
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంతంపల్లి గ్రామంలో అప్పులకు తాళలేక మార్కెట్ కమిటీ ఛైర్మన్ భగవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. భగవంత్ రెడ్డి భిక్కనూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో అప్పులు ఎక్కువగా కావడంతో ఆయన వేదనకు లోనయ్యారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, అంతంపల్లిలో విషాదం నెలకొంది.