
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్‌లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి.
కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్‌జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్‌పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!)