
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ ఇప్పటికే విడుదలైన వాహనాలను కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1. టాటా పంచ్ ఈవీ:
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో అత్యధిక భద్రత కలిగిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో విడుదలకానున్నట్లు సమాచారం.
దేశీయ విఫణిలో ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో పంచ్ ఈవీ కూడా ఒకటి. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్‌తో లభించనుంది. అవి 19.2 కిలోవాట్ (65 Bhp / 110 Nm) & 24 కిలోవాట్ (74 Bhp / 114 Nm) బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
2. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ:
ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2024 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ ఇందులో 25 కిలోవాట్ నుంచి 30 కిలోవాట్ మధ్యలో ఉండవచ్చని అంచనా. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్
3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ:
మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకానుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కంపెనీ 2030 నాటికి 6 వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఫ్రాంక్స్ ఈవీ. ఈ వెర్సన్ గురించి కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో 400 నుంచి 450 కిమీ రేంజ్ అందించవచ్చని తెలుస్తోంది.
Note: ఈ కథనంలో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారిక చిత్రాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.