో సోమవారం ఆయా దేశాల స్టాక్ సూచీలు 2%, యూరప్ మార్కెట్లు ఒకశాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ మార్కెట్లు సానుకూల సంకేతాలను అందుకున్నాయి. అధిక వెయిటేజీ షేర్లైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఎల్అండ్టీ షేర్లు రెండు శాతం రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఇటీవల దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) విక్రయాల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు తాజాగా రూ.156 కోట్ల షేర్లను కొన్నారు. రెండు రోజుల్లో రూ.4.73 లక్షల కోట్లు గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్ సూచీ 1105 పాయింట్లు దూసుకెళ్లడంతో బీఎస్ఈలో రూ.4.73 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒకటిన్నర శాతం రాణించడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.42 లక్షలు పెరిగి రూ.255.39 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ∙ముడిచమురు ధరల రికవరీ రిలయన్స్ షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈలో ఒకశాతం లాభపడి రూ.2,422 వద్ద స్థిరపడింది. ∙ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు కనబరిచినప్పటికీ.., షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకశాతం నష్టంతో రూ.1,348 వద్ద నిలిచింది. ∙దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విమాన ఇంధన ధరను 2.2 శాతం మేర తగ్గించడంతో విమానయాన షేర్లు లాభాల్లో పయనించాయి. స్పైస్‌జెట్, ఇండిగో, జెట్‌ఎయిర్‌వేస్ షేర్లు ఆరుశాతం వరకు ర్యాలీ చేశాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ ఫలితాలు సూచీలకు దిశానిర్దేశం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు, పార్లమెంట్వర్షాకాల సమావేశాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘ఇటీవల క్రూడాయిల్‌తో పాటు కమోడిటీ ధరలు దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల ఉధృతి తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్ సూచీలు మరికొంత పాటు పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 16,00 స్థాయిపైన ముగిసింది. కొనుగోళ్లు కొనసాగితే జూన్ నెల గరిష్టం 16,275 స్థాయి వద్ద నిరోధం ఎదుర్కోనుంది. అటు పిదప 16,400–16,500 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 15,858 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700–15,500 రేంజ్లో మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి దిగిరావడం, ఇప్పటి వరకు విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ద్రవ్యోల్బణ పెరగడంతో ఫెడ్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో గతవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్లు చొప్పున క్షీణించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., కీలక దశలో కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ముందుగా నేడు మార్కెట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హావెల్స్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆర్బీఎల్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే.., యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రేపు ద్రవ్య విధానాన్ని వెల్లడించనుంది. వడ్డీరేట్ల పెంపుకే మొగ్గు చూపవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. యూరో కరెన్సీ పదేళ్ల కనిష్టానికి దిగివచ్చని నేపథ్యంలో ఈసీబీ కఠినతర వైఖరి అనుసరించే వీలుందంటున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ కేంద్ర బ్యాంక్ గురువారం ద్రవ్య పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ జూలై తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,432 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత నెలలో సైతం అమెరికా డాలర్ బలపడటం, అమెరికా మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనలు ఇందుకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. కాగా గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ.., కొనుగోలు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ లేకపోవడంతో అమ్మకాల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. -
అమెరికాపై వడ్డీరేట్ల పెంపు ఎఫెక్ట్.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్ల పెంపుతో అమెరికా ఎకానమీపై ప్రభావం, బ్యాంకింగ్ దిగ్గజాలైన జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ నిరుత్సాహ పరిచిన ఆర్ధిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా శుక్రవారం ఉదయం 10.20గంటలకు సెన్సెక్స్ 182 పాయింట్లు లాభంతో 53598 వద్ద నిఫ్టీ 59 పాయింట్ల స్వల్ప లాభంతో 15998 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా కాన్స్, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా, ఎంఅండ్ ఎం, నెస్లే, టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. విప్రో,టాటా స్టీల్, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. -
టీసీఎస్‌కు భారీ షాక్, రూ.55,471 కోట్ల నష్టం!
ముంబై: ఐటీ షేర్ల పతనంతో స్టాక్ సూచీల మూడు రోజుల ర్యాలీకి సోమవారం అడ్డుకట్టపడింది. టీసీఎస్ తొలి క్యూ1 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు డాలర్ మారకంలో రూపాయి తాజా కనిష్టానికి దిగిరావడం ప్రతికూలాంశాలుగా మారాయి. నేడు జూన్ ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. ఇంట్రాడేలో 437 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్ల నష్టంతో 54,395 వద్ద స్థిరపడింది. మరో సూచి నిఫ్టీ 133 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్ల నష్టంతో 16,216 వద్ద నిలిచింది. ఐటీ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత మార్కెట్లో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.270 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 171 కోట్ల షేర్లను అమ్మేశారు. ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందుకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్‌కు రూ.55,471 కోట్ల నష్టం ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా షేరు 4.64% నష్టంతో మూడు వారాల కనిష్టం రూ.3,113 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదుశాతం పతనమై 3,105 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు ఐదు శాతం క్షీణతతో రూ.55,471 కోట్ల మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. టెలికం రంగ షేర్ల నష్టాల ‘ట్యూన్’ టెలికాం రంగంలో అదానీ అడుగుపెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో సంబంధింత టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ నెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌తో పాటు అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకున్నారు. అదానీ రాక పోటీ మరింత తీవ్రతరమవుతుందనే భయాలతో భారతీ ఎయిర్ టెల్ షేరు ఐదు శాతం నష్టపోయి రూ.660 ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాప్ లూజర్ ఇదే. వొడాఫోన్ ఐడియా షేరు మూడున్నర శాతం పెరిగి రూ.8.72 వద్ద ముగిసింది. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ షేర్లు 20శాతం పెరిగి రూ.19.85 వద్ద నిలిచింది. అదానీ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో 7–1% మధ్య రాణించాయి. -
లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్లపై దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించింది. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల వంటి ఇతర కారణాలు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైన ఆ వెంటనే తిరిగి లాభాల్లోకి పుంజుకున్నాయి. శుక్రవారం ఉదయం 9.35 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 54,400పైన నిలదొక్కుకోగా, నిఫ్టీ 80పాయింట్లతో లాభపడి 16,200 మార్క్‌ను క్రాస్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 35,100 ఉండగా,ఇండియా వీఐఎక్స్ 20 స్థాయిల దిగువకు పడిపోయాయి. ఇక సెన్సెక్స్‌లో 1.2శాతం క్షీణించిన ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో పయనిస్తుంది. హిందుస్తాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లారెన్స్ అండ్ టూబ్రో, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలతో ముగిశాయి. గురువారం సైతం సూచీలు అదే జోరును కంటిన్యూ చేస్తాయని భావించిన మదుపర్లకు నిరాశే ఎదురైంది. దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయి 54029 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16078 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగుతుంది. రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బ్రిటానియా, ఐటీసీ,మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. టైటాన్ కంపెనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఓఎన్జీసీ,ఏసియన్ పెయింట్స్, హిందాల్కో,విప్రో, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్లు: ఇన్వెస్టర్లు జాక్‌పాట్ కొడతారా? లేదంటే నష్టపోతారా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, క్రూడాయిల్ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్స్ కవర్ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లైయితే బుల్స్ రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నా.., గతవారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ నష్టాల్లో ముగిసినా.., సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకొంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించొచ్చు. ఎగువస్థాయిలో కొనుగోళ్ల జరిగితే 15,900 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. అటు పిదప 16,170–16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. 1. ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం టీసీఎస్ శుక్రవారం జూన్(8న) క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. ‘‘అట్రిషన్ రేటు పెరగడంతో ఐటీ రంగం, మందగమనంతో మౌలికరంగం., సైక్లికల్స్ సెక్టార్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీల గణాంకాలు మెప్పించవచ్చు. కార్పొరేట్ ఫలితాల ప్రకటనకు ముందు స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది’’ అని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్‌తో పాటు పీటీసీ ఇండియా, జీఎం బేవరీజెస్, మైసూర్ పేపర్ మిల్స్, వక్రంజీ, కోహినూర్ ఫుడ్స్ తదితర కంపెనీలు ఈ వారంలో ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. 2. ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జూన్ ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. ఇదేవారంలో మంగళవారం యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ, బుధవారం కన్స్ట్రక్షన్ పీఎంఐ, మే మాసపు రిటైల్ అమ్మకాలు వెల్లడి కానున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రష్యా – ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. -
రిలయన్స్‌కు భారీ షాక్, గంటల వ్యవధిలో లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరి!
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఇంధన షేర్లు పతనంతో స్టాక్ సూచీలు మూడోరోజూ (శుక్రవారం) నష్టాలను మూటగట్టుకున్నాయి. జూన్‌లో తయారీ రంగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకోవడం కూడా సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 925 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్ల పతనం నుంచి కోలుకోని 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద నిలిచింది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.74%, అర శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,138 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,378కోట్ల షేర్లను కొన్నారు. విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎఫెక్ట్ విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఆయిల్అండ్ గ్యాస్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు 15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఇంధన షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోయింది. రిలయన్స్‌కు రూ.1.25 లక్షల కోట్ల నష్టం కేంద్ర విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్‌లో రెండేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.2365 వద్ద స్థాయిని తాకింది. చివరికి ఏడుశాతం నష్టంతో రూ.2409 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో రూ.1.25 లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వాయిదాతో ఎయిర్టెల్ 2% క్షీణించి రూ. 673 వద్ద నిలిచింది. ♦బలహీన మార్కెట్లోనూ ఐటీసీ షేరు రాణించింది. ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీలో భాగంగా 4% లాభపడి రూ. 284 వద్ద స్థిరపడింది. ♦బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో టైటాన్ షేరు ఇంట్రాడేలో 7% నష్టపోయింది. చివరికి 0.20 శాతం లాభంతో రూ.1,946 వద్ద స్థిరపడింది. -
ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్
ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
ఆర్ధిక మాంద్యం భయాలు, స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేకులు!
ముంబై: ఆర్థిక మాంద్యం భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్ సూచీల నాలుగు రోజుల లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. జూన్ నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందుట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన అంతర్జాతీయ సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 53,027 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్ల పతనంతో 15,799 వద్ద నిలిచింది. మరోవైపు ఇంధన, రియల్టీ, మెటల్, ఆటో షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు వరసగా 0.70%, 0.20 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.847 కోట్ల షేర్లను కొన్నారు. యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు విడుదల(రాత్రికి) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ‘‘ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా ఇటీలవ దేశీయ స్టాక్ మార్కెట్ సరైన దిశా, నిర్దేశం లేకుండా ట్రేడ్ అవుతోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(నేడు)తో పాటు ఆటో విక్రయ, పీఎంఐ గణాంకాల విడుదల(రేపు)కు ముందు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రానున్న రోజుల్లో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 554 పాయింట్ల నష్టంతో 52,623 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు పతనంతో 15,702 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కొనుగోళ్లకు తోడ్పడే అంశాలేవీలేకపోవడంతో సూచీలు తొలిసెషన్లో పరిమితి శ్రేణిలో నష్టాలతో కదలాడాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి ఇంధన, ఆటో ప్రభుత్వ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్ విక్రయం ధరలను నియంత్రణ పరిధి నుంచి తొలిగించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయంతో ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు ఐదుశాతం నుంచి ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. ► ఓపెన్ మార్కెట్ పద్దతిలో షేర్ల బైబ్యాక్ ప్రకటన నిరాశపరచడంతో రూట్ మొబైల్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.1,237 వద్ద నిలిచింది. ►ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లు 4శాతం నుంచి ఒకశాతం క్షీణించాయి. కారణాలు...కఠినం క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెంపు ధోరణి, డాలర్ పటిష్టత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు, మరో మాంద్యం ముందు ప్రపంచం నిలబడిందన్న విశ్లేషణలు, కోవిడ్–19పై అనిశ్చితి వంటి పలు అంశాలు రూపాయి పతనానికి కారణంగా ఉన్నాయి. మరోవైపు రూపాయి కట్టడిచేసే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లేదన్న వార్తలు రూపాయి జారుడుకు మరింత ఊతం ఇస్తోంది. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని చెప్పారు. ‘‘రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 79 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.50 డాలర్లపైన ట్రేడవుతోంది. ముంబై: క్షీణబాటలో రూపాయి వేగం ఆగట్లేదు. ఏరోజుకారోజు కొత్త పతన రికార్డులు కొనసాగుతున్నాయి. బుధవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోల్చితే 18 పైసలు నష్టంతో 79.03 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మంగళవారం ముగింపు 78.85. బుధవారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 78.86 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 79.05 స్థాయినీ చూసింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 18పైసలు నష్టపోయింది. వెరసి ముగింపు, ఇంట్రాడేల్లో రూపాయిది బుధవారం విలువలే కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రూపాయి దాదాపు 6 శాతం నష్టపోయింది. ఏడాది ప్రారంభం నుంచి 6.39 శాతం నష్టపోతే, ఒక్క జూన్ నెల్లో 2 శాతం పతనమైంది. ఫిలిప్పీన్ పెసో, థాయ్ భాట్ తర్వాత ఆసియా కరెన్సీల్లో రూపాయి ఇటీవలి నెలల్లో మూడవ అత్యంత క్షీణతను నమోదుచేసుకుంది. శుక్రవారం వరుసగా ఎనిమిది వారాల్లో నష్టాల్లో నడిచిన రూపాయి, తాజా వారంలో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టపోవడం గమనార్హం. ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
దూకుడుకు బ్రేకులు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. బుధవారం మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. బుధవారం ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 51979 వద్ద నిఫ్టీ 174 పాయింట్లు నష్ట పోయి 15464 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, హిందాల్కో,ఓఎన్‌సీజీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
షార్ట్ రికవరింగ్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
ముంబై : గత వారం భారీ నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలతో ఆరంభమైంది. కనిష్టాల వద్ద షేర్లు లభిస్తుండటంతో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా సోమవారం ఉదయం మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్‌కు ఊపును తెచ్చే ఘటనలు ఏమీ చోటు చేసుకోపోయినా ప్రస్తుతానికి సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో 51,470 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు ఉండటంతో వరుసగా పాయింట్లు పెరుగుతూ పోతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 212 పాయింట్లు లాభపడి 51,572 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది,. మరోవైపు నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 15,334 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సన్‌ఫార్మా, ఏషియన్ పేయింట్స్, అపోలో హస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడగా ఎఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు కూడా లాభాల్లో కదలాడుతున్నాయి. -
ఫెడ్వడ్డీ రేట్ల పెంపు.. అయినా లాభాల్లో సూచీలు
ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడంతో క్రితం రోజు మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో కనిష్టాల వద్ద షేర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి మళ్లుతుంటూ ఆ స్థానాన్ని దేశీ ఇన్వెస్టర్లు ఆక్రమిస్తున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ భారీ లాభాలతో ఆరంభమైంది. క్రితం రోజు ఎనిమిది నెలల కనిష్టాలకు పడిపోయి 52,541 పాయింట్లకు పడిపోయింది. కానీ గురువారం ఉదయం నాలుగు వందలకు పైగా పాయింట్ల లాభంతో 53,018 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటలకు 498 పాయింట్ల లాభంతో 53,040 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్..కోట్ల సంపద కోల్పోతున్న ఇన్వెస్టర్లు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు స్టాక్‌మార్కెట్‌ను కలవర పెడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం 9:30 గంటల సమయంలో 1459 పాయింట్లు నష్టపోయి 2.46 శాతం క్షీణించి 52,843 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 396 పాయింట్లు నష్టపోయి 15,805 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. బ్లాక్‌మండే ఎఫెక్ట్‌తో మార్కట్ ఆరంభమైన అరగంటలోనే సెన్సెక్స్ 53 వేల దిగువకు పడిపోగా నిఫ్టీ 16వేల కిందకు పడిపోయింది. లార్జ్, స్మాల్, మిడ్ అన్ని రంగాల్లో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్‌మార్కెట్ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారను. గడిచిన పది రోజుల్లో ఏకంగా 14 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం జూ 1 నుంచి 10 మధ్యలో ఏకంగా రూ.13,888 కోట్ల నగదు మార్కెట్ నుంచి బయటకు వెళ్లింది. అయితే దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రావడం కొంత ఊరట కలిగించింది. అయితే సోమవారం కూడా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహారణ బాటలోనే ఉండటం ఒకింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. -
విలవిలాడుతున్న ఇన్వెస్టర్లు.. భారీగా నష్టపోతున్న మార్కెట్ సూచీలు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారాయి. ద్రవ్యోల్బణ కట్టడికి యూఎస్ ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకుai వడ్డీరేట్లు పెంచవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో శుక్రవారం ఆరంభం నుంచే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆరంభం కావడమే ఆరు వందలకు పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ జర్నీ మొదలైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల నష్టంతో 54,760 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో నష్టాలు తప్పడం లేదు. ఉదయం 9:50 గంటల సమయంలో 735 పాయింట్లు కోల్పోయి 1.28 శాతం క్షీణించి 54,607 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయి 1.29 క్షీణించి 16,265 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గంట వ్యవధిలోనే రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చత్త పరిస్థితులకు ఇన్వెస్టర్లు విలవిలాడుతున్నారు. హెవీ వెయిట్ కలిగిన కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మారుతి సుజూకి, టైటాన్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం క్షీణించింది. -
‘రెపో’ ఎఫెక్ట్.. నష్టాలతోనే ఆరంభం
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ రెపోరేటు పెంపు, ఆర్థిక వృద్ధి కుదింపు, అంతర్జాతీయంగా భయపెడుతున్న చమురు ధరల ఎఫెక్ట్‌తో దేశీ సూచీలు నష్టాలతో ఆరంభం అయ్యాయి. పైగా రాబోయే నెలల్లో వడ్డీరేట్లు మరింతగా పెరుగుతాయనే అంచనాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. క్రితం రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడి చివరకు నష్టాలతో మార్కెట్ ముగిసింది. ఈ రోజు ఉదయం కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తూ నష్టాలతోనే ఆరంభం అయ్యింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వందల పాయింట్లకు పైగా నష్టంతో ఆరంభమైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 378 పాయింట్లు నష్టపోయి 54,514 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి 16,209 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. -
లాభాలు కొద్ది సేపే.. వెంటాడుతున్న నష్టాలు
ముంబై: స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాలతో మొదలైంది. ఆరంభంలో లాభాలు కనిపించినా వెనువెంటనే నష్టాల్లోకి జారుకుంది. గత మూడునాలుగు రోజులుగా నిత్యం మార్కెట్ నష్టాలతోనే ముగుస్తోంది. దీంతో అనేక స్టాక్స్ కనిష్టాల వద్ద లభిస్తుండటంతో బుధవారం ఉదయం కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే అది కొద్ది సేపటికే పరిమితం అయ్యింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ కమిటీ సమావేశాలు జరుగుతుండటం.. రేపోరేటు పెంచవచ్చనే నిర్ణయాలు మరోసారి ప్రభావం చూపాయి. దీంతో మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం రోజు ముగింపుతో పోల్చితే రెండు వందలకు పైగా పాయింట్ల లాభంతో 55,345 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటి వరకు ఇదే జోరు కనిపించింది. కానీ అరగంట తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:14 గంటల సమయంలో 267 పాయింట్లు నష్టపోయి 54,840 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 16,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
సర్రున కిందికి జారిన సూచీలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: ఆర్బీఐ వడ్డీరేటు వార్తలు, ఉక్రెయిన్‌లో భూభాగాలను రష్యా ఆక్రమించుకోవచ్చనే వార్తల నేపథ్యం, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వెరసి ఇన్వెస్టర్లలో ఆందోళనల రేకెత్తించాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కన్సుమర్స్ గూడ్స్ విభాగంలో షేర్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ఉదయం 55,373 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆరంభంలోనే మూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10:15 గంటల సమయంలో 634 పాయింట్లు నష్టపోయి 55,041 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 16,404 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ , యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్, హిందూస్థాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. -
ఝలక్ ఇచ్చిన ఐటీ షేర్లు.. నష్టాలతో మొదలైన మార్కెట్
ముంబై: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ఆరంభమయ్యాయి. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. రుతుపవనాలు సకాలంలో వస్తాయి సమృద్ధిగా వర్షాలు పడతాయనే సానుకూల వార్తలు ఉన్నా మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు పెంచవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 55,610 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. ఉదయం 9:50 గంటల సమయంలో 393 పాయింట్లు నష్టపోయి 55,375 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 16,475 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఈ రోజు ఉదయం సెషన్లో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు షేర్లకు నష్టాలు తప్పలేదు. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఆరంభం అదిరేలా, చివరికి నష్టాలతో ముగిసిన మార్కెట్లు!
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం (56,433) నుంచి 663 పాయింట్లు క్షీణించి చివరికి 49 పాయింట్ల నష్టంతో 55,769 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 166 పాయింట్లు బలపడింది. మార్కెట్ ముగిసే సరికి 44 పాయింట్ల నష్టంతో 16,584 వద్ద నిలిచింది. ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఆటో రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,770 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.2,360 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి మూడు పైసలు క్షీణించి 77.63 వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ద్రవ్య విధానాన్ని నిర్ణయించే యూఎస్ ఉద్యోగ గణాంకాల వెల్లడి(శుక్రవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఈ వారంలో మూడు ట్రేడింగ్ సెషన్లో నష్టాలను చవిచూడగా, రెండురోజులు లాభాలను ఆర్జించింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ల్లో సెన్సెక్స్ 885 పాయింట్లు, నిఫ్టీ 232 పాయింట్లు చొప్పున పెరిగాయి. ‘‘వచ్చే వారంలో(6–8 తేదిల్లో) ఆర్బీఐ.., అటుపై వారం (14–15 తేదీల్లో) యూఎస్ ఫెడ్ రిజర్వ్ పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా ఆర్బీఐ 25–35 బేసిస్ పాయింట్లు., ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్లు చొప్పున వడ్డీరేట్లను పెంచే వీలుంది. పాలసీ ప్రకటన సందర్భంగా వెల్లడయ్యే ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్ వ్యాఖ్యలు, ద్రవ్యోల్బణ అంశాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయి. అలాగే ద్రవ్య పాలసీపై కేంద్ర బ్యాంకులు మునుపటి కన్నా కఠిన వైఖరిని ప్రదర్శిస్తే ఈక్విటీ మార్కెట్లలో తిరిగి బేరీష్ వాతావరణం నెలకొనవచ్చు’’ జియోజిత్ పైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ స్పెషాలిటీ కెమికల్స్ ఏథర్ ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.642తో పోలిస్తే పదిశాతం లాభంతో రూ.706 వద్ద లిస్టయింది. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 21 శాతం దూసుకెళ్లి అప్పర్ సర్క్యూట్ రూ.777 వద్ద లాకయ్యింది. ఎక్సే్ఛంజీలో మొత్తం 5.71 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.9,669 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రెండోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్ఈలో రెండు శాతం లాభపడి రూ. 2,779.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3% శాతం బలపడి రూ.2,816 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఈ షేరు ఏడుశాతం పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ రూ.12,886 కోట్ల సామర్థ్య విస్తరణ ప్రణాళిక ప్రకటనతో సిమెంట్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక సరఫరాతో సిమెంట్ ధరలు దిగివస్తాయనే ఆందోళనలతో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, శ్రీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, నువాకో విస్టాస్, గ్రాసీమ్ షేర్లు 6% పతనాన్ని చవిచూశాయి. గుజరాత్ యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దీపక్ నైట్రేట్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.1,964 వద్ద స్థిరపడింది. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం బుల్ జోరు కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు పాజిటీవ్ వైబ్స్‌తో కొనసాగుతుండగా..వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో సోమవారం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 864 పాయింట్ల భారీ లాభంతో 55749 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ సైతం 381 లాభంతో 35995 పాయింట్ల వద్ద ట్రేడ్‌ను కంటిన్యూ చేస్తుంది. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్,యూపీఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్,హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, గ్రిసిం, టెక్ మహీంద్రా,కిప్లా, శ్రీ సిమెంట్, విప్రో, టాటా మోటార్స్, టాటా కాన్స్,టీసీఎస్,లారెసన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. జేఎస్‌డ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, కొటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
అమ్మకానికి మరో ప్రభుత్వ రంగ సంస్థ వాటా!
అన్‌లిస్టెడ్ అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్(బీసీసీఎల్)లో 25 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తెలియజేసింది. తదుపరి తగిన అనుమతులు లభిస్తే బీసీసీఎల్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి 10న జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. బొగ్గు శాఖ(ఎంవోసీ) సూచనలమేరకు బీసీసీఎల్‌లో 25శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ముందస్తు అనుమతిని మంజూరు చేసినట్లు పేర్కొంది. తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టింగ్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ అంశంలో మరిన్ని అనుమతుల కోసం ఎంవోసీకి ప్రతిపాదించినట్లు వెల్లడించింది. అయితే బోర్డు సూచనప్రాయ అనుమతిని మాత్రమే మంజూరు చేసిందని, ఎంవోసీ నుంచి క్లియరెన్స్ లభిస్తే లిస్టింగ్ సన్నాహాలు చేపడతామని వివరించింది. 2020–21లో 37.13 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 24.66 ఎటీ ఉత్పత్తిని మాత్రమే బీసీసీఎల్ సాధించినట్లు ఈ సందర్భంగా కోల్ ఇండియా వెల్లడించింది. -
ఐపీవోకి ఓయో..టార్గెట్ రూ.8వేల కోట్ల పైమాటే!
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ట్రావెల్ టెక్ కంపెనీ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఈ క్యాలండర్ ఏడాది చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. సెప్టెంబర్ తదుపరి ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తాజాగా సవరించిన కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాల సమాచారాన్ని సెబీకి దాఖలు చేసింది. ఓయో బ్రాండ్ కంపెనీ గతేడాది అక్టోబర్‌లో షేర్ల విక్రయం ద్వారా రూ. 8,430 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత 11 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ ఇటీవల 7–8 బిలియన్ డాలర్లకు లక్ష్యాన్ని సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పనితీరులో మెరుగుపడే అవకాశం, మార్కెట్లలో ప్రస్తుతం నమోదవుతున్న హెచ్చుతగ్గులు వంటి అంశాలు క్యూ4లో ఐపీవో చేపట్టే యోచనకు కారణాలుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు అందుతున్నాయి. మరోవైపు దేశీ సూచీలు నాలుగు నెలల కనిష్టాలకు పడిపోయాయి. స్టాక్‌లు తక్కువ ధరకే వస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ రోజు ఉదయం ఆరంభంలోనే దేశీ సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు ఏడు వందల పాయింట్ల లాభంతో 53,513 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 721 పాయింట్ల లాభంతో 997 పాయింట్లు లాభపడి 53,790 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 283 పాయింట్లు లాభపడి 16,093 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈరోజు ఈ ముద్ర ఐపీవోకి రానుంది. -
ఫ్యూచర్‌కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) తాజాగా రూ. 23 కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది గత మూడు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్ఈఎల్ గత నెల స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ డీల్ సాకారం కాలేదు. -
దేశీ సూచీల నేల చూపులు.. ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చేశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. మార్కెట్ ఆరంభం నుంచి ముగింపు వరకు షేర్లు తమ విలువలను కోల్పోతూనే ఉన్నాయి. సెన్సెక్స్ 30, నిఫ్టీ 50లోని ప్రముఖ కంపెనీల షేర్లు ఢమాల్ అన్నాయి. ఈరోజు ఉదయం ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లను కోల్పోతూనే వచ్చింది, ఒక దశలో 52,669 పాయింట్ల కనిష్టాలను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1416 పాయింట్ల నష్టంతో 2.61 క్షీణత నమోదు చేసి 52,792 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే సెన్సెక్స్‌ను మించి నష్టాలను చవి చూసింది. 520 పాయింట్లు నష్టపోయి 3.18 శాతం క్షీణించి 15,836 పాయింట్ల దగ్గర ముగిసింది. మార్కెట్ విశేషాలు - బాంబే స్టాక్ ఎక్సేంజీలో 278 స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. - బీఎస్ఈలో బీ కేటగిరీలో 47 స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. - 82 స్టాక్స్ ఇయర్‌లోను చూశాయి - నిఫ్టీ 50 మిడ్‌క్యాప్‌లో 3.50 లక్షల కోట్ల సందప ఆవిరైంది - టాప్ 5 ఐటీ కంపెనీల మార్కెట్‌క్యాప్‌కి రూ.1.40 లక్షల కోట్ల మేర కోత పడింది - ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు బాగా లాభపడ్డాయి, ఇవాల ఒక్కరోజే ఐటీసీ మార్కెట్ క్యాప్ 11 వేల కోట్లు పెరిగింది. - ఇష్యూ ప్రైస్‌తో పోల్చితే ఎల్ఐసీ షేర్ వ్యాల్యూకి మరింత కోత పడింది. మొత్తంగా పది శాతం మేర క్షీణించింది -
లాభాలు మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్లపై నేరుగా పడింది. దీంతో ఈ రోజు మార్కెట్ నష్టాలతోనే ఆరంభమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది.యుక్రెయిన్ వార్ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడం, చైనా జీరో కోవిడ్ పాలసీలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 దగ్గర ట్రేడింగ్ మొదలైంది. మార్కెట్లో అస్థిరత నెలకొనడంతో సూచీలు అక్కడి నుంచి అటుఇటుగా కదలాడుతోంది. ఉదయం 9:40 గంటల సమయంలో 994 నష్టపోయి 1.83 శాతం క్షీణించి 53,214 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ భారీగా కుదేలవుతోంది. 421 పాయింట్ల నష్టంతో 2.58 శాతం క్షీణించి 15,935 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియా వీఐఎక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. -
జోరుమీదున్న సూచీలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు జోరుమీదున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండటం, షార్ట్ రికవరింగ్‌కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాలతో ఆరంభమయ్యాయి. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో 54,554 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 54,692 పాయింట్ల గరిష్టాలును టచ్ చేసింది. ఉదయం 9:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 54,653 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,356 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. -
లాభాల్లో దేశీ సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ఆరంభమయ్యాయి. ఏషియన్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదులుతుండటం దేశీ మార్కెట్లకు కలిసి వచ్చింది. దీంతో ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ రెండు సూచీలు దూసుకుపోతున్నాయి. ఈ రోజు ఎల్ఐసీ ఐపీవో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుండటంతో ఇన్వెస్టర్ల ఫోకస్ దానిపై కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,285 పాయింట్లతో మొదలైంది. ఒక దశంలో 53,400 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసినా.. అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ఉదయం 9:45 గంటల సమయానికి 366 పాయింట్ల లాభంతో 53,340 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 124 పాయింట్లు లాభపడి 15,966 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
సుదీర్ఘ నష్టాలకు సోమవారం స్టాక్మార్కెట్లో బ్రేక పడింది. మార్కెట్ సూచీలను తక్షణ కలవరపాటుకు గురి చేసే అంశాలేవీ అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకోలేదు. మరోవైపు షేర్లు కనిష్టాల దగ్గర లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాల్లో మొదలయ్యాయి. కీలకమైన పదిహేను విభాగాల్లో షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. స్మాల్, మిడ్, లార్జ్ అని తేడా లేకుండా అంతటా సానుకూల వాతావారణమే కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. ఉదయం 10 గంటల సమయంలో 53,405 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోల్చితే ఇప్పటికే సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 1.16 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 0.96 శాతం వృద్ధితో 15,926 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సాయంత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 136పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ సైతం 25పాయింట్ల స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇక టాటామోటార్స్,సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, ఐటీసీ, యూపీఎల్, టైటాన్ కంపెనీ, ఎథేర్ మోటార్స్ లాభాల్ని గడించగా..హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి. -
దేశీ ఇన్వెస్టర్ల మద్దతు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి దేశీ సూచీలు పడిపోవడంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోవడం, ఫిన్లాండ్ తాజా నిర్ణయంలో ముదిరిన అంతర్జాతీయ ఉద్రిక్తలు , పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇంకా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,565 పాయింట్ల దగ్గర లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 53,625 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. కానీ ఆ తర్వాత అక్కడే ఎక్కువ సేపు ఉండేలేక కిందకు జారుకుంది. ఉదయం 10:15 గంటల సమయంలో 340 పాయింట్ల లాభంతో 53,270 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,950 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాబపడిగా.. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలను చవి చూశాయి. -
బేర్ పంజా.. ఆరంభంలోనే భారీ పతనం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: మార్కెట్లో బేర్ పంజా కొనసాగుతోంది. చాలా కంపెనీల నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధ భయాల నడుమ స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు సాధించింది. దీంతో వరుసగా మార్కెట్ నష్టాల పాలు అవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏ వైపు నుంచి మార్కెట్‌కు జోష్ అందించే పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,608 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో వేగంగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎఉస్‌ఈ సెనెక్స్ 782 పాయింట్ల నష్టంతో 1.45 క్షీణత నమోదు చేసి 53,305 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 1.48 శాతం క్షీణత నమోదు చేసి 15,927 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కనాకష్టంగా 54 వేలు, 16 వేల పాయింట్ల మార్క్‌ను కాపాడుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం రోజు ఆరంభంలోనే వాటిని కోల్పోయాయి. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొనసాగి కొనుగోళ్ల మద్దతు లభించకపోతే భారీ నష్టాలు తప్పేలా లేవు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోనుంది. -
తప్పని నష్టాలు.. కీలక బెంచ్‌మార్క్ పాయింట్లు కోల్పోయిన సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి. తగ్గని యుద్ధ భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం కొద్ది సేపుల లాభాలు కనిపించినా ఆ వెంటనే నష్టాలు వెంటాడాయి. మరోవైపు రేపటితో ఫ్యూచర్స్, ఆప్షన్స్ గడువు తీరిపోతుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. పైగా మార్కెట్లో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్, ఐటీసీ, ఎల్ అండ్ , బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. అయితే మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు కీలక బెంచ్‌మార్క్‌లను నిలబెట్టుకోగలిగాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,544 పాయింట్లతో లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాలు పలకరించాయి. వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది సెన్సెక్స్. ఒక దశలో 53,519 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 226 పాయింట్లు నష్టపోయి 54,088 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 72 పాయింట్లు నష్టపోయి16,167 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. -
మార్కెట్లో అస్థిరత.. మళ్లీ నష్టాల్లో సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో అనిశ్చిత్తి నెలకొంది. దేశీ సూచీలు ఉదయం లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్‌ను ఉత్తేజ పరిచే పరిణామాలేవీ అంతర్జాతీయ, దేశీయంగా చోటు చేసుకోకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,544 పాయింట్లలో లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత 54,598 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడుతుందనే నమ్మకం కుదిరింది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:20 గంటల సమయంలో 293 పాయింట్లు నష్టపోయి 54,071 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నష్టాలు ఇలాగే కొనసాగితే సెన్సెక్స్ 53 వేల దిగువకు పడిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇదే తరహాలో నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,178 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
మార్కెట్లో అస్థిరత.. ఒత్తిడిలో ఇన్వెస్టర్లు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మంగళవారం మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా నష్టంతో 54,309 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత మరింతగా నష్టపోతూ 54,269 పాయింట్లకు చేరుకుంది. ఇక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 112 పాయింట్ల లాభంతో 54,582 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభంలో నష్టాలు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. 29 పాయింట్ల లాభంతో 16,331 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉండగా ఇండియా వీఐఎక్స్, ఏషియన్ పేయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజూకి ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలు పొందాయి. -
నష్టాలతోనే ముగింపు.. అయితే చివర్లో ఊరట
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా నష్టాలతోనే మొదలైంది. ద్రవ్యోల్బణ కట్టడికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చల్లారని ఉక్రెయిన్ యుద్ధ వేడి, చైనాలో కంట్రోలోకి రాని కరోనాతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత వారంలో మొదలైన నష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,188 పాయింట్లతో భారీ నష్టాలతో మొదలైంది. ఒక దశలో 54 వేల మార్క్‌ను కోల్పోయి 53.918 పాయింట్లకు పడిపోయింది. షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతు పెరిగింది. దీంతో చివరకు మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల తీవ్రత తగ్గింది. 364 పాయింట్లు నష్టపోయి 54,470 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభంతో పోల్చితే మెరుగైన స్థితిలోనే సెన్సెక్స్ ముగించింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 109 పాయింట్లు నష్టపోయి 16,301 వద్ద క్లోజయ్యింది. చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతులో సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16 వేల మార్క్‌ను నిలబెట్టుకోగలిగాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, మారుతి, బజాజ్ ఫిన్ సర్వీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్టల్ ఇండియా, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఎల్ఐసీ ఐపీవోలో 2.88 నిష్పత్తిలో సబ్‌స్క్రైబ్ అయ్యింది. -
బేర్ పంజా.. ఆరంభంలోనే భారీ నష్టాలు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం దేశీ ఇన్వెస్టర్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. షాంగైలో లాక్డౌన్ కొనసాగుతుండం, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేయడం, వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు పెంచడం తదితర కారణాలు ఇందుకు కారణం. దీంతో ఈ రోజు ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే భారీ నష్టాలను చవి చూసింది. గత వారమే దాదాపు 4 శాతం వరకు మార్కెట్లు క్షీణించాయి. ఈ రోజు ఉయదం బీఎస్ఈ సెన్సెక్స్ 54,188 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలెట్టింది. ఆరంభంలోనే ఆరు వందలకు పైగా పాయింట్లను నష్టపోయింది. ఉదయం 9:51 గంటల సమయంలో 658 పాయింట్లు నష్టపోయి 54,177 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయి 16,161 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నష్టాలు ఇదే తీరున కొనసాగితే సెక్సెక్స్ 54 వేల మార్క్‌ని, నిఫ్టీ 16 వేల మార్క్ దిగువకు పడిపోయే అవకాశం ఉంది. -
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్ దేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. దాని ప్రభావం ఈ రోజు ఏషియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు ముడి చమురు ఉత్పత్తి పెంపుపై ఒపెక్ దేశాల మొండిపట్టుదల కూడా తోడైంది. ఫలితంగా ముడి చమురు బ్యారెల్ ధర 110 డాలర్లకు ఎగిసింది. మరోవైపు ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు నిఫ్టీలు నష్టాలతో మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 800 పాయింట్ల నష్టంతో 54,928 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్‌ను ఉత్తేజ పరిచే ఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 760 పాయింట్లు నష్టపోయి 54,941 దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 16,428 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్లూచిప్, మిడ్, స్మాల్ క్యాప్ అన్ని కేటగిరిల్లో నష్టాలు నమోదు అయ్యాయి. చదవండి: బ్యాంకుల వడ్డింపు షురూ.. -
Stock Market: బొటాబొటి లాభాలతో ముగింపు
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఈ రోజు స్టాక్ మార్కెట్లో జోష్ కనిపించింది. అయితే ఆ ఉత్సాహాం కొద్ది సేపే ఉంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఈ రోజు మార్కెట్ ఆరంభంలో షేర్ల ధరలు తక్కువగా ఉండటంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ ఐదు వందలు, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా నష్టాలతో మొదలయ్యాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొలంది. దీంతో ఆరంభంలో కనిపించిన భారీ లాభం కరిగిపోయింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,255 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 56,566 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 55,702 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ కేవలం ఐదు పాయింట్లే లాభపడి 16,682 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్ల ధరలు కుంగిపోవడంతో భారీ లాభాలకు గండిపడింది. -
భారత్ స్టాక్ మార్కెట్లో తగ్గతున్న విదేశీ పెట్టుబడులు, కానీ
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2021 డిసెంబర్ చివరికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో.. విదేశీ ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) వాటాలు 9 ఏళ్ల కనిష్టానికి తగ్గాయి. కానీ, అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఇనుమడిస్తోంది. 14 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 0.81 శాతం తగ్గి 19.7 శాతానికి పరిమితమైంది. ఇలా ఎఫ్ఐఐల వాటాలు క్షీణించడం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ నమోదైంది. నిఫ్టీ 500 కంపెనీల్లో అయితే డిసెంబర్ క్వార్టర్లో ఎఫ్ఐఐల వాటాలు 0.65 శాతం తగ్గి 20.9 శాతంగా ఉంది. ఈ వివరాలను ఎన్ఎస్ఈ నివేదిక వెల్లడించింది. 2021 మొత్తం మీద ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2.04 శాతం, ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో 1.65 శాతం మేర తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వాటాలు తగ్గిపోవడం వెనుక గత ఏడాదిగా విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుండడం ప్రధాన కారణంగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా ఆంక్షలు ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా, మరీ ముఖ్యంగా గత ఆరు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్లలో మారిన పరిస్థితి.. ఎఫ్ఐఐ పెట్టుబడులు ఎక్కువగా ఉండే కంపెనీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల్లో 0.21 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. నిఫ్టీ 500 కంపెనీల్లో 0.29 శాతం పెరిగి 9 శాతానికి.. ఎన్ఎస్ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల్లో 0.36 శాతం పుంజుకుని 9.7 శాతానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు చేరాయి. గడిచిన రెండేళ్లలో ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం ఎన్నో రెట్లు పెరిగింది. కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు, క్యాష్ మార్కెట్లో వారి లావాదేవీలు అధికమయ్యాయి. 2019 డిసెంబర్ త్రైమాసికం నుంచి చూస్తే 2021 డిసెంబర్ నాటికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిటైలర్ల వాటా నికరంగా 1.3 శాతం పెరిగింది. ఫండ్స్‌కు సిప్ కళ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా రిటైలర్ల ప్రాతినిధ్యం పెరిగేందుకు దోహదం చేస్తోంది. సిప్ పెట్టుబడులు ప్రతీ నెలా కొత్త గరిష్టాలకు చేరుతుండడాన్ని గమనించొచ్చు. ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్పండ్స్ వాటా వరుసగా రెండో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)లోనూ 0.11 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. 2020 మార్చి త్రైమాసికం నాటికి ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు గరిష్టంగా 7.9 శాతం వాటా ఉంది. దీనికంటే ప్రస్తుతం 0.46 శాతం తక్కువగానే వాటి వాటా ఉన్నట్టు అర్థమవుతోంది. పెరుగుతున్న సిప్ పెట్టుబడులతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు లాభపడతున్నాయి. పెద్ద కంపెనీల్లోనే వీటి వాటాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సిప్ పెట్టుబడుల రాక వీటి ప్రాతినిధ్యం అధికమయ్యేందుకు సాయపడుతోంది. ఎన్ఎస్ఈ 500 కాకుండా ఇతర కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలు తగ్గడం గమనార్హం. చిన్న సంస్థల పట్ల ఎఫ్ఐఐల్లో ఆసక్తి ప్రధాన సూచీల్లోని కంపెనీల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో మాత్రం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పెట్టుబడుల పూల్‌లోకి కొత్తగా 260 కంపెనీలను వారు చేర్చుకున్నారు. 5 శాతానికి పైగా ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉన్న కంపెనీల సంఖ్య 600 స్థాయిలోనే కొనసాగుతోంది. అంటే వారి నుంచి తాజా పెట్టుబడులు మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోకి వెళుతున్నట్టు అర్థమవుతోంది. -
రెపోరేట్ల దెబ్బ, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీడడం లేదు. వరుసగా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు బుధవారం ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న మదుపర్లు అలెర్ట్ అయ్యారు. దీంతో గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ రెపో రేట్ల పెంపు నిర్ణయం రియల్ ఎస్టేట్, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గురువారం ఉదయం 9.30 నిమిషాలకు సెన్సెక్స్ 478 పాయింట్లు నష్టపోయి 56117 పాయింట్లు వద్ద నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 16817 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా,ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, ఎస్బీఐ, బజాజ్ఆటో, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కాన్స్,నెస్లే, రిలయన్స్, టైటాన్ కంపెనీలు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కెట్‌కు ఆర్బీఐ షాక్..
ముంబై: ఊహించని విధంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీ ఐపీఓ ప్రారంభం నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ హోల్డింగ్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో బాండ్ మార్కెట్ వణికింది. పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడి రెండేళ్ల గరిష్ట స్థాయి 7.41 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ ద్రవ్యపాలసీ ప్రకటన (బుధవారం రాత్రి)కు ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఈ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక, రియల్టీ షేర్లలో భారీ స్థాయిలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,680 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఎనిమిది వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెండున్నర శాతం, స్మాల్ క్యాప్ సూచీ రెండుశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 76.40 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటకు ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వేచిచూచే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, ఇండోనేషియా, జపాన్ మార్కెట్లకు సెలవు. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు ఆర్బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీరేట్ల ఆధారిత కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పుకూలాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం నుంచి అరశాతం వరకు క్షీణించాయి.అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నాలుగున్నర శాతం నుంచి రెండు శాతం పతనమయ్యాయి. రూ.6.27 లక్షల కోట్లు సంపద ఆవిరి ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో సోమవారం ఒక్కరోజే రూ.6.27 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ ఏథర్ ఇండస్ట్రీస్ సహా మొత్తం ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, సనాతన్ టెక్స్టైల్స్, క్యాపిలరీ టెక్నలజీస్ ఇండియా, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు రూ. 9,865 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. ఏప్రిల్ 27–30 మధ్యలో సెబీ అనుమతులు మంజూరు చేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఫ్యాబ్ఇండియా .. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల వరకూ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.5 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఈ ఇష్యూ సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు ఏథర్ ఇండస్ట్రీస్ ఆఫర్ ప్రకారం రూ. 757 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ మార్గంలో 27.51 లక్షల షేర్లను విక్రయించనుంది. మొత్తం మీద రూ. 1,000 కోట్ల వరకూ సమీకరించవచ్చని తెలుస్తోంది. మిగతా సంస్థలు.. ►ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రూ. 765 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, హాథ్‌వే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ. 465 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనుంది. ►ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీస్ దాదాపు రూ. 1,000–1,200 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. రూ. 926 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ వీణా కుమారి టాండన్ 33.69 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. ► యార్న్ తయారీ సంస్థ సనాతన్ టెక్స్టైల్స్ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,200–1,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల మేర కొత్త షేర్లు, ఓఎఫ్ఎస్ కింద 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూష న్స్ అందించే క్యాపిలరీ టెక్నాలజీస్ .. ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమకూర్చుకోనుంది. పబ్లిక్ ఇష్యూ కింద తాజాగా రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లు, అలాగే ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 650 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ►హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ రూ. 750 కోట్లు సమీకరిస్తోంది. రూ. 455 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 300 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. -
బేర్ పంజా దెబ్బకు మార్కెట్లు విలవిల..నేడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు!
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్ రెండోరోజూ నష్టాలను చవిచూసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇంట్రాడేలో 642 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 85 పాయింట్ల నష్టంతో 56,976 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్ ముగిసే సరికి 33 పాయింట్ల పతనంతో 17,069 వద్ద నిలిచింది. ఐటీ, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్స్, వినిమయ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అరశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,872 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,981 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాల్ని కోల్పోయి ఒక పైసా స్వల్ప నష్టంతో 76.51 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియాలో చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, తైవాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్లలో సెలవు కావడంతో ఆయా దేశాల ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. అయితే జపాన్, దక్షిణ కొరియాల స్టాక్ సూచీలు అరశాతం నష్టపోయాయి. యూరప్‌లో లండన్ మార్కెట్‌కు సెలవు కాగా.., ఫ్రాన్స్, జర్మనీ దేశాల ఇండెక్సులు రెండు శాతం క్షీణించాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు(నేడు) అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. రంజాన్ సందర్భంగా మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ‘‘ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ కఠిన విధాన వైఖరికి మొగ్గుచూపొచ్చనే ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు తొలి దశలో అమ్మకాలకు పాల్పడ్డారు. డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, కమోడిటీ ధరల్లో అస్థిరతలు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని తగ్గించాయి. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందనేందుకు సంకేతంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడటంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెచ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆరంభ నష్టాలు రికవరీ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలతో ఉదయం దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 632 పాయింట్ల నష్టంతో 56,429 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 16,924 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో సెన్సెక్స్ 648 పాయింట్ల క్షీణించి 56,413 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 185 పాయింట్లు దిగివచ్చి 16,917 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిలను నమోదు చేసింది. అయితే ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు జీవితకాల గరిష్ట స్థాయిలో నమోదవడంతో పాటు ఇదే నెలలో ఆటో అమ్మకాలు, దేశీయ తయారీ రంగం పటిష్ట వృద్ధి రేటును కనబరచడం తదితర సానుకూలాంశాల అండతో సూచీలు ఆరంభ నష్టాలను రికవరీ చేసుకోగలిగాయి. ముఖ్యంగా మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలియి. -
చివర్లో తేరుకున్న మార్కెట్.. అయినా తప్పని నష్టాలు
ముంబై: ఈ రోజు భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ చివర్లో కోలుకుంది. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా మొదలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి కనబరచడంతో ఉదయం ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్ మరో గంటలో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా మార్కెట్ పుంజుకుంది. ఫలితంగా భారీ నష్టాల నుంచి తప్పించుకున్న రెండు సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదారు ఆరు వందల పాయింట్ల నష్టంతో 56,429 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత మరింత నష్టాలను చవి చూస్తూ ఓ దశంలో 56,412 పాయింట్లకు పడిపోయింది. అయితే మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఒక్కసారిగా పుంజుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 85 పాయింట్ల నష్టంతో 56,975 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,069 పాయింట్ల దగ్గర ముగిసింది. కోల్పోయిన 17 వేల పాయింట్లను నిఫ్టీ తిరిగి సాధించగా సెన్సెక్స్ 57 వేల పాయింట్లు క్రాస్ చేసేందుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. చదవండి: వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే! -
ఇన్వెస్టర్ల అప్రమత్తత, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
జాతీయ, అంతర్జాతీయంగా ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 439 పాయింట్లు నష్టపోయి 56621 వద్ద నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 16959 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, ఏసియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎథేర్ మోటార్స్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్‌ను శాసించే అంశాలివే!
ముంబై: అమెరికా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో తీసుకునే నిర్ణయాలతో పాటు దేశీయ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీకి లభించే స్పందనకు అనుగుణంగా ఈ వారం స్టాక్ సూచీలు కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కోవిడ్ కేసుల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాలపై ఇన్వెస్టర్లు కన్నేయొచ్చని తెలిపారు. రంజాన్ సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం లో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. ‘‘జాతీయ, అంతర్జాతీయంగా ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. కావున ఈ వారంలో కన్సాలిడేషన్ లేదా స్వల్పకాలిక కరెక్షన్కు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ రెండు వారాలుగా 16,900 – 17,350 స్థాయిల పరిధిలో ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 16,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 16,800 వద్ద మద్దతు లభించొచ్చు’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలు మిశ్రమ నమోదుతో గతవారమూ స్టాక్ సూచీలు అరశాతం నష్టపోయాయి. ఇంధన, హెల్త్‌కేర్, ఇన్ఫ్రా, టెక్నాలజీ, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్136 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు చొప్పున క్షీణించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.., ►కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా 200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలకు అనుగుణంగా ఎంపిక చేసిన షేర్లు కదలాడవచ్చు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 గణాంకాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరుస్తోంది. ► ఎల్ఐసీ ఐపీవో దేశీయ అతిపెద్ద ఐపీవో ఎల్ఐసీఐ బుధవారం(మార్చి 4న) ప్రారంభమై వచ్చే సోమవారం(మార్చి 9న) ముగిస్తుంది. ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇందుకు ప్రతి షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించింది. అతిపెద్ద ఇష్యూ ప్రారంభం నేపథ్యంలో సెకండరీ మార్కెట్ నుంచి నిధులు ఐపీఓకు తరిలే అవకాశం ఉంది. కావున దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ► ఫెడ్ మీటింగ్‌పై ఫోకస్ అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది. దాదాపు 40 ఏళ్ల గరిష్టాన్ని చేరిన ద్రవ్యోల్బణ కట్టడికి 50 బేసిస్ వడ్డీరేట్ల పెంపు ఖాయమనే అంశాన్ని ఇప్పటికే మార్కెట్ వర్గాలు డిస్కౌంట్ చేసుకున్నాయి. సమీక్షా సమావేశంలో ఫెడ్ తీసుకునే ద్రవ్య పరమైన విధానాలతో పాటు పాలసీ ప్రకటన సందర్భంగా చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ► స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ నేడు ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు, ఆటో అమ్మక గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. వాహనాలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్ముడయ్యాయి. తయారీ రంగ పీఎంఐ నేడు, సేవారంగ గణాంకాలు (గురువారం) ఐదో తేదీన విడుదల అవుతాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ ఏప్రిల్ 29 వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వలను, ఏప్రిల్ 22వారంతో ముగిసిన బ్యాంక్ డిపాజిట్, రుణాల డేటాను విడుదల చేయనుంది. దేశ ఆర్థికస్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు. -
వీడిన బేర్ పంజా.. దుమ్మురేపుతున్న బుల్..
చైనాలో కరోనా భయాలు వెంటాడుతున్నా ద్రవ్యోల్బణం ఛాయలు వీడకున్నా స్టాక్ మార్కెట్ ఈ రోజు బేర్ పంజా నుంచి తప్పించుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్లు అందించిన ఉత్సాహం, మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నెలకొన్న సానుకూల వాతావరణంతో గురువారం మార్కెట్లో బుల్ దుమ్మురేపింది. గత వారం కొనసాగిన అనిశ్చిత్తి కారణంగా నష్టపోయిన సూచీలు మళ్లీ బలపడ్డాయి. ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 57,296 పాయింట్ల దగ్గర లాభాలతో మొదలైంది. ఆ తర్వాత ఇదే జోరు కనబరుస్తూ ఓ దశలో 57,790 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 701 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధి కనబరుస్తూ 57,521 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 17,245 పాయింట్ల దగ్గర ముగిసింది. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,యూపీఎల్,అపోల్ ఆస్పిటల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎథేర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్,ఎసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా,భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
స్వరం పెంచిన రష్యా.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టాలను చవి చూశారు. మార్కెట్ పెద్దన్న రిలయన్స్ షేర్ల ధర ఆల్‌టైం హైకి చేరుకున్నా.. మిగిలిన అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా మరింత దూకుడు పెంచింది. పోలాండ్, బల్గేరియా దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదుపుకు గురయ్యాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎలా అదుపు చేయాలో తెలియక సతమతం అవుతుంటే యుద్ధం మరింతగా ముదురుతుండటం ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీ, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో అయితే కేవలం 3 కంపెనీలు మినహా మిగతా అన్ని నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ఉయదం బీఎస్ఈ సెన్సెక్స్ 56,983 పాయింట్ల దగ్గర నష్టాలతో మొదలైంది. అబుదాబీ కంపెనీతో కుదిరిన డీల్ కారణంగా రిలయన్స్ షేర్లు ఆల్‌టైం హైంని తాకాయి. మరోవైపు అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాలు మొదలయ్యాయి. ఒక దశలో 56,583 పాయింట్ల కనిష్టాలకు చేరుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 556 పాయింట్ల నష్టంతో 56,800ల పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 17,032 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. -
కరోనా ఎఫెక్ట్, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా చైనా ఆర్ధిక మాంధ్యంలో కొట్టుమిట్టాడుతుంది. బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది తొలి వార్షిక ఫలితాల్లో చైనా ఆర్ధిక వ్యవస్థలో కీలక ఉన్న మూడవ వంతు ప్రాంతాల్లో కరోనా కోరలు చాచింది. దీంతో చైనా వృద్ధిరేటు ఊహించిన స్థాయిలో లేకపోవడం,ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి పరిణామాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపించాయి. ఫలితంగా బుధవారం ఉదయం 10గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు నష్టపోయి 57001 వద్ద నిఫ్టీ 125పాయింట్లు నష్టపోయి 17075 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. రిలయన్స్, హీరో మోటో కార్పొరేషన్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో,విప్రో, అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. -
బుల్ పరుగులు..చెలరేగిన సెన్సెక్స్, రూ.4.11 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ భారీ లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన, ఆటో, వినిమయ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. వేడిక్కిన చమురు ధరలు చల్లబడటం కలిసొచ్చింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగి 57,357 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 17,201 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. కాగా, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ నాలుగు పైసలు స్వల్పంగా బలపడి 76.60 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,174 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,644 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్ మార్చి క్వార్టర్ గణాంకాలు మెప్పించడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాభాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 862 పాయింట్లు ఎగసి 57,442 వద్ద, నిఫ్టీ 270 పాయింట్లు బలపడి 17,224 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలకు అందుకున్నాయి. కాగా, మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు మిశ్రమ స్పందన కనిపించింది. రిలయన్స్ దూకుడు అబుదాబీ కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్సీ (త’జీజ్)తో రెండు బిలియన్ డాలర్లు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుందనే వార్తలు రిలయన్స్ షేర్ల దూకుడు కారణమైంది. బీఎస్ఈలో ఉదయం ఈ షేరు అరశాతం లాభంతో రూ.2,710 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,796 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి మూడు శాతం లాభంతో రూ.2,776 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 56 లక్షల చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.18.77 లక్షల కోట్లుగా నమోదైంది. సూచీల లాభాల్లో సింహభాగం రిలయన్స్‌దే. కాగా, రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుకావడంతో ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థల షేర్లు రెండోరోజూ నష్టపోయాయి. సూచీల ఒకటిన్నర శాతం బౌన్స్‌బ్యాక్‌తో స్టాక్ మార్కెట్లో రూ.4.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లకు చేరింది. -
రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం!
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రెండున్నర శాతం క్షీణించింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం సెన్సెక్స్ 617 పాయింట్లు క్షీణించి 57 వేల స్థాయిని కోల్పోయి 56,580 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి ఐదు వారాల తర్వాత తొలిసారి 17 వేల దిగువన 16,954 వద్ద నిలిచింది. ఇటీవల కరెక్షన్‌లోనూ రాణించిన మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. విస్తృత మార్కెట్లోనూ చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 22 పైసలు బలహీనపడి 76.64 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,303 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,870 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు చైనా రాజధాని బీజింగ్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి పలు ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధించారు. దీంతో ఆసియాలో చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్ దక్షిణ కొరియా, ఇండోనేసియాలతో సహా ప్రధాన మార్కెట్లన్నీ ఐదు శాతం మేర నష్టపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండునెలలైనా ఆగలేదు. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో కఠినతర ద్రవ్య విధానాలను అవలంబించాలని ఈసీబీ నిర్ణయించుకుంది. ఫలితంగా యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. ఫెడ్ రిజర్వ్ ఈ మేనెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో పాటు అవసరమైతే జూన్, జూలైలో కూడా రేట్లను పెంచొచ్చనే సంకేతాలతో అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండు శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్లతో డిమాండ్ తగ్గొచ్చనే అంచనాలతో ఇంట్రాడేలో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనాన్ని చూవిచూశాయి. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరల భగభగలు, సప్లై అవాంతరాలు తదితర ప్రతికూలతలకు తాజాగా నిరాశపూరిత కార్పొరేట్ మార్చి ఆర్థిక గణాంకాలు తోడయ్యాయి. ఇండోనేసియా విదేశాలకు పామాయిల్ ఎగుమతులను నిషేధించింది. ఈ పరిణామాలూ జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో బలహీనతలను నింపాయి ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 440 పాయింట్ల నష్టంతో 56,758 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు క్షీణించి 17,009 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోనూ కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మిడ్‌సెషన్ సమయంలో సెన్సెక్స్ 840 పాయింట్లు క్షీణించి 56,356 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 16,889 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే క్రూడాయిల్ పతనం నుంచి కొంత సానుకూలతలు అందుకున్న సూచీలు ట్రేడింగ్ చివర్లో స్వల్పంగా నష్టాలను తగ్గించుకున్నాయి. రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్ 1,332 పాయింట్ల పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6.47 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.265 లక్షల కోట్లుగా దిగివచి్చంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుతో ఆర్ఐఎల్తో పాటు ఫ్యూచర్స్ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్, ఫ్యూచర్ లైఫ్ స్టైయిల్ ఫ్యాషన్ షేర్లు 20 శాతం క్షీణించాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పదిశాతం, ఫ్యూచర్ రిటైల్ షేరు ఐదు శాతం పతనమైంది. ఫ్యూచర్ గ్రూప్‌లోని షేర్లన్నీ లోయర్ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్ అయ్యాయి. రిలయన్స్ షేరు బీఎస్ఈలో రెండున్నర శాతం క్షీణించి రూ.2,695 వద్ద స్థిరపడింది. ► నష్టాల మార్కెట్లోనూ ఐసీఐసీఐ బ్యాంకు షేరు రాణించింది. క్యూ4లో కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ షేరు ఒకశాతం లాభపడి రూ.753 వద్ద స్థిరపడింది. ఒక దశలో రెండు శాతం బలపడి రూ.762 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 8.54 లక్షల షేర్లు చేతులు మారాయి. -
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల!
జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, పెరిగిపోతున్న కరోనా కేసులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాల నుంచి దేశీయ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.38నిమిషాలకు సెన్సెక్స్ 593 పాయింట్లు నష్టపోయి 56610 వద్ద నిఫ్టీ 189 పాయింట్లు నష్టపోయి 16977 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతి సుజికీ, ఎథేర్ మోటర్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..బీపీసీఎల్, బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్‌డ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. -
బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకుపోతుంది. గత రెండు రోజులకు భిన్నంగా ఈరోజు బ్లూచిప్ కంపెనీలకు తోడు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్లు కూడా లాభాలు అందించాయి. హెవీ వెయిట్ రిలయన్స్ షేర్లు ఈ రోజు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వందల పాయింట్లు పైగా లాభమంతో మొదలైంది ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో గంటగంటకు లాభపడుతూ పోయింది. ఉదయం 57,458 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 57,991 పాయింట్లను టచ్ చేసింది. చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 57,911 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 256 పాయింట్ల లాభంతో 17,392 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, మారుతి సుజూకి ఇండియా, బజాజ్ ఫిన్ సర్వీసెస్, రిలయన్స్ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. -
భారీ లాభాలతో మొదలైన సూచీలు..!
వరుస నష్టాలకు బ్రేక్ ఇస్తూ...బుధవారం రోజున లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్ నేడు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలమైన ఒపెనింగ్‌తో గురువారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలతో ఎషియన్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. గురువారం ఉదయం 9.50 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 457.04 పాయింట్లు పెరిగి 57,511వద్దకు చేరుకోగా, ఇదే సమయంలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 17,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100 షేర్లు 0.76 శాతం, స్మాల్ క్యాప్ 1.14 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, మారుతీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, అదానీ పోర్స్ట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చదవండి: కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్..! -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
రెండు రోజులపాటు వరుస నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ట ధరల వద్ద షేర్స్ లభించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఆటోమొబైల్, ఐటీ, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్ లాభాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక చైనాలో కోవిడ్-19 ప్రేరేపిత లాక్‌డౌన్స్‌తో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. బుధవారం బీఎసీఈ సెన్సెక్స్ ఉదయం 9.46 సమయంలో 409 పాయింట్లు పెరిగి 56, 878 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9.48 సమయంలో 120 పాయింట్లు పెరిగి 17,081 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 1.22 శాతం, స్మాల్ క్యాప్ 1.20 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ఉన్నాయి. రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు..!
స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఒక రోజులోనే 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, టోకు ద్రవ్యోల్భణం తారస్థాయికి చేరాయి. దీనికి తోడు ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతుందనే వార్తలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంది. ఫలితంగా మంగళవారం దేశీయ సూచీలు నష్టాలో ట్రేడవుతున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశం ఉందనే వార్తలు ఏషియన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్ఇ సెన్సెక్స్ 225 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 57,390 వద్దకు చేరుకోగా వెంటనే నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 9.55 సమయంలో 80.80 పాయింట్లు నష్టపోయి 57, 092.40 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా ప్రారంభంలో 85 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగింది.ఉదయం 9. 55 సమయంలో 4 పాయింట్ల లాభంతో 17,178.15 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎస్బిఐ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ ,కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చదవండి: భారీ నష్టాలు.. ఒక్క రోజులో 3.39 లక్షల కోట్ల సంపద ఆవిరి! -
మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
మార్కెట్ పతనంలో పెట్టుబడులకు అనుకూలమైన స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – శ్వేత మార్కెట్లలో కరెక్షన్ మొదలైన తర్వాత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలను అన్వేషించకూడదు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఎంతో విస్తృతమైన పరిశోధన, కసరత్తు కావాలి. కంపెనీ ఎప్పటికప్పుడు వ్యాపారంలో వృద్ధి నమోదు చేస్తోందా? అని చూడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి రేషియోలో ఉందా? అని చూడాలి. రుణభారంతో నెట్టుకొస్తూ ఉండకూడదు. అంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఉండకూడదు. కంపెనీని నడిపించే యాజమాన్యం నిధులు పక్కదారి పట్టించకుండా నిజాయతీగా, సమర్థవంతంగా పనిచేసేదై ఉండాలి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ డబ్బులను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా భావించాలి. అందుకే కంపెనీని నడిపించే వ్యక్తులు విశ్వసనీయత కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక కంపెనీలో గుర్తిస్తే ఆకర్షణీయమైన ధర వద్ద షేరులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు గుర్తించింది గొప్ప కంపెనీ అవుతుంది. అయితే, సహేతుక ధర వద్దే కానీ, ఖరీదైన ధరలో కొనుగోలు చేస్తే రాబడులు కష్టం కావచ్చు. ఇలాంటి నాణ్యత అంశాలతో కూడిన కంపెనీలను గుర్తించినప్పుడు వాటిని వాచ్ లిస్ట్ (పరిశీలన జాబితా)లో పెట్టుకోవాలి. వాల్యూరీసెర్చ్ పోర్టల్‌పై వాచ్‌లిస్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మంచి ఫలితాలనిస్తుందని నేను భావిస్తున్నాను. విజయవంతమైన ఇన్వెస్టర్లలో నేను గుర్తించిన అసాధారణ అంశం ఇది. కానీ, ఇందుకు ఎంతో ఓపిక ఉండాలి. మీరు గుర్తించిన కంపెనీలు ఖరీదైన వ్యాల్యూషన్లలోనే ఎక్కవ రోజుల పాటు ట్రేడ్ కావచ్చు. కానీ, మీరు అనుకున్న ధరకు దిగొచ్చే వరకు వేచి చూడాలి. మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – నవీన్ మార్కెట్లలో ఇప్పుడు అస్థిరతలు కనిపిస్తున్నాయి. ముందు కూడా అస్థిరతలు ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఎక్కువగానూ ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టొచ్చు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో రక్షణ కల్పించుకోవాలి. సమీప కాలంలో మార్కెట్లపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు, ఏడేళ్ల వరకు అవసరం కానివి అయి ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ అమల్లో పెట్టిన తర్వాత, క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారు అయి ఉండి, పెట్టుబడులు పెట్టాలనుకునే సమయంలో మార్కెట్లలో అస్థిరతలు ఉంటే వాటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
లాభాలు కొద్ది సేపే.. వరుసగా మూడో రోజు నష్టాలతోనే ముగింపు
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ప్రతికూల ఫలితాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈ రోజుతో ఈ వారం మార్కెట్ ముగిసిపోతుండటంతో ఆరంభంలో కొనుగోళ్ల జోరు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఇన్వెస్టర్లను రిస్క్ నుంచి వెనుకడుగు వేసేలా చేసింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,910 పాయింట్ల దగ్గర ఫుల్ జోష్‌లో ప్రారంభమైంది. ఒక దశలో 59,003 పాయింట్ల గరిష్టాలను తాకింది. ఆ తర్వాత గంటన్న తర్వాత ఒడిదుడుకులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా పాయింట్లూ కోల్పోతూ వచ్చింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 237 పాయింట్లు నష్టపోయి 58,338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభం జోరు కొద్ది సేపే నిలిచి ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి 54 పాయింట్లు నష్టపోయి 17,475 పాయింట్ల దగ్గర ఆగింది. - ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుందనే ప్రకటన రావడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగిశాయి. - గడిచిన 17 నెలల్లో అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం (6.95 శాతం) దేశీయంగా నమోదు అయ్యింది. - అమెరికాలో పదహారు నెలల తర్వాత మంత్లీ కన్సుమర్ ప్రైసెస్ పెరిగాయి - బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టాలకు చేరుకుంది -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో..బుధవారం రోజున భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాలతో మొదలైనాయి.. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలతో ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. బుధవారం రోజున బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడ్‌లో 238 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 58,814 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 17,604 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 0.82 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ షేర్లు 1.07 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బలమైన లాభాలతో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, ఎం అండ్ ఎం, ఐటిసి లాభాల్లో ట్రేడ్ అవుతునాయి. మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్..!
గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన వాతావరణం ఉండడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా కంటే ట్రెజరీ ఈల్డ్స్ మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆసియా షేర్లు భారీగా పతనమైనాయి. వివిధ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసే నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఉదయం 9. 40 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ బిఎస్ఇ సెన్సెక్స్ 0.71 శాతం లేదా 429. 53 పాయింట్లు తగ్గి 58,527 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా 145 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 17,528 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 0.71 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ షేర్లు 0.40 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్, టోరంట్ పవర్, అదానీ పవర్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, విప్రో, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎస్బిఐ నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..! -
నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!
భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్స్ బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సోమవారం రోజున నష్టాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌తో సూచీలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేశారు. బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు లేదా 0.81 శాతం పతనమై 58,965 వద్ద ముగిసింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 109 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 17,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.62 శాతం పెరగగా...స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించడంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు మిశ్రమ ఫలితాలను పొందాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా,సన్ ఫార్మా లాభాలను గడించాయి. ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ భారీ నష్టాల్లో మూటగట్టుకున్నాయి. గత వారం హెచ్డీఎఫ్సీ మెగా-విలీనాన్ని ప్రకటించన తదుపరి రోజు నుంచిహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వరుసగా ఐదు సెషన్లలో భారీ నష్టాలను పొందాయి. విలీన ప్రకటన తరువాత వచ్చిన లాభాలు మొత్తం నీరుగారిపోయాయి. నిఫ్టీలో హెచ్‌సిఎల్ టెక్ టాప్ లూజర్‌గా నిలిచింది. చదవండి: షాకింగ్ నిర్ణయం..! యూపీఐ పేమెంట్స్‌తో వాటిని కొనలేరు...! -
ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం..నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే మూడురోజుల ట్రేడింగ్‌లో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారమే..సోమవారం ఉదయం 9.40 నిమిషాలకు సెన్సెక్స్ 430 పాయింట్ల నష్టపోయి 59010 పాయింట్ల వద్ద నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17667 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక జేఎస్‌డ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ,ఎస్బీఐ,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్,ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరోమోటోకార్ప్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
అలెర్ట్ :ఈ వారంలో స్టాక్ మార్కెట్‌కు వరుస సెలవులు! ఎందుకంటే?
ముంబై: మూడురోజులే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. మహవీర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం, గుడ్ ఫ్రైడ్ సందర్భంగా శుక్రవారం ఎక్స్ఛేంజీలకు సెలవు. కావున ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానుంది. వెరండా లెర్నింగ్స్ సెల్యూషన్స్ షేర్లు నేడు., హరిఓం పైప్ ఇండస్ట్రీస్ షేర్లు ఎల్లుండి ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో గత వారంలో సెన్సెక్స్ గత వారం మొత్తంగా సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లను ఆర్జించాయి. ‘‘సంకేతాలు కన్సాలిడేషన్‌కు అనుకూలంగా ఉన్నాయి. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభ నేపథ్యంలో పలు షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఈ వారంలోనూ కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 18,100 పాయింట్ల వద్ద కీలక నిరోధాన్ని చేధించాలి. ఒకవేళ అమ్మకాలు జరిగితే 17,600 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కార్పొరేట్ల ఫలితాల సందడి షురూ దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నేడు నాలుగో త్రైమాసికం(క్యూ4)తో పాటు పూర్తి ఏడాది (2020 – 21) గణాంకాలను ప్రకటించి స్టాక్ మార్కెట్లో ఆర్థిక ఫలితాల సందడిని షురూ చేయనుంది. ఇన్ఫోసిస్ బుధవారం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు శనివారం తమ క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించున్నాయి. వీటితో పాటు అలోక్ ఇండస్ట్రీస్, బిర్లా టైర్స్, డెల్టా కార్ప్, అనంద్ రాఠీ వెల్త్, హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్, ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ సర్వీసెస్ గణాంకాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్వార్టర్ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి. అదేరోజున ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ డేటా వెలువడునుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గతవారంలో ఆర్బీఐ పాలసీ కమిటీ 2022–23 సంవత్సరానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతానికి పెంచింది. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడం కొంత ఆందోళనకరమైన అంశమని నిపుణులంటున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ ఆర్థిక అంశాలు మార్కెట్ గమనానికి కీలకమని వారంటున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సంక్షోభం ఉక్రెయిన్ రష్యా యుద్ధం 46వ రోజుకు చేరుకుంది. నెలన్నరైనా పోరు ఆగకపోవడం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కలవరపాటుకు గురిచేస్తోంది. రష్యా దళాలు రాజధాని కీవ్ నుంచి వెనుదిరిగినా.., తూర్పు ప్రాంతంలో దాడిని తీవ్రతరం చేసింది. యుద్దం ఆగేందుకు దౌత్య మార్గాలను వెతకడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఆరు సెషన్లలో రూ.7,707 కోట్ల విదేశీ నిధులు ఆరు నెలల వరుస విక్రయాలు తర్వాత ఈ ఏప్రిల్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల తొలి ఆరు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.7,707 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఇటీవల కరెక్షన్లో భాగంగా దిగివచ్చిన షేర్లను ఎఫ్ఐఐలు కొంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిరతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం మారుతూ ఉంటుందన్నారు. -
ముచ్చటగా మూడోరోజు...నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాలు కఠినంగా ఉంటాయనే వార్తలు ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక పాలసీ ఫలితాలను శుక్రవారం రోజున ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు తోడవడంతో దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 575 పాయింట్లు లేదా 0.97 శాతం క్షీణించి 59,035 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 168 పాయింట్లు లేదా 0.94 శాతం క్షీణించి 17,640 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.02 శాతం, స్మాల్ క్యాప్ 0.31 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), టిసిఎస్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టి, అదానీ పోర్ట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెచ్డీఎఫ్సీ షేర్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. చదవండి: తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు.. రూ.1000 కోట్ల పెట్టుబడులు -
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు..నష్టాల్లో దేశీయ మార్కెట్లు!
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ అధికారుల కఠినతర ద్రవ్య విధాన వైఖరి, రష్యాపై ఆంక్షలు,ఆర్బీఐ పాలసీ కమిటీ సమావేశాలు,భారత్ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1.4 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు ముడిచమురు ధరల అనిశ్చితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు వెంటాడటం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రతికూల పరిణామాలతో గురువారం ఉదయం 9.26 నిమిషాలకు సెన్సెక్స్ 363పాయింట్లు నష్టపోయి 59250 వద్ద సెన్సెక్స్ 94పాయింట్లు నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. కిప్లా, సన్‌ఫార్మా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా కాన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్, టీసీఎస్, నెస్లే, రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
లాక్డౌన్ వార్తలు...రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!
భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు బుధవారం(ఏప్రిల్ 6)న వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వార్తలతో ఇన్వెస్టర్లు ఆచితూచి మార్కెట్లలో అడుగులువేశారు. దాంతో పాటుగా చైనా ఆర్థిక కేంద్రం షాంఘైలో లాక్ డౌన్ విధింపు వార్తలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 566 పాయింట్లు లేదా 0.94 శాతం క్షీణించి 59,610 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 17,808 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం, స్మాల్ క్యాప్ 0.12 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. విలీన వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లు సోమవారం రోజున భారీ లాభాలను పొందాయి. కాగా గత రెండు సెషన్లలో ఈ స్టాక్స్ భారీగా క్షీణించాయి. హెచ్డీఎఫ్సి లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం నష్టాలో ముగిశాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, ఎల్అండ్ టీ, ఎస్బీఐ లాభాలను గడించాయి. చదవండి: దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు, ఓఎన్జీసీ..రిలయన్స్‌కు లాభాలే లాభాలు! -
స్టాక్ మార్కెట్‌కి నష్టాల కుదుపు.. భారీగా నష్టపోతున్న సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం దేశీ స్టాక్ మార్కెట్‌పై పడింది. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యవిధానం కట్టుదిట్టం చేయడంతో ఇన్వెస్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 60,176 పాయింట్ల దగ్గర మార్కెట్ ముగియగా.. ఈ రోజు ఉదయం నష్టాల మధ్య 59,815 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత నష్టాలు కొనసాగుతూ ఉదయం 10 గంటల సమయానికి 403 పాయింట్లు నష్టపోయి 59,773 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 17,876 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చూడగా కోల్ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు పొందాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో 0.17 శాతం క్షీణించాయి. -
లాభాల్లో రేసుగుర్రాల్లా..ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోన్న చిన్న షేర్లు..!
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో చిన్న షేర్లు(స్మాల్ క్యాప్స్) భారీ లాభాలతో దూకుడు ప్రదర్శించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 37 శాతం వృద్ధి చూపింది. తద్వారా ప్రధాన ఇండెక్సులను సైతం అధిగమించి టాప్‌లో నిలిచింది. ఈ ర్యాలీలో భాగంగా 2022 జనవరి 18న 31,304 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పలు విధాల లాభాల తీపిని రుచి చూపాయి. ప్రధానంగా చిన్న షేర్లు భారీగా ఎగశాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 18.3 శాతం(9,059 పాయింట్లు) లాభపడితే.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 36.6 శాతం(7,566 పాయింట్లు) జంప్‌చేసింది. ఇదే కాలంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 19.5 శాతమే(3,927 పాయింట్లు) బలపడింది. వెరసి గతేడాది స్మాల్ క్యాప్స్ హవా నడిచింది. కాగా.. ఈ స్పీడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ కొనసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం! చివర్లో ఆటుపోట్లు భౌగోళిక ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో గతేడాది చివర్లో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలి అర్ధభాగంలో జోరు చూపిన మార్కెట్లు ద్వితీయార్థంలో కన్సాలిడేషన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల కారణంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూసినట్లు తెలియజేశారు. అయినప్పటికీ మార్కెట్లు పలు అందోళనల మధ్య కూడా నిలదొక్కుకుంటూ వస్తున్నట్లు తెలియజేశారు. ఇది నిర్మాణాత్మక బుల్ మార్కెట్‌కు నిదర్శనమని, మధ్యమధ్యలో దిద్దుబాట్లు దీనిలో భాగమని వివరించారు. క్లాసికల్ బుల్ క్లాసికల్ బుల్ మార్కెట్లో మధ్య, చిన్నతరహా షేర్లు ర్యాలీ చేయడం సహజమని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్థ్ న్యాటి పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం మిడ్, స్మాల్ క్యాప్స్ జోరు చూపవచ్చని అంచనా వేశారు. స్వల్పకాలపు సవాళ్ల మధ్య దేశీ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లపాటు వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చరిత్ర ప్రకారం ఈక్విటీ మార్కెట్లకు ఏప్రిల్ ఉత్తమ నెలగా పేర్కొన్నారు. మిడ్, స్మాల్ క్యాప్స్‌నకు ప్రధానంగా కలసి వస్తుందని తెలియజేశారు. గత 15 ఏళ్లలో 14సార్లు ఇది జరిగిందని, సగటున 7 శాతం లాభాలు అందించాయని వెల్లడించారు. రికార్డుల బాటలో 2021 ఏప్రిల్ 19న 52 వారాల కనిష్టానికి చేరిన బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఈ జనవరికల్లా 31,304 పాయింట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. ఇదే విధంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19న 27,246ను దాటి కొత్త గరిష్టాన్ని అందుకుంది. 2021 ఏప్రిల్ 19న 19,423 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఇక మరోవైపు సెన్సెక్స్ 2021 అక్టోబర్ 19న 62,245 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. అయితే గత ఆరు నెలల్లో మార్కెట్లలో కరెక్షన్ చోటు చేసుకున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ప్రస్తావించారు. ఇది మధ్య, చిన్నతరహా షేర్లలో పెట్టుబడులకు అవకాశమన్నారు. లార్జ్, మిడ్ క్యాప్స్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్స్ అందుబాటులో ట్రేడవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే స్వల్పకాలంలో ఆటు పోట్లు తప్పవని, ద్యవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఆర్జనల డౌన్‌గ్రేడ్స్ వంటి ప్రతికూలతలు ఎదురవుతాయని తెలియజేశారు. కాగా.. కరోనా మహమ్మారి తదుపరి ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని, దీంతో పలు మిడ్, స్మాల్ క్యాప్స్ ఊపందుకోనున్నాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్.రంగనాథన్ అంచనా వేశారు. చదవండి: స్టాక్స్ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..! -
లాభాలకు బ్రేక్..నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!
గత రెండు సెషన్స్‌లో దేశీయ సూచీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. అదే ఊపును దేశీయ సూచీలు మంగళవారం(ఏప్రిల్ 5)న కొనసాగించలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల అంశాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీసింది. దీంతో దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 435.24 పాయింట్లు లేదా 0.72 శాతం క్షీణించి 60,176.50 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 17,957.40 వద్ద ముగిశాయి. కాగా గత రెండు సెషన్లలో దేశీయ సూచీలు దాదాపు 3.5 శాతం చొప్పున పెరిగాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థల విలీన ప్రకటనతో సోమవారం సూచీలు భారీ లాభాలను గడించాయి. ఈ ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థల షేర్లు భారీగా పెరిగాయి. కాగా మంగళవారం ఇరు సంస్థల స్టాక్స్ భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. చదవండి: స్టాక్స్ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..! -
స్టాక్ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..!
