
బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి రూరల్: బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్ట్‌రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ వెల్పేర్ అసోసియేషన్ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగ రాజ్‌కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన రూ.లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.
జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్
శాస్త్రాల తిరుపతి