Jayashankar District News
-
విజయం దక్కాలని ప్రత్యేక పూజలు
కాళేశ్వరం/రేగొండ: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి, త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ కాళేశ్వరాలయం, రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరాలయం దేవస్థాన ఈఓ ఎస్.మహేష్, స్థపతి వల్లినాయగం, ఎస్ఈ దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ ధర్మకర్తలు బండి మల్లయ్య, మల్లెబోయిన శ్రీధర్, మూల ఓంకార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాధిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందిస్తున్నామన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ)తో కూడా విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఉదయం రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులతో వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ సాధిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.డీఈఓ రాజేందర్ -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాలను ఇచ్చే విధంగా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు చేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. అందరినీ ఆకర్షిస్తాయి. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు ● -
అధికారులు కాళేశ్వరంలోనే ఉండాలి
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శనివారం నుంచి అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేసి, అన్ని ఏర్పాట్లను సమీక్షించి పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టేజీ, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈఓ కార్యాలయంలో వైద్య సిబ్బందితో వైద్య సేవలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు మహాదేవపూర్‌లో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అంబులెన్స్, 108 సేవలు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం వీవీఐపీ ఘాట్‌లోని త్రివేణి సంగమం వద్ద గోదావరిలో నీటిమట్టాన్ని పరిశీలించారు. సీఎం రానున్న నేపథ్యంలో ముందస్తుగా రక్షణ చర్యలను పర్యవేక్షించారు. వర్షం వచ్చినా టెంట్ సిటీ వద్ద బురద కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ ఎస్పీ కిషన్, సీఐ రామచందర్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీఎల్పీఓ వీర భద్రయ్య, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు ఉన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి కలెక్టర్ రాహుల్‌శర్మ -
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
జ్ఞానదీపం ఏర్పాటుకాళేశ్వరం: మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగింది. నాలుగు రోజులుగా మహారాష్ట్రలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా గోదావరికి స్వల్ప వరద పెరిగింది. ప్రస్తుతం 2,350 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతోంది. నాలుగు రోజుల క్రితం వరకు ఎండల తీవ్రత నేపథ్యంలో 1,800 క్యూసెక్కులు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నీరు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. టెంట్‌సిటీ రెడీ.. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్‌సిటీ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 30వరకు టెంట్లు, ఏసీలతో సిద్ధం చేసి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన సరస్వతిమాత విగ్రహం ఎదుట రెండు వైపులా జ్ఞానదీపం ఏర్పాటు చేశారు. రెండు చేతులు జోడించి తాళపత్ర గ్రంథాల్లో జ్యోతి వెలిగినట్లు కనిపించే సీఆర్సీతో తయారు చేసిన మెటల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేయించారు. -
అక్రమ సోదాలు సరికాదు..
భూపాలపల్లి అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కాకతీయ ప్రెస్‌క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రజా సమస్యలను వెలికితీస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సరికాదని జర్నలిస్టులు మండిపడ్డారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సామంతులు శ్యామ్, ఎడ్ల సంతోష్, దొమ్మటి రవీందర్, తిక్క ప్రవీణ్, సుధాకర్, రవీందర్, పసుపుల రాజు, వెంకటస్వామి, శేఖర్, పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని.. తేమశాతం 17 దాటకూడదని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ గురించి రైతులకు వివరించి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేందర్‌రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే పతనం తప్పదు
ములుగు: పత్రిక స్వేచ్ఛను హరిస్తే పసుపు రంగు ప్రభుత్వానికి పతనం తప్పదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా ములుగు సాక్షి ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునిల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ములుగు జాతీయ రహదారిపై నల్లా బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు షఫీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ‘సాక్షి’పై కక్షపూరితంగానే ఎడిటర్ ఇంటికి వెళ్లి పోలీసులతో ఏపీ ప్రభుత్వం డ్రామా ప్లే చేయించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎడిటర్లు, జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. పత్రిక స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతీ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదవి వారు హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ -
సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ..
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.– 10లోuకాళేశ్వరంతో పాటు చుట్టుప్రక్కల శివారుల్లో సుమారు 200కుపైగా సీసీ కెమెరాలు పోలీసులు అమర్చుతున్నారