
గత మూడు రోజుల వాతావరణం:
గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలోఅక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు35నుండి 40డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు18 నుండి 24డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
వచ్చే ఐదు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు (సోమవారం మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ఆధారంగా) అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 26 (బుధవారం) నుండి 30వ(ఆదివారం) వరకు రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కోసం పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర పంటలను వేసుకోవచ్చు.
నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వరికి ఆరుతడులు ఇవ్వాలి.
చీడపీడలు, తెగుళ్ళ ఉధృతి అధికంగా కాకుండా చూడటానికి సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి.
వడగళ్ళ వాన, అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు:
నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించడానికి నేల బాగా తడిచే విధంగా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ళలో పోయాలి.
అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోవటానికి 2% యూరియా లేదా 1% ΄÷టాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి.
వర్షాలతో శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటల్లో నష్టం ఎక్కువగా ఉంటే తిరిగి మొక్కలను నాటుకోవాలి.
పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉనట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా అమ్ముకోవాలి.
అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. కావున తెగుళ్ళ ఉధృతి గమనించినట్లయితే 1 మి.లీ. ్ర΄ోపికోనజోల్ లేదా 0.4 గ్రా. టేబుకొనజోల్ + ట్రైఫ్లాక్సిస్త్రోబిన్ లేదా 2.5 గ్రా. ట్రైసైక్లాజోల్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్‌కు తరలించాలి. పగిలి ΄ోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది.
మామిడిలో కాయమచ్చ తెగులు కనిపిస్తే 1 గ్రా. కార్బండజిమ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి (కంకివెన్ను 10 శాతం కన్న తక్కువ ఉన్నప్పుడు మందుల పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10 శాతం కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేస్తే దిగుబడి తగ్గుతుంది).
వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు, ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్: 1.5గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకడానికి అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లాజోల్ 0.5 గ్రా. లేదా ఐసో ప్రోథైయోలిన్ 0.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరిలో కాండం తొలిచే పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిపోరల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలి్ర΄ోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణంలో వరికి జింక్ ధాతువు లోపం రావటానికి అనుకూలం. నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
మొక్కజొన్న
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు (భూమిలో ఎక్కువ తేమ) మొక్కజొన్నలో బాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 4 కి.గ్రా. బ్లీచింగ్ పొడి (35 % క్లోరిన్ కలిగిన) మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పోయాలి.
పూత అనంతరం ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.
మేడిస్ అకుమాడు తెగులు ఆశంచడానికి అనుకూలం. నివారణకు, 2.5గ్రా. మ్యంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కత్తెర పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలి్ర΄ోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి.
వంగ
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ, కాయతొలిచే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు ఎకరానికి 10–15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను తుంచి 10,000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిపోరల్ పిచికారీ చేయాలి.
మిరప
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో జెమిని వైరస్ (ఆకుముడత) తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు..
వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం లో కలుపు మొక్కలను నివారించాలి. n పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8–10 చొప్పున అమర్చాలి.
నివారణకు 1.5 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ లేదా 1.0 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ.ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నల్ల తామర పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 2 మి.లీ. సైంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
టమాట
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో పొగాకు లద్దె పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 1మి.లీ. నోవల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ∙ఫ్యుజేరియం ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల చుట్టూ ΄ోయాలి.
తీగజాతి కూరగాయలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించడానికి అనుకూలం. నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లేదా 2 మి.లీ ప్రోఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి
తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటల్లో కాయ అభివృద్ధి దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్దతులు: తోటలను శుభ్రంగా ఉంచాలి
పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి.
10,000 పి.పి. యం వేప నూనెను పిచికారీ చేయాలి.
పండుఈగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200 మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి. ఎకరాకి 40 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి.
– డా. పి. లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి, వాతావరణ ఆధారిత వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఎఆర్‌ఎస్, పిజెటిఎయు, రాజేంద్రనగర్.
(చదవండి: 'క్లైమేట్ ఎమర్జెన్సీ': ఇలాంటప్పుడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!)