
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది.
► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం
ఇందుకు కారణం.
► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది.