
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
కాళేశ్వరం/పలిమెల: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రం, పలిమెల మండలకేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, అనిల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వ్యవసాయ అధికారి సుప్ర జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