
ముఖ్య అతిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లివింగ్ టెంపుల్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని టి-వర్క్స్‌లో ప్రారంభమైంది. భారతదేశ ఆలయ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని చాటుకునే ఈ ప్రదర్శనలో టెంపుల్ ఆర్ట్ స్ఫూర్తితో 30 మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తారు. ‘లివింగ్ టెంపుల్’ పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల పాలు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సంస్కృతి, వారసత్వం మరియు యువజన వ్యవహారాల శాఖ, తెలంగాణ) స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు సర్వే శాఖ కెకె ముహమ్మద్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, “ఇది యువకులు, అనుభవజ్ఞులైన కళాకారులతో జమిలిగా కలిసి వచ్చే క్యాలెండర్ కార్యక్రమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కెకె ముహమ్మద్ మాట్లాడుతూ, “వివిధ రకాల వారసత్వ పర్యటనలు ఉన్నాయి కానీ,అవి ప్రజలను ఆకట్టుకునేలా వినూత్నంగా ఉండాలన్నారు. సందర్శకులకు ఈ ప్రదర్శనను ఆదరించడం ద్వారా సింగపూర్, చైనాలో లాగా ఈ స్మారక చిహ్నాలను జీవన వారసత్వంగా మార్చాలని అభిలషించారు.

మన వారసత్వాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, కళా దర్శకుడు తోట తరణి తన సెట్‌ను తీసివేసినపుడు, ఈ ప్రదేశంలో ఎలాంటి శిథిలాలు లేకుండా జాగ్రత్త పడతానని వివరించారు.

తెలంగాణ టూరిజం మద్దతుతో అన్నపూర్ణ మడిపడిగ క్యూరేట్ చేస్తున్న ‘లివింగ్ టెంపుల్’ దేశవ్యాప్తంగా ఉన్న 30 మందికి పైగా ప్రఖ్యాత కళాకారులు భారతీయ దేవాలయాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. 100 కి పైగా అద్భుతమైన కళాకృతులతో,సాంప్రదాయ ఆలయ కళ, సమకాలీన కళాత్మక వ్యక్తీకరణల అందమైన కలయికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అద్భుతమైన కళాఖండాల సేకరణతో పాటు - ఆర్ట్ - హెరిటేజ్ టూరిజం - ది మిస్సింగ్ లింక్ , ప్యానెల్ చర్చ, సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తోట తరణి, అమర్ రమేష్, ద్రధా, చరణ్ జీత్, పర్ణవి బంగర్, రాయన్న గిరిధర్ గౌడ్, సంగం వంఖడే, వినోద్ దరోజ్ లాంటి అనేక ప్రఖ్యాత కళాకారుల బృందం అద్భుతమై ప్రదర్శనివ్వబోతోంది. ఈ కార్యక్రమం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్, ఫోటోగ్రాఫర్ అమర్ రమేష్ , కళాకారుడు ద్రధా వ్రత వంటి నిపుణుల సహకారం తో ‘లివింగ్ టెంపుల్’ భారతీయ ఆలయ సంస్కృతి యొక్క సజీవ వారసత్వానికి ఒక వేడుక, ఒక మరపురాని అనుభవాన్ని మిగల్చినుంది అనడంలో సందేహంలేదు.
ఫిబ్రవరి 28 2025 మార్చి 2 వరకు సందర్శకులకు ఆహ్వానం
ప్రదర్శన: ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు
వేదిక : టి-వర్క్స్, శిల్ప్ గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, రాయ్ దుర్గ్, హైదరాబాద్, తెలంగాణ 500081.
మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.
అన్నపూర్ణ మడిపడిగ- 9052594901