వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Market bounces back with Nifty above 16600, Sensex gaining over 1300 pts | Sakshi
Sakshi News home page

వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Fri, Feb 25 2022 4:08 PM | Last Updated on Fri, Feb 25 2022 4:09 PM

Market bounces back with Nifty above 16600, Sensex gaining over 1300 pts - Sakshi

ముంబై: రికార్డు స్థాయి నష్టాల అనంతరం దేశీయ స్టాక్​ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. రష్యా- ఉక్రెయిన్​ మధ్య దాడులు జరుగుతున్నా.. దేశీయ సూచీలు తేరుకోవడం విశేషం. క్రితం సెషన్​లో సెన్సెక్స్​ 2700 పాయింట్లు పతనం కావడం గమనార్హం. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. స్టాక్​ మార్కెట్​ గురువారం భారీగా కుదేలైన నేఫథ్యంలో స్వల్పకాల లాభాలను ఆర్జించేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. షేర్ల కనిష్ఠాల వద్ద భారీ కొనుగోళ్లు చేస్తుండడం కారణంగా సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

అలాగే, రష్యా- ఉక్రెయిన్​ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇతర దేశాలు ప్రత్యక్షంగా పాల్గొనక పోవడం కూడా మదుపరులకు ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభలో బాటలో పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,328.61 పాయింట్లు (2.44%) పెరిగి 55,858.52 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 410.40 పాయింట్లు(2.53%) పెరిగి 16,658.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్ షేర్లు డీలా పడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్యు బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు 4-6 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పెరిగాయి.

(చదవండి: అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో, దేశీయ మార్కెట్‌లో బ‌డ్జెట్‌ స్మార్ట్ ఫోన్!!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement