
వెచ్చదనం తగ్గించే పచ్చదనం
ఆసక్తి కనబరుస్తున్న నగర వాసులు
ఇటు అందం.. అటు ఆరోగ్యం
నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో వేడిని తట్టుకునేందుకు నగర వాసులు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా ఏసీలు, కూలర్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి.. అయితే దీనికి భిన్నంగా వేడి నుంచి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గమైన మొక్కలను పెంచుతున్నారు. ఇంటి వాతావరణం చల్లబరిచేందుకు ఇదో చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. నర్సరీల్లోనూ ఇటీవల కాలంలో ఇంటీరియర్ ప్లాంట్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోతున్నాయని పలువురు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవ్వడంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని ఇంటీరియర్ డిజైనర్స్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ ప్లాంట్స్ గురించిన మరిన్ని విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరో
వేసవి తాపానికి ఎండలు మాత్రమే ప్రధాన కారణం కాదు. పరిమితికి మించిన వాహనాల కాలుష్యం, పరిశ్రమలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. అయితే గతంలో ఇంటి వద్ద మెక్కల పెంపకం కొందరికి హాబీగా ఉండేది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌లా మారింది. కొందరు అందానికి, మరి కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే, ఇంకొందరు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని లక్షలు వెచ్చించి ఇంపోర్టెడ్ మొక్కలను పెంచుతున్నారు. దీంతో బాల్కనీ, డోర్స్‌ముందు ఖాళీ ప్రదేశంలోనే మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతున్నారు.
చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
ముఖ్యంగా గాలిలోని టాక్సిన్‌లను హరించే హెర్బల్ ప్లాంట్స్, ఆక్సిజన్ స్థాయిలను పెంచే అరుదైన మొక్కలు, ఆహ్లాదాన్ని అందించే అలంకరణ మొక్కలు ఎంపిక చేసుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సకులెంట్స్, డిజర్ట్ ప్లాంట్స్ పెంచుతున్నారు. మరికొందరు అరుదైన లక్షణాలున్న మొక్క జాతులు, నీటిలో పెంచే ఆక్వా ప్లాంట్స్, బోన్సాయ్ మొక్కలు, క్రీపర్స్, హ్యాంగింగ్స్ పెంచుతున్నారు.

వివిధ రకాల మొక్కలు..
మోస్టరైజమ్, పెడల్‌లీఫ్, ఫిలిడాండ్రమ్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీస్ పెంచుకోవచ్చని నిపుణుల సూచన. ఇండోర్, ఔట్‌డోర్‌లోనూ పెరిగే మనీ ప్లాంట్, ఇంటి ముందు కానీ సూర్యరశ్మి పడే ఇంటిలోపలి వాతావరణంలో అడీనియం, అరేలియా, హెల్కోనియా, దురంతా, పెంటాస్, గ్లోరోఫైటమ్, గ్రోటాన్, పెనివత్, సైకస్ తదితర జాతి మెక్కలను పెంచుకోవచ్చు. విలాసవంతమైన ఇళ్లలో బర్డ్ ఆఫ్ ప్యారడైస్, మేరీ గోల్డ్‌లాంటి అరుదైన మొక్కలను పెంచుతున్నారు. నగర నలుమూలలా అన్ని రకాల మెక్కలు దొరికే నర్సరీలు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!