
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.
తీవ్ర ఇబ్బందులు
పడుతున్నాం..
పంట కోసిన తర్వాత వరి ధాన్యం చాలా తేమతో కూడుకొని ఉంటుంది. పది, పదిహేను రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. సరైన ఫ్లాట్‌ఫాంలు లేక రోడ్డపైన, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబెడుతున్నాం. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధాన్యం ఆరబోతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. ఫ్లాట్‌ఫాంల నిర్మాణానికి సహకరించాలి.
– తిరుపతిగౌడ్, రైతు, వెంకట్రావుపల్లి
ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే..
గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. మూడేళ్లుగా ఆ పథకం నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే రైతులకు తెలియజేస్తాం.
– నరేశ్,
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
●

వాతావరణం