
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 575.09 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో 79,128.30 వద్ద, నిఫ్టీ 143.15 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 23,994.80 వద్ద కొనసాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో సంభవ్ మీడియా, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో-నేషనల్ వంటి కంపెనీలు చేరాయి. ఆక్‌మె ఫిన్‌ట్రేడ్ ఇండియా, ఆర్వీ లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, జైప్రకాష్ అసోసియేట్స్, బినాని ఇండస్ట్రీస్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).