
వైభవం.. ఉగాది ఉత్సవం
● సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘విశ్వావసు’ వేడుకలు ● ఆకట్టుకున్న విద్యార్థుల తెలుగు పద్య, గద్య పోటీలు ● కనువిందు చేసిన సంప్రదాయ వస్త్ర ప్రదర్శన ● విజేతలకు బహుమతుల ప్రదానం ● శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం ● ఈ ఏడాది ఒడిదొడుకులు తప్పదంటున్న పండితులు
తిరుపతి తుడా/తిరుపతి సిటీ : సాక్షి మీడియా ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల ను కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వైభవంగా జరిపించారు. ఏబీ ఎలక్ట్రానిక్స్, అమిగోస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, అన్నమాచార్య వర్సిటీ, శుభమస్తు షాపింగ్ మాల్, కెనరా బ్యాంక్ సంయుక్త సహకారంతో సాక్షి ఉగాది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉగాది విశిష్టత చా టేలా ఆడిటోరియాన్ని అరటి మొక్కలు, మామిడి ఆకు ల తోరణాలతో అలంకరించారు. వీక్షకులను ఆహ్వానించేందుకు వివిధ పూల మొక్కలతో విశేష అలంకరణ చేశారు. వాగ్దేవి, పి.బాలచంద్ర కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు.
గణపతి పూజతో ప్రారంభం
గణపతి పూజతో సాక్షి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి పండితులు మహేష్ స్వామి శ్రీకారం చుట్టారు. సాక్షి జనరల్ మేనేజర్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, ప్రధాన స్పాన్సర్లు ఏబీ ఎలక్ట్రానిక్స్ అధినేతలు మహేష్, మహేంద్ర, అమిగోస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత అనిత్ కుమార్‌రెడ్డి, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయాతో పాటు శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతినిధి రవి, అన్నమాచార్యా వర్సిటీ వ్యవస్థాపకుడు గంగిరెడ్డి జ్యోతి ప్రజ్వల చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఆకట్టుకున్న పోటీలు
ఉగాది ఉత్సవాలలో భాగంగా పద్య, గద్య, సాహిత్య పోటీలను నిర్వహించగా నగరంలోని పలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. తమదైన శైలి లో గీతం, రత్నం, శ్రీ వెంకటేశ్వర, విశ్వం, అకార్డ్, విశ్వ చైతన్య, అకడమిక్ హైట్స్, ఎమ్‌ఎస్ ఇంటర్నేషన ల్ ప్రీ స్కూల్, స్ప్రింగ్‌డేల్‌తో పాటు పలు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటా రు. చక్కని తెలుగు వచనాలు, వినసొంపైన శ్లోకాలు, వాటి భావాలను చక్కగా వివరించారు. ఈ సందర్బంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కౌషిక్, క్రిష్ణసాత్విక్, యువరాజ్ గెలుచుకున్నారు. అలాగే మరో ఐదు మందికి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాల తో పాటు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ఒడిదొడుకులు తప్పవు..
విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రంగాలు ఒడుదుడుకులు ఎదుర్కొకతప్పవని ఆగమ శాస్త్ర పండితులు డాక్టర్ పీటీజీ రంగ రామాజాచార్యులు వెల్లడించారు. ముందుగా ఆయన ఉగాది పచ్చడి విశేషాలను సభికులకు వివరిస్తూ సుగంధ ద్రవ్యాన్ని శాస్త్రోక్తంగా తయారు చేయించి అందిరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు మంచికి వెళ్లినా చెడు ఎదుర్కోక తప్పని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలను వివరించారు. అనంతరం ఆయనను దుశ్సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
సాంస్కృతికం...నేత్రానందం...
సాక్షి ఉగాది వేడుకలలో ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు నేత్రానందంగా సాగాయి. భరతనాట్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి, ప్రముఖ నృత్యకారుడు చల్లా జగదీష్ ప్రదర్శించి తోడైమంగళం జయ జానకీ రమణ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలాగే అకార్డ్స్ స్కూల్ విద్యార్థుల ప్రణవాలయ పాహీ స్వాగత నృత్య రూపకం అలరించింది. జగదీష్ శిష్య బృందం నేహా, భవజ్ఞ, కీర్తనలు ప్రదర్శించిన మల్లారి నృత్యం మైమరిపింపజేసింది. ప్రదర్శకులకు అతిథుల చేతులుగా జ్ఞాపికలు అందజేశారు.

వైభవం.. ఉగాది ఉత్సవం