
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రిటైల్ చెల్లింపుల లావాదేవీలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి రూ.8.27 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. సంఖ్యా పరంగా 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం నెల 2022 జనవరిలో 461 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.8.32 లక్షల కోట్ల మేర ఉంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఆధారిత లావాదేవీలు 24.36 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3,613 కోట్లుగా నమోదైంది.
ఈ వివరాలను ఎన్‌పీసీఐ విడుదల చేసింది. జనవరిలో ఫాస్టాగ్ టోల్ వసూళ్ల లావాదేవీలు 23.10 కోట్లుగాను, వీటి విలువ రూ.3,604 కోట్లుగా ఉంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ జనవరిలో రూ.3.87 లక్షల కోట్లు. ఫిబ్రవరిలో రూ.3.84 లక్షల కోట్లకు తగ్గింది. జనవరిలో 31 రోజులు కాగా, ఫిబ్రవరిలో 28 రోజులే కావడం గమనార్హం.
(చదవండి: వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!)