
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది.
– ఏపీజే అబ్దుల్ కలాం
ఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్‌కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు.