ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం తీసుకెళ్లి.. కాబోయే భార్యను.. | Man Molestation His Fiancee In Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలు ఎక్కకముందే వేధింపులు 

Published Sun, Nov 14 2021 7:18 AM | Last Updated on Sun, Nov 14 2021 7:21 AM

Man Molestation His Fiancee In Karnataka - Sakshi

నిశ్చితార్థం రోజు కాబోయే భర్తతో పవిత్ర దిగిన ఫొటో

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): వివాహం నిశ్చయమైన యువతి ఇంకా పెళ్లి పీటలు ఎక్కనేలేదు. అప్పుడే కాబోయే భర్త అనుమానంగా చూడటం మొదలు పెట్టాడు. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఆ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన  హుబ్లీ ప్రశాంత్‌నగర్‌లో చోటు చేసుకుంది. హుబ్లీకి చెందిన పవిత్ర పాటిల్‌కు హావేరి చెందిన అభినందన్‌తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 2న ముహూర్తం ఖరారు చేశారు. ఈక్రమంలో పవిత్రను అభినందన్‌ దాండేలికి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం తీసుకెళ్లాడు.

అప్పటినుంచి ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ వేధించసాగాడు. పవిత్ర  కుటుంబ సభ్యులకు తెలియజేసింది. పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయని ఓదార్చారు.  తీవ్ర వేదనకు గురైన పవిత్ర శుక్రవారం తన ఇంటిలోనే  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement