
నాటో చేరాలనుకున్న స్వీడన్, ఫిన్లాండ్ ఆ కాంక్ష ఫలించింది. నాటో నాయకులు బుధవారం అధికారంగా కూటిమిలో చేరాలంటూ ఆయా దేశాలను ఆహ్వనించనున్నారు.
Agreement that paves the way for Finland and Sweden to join NATO: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చోకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయ్యిందని నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు.
ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతంకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను అధికారికంగా కూటమిలోకి చేరాలని ఆహ్వానిస్తారని స్టోలెన్‌బర్గ్ తెలిపారు. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాని కూడా అన్నారు.