సాక్షి, అమరావతి: మదుపు కోసం స్టాక్ మార్కెట్ల తలుపుతట్టడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా స్టాక్ మార్కెట్లో ఖాతాలు ఉన్నట్లు స్టాట్స్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 8.8 శాతం మంది బొంబే స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ)లో మదుపుదారుగా నమోదయి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అంటే ప్రతీ 100 మందిలో 8.8 శాతం మంది బీఎస్ఈ ద్వారా స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో 8.2 శాతం, కర్నాటకలో 8.7 శాతం, తమిళనాడులో 7.0 శాతం, పుదిచ్చేరిలో 6 శాతం ఉండగా కేరళలో 7 శాతంగా ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రా నుంచే అత్యధికంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద చూస్తే 7.4 శాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాత్రం 8.8 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఢిల్లీ 23.6 శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 47 లక్షల మంది ఇన్వెస్టర్లు దేశవ్యాప్తంగా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంఖ్య ఈ మార్చి నాటికి 10 కోట్ల మార్కును అధిగమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 47 లక్షల మంది స్టాక్ మార్కెట్లో ఖాతాలను కలిగి ఉన్నట్లు స్టాట్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశం మొత్తం మీద 10 కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నా అందులో 50 శాతం మంది అయిదు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.07 కోట్ల ఖాతాలు ఉండగా, ఆ తర్వాత గుజరాత్ 1.09 కోట్లు, ఉత్తరప్రదేశ్ 86 లక్షలు, కర్నాటక 58 లక్షలు, రాజస్థాన్ 56 లక్షలుగా ఉన్నాయి. ఖాతాల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంటే, 31 లక్షల ఖాతాలతో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. కొత్త ఖాతాల్లో నెమ్మది... ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్టాక్ మార్కెట్లో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న తరుణంలో గత 12 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లో ఖాతాల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా రెట్టింపు నమోదవ్వగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొత్త ఖాతాల పెరుగుదల్లో ఆంధ్రప్రదేశ్ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల ఖాతాల సంఖ్యలో గత 12న నెలల్లోనే 3.6 కోట్ల ఖాతాలు కొత్తగా వచ్చిచేరాయి. ఈ పెరుగుదల అస్సాంలో 283 శాతంగా ఉంటే బీహార్ 116 శాతం, మధ్యప్రదేశ్109 శాతం, ఒరిస్సా 106 శాతం, తెలంగాణ 79 శాతంగా ఉంది. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాల పెరుగుదల 40 శాతానికే పరిమితమయ్యింది. చదవండి: స్టాక్ మార్కెట్లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు -
స్టాక్ మార్కెట్లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ఆరంభమైన తర్వాత జపాన్ నిక్కీ, సౌత్‌కొరియా కొప్సీ సూచీలు నష్టపోయాయి. ఇదే సమయంలో షాంగై స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. బుల్‌ర్యాలీ మరికొంత కాలం కొనసాగుతుందా? లేక కరెక్షన్ను ఛాన్స్ ఉందా అనే కోణంలో బేరిజు వేసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 60,582 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మొదటి అరగంటలో వచ్చిన లాభాలు హుష్‌కాకి అయ్యాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 11 పాయింట్లు నష్టపోయి 18,042 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉండగా నిన్న గణనీయంగా లాభపడిన హెచ్డీఎఫ్సీ షేర్లు ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీతో పాటు బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్‌మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
భారీ లాభాలతో ముగిసిన సూచీలు...!
దేశీయ సూచీలు సోమవారం (ఏప్రిల్ 4) భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండడంతో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీ లాభాలను గడించాయి. ఇక ప్రైవేట్ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీన ప్రణాళికను ప్రకటించిన తర్వాత దేశీయ సూచీలు రెండున్నర నెలల కంటే ఎక్కువ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. హెచ్డీఎఫ్సీ విలీన వార్తలు రావడంతో మార్కెట్ ప్రారంభంలో ఒక గంటలోనే ఇన్వెస్టర్లు 3 లక్షల కోట్ల లాభాలను వెనకేశారు. బీఎస్ఈ సెన్సెక్స్ 1,335 పాయింట్లు లేదా 2.25 శాతం లాభపడి 60,611.74 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.9 పాయింట్లు లేదా 2.17 శాతం పెరిగి 18,053 వద్ద ముగిసింది. నీఫ్టీలో 15 సెక్టార్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభానికి ముందు హెచ్డీఎప్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీన ప్రకటనతో కంపెనీల షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్ అండ్ టి, సన్ ఫార్మా టాప్ కూడా భారీ లాభాలను పొందాయి. ఇక టైటాన్,ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. చదవండి: డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..! -
డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..!
దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాలతో ముందుకుసాగాయి. తొలి గంటలోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ విలీన ప్రతిపాదనపై ఈక్విటీలు పుంజుకోవడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా సంపాదించారు . ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రతిబింబిస్తూ, బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ 1,472.33 పాయింట్లు లేదా 2.46 శాతంతో 60,736.08 పాయింట్లకు చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ హెచ్డీఎఫ్సీ నిర్ణయంతో బుల్ రంకెలు వేస్తూ పరుగులు తీసింది. బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఏకంగా రూ.2,71,36,569.94 కోట్లకు పెరిగింది. గత వారం శుక్రవారం బీఎస్ఈలో ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ వాల్యుయేషన్‌తో పోలిస్తే ఇది రూ. 3.11 లక్షల కోట్లకు పైగా లాభాన్ని సూచిస్తుంది. బీఎస్ఈ డేటా ప్రకారం...137 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 416 స్క్రిప్‌లు ఎగువ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో, మొత్తం 25 స్టాక్స్ లాభాలను గడించాయి.అందులో కేవలం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు దాదాపు 14 శాతం వరకు లాభపడ్డాయి. చదవండి: కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్ కొట్టేశారు..! -
బుల్ జోరు, లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త ఆర్ధిక సంవత్సరం సందర్భంగా ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమావేశం బుధవారం(ఏప్రిల్ 6న) నిర్వహించనుంది. దీంతో పాటు రష్యాతో చమురు కొనుగోళ్ల ఒప్పొందాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ట్రెండ్ బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.20గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 619 పాయింట్లు లాభపడి 59896 పాయింట్ల వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల లాభపడి 17828 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఏసియన్ పెయింట్స్, హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎథేర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఓఎన్జీసీ, యాక్సిక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్ కొట్టేశారు..!
స్టాక్ మార్కెట్స్ ఇది ఒక క్లిష్టమైన సబెక్ట్..! వీటిపై పట్టు సాధించాలనేగానీ..కుర్చున్న దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్స్‌లో మల్టీబ్యాగర్స్ స్టాక్స్ అంటూ వింటూనే ఉన్నాం. ఈ స్టాక్స్ ఇన్సెస్టర్లకు అతి తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో భారీ లాభాలను అందిస్తోన్నాయి. కాగా తాజాగా ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు కనక వర్షాన్ని కురిపించాయి. ఐదునెలల్లో 8424 శాతం లాభాలు..! SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది స్మాల్ క్యాప్ స్టాక్. గత కొన్ని నెలల్లో పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించిన పెన్నీ స్టాక్‌కు మంచి ఉదాహరణగా SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ నిలుస్తోంది. ఈ మల్టీ-బ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రూ. 5.52 (నవంబర్ 1, 2021) ఉండగా ప్రస్తుతం ఒక్కో స్టాక్ ధర రూ.470.55కి పెరిగింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారికి గత 5 నెలల్లో 8424 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ స్టాక్స్‌లో గత ఐదు నెలల్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి రూ.85.24 లక్షల లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ మల్టీ బ్యాగర్ గత ఏడాది అక్టోబర్ నుంచి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ఆరంభంలో భారీ నష్టాలు..! గతంలో SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ భారీ నష్టాలను కూడా మూటగట్టుకుంది. ఈ కంపెనీ ఒక్కో షేర్ ధర రూ. 215. 55 వద్ద 24 ఆగస్టు 2007 రోజున బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యింది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక్కో షేర్ ధర రూ. 644.65కు చేరుకుంది. ఆ తరువాత కంపెనీ షేర్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక సమయంలో కంపెనీ షేర్ ధర రూ. 4.95 కు చేరుకుని భారీ నష్టాలను చవి చూసింది. ఈ స్టాక్ 2021 ఫిబ్రవరి నుంచి పురోగమించి ఇప్పడు రికార్డు స్థాయిలో ఒక్కో షేర్ ధర రూ. 862.25కు చేరుకొని ఆల్‌టైం హై లాభాలను సొంతం చేసుకుంది. SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది దేశీయ టెక్స్టైల్ కంపెనీ . ఇది నూలు, బట్ట, రెడీమేడ్ వస్త్రాలు, తువ్వాళ్ల తయారీ, ప్రాసెసింగ్, వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఇది బీచ్ టవల్స్, బాత్ టవల్స్, కిచెన్ టవల్స్, క్రిస్మస్ టవల్స్ వంటి టెర్రీ టవల్స్ తయారు చేయడంతో ప్రసిద్ది చెందింది. చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..! -
కొత్త ఏడాదిలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు..!
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను దేశీయ సూచీలు 18 శాతం మేర జంప్ అయ్యాయి. యుద్ద భయాలు ఉన్నప్పటీకి గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు రూ. 59 లక్షల కోట్లను వెనకేశారు. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. శుక్రవారం రోజున దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఉదయం 9.55 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 58, 718 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 17,522.60 వద్ద ట్రేడవుతుంది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిగ్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: భయపెట్టని యుధ్దం..! రూ. 59.75 లక్షల కోట్లను ఇట్టే వెనకేశారు..! -
భయపెట్టని యుధ్దం..! రూ. 59.75 లక్షల కోట్లను ఇట్టే వెనకేశారు..!
న్యూఢిల్లీ: ఈ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపద రూ. 59.75 లక్షల కోట్లకుపైగా ఎగసింది. ఇందుకు మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 18 శాతం జంప్చేయడంతోపాటు.. దేశీ స్టాక్స్ ర్యాలీ దోహదపడింది. ఏడాది చివర్లో కొంతమేర సవాళ్లు ఎదురైనప్పటికీ సెన్సెక్స్ నికరంగా 9,059 పాయింట్లు(18.3 శాతం) లాభపడింది. యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలలోనూ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 59.75 లక్షల కోట్లకుపైగా పురోగమించింది. రూ. 2,64,06,501 కోట్లను అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈ ఏడాది జనవరి 17న రూ. 280 లక్షల కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డుకు తెరతీసింది. కాగా.. 2021 అక్టోబర్ 19న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 62,245 పాయింట్లను తాకడం విశేషం! ఆర్ఐఎల్ దూకుడు మార్కెట్ క్యాప్(విలువ)రీత్యా దేశీయంగా రూ.17,81,834 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రపథాన నిలిచింది. ఇక రూ. 13,83,001 కోట్ల విలువతో టీసీఎస్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 8,15,167 కోట్లు), ఇన్ఫోసిస్(రూ.8,02,309 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 5,07,434 కోట్లు) తదుపరి ర్యాంకులను పొందాయి. కాగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ ఏకంగా 68 శాతం దూసుకెళ్లడం గమనార్హం! చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..? -
మార్కెట్లో అస్థితర.. చివరకు నష్టాలతో ముగింపు
ముంబై : దేశీ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో రెండు సూచీలు కొంత దూకుడు చూపించినా.. ఆ తర్వాత అస్థితర మార్కెట్లో రాజ్యమేలింది. మూడు సెషన్లలోనూ రెండు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు రెండు సూచీలు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58779 పాయింట్లతో మొదలైంది. ఒక దశలో 58,890 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఒక దశలో 58,485 పాయింట్ల కనిష్టాలను తాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 115 పాయింట్లు నష్టపోయి 58,568 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,464 పాయింట్ల దగ్గర ముగిసింది. రిలయన్స్, రెడ్డీస్, విప్రో, మారుతి, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వీస్, కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోగా ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సూచీలు సానుకూలంగా కదలాడుతుండటంతో దేశీ మార్కెట్ సూచీలు సైతం జోరు చూపిస్తున్నాయి. మరోవైపు ఎగిసిపడతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆయిల్ రిజర్వ్‌లు ఉపయోగిస్తామని ప్రకటించింది. దీంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలను నాలుగు శాతం తగ్గాయి. ఇటు సింగపూర్, జపాన్, మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58779 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదైలంది. ఆ తర్వాత గరిష్టంగా 58,804 పాయింట్లను టచ్ చేసింది. అయితే ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయింది. ఉదయం 9:27 గంటల సమయంలో 91 పాయింట్ల లాభంతో 58,775 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 21 పాయింట్లు లాభపడి 17,519 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
రంకెలేసిన బుల్, 18 లక్షల కోట్లను క్రాస్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ!
