అత్యంత స్పైసీ హాట్‌ సాస్‌..జస్ట్‌ మూడు నిమిషాల్లో..! | Canadian YouTuber Eats More Than 1 Kg Sriracha Hot Sauce In Just 3 Minutes | Sakshi
Sakshi News home page

అత్యంత స్పైసీ హాట్‌ సాస్‌..జస్ట్‌ మూడు నిమిషాల్లో..!

Published Wed, Oct 9 2024 1:24 PM | Last Updated on Wed, Oct 9 2024 5:25 PM

Canadian YouTuber Eats More Than 1 Kg Sriracha Hot Sauce In Just 3 Minutes

కొంచెం నోటికి ఘాటుగా తగిలితేనే హ్హ..హ్హ అంటూ హాహాకారాలే చేస్తాం. ఎప్పుడైనా సరదాగా స్పైసీ ఫుడ్‌ తిన్న కూడా అమ్మ బాబోయ్‌ ఏంటీ ఘాటూ అని గోల చేసేస్తాం. అలాంటిది ఇక్కడొక వ్యక్తి అత్యంత స్పైసీగా ఉండే రెండు సాస్‌ బాటిల్స్‌ని చక్కగా తినేసి గిన్నిస్‌ రిక్కార్డుల కెక్కాడు.

కెనడాకు చెందిన యూట్యూబర్‌ మైక్ జాక్  రెండు బాటిళ్ల చిల్లీ సాస్‌ని జస్ట్‌ మూడు నిమిషాల్లో హాంఫట్‌ చేసేశాడు. ఏదో తియ్యటి సూప్‌ తాగుతున్నట్లుగా తాగేసి ఔరా అనిపించుకున్నాడు. అత్యంత ఘాటుగా ఉండే సాస్‌ ఇది. కొంచెం టేస్ట్‌ చేయగానే కళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. అలాంటిది మన మైక్‌ దాన్ని అమృతం తాగినట్లు తాగిసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. 

పైగా ఈ స్టంట్‌ పూర్తి అయిన తర్వాత ఎలా తినేయగలిగావు ఈ సాస్‌ని అని ప్రశ్నిస్తే..తనకు ఫ్లేవర్‌ ఫెటీగ్‌ టెక్నీక్‌ని ఉపయోగించి తినేశానంటూ వివరణ ఇచ్చాడు. అంటే తనకిష్టమైన ఫ్రూట్‌ ఊహించుకుని ఆ రుచిని ఆశ్వాదిస్తూ తినడమే "ఫ్లేవర్‌ ఫెటీగ్‌" టెక్నిక్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం అతడు తింటుంటే మా నోటిలోకి నీళ్లు వచ్చేసాయని కామెంట్‌ చేస్తూ..పోస్టులు పెట్టారు.

 

(చదవండి: వామ్మో..! రాను రాను హోటల్‌లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement