
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.
మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.
ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.
ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.