
మార్చి నెలలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మార్చి నెలలో రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. విలువ పరంగా ఇది సరికొత్త నెలవారీ గరిష్ట రికార్డు.
ఫిబ్రవరిలో నమోదైన రూ.21.96 లక్షల కోట్లతో పోల్చితే విలువ పరంగా 12.7% వృద్ధి నమోదైంది. 2024 మార్చిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.19.78 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి నెలలో రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల విలువ రూ.79,903 కోట్లుగా నమోదైంది.