ముంబై: ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చల ద్వారా సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో పాటు మార్కెట్ల అనిశ్చితిని అంచనా వేసే వీఐఎక్స్ ఇండెక్స్ భారీగా దిగిరావడం (20 స్థాయికి దిగువకు)ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 58,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు బలపడి 17,498 వద్ద నిలిచింది. ఈ ముగింపు సూచీలకు ఆరువారాల గరిష్టస్థాయి కావడం విశేషం. విస్తృతస్థాయి మార్కెట్లో బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో ఒక్క జపాన్ స్టాక్ మార్కెట్ మాత్రమే నష్టపోయింది. మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండు శాతం వరకు రాణించాయి. ఇటీవల భారీ ర్యాలీ నేపథ్యంలో యూరప్ మార్కెట్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1357 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,126 కోట్ల షేర్లను కొన్నారు. మూడురోజుల్లో రూ.3 లక్షల కోట్లు గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1321 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈ నమోదిత కంపెనీలు మొత్తం రూ.3 లక్షల కోట్లను ఆర్జించాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఇదే మూడురోజుల్లో నిఫ్టీ సూచీ 345 పాయింట్లు లాభపడింది. ఒడిదుడుకులమయంగా సాగిన మార్చి ట్రేడింగ్‌లో మొత్తం రూ.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ‘‘ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ తేదీ(నేడు)న నిఫ్టీ 17,450 స్థాయి నిలుపుకోలిగే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కీలక నిరోధం 17,900 స్థాయిని చేధించేందుకు వీలుంటుంది. ఇటీవల గరిష్టాలను చేరిన కమోడిటీ, క్రూడ్ ధరలు దిగిరావడంతో కార్పొరేట్లపై నెలకొన్న మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చనే అంచనాలు సూచీల ర్యాలీకి తోడ్పడ్డాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రూపాయి 21 పైసలు పతనం: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 21 పైసలు క్షీణించి 75.94 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల రికవరీతో పాటు వడ్డీరేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు రూపాయి కరిగేందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 75.65 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.62 వద్ద గరిష్టాన్ని, 75.97 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. రిలయన్స్ : రూ.18 లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో రెండుశాతం లాభపడి రూ.2,673 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.18 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►టాటా కాఫీ(టీసీఎల్)ని విలీనం చేసుకుంటామని టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రకటనతో టీసీఎల్ షేరు తొమ్మిది శాతం లాభపడి రూ.215 వద్ద స్థిరపడింది. ఒక దశలో 13 శాతం పెరిగి రూ.222 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ►ఎస్అండ్పీ బ్రోకరేజ్ సంస్థ పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు మూడుశాతం లాభపడి రూ.7,254 వద్ద ముగిసింది. ► ఓఎన్జీసీ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ఇష్యూ మొదలుకావడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఐదు శాతం క్షీణించి రూ.162 వద్ద స్థిరపడింది. -
ఎన్నాలకెన్నాళ్లకు.. మళ్లీ 58 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్ ఆరంభం నుంచి చివరి వరకు దేశీ సూచీలు లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దానికి తగ్గట్టే దేశీ సూచీలు సైతం లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి 58 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. చివరిసారి ఫిబ్రవరి 10న సెన్సెక్స్ 58 వేలు పాయింట్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత వరుస నష్టాలతో ఒక దశలో 52 వేలకు పడిపోయింది. కాగా బుధవారం దేశీ సూచీలు జోరు చూపించడంతో 58 వేలు దాటింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,362 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ముగిసే సమయానికి 740 పాయింట్లు లాభపడి 58,683 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 17,498 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. బజాజ్ ఫిన్ సర్వీస్, మహీంద్రా అండ్ మమీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
కలిసొచ్చిన ఉక్రెయిన్ - రష్యా పరిణామాలు, లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం దిశగా అడుగులు పడడం, బాండ్లపై రాబడులను పరిమితం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్యపాలసీ విధానానికే మొగ్గుచూపడం వంటి అంశాలు మదుపర్లు ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఉదయం 9.20గంటల సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు పెరిగి 58266 వద్ద.. నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 17,409 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా, టాటా కాన్స్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్, కిప్లా, ఎయిర్టెల్,హెచ్డీఎఫ్సీ,బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజికీ షేర్లు లాభాల్లో కొనసాగున్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా,ఐటీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు...లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య మరో రౌండ్ చర్చలు జరిగే నేపథ్యంలో మంగళవారం యూరోపియన్ స్టాక్‌మార్కెట్స్ పురోగమించాయి. ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండడంతో ప్రధాన మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు మంగళవారం రోజున లాభాల్లో ముగిశాయి. బై అండ్ సెల్ వ్యూహం ఇన్వెస్టర్లలో కన్పించింది. దీంతో మార్కెట్లు కాస్త ఊగిసలాడాయి. ఇక చివరి గంటలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. బీఎస్సీఈ సెన్సెక్స్ ఇండెక్స్ 350 పాయింట్లు లేదా 0.6 శాతం పెరిగి 57,944 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇండెక్స్ 103 పాయింట్లు లేదా 0.6 శాతం పెరిగి 17,325 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బిఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీ సిమెంట్ లార్జ్ క్యాప్ స్పేస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు భారీగా పడిపోయాయి. గత వారం ఆదాయపు పన్ను శాఖ హీరో మోటో కార్ప్ దాడులను జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్ రూ. 1,000 కోట్లకు పైగా బోగస్ ఖర్చులు , రూ. 100 కోట్లకు పైగా నగదు లావాదేవీలు చేసిందని ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన నివేదికలతో హీరో మోటోకార్ప్ షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి. చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా -
అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తల కారణంగా నెల రోజులకు పైగా లాభానష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఈ రోజు ఎంతో నమ్మకంగా లాభాల బాట పట్టాయి. జపాన్ నిక్కీ 0.60 శాతం లాభపడగా దక్షిన కోరియా కోస్పీ సూచీ 0.26 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు హాంగ్‌కాంగ్‌కి సంబంధించి హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.39 శాతం, యూఎస్ నాస్డాక్ 1.31 శాతం వృద్ధిని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్టే దేశీ సూచీలు జోరు చూపిస్తున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు లాభంతో 0.32 శాతం వృద్ధితో 57,777 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 0.44 శాతం వృద్ధి కనబరుస్తూ 17,297 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్, నిఫ్టీల కీలక నిరోధక పాయింట్లను దాటినందున మరికొద్ది రోజుల పాటు మార్కెట్లో బుల్ జోరు కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి పుంజుకోవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఆటో, బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, మెటల్ స్టాక్స్ మద్దతుతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 231.29 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 57,593.49 వద్ద ఉంటే, నిఫ్టీ 69 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 17222 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.16 వద్ద ఉంది. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి.బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడగా.. ఆటో, మెటల్ సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, క్యాపిటల్ గూడ్స్, ఐటీ & ఫార్మా పేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి తమిళనాడుతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం(ఎమ్ఒయు) పై సంతకం చేసిన తరువాత ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ షేరు ధర 10 శాతం పెరిగింది. మల్టీప్లెక్స్ బ్రాండ్స్ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థల విలీనంతో వాటి షేర్ల ధరలు 52 వారాల గరిష్టాలను తాకాయి. కంపెనీ పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి మార్చి 31న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుండటంతో గెయిల్ ఇండియా షేరు ధర 3 శాతం పెరిగింది. (చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! ఎన్నడూ లేని విధంగా యూజర్లకు బెనిఫిట్స్..!) -
మార్కెట్: క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా ఈ స్టాక్స్‌కు ఢోకాలేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయుల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ముడి వనరుగా ఉపయోగించే కొన్ని రంగాల సంస్థల మార్జిన్లు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నహా తెలిపారు. ముడి చమురు అధిక ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు వాణిజ్య లోటు.. ద్రవ్య లోటు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ మార్కెట్ల విషయంలో ఆచి తూచి వ్యవహరించనున్నట్లు అనిరుద్ధ వివరించారు. ఆదాయాలపరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మెరుగ్గా కనిపిస్తోందని, ఇటీవల కొంత కరెక్షన్ తర్వాత ఐటీ స్టాక్స్ ఆకర్షణీయ ధరలో ఉన్నాయని ఆయన చెప్పారు. టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం .. ఐటీ రంగానికి తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. ఇక డిమాండ్ రికవరీ అనేది పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలకు సానుకూలమని తెలిపారు. సుదీర్ఘ మందగమనం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగి కోలుకుంటోందని, సమీప భవిష్యత్తులో ఇది నిలకడగా వృద్ధి చెందవచ్చని చెప్పారు. క్రూడాయిల్ ధరలు దిగి వస్తే.. రాబోయే మూడేళ్లలో కొన్ని ఆటో, ఆటో అనుబంధ కంపెనీలు సముచిత స్థాయిలో వృద్ధి చెందగలవని భావిస్తున్నట్లు అనిరుద్ధ వివరించారు. అయిదేళ్లు కార్పొరేట్లకు సానుకూలం.. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడం వల్ల సమీప భవిష్యత్తులో కాస్త సవాళ్లు నెలకొనవచ్చని అనిరుద్ధ చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఇన్వెస్టర్లు ఎన్నో చూశారని.. కంపెనీల వృద్ధి, లాభదాయకత ఆధారంగా మార్కెట్లు పుంజుకుంటూనే ఉన్నాయన్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యవస్థాగత మార్పులు కార్పొరేట్లకు సానూకూలాంశాలు. డిమాండ్ పుంజుకునే కొద్దీ అమ్మకాలు, లాభాలు వృద్ధి చెంది వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు దేశీ కార్పొరేట్లకు మెరుగ్గా ఉండగలదు‘‘ అని ఆయన పేర్కొన్నారు. మూడు నుంచి అయిదేళ్ల కాలవ్యవధితో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని అనిరుద్ధ చెప్పారు. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలను, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుని తదనుగుణమైన వ్యూహాన్ని పాటించాలని అనిరుద్ధ సూచించారు. తగు స్థాయి రిస్కు తీసుకోగలిగి, కనీసం మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయగలిగే వారు ఫ్లెక్సిక్యాప్ లేదా మిడ్‌క్యాప్ వ్యూహాన్ని ఎంచుకోవచ్చన్నారు. మరింత దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పరిశీలించవచ్చని అనిరుద్ధ పేర్కొన్నారు. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంవత్సరం ముగియనుండడం, బ్యాంకుల స్ట్రైక్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి తాజా పరిణామాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోయి 57134.25 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 49 పాయింట్లు నష్ట పోయి 17103.15 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది క్లిప్‌లా,బజాజ్ ఆటో,ఐఓసీ, మారుతిసుజికీ, ఓన్జీసీ,సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ,కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
వరుసగా మూడో రోజూ నష్టాలే..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలపాలయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే రీతిలో కొనసాగాయి. సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల భారత్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం(యూఎన్‌సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశీయ ముదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, సూచీలు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 233.48 పాయింట్లు(0.41%) క్షీణించి 57362.20 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.41%) నష్టపోయి 17153 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 76.20 వద్ద ముగిసింది. టైటాన్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, టీసీఎస్ ఎక్కువగా నష్టపోతే.. ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ సూచీలు రాణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ షేర్లు అర శాతానికి పైగా నష్టపోగా.. రియల్టీ లాభాల్లో ముగిసింది. (చదవండి: పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!) -
యుద్ధ భయాలు..నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఆ యుద్ధం వల్ల భారత్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశీయ ముదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. దీంతో శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సెన్సెక్స్ 124పాయింట్లు నష్టపోయి 57471 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17204తో ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. బజాజ్ ఆటో, యూపీఎల్, హీరో మోటో కార్పొ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కాన్స్, టైటాన్ కంపెనీ, మారుతి సుజికీ, టెక్ మహీంద్రా,ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఒడుదొడుకుల్లో సూచీలు.. సెన్సెక్స్ 90 మైనస్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదోడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లపై ప్రభావం చూపింది. దీంతో, సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 89.14 పాయింట్లు(0.15) శాతం క్షీణించి 57,595.68 వద్ద ఉంటే, నిఫ్టీ 22.90 పాయింట్లు(0.13 శాతం) నష్టపోయి 17,222.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.38 వద్ద ఉంది. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువ లాభపడితే.. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా ఇండెక్స్‌లు 1 శాతం చొప్పున పెరిగితే, బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ & స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. (చదవండి: అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు!) -
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా...నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్ప కూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవ్వడం, అంతర్జాతీయంగా అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం,యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం 9.20గంటలకు సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయి 57370 వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35659 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను కొనసాగుతుంది. కోల్ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్ స్టాక్స్ లాభాలతో కంటిన్యూ అవుతుండగా..కొటాక్, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఆటో, బ్యాంకు షేర్లు పడేశాయ్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి. ‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు. ► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది. ► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్డీఎఫ్సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత అదే తిరుతో చివరి వరకు కొనసాగాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన రిటైల్ ధరల పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వంటి ప్రతికూల పరిణామాలతో మదుపరులు ఆచీ తూచీ అడుగులు వేశారు. దీంతో, సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 304.48 పాయింట్లు(0.53 శాతం) క్షీణించి 57,684.82 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.40 శాతం) నష్టపోయి 17,245.70 వద్ద ముగిసింది. ఈరోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.33 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టాటా స్టీల్, యూపీఎల్ షేర్లు రాణిస్తే.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, సిప్లా షేర్లు నష్టాలతో ముగిశాయి. హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్, పవర్ సూచీలలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగితే.. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీలో అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా రెండవ రోజు ఫ్లాట్'గా ముగిశాయి. (చదవండి: బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!) -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. ఏషియన్ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. దీంతో మార్కెట్లోకి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా బాండ్ల కొనుగోళ్లు జోరుమీదున్నాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 58,194 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 17,379 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక లిస్టింగ్ మొదలైంది ఇప్పటి వరకు వరుసగా నష్టాలే తప్ప లాభాలంటూ ఎరుగని పేటీఎం షేరు ధర ఈ రోజు స్వల్పంగా పుంజుకుంది. -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నాయి. విదేశీయ సంస్థాగత మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగడం, అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ భరోసా ఇవ్వడం నేడు మార్కెట్లకు సానుకూలాంశంగా కనిపిస్తోంది. దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్ ధరల్ని, అలాగే వంటగ్యాస్ ధరలు పెంచిన మార్కెట్లు దూసుకెళ్లడం గమనర్హం. రిలయన్స్, ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 696.81 పాయింట్లు(1.22 శాతం) పెరిగి 57,989.30 వద్ద నిలిస్తే, నిఫ్టీ 197.90 పాయింట్లు(1.16 శాతం) లాభపడి 17,315.50 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్ మోటార్స్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. బీఎస్ఈ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. (చదవండి: టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం..!) -
ఫ్లాట్‌గా కదులుతున్న సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. మార్కెట్‌ను ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు అంతర్జాతీయ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. అదే ట్రెండ్ ఇక్కడా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9:35 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 57,310 దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 17,105 దగ్గర కొనసాగుతోంది. టాటాస్టీల్, విప్రో, టీసీఎస్, మారుతి సుజూకి, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌యూఎల్, నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: బేర్ పంజాతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి చమురు ధరలు పెరుగుతుండడం మదుపరులను కలవరపెడుతోంది. గత వారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ చమురు ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరింది. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, కొన్ని దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, లాక్డౌన్ల విధింపు వంటి అంశాలు మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలను భారీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ముగింపులో, సెన్సెక్స్ 571.44 పాయింట్లు(0.99 శాతం) క్షీణించి 57292.49 వద్ద నిలిస్తే, నిఫ్టీ 69.40 పాయింట్లు(0.98 శాతం) నష్టపోయి 17,117.60 వద్ద ట్రేడవుతున్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.17 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ఇండియా, హిందాల్కో, యూపీఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, టాటా కంజ్యూమర్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆటో, బ్యాంకులు, రియాల్టీ, పవర్ షేర్లు ఒక్కొక్కటి ఒక్కో శాతం మేర క్షీణించాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, చమురు, విద్యుత్ రంగాల షేర్లు నష్టాల బాట పట్టడం మార్కెట్‌పై ప్రభావం చూపించింది. మరోవైపు ఫార్మా, స్టీల్ రంగాల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతానికి పైగా పెరిగింది. (చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..) -
బుల్ జోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సూచీలు..!
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత కూడా బెంచ్ మార్క్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. అయితే, మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ విశేషం. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది. ముగింపులో, సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు(1.84%) పెరిగి 57,863.93 వద్ద ఉంటే, నిఫ్టీ 311.70 పాయింట్లు(1.84%) పెరిగి 17,287.00 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.89 వద్ద ఉంది. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ బీమా, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు రాణిస్తే.. ఇన్ఫోసిస్, సిప్లా, కోల్ ఇండియా, ఐఓసీ, హెచ్‌సీఎల్ టెక్‌లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఆటో ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ ఇండెక్స్ ఒక్కొక్కటి 3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. (చదవండి: దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు.. !) -
బుల్ జోరు... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. నేడు అంతే స్థాయిలో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. మొదటి నుంచి లాభాల్లో ప్రారంభం అయిన సూచీలకు ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దన్నుగా నిలిచాయి. దీనికి తోడు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో సూచీలు భారీ లాభాల దిశగా అడుగులు వేశాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,039.80 పాయింట్లు(1.86%) పెరిగి 56,816.65 వద్ద ఉంటే, నిఫ్టీ 312.30 పాయింట్లు(1.87%) లాభపడి 16,975.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.21 వద్ద ఉంది. నిఫ్టీలో అల్ట్రాటెక్ సీమెంట్, యాక్సిస్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు రాణిస్తే.. సీప్లా, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ & రియాల్టీ సూచీలు 2-3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, పవర్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా జోడించాయి. (చదవండి: ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర..అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్?!) -
జోష్‌లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: హోలి పండగ ముందు స్టాక్ మార్కెట్లో జోష్ నెలకొంది. క్రూడ్ ఆయిల్ రేట్లు దిగిరావడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా పడవచ్చనే అంచనాల నడుమ దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. ఏషియా స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల వాతావరణం దేశీ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది ఫలితంగా మార్కెట్ మొదలైన గంటకే భారీ లాభాలు నమోదు అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఊగిసలాట ధోరణిలో ఉన్న దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 945 పాయింట్లు లాభపడి 56,721 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 267 పాయింట్లు లాభపడి 16,928 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా.. కుప్పకూలిన సూచీలు!
స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసరడంతో సూచీలు నేడు భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత హెవీ వెయిట్ షేర్ల పతనంతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటి కారణాలతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అలాగే, వరుసగా 5 సెషన్లు లాభాలతో ముగియడంతో మదుపరులు తమ లాభాలను వెనక్కి తీసుకున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 709.17 పాయింట్లు(1.26%) క్షీణించి 55,776.85 వద్ద ఉంటే, నిఫ్టీ 208.30 పాయింట్లు(1.23%) క్షీణించి 16,663 వద్ద స్థిరపడింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు భారీగా పతనమవుతోంది. బీఎస్ఈలో మార్చి 14న 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం.. నేడు మరో 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ పడిపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. నేడు ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.76.53 వద్ద ఉంది. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, ఎమ్ & ఎమ్, సిప్లా, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి షేర్లు రాణించాయి. ఆటో మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు(ఐటి, మెటల్, పవర్ ఆయిల్ & గ్యాస్) 1-4 శాతం నష్టపోవడంతో మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం నష్టపోయాయి. (చదవండి: ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!) -
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
ముంబై: ఫిబ్రవరి ద్రవ్యోల్బణం ఫలితాలు పెరిగినా అంతర్జాతీయ చమురు ధరలు దిగిరావడం, రష్యా, ఉక్రెయిన్ల మధ్య మరోసారి వర్చువల్‌గా చర్చలు ప్రారంభం అవుతాయనే వార్తల నేపథ్యంలో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో మరోరోజు దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:10 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 56,663 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 16,900 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. 1700 పాయింట్ల దగ్గర తీవ్ర నిరోధకం ఎదురుకావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే వరకు అంతకంతకూ పెరుగుతూ లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 935.72 పాయింట్లు (1.68%) పెరిగి 56,486.02 వద్ద ఉంటే, నిఫ్టీ 240.80 పాయింట్లు (1.45%) పెరిగి 16,871.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.50 వద్ద ఉంది. నిఫ్టీలో ఇన్ఫోసీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. ఐఓసీ, ఓఎన్జీసీ, హెచ్‌యుఎల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ దాదాపు 2 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిస్తే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం లాభపడింది. (చదవండి: ప్రపంచ దేశాల్లో కరోనా కలవరం, చైనాకు యాపిల్ భారీ షాక్!) -
ద్రవ్యోల్బణం, ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలతో (బుధవారం వెలువడనున్న) పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమ నాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. హోళీ సందర్భంగా శుక్రవారం(మార్చి 18న) ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గతవారంలో సెన్సెక్స్ 1,216 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు తగ్గేంత వరకు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మార్కెట్లను నడిపించనున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు క్రూడాయిల్ ధరలు కూడా కీలకం కానున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ టోకు, రిటైల్ గణాంకాలు, ఎఫ్ఐఐల అమ్మకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించవచ్చు. సాంకేతికంగా దిగువస్థాయిలో నిఫ్టీకి 16,400 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ మార్చి మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–4 తేదీల మధ్య ఎఫ్ఐఐలు మొత్తం రూ.45,608 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల రూపంలో రూ. 41,168 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 4,431 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ‘‘పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం భారత్ మార్కెట్‌పై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ తెలిపారు. ఐపీవోకు నవీ టెక్నాలజీస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,350 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవో నిధుల కోసం పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ బన్సల్ ఐపీవోలో భాగంగా ఎలాంటి వాటాను విక్రయించబోవడంలేదని ప్రాస్పెక్టస్ ద్వారా కంపెనీ వెల్లడించింది. -
కలిసొచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు...లక్ష 91 వేల కోట్లను ఇట్టే సంపాదించారు..!
దేశీయ మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అస్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భారతీయ ఈక్విటీలు చివరి వారంలో భారీ లాభాలను గడించాయి. దాంతో పాటుగా ఉక్రెయిన్ నాటోలో చేరమనే సంకేతాలు, అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో స్టాక్ మార్కెట్స్ మళ్లీ రంకెవేస్తూ లాభాల్లోకి వచ్చాయి. గత వారం స్టాక్ మార్కెట్స్లోని టాప్-10 కంపెనీలు భారీ లాభాలను గడించాయి. ఆయా కంపెనీలు మార్కెట్ క్యాప్‌కు సుమారు లక్ష 91 కోట్లను యాడ్ చేసుకున్నాయి. అత్యంత విలువైన పది షేర్లలో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,91,434.41 కోట్లను అందించడంతో చివరి వారం మార్కెట్లు సహాయపడ్డాయి. లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ టాప్ ప్లేస్‌లో నిలిచాయి. కాగా గత వారం ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కొంత మేర నష్టాలను చవిచూసింది. మార్చి 11 శుక్రవారం రోజున సెన్సెక్స్ 55,550 పాయింట్ల వద్ద , నిఫ్టీ 16,630 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ► బీఎస్ఈలో మార్కెట్ క్యాప్‌లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.49,492.7 కోట్ల లాభాలను గడించి, అతిపెద్ద కంట్రిబ్యూటర్‌గా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 16,22,543.06 కోట్లకు చేరుకుంది. ► ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్ మర్కెట్ క్యాప్ వాల్యుయేషన్‌కు వరుసగా రూ.41,533.59 కోట్లు, రూ 27,927.84 కోట్లు పెరిగింది. ► అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ రూ. 22,956.67 కోట్లను జోడించి దాని మార్కెట్ క్యాప్ రూ.3,81,586.05 కోట్లకు చేరుకుంది. ► ఇక ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.17,610.19 కోట్లను జోడించి రూ.4,92,204.13 కోట్లకు చేరుకుంది . ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువలో రూ.16,853.02 కోట్లను జోడించి రూ. 7,74,463.18 కోట్లకు చేరుకుంది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేరెంట్ సంస్థ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రూ.2,210.49 కోట్లు పెరిగి రూ.4,04,421.20 కోట్లకు పెరిగింది. ► ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్‌లో రూ.7,541.3 కోట్లను జోడించి రూ. 4,19,813.73 కోట్లకు చేరుకుంది. ► బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.5,308.61 కోట్లు పెరిగి రూ.4,00,014.04 కోట్లకు చేరుకుంది. ► ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్కెట్ క్యాప్‌లో రూ. 7,023.32 కోట్లు తగ్గి రూ. 4,71,047.52 కోట్లకు పడిపోయింది . చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ఆ తర్వాత వెంటనే లాభాల బట్టి 200 పాయింట్ల వరకు పైకి దూసుకెళ్లాయి. మళ్లీ కాసేపటికే మార్కెట్ ఫ్లాట్‌గా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. రోజంతా సూచీలు ఊగిసలాటలో కొనసాగాయి. ముగింపులో, సెన్సెక్స్ 85.91 పాయింట్లు (0.15%) పెరిగి 55,550.30 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 35.60 పాయింట్లు లేదా 0.21% పెరిగి 16,630.50 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.59 వద్ద ఉంది. నిఫ్టీలో సీప్లా, బిపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. టాటా మోటార్స్, మారుతీ సుజుకి, నెస్లే ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా ఇండెక్స్ 2 శాతం పెరిగితే, చమురు & గ్యాస్ సూచీలు 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
మార్కెట్లో చిన్న ఝలక్.. ఆపై సెట్‌రైట్
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. యూఎస్, ఇంగ్లండ్, ఏషియన్ మార్కెట్లు శుక్రవారం ప్రతికూలంగా మొదలవడంతో దేశీ సూచీలు సైతం ఆరంభంలో నష్టాలు చవి చూశాయి. అయితే అరగంట తర్వాత క్రమంగా మార్కెట్ పుంజుకోవడం మొదలు పెట్టింది. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 55,218 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. క్రితం రోజు 55,464 పాయింట్ల దగ్గర ముగిసింది. దీంతో ఆరంభంలో సుమారు రెండు వందల పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 113 పాయింట్ల లాభంతో 55,577 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ముందు నుంచి మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్టే 16,500 పాయింట్ల దగ్గర నిఫ్టీకి తీవ్ర రెసిస్టెన్స్ ఎదురైంది. మార్కెట్ ప్రారంభం అయిన కాసేపటికే 70 పాయింట్ల వరకు నష్టపోయినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9:45 గంటల సమయానికి 54 పాయింట్లు లాభపడి 16,649 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
మార్కెట్‌కు బీజేపీ విన్నింగ్ కిక్
ముంబై: ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు ఎన్నికల ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వెలువడటంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు దిగిరావడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 817 పాయింట్లు పెరిగి 55,464 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250 పాయింట్లు ఎగసి 16,595 వద్ద నిలిచింది. రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లకు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ సూచీలో టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం తలపెట్టదలిచిన ఆర్థిక సంస్కరణల వేగం మరింత పుంజుకోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ సంధికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇరాక్, యూఏఈలతో పాటు ఒపెక్ దేశాల నుంచి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలతో క్రూడ్ ధరలు చల్లబడ్డాయి. ఇప్పుడు సాంకేతికంగా నిఫ్టీ 16,800 స్థాయి వద్ద నిరోధాన్ని కలిగి ఉంది. బలమైన ఈ స్థాయిని ఛేదిస్తేనే మార్కెట్ మూమెంటమ్ కొనసాగుతుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు బలపడి 76.43 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,981 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.946 కోట్ల షేర్లను కొన్నారు. దాదాపు సగం లాభాలు మాయం ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,595 పాయింట్ల లాభంతో 56,242 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు పెరిగి 16,757 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. అయితే యూరప్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం, యూఎస్ సీపీఐ డేటా గణాంకాల వెల్లడి నేపథ్యంలో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు సగం లాభాలు మాయమయ్యాయి. మూడు రోజుల్లో రూ.10.83 లక్షల కోట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,621 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్ఈ ఎక్సే్చంజీ మార్కెట్ క్యాప్ రూ.251 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ట్రేడింగ్ సమయంలో రూ.2,689 కోట్ల షేర్లు చేతులు మారడంతో కోపోర్జ్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.4,234 వద్ద స్థిరపడింది. ► పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ)లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటుందనే వార్తలతో పేటీఎం షేరు మూడుశాతం పెరిగి రూ.774 వద్ద నిలిచింది. గత రెండురోజుల్లో ఈ షేరు 9% ర్యాలీ చేసింది. ► క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు వరుసగా అరశాతం, 3% చొప్పున బలపడ్డాయి. ► ఎఫ్ఎంసీజీ షేర్లకు నెలకొన్న డిమాండ్‌తో హెచ్‌యూఎల్ షేరు ఐదు శాతం బలపడి రూ.2,101 వద్ద ముగిసింది. సూచీల్లో అత్యధికంగా బలపడిన షేరు ఇదే. (చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!) -
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..రయ్‌మంటూ దూసుకెళ్తున్న దేశీయ సూచీలు..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ సూచీలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సాంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజున మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9:31 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1085.50 పాయింట్లు లాభపడి 55,741.95 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 311.35 పాయింట్లు లాభపడి 16,657.55 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఓఎన్జిసి, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ , జెఎస్డబ్ల్యు స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..! -
బుల్ జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ముగింపు వరకు అదే జోరును కొనసాగించాయి. ఆటో, బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, ఫార్మ, ఐటీ రంగ షేర్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధ భయాలు ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేసిన ప్రకటన మార్కెట్లో కొత్త ఆశలు నింపింది. ముగింపులో, సెన్సెక్స్ 1,223.24 పాయింట్లు(2.29%) పెరిగి 54,647.33 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 331.90 పాయింట్లు(2.07%) లాభపడి 16,345.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.54 వద్ద ఉంది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంకుల షేర్లు భారీ లాభాలతో ముగిస్తే.. శ్రీ సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని క్యాపిటల్ గూడ్స్, ఆటో & రియాల్టీ సెక్టోరల్ సూచీలు 2-3 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి. (చదవండి: గృహిణులకు యాక్సిస్ బ్యాంక్ తీపికబురు..!) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లో పయనించాయి. రియాల్టీ, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సూచీలు లాభాలలో ముగిశాయి. అలాగే, కనిష్ట ధరల వద్ద షేర్లు అందుబాటులో ఉండటంతో మదుపరులు కొనుగోలుకు మొగ్గుచూపారు. ముగింపులో, సెన్సెక్స్ 581.34 పాయింట్లు(1.10%) పెరిగి 53,424.09 వద్ద ఉంటే, నిఫ్టీ 150.30 పాయింట్లు(0.95%) లాభపడి 16,013.50 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.92 వద్ద ఉంది. నిఫ్టీలో ఐఓసీ, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సీప్లా, టీసీఎస్ షేర్లు రాణిస్తే.. మరోవైపు హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయాయి. లోహపు షేర్లు మినహా మిగిలిన రంగాలన్నీ చివరకు భారీగా లాభాలు నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఒక శాతం చొప్పున వృద్ధి సాధించాయి. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?) -
వెంటాడుతున్న భయాలు.. కుప్పకూలిన దేశీయ మార్కెట్లు..!
ముంబై: ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొలుకొన్నట్లు కనిపించిన మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి. సోమవారం బ్యారెల్ చమురు ధర 9 డాలర్లకు పైగా పెరిగింది. ముగింపులో, బీఎస్ఈ సెన్సెక్స్ 1491 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 52,842.75 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.20 పాయింట్లు(-2.35 శాతం) క్షీణించి 15,863.15 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.99 వద్ద ఉంది. ఇక ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై మరిన్ని ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్‌మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌పై 9 డాలర్లు పెరిగి 124 డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్‌ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పడింది. మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే తక్కువ లాభాలను అర్జీస్తే.. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండ్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 7.48శాతం క్షీణించాయి. (చదవండి: మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!) -
రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముగింపులో, సెన్సెక్స్ 366.22 పాయింట్లు (0.66%) క్షీణించి 55,102.68 వద్ద స్థిరపడితే , నిఫ్టీ 108 పాయింట్లు లేదా 0.65% క్షీణించి 16,498 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.97 వద్ద ఉంది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు రాణిస్తే.. అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ డీలాపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ & బ్యాంక్ రంగాలలో సూచీలు 1-2 శాతం పడిపోగా, ఎఫ్ఎంసిజి & రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. అయితే మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగాయి. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట దొరణి కనబరిచాయి. చివరిలో కొద్ది పుంజుకోవడంతో అతి భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల మంట, నిత్యావసర ధరల పేరుగుతాయని అనే భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది. ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయని ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 689.78 పాయింట్లు(1.23%) క్షీణించడంతో 55557.50 పాయింట్ల వద్ద స్థిర పడితే, నిఫ్టీ 165.10 పాయింట్లు(0.98%) నష్టపోయి 16628.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 75.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటాస్టీల్స్, టైటాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు రాణిస్తే.. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాలలో ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతం పడిపోయాయి. (చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!) -
–1026 నుంచి +389
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య జరిగిన పోరులో సోమవారం బుల్స్ ధాటికి బేర్స్ తలవంచాయి. ఆరంభంలోనే 1026 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ మెటల్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో 389 పాయింట్లు లాభంతో 56,247 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,800 పాయింట్ల చేరువలో 16,794 వద్ద ముగిసింది. సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకవైపు భీకర యుద్ధం జరుగుతున్నా.., మరోవైపు బెలారస్ సరిహద్దు ఫ్యాపిట్ వేదికగా రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన ఈ చర్చలతో యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చనే ఆశలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలను నెలకొల్పాయి. ఆసియా మార్కెట్లు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన యూరప్ సూచీలు మన మార్కెట్ ముగిసిన తర్వాత అనూహ్యంగా నష్టాలబాటపట్టాయి. దేశీ ఇన్వెస్టర్లు రూ.3,948 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,143 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఐదుశాతం పెరగడంతో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రెండు పైసలు స్వల్పంగా క్షీణించి ఫ్లాట్‌గా 75.33 వద్ద స్థిరపడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం(నేడు) స్టాక్, ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లకు సెలవు. బుధవారం మార్కెట్లు మళ్లీ యథాతథంగా పనిచేస్తాయి. భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి... ఉక్రెయిన్– రష్యా యుద్ధ భయాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 530 పాయింట్లు పతనమైన 55,329 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు క్షీణతతో 16,482 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1026 పాయింట్లను కోల్పోయి 54,834 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 16,356 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరతీశారు. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నించింది. ట్రేడింగ్ ముగిసే వరకు స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా రెండోరోజూ లాభాలతో ముగిశాయి. సూచీల రికవరీకి మెటల్ షేర్ల దన్ను మెటల్ షేర్లు రాణించి సూచీల రికవరీలో ప్రధాన పాత్ర పోషించాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రష్యా మెటల్ ఎగుమతులు తగ్గొచ్చనే అంచనాలతో దేశీయ మెటల్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. హిందాల్కో ఏడు శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్ 6%, జేఎస్‌డబ్ల్యూ ఐదుశాతం రాణించాయి. నాల్కో, వేదాంత, హిందూస్తాన్ కాపర్ షేర్లు 4–3% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అన్నిరంగాల సూచీల్లోకెల్లా మెటల్ ఇండెక్స్ ఐదుశాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల కనిష్టానికి ఇన్వెస్టర్ల సంపద ఫిబ్రవరిలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 1,767 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల రూ.26.41 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఫిబ్రవరి చివరిరోజు(28 తేదీ)నాటికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆరునెలల కనిష్ట స్థాయి రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఇదే ఫిబ్రవరి ముగింపు నాటితో నమోదైన రూ.200 లక్షల కోట్లతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద 25.68 శాతం వృద్ధి చెందింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ ఇండస్ట్రీస్ 200 స్టోర్స్‌ను టేకోవర్ చేసుకోవడంతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు రాణించాయి. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్ షేర్లు ఎనిమిది శాతం నుంచి 16% లాభపడ్డాయి. ► డిసెంబర్ క్వార్టక్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో రైన్ ఇండస్ట్రీస్ షేరు ఎనిమిది శాతం క్షీణించి రూ.185 వద్ద ముగిసింది. ► పలు బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో రిలయన్స్ షేరు మూడు శాతం బలపడి రూ.2359 వద్ద స్థిరపడింది. (చదవండి: మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!) -
వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: రికార్డు స్థాయి నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నా.. దేశీయ సూచీలు తేరుకోవడం విశేషం. క్రితం సెషన్లో సెన్సెక్స్ 2700 పాయింట్లు పతనం కావడం గమనార్హం. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ గురువారం భారీగా కుదేలైన నేఫథ్యంలో స్వల్పకాల లాభాలను ఆర్జించేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. షేర్ల కనిష్ఠాల వద్ద భారీ కొనుగోళ్లు చేస్తుండడం కారణంగా సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే, రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇతర దేశాలు ప్రత్యక్షంగా పాల్గొనక పోవడం కూడా మదుపరులకు ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభలో బాటలో పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,328.61 పాయింట్లు (2.44%) పెరిగి 55,858.52 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 410.40 పాయింట్లు(2.53%) పెరిగి 16,658.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్ షేర్లు డీలా పడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్‌యు బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు 4-6 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పెరిగాయి. (చదవండి: అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి సైనిక చర్య మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల(పరోక్షంగా అమెరికాతో) మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక మదుపరులు తమ పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం భారీగానే కనిపించింది. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుకు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత పడిపోయ అవకాశం ఉంది. ముగింపులో, సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు (4.72%) క్షీణించి 54,529.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 815.30 పాయింట్లు(4.78%) నష్టపోయి 16,248.00 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగి రూ.75.69 వద్ద ఉంది. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్‌లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. టాటా మోటార్స్ 10 శాతానికిపైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు 3-8 శాతం నష్టంతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి.బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి. (చదవండి: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!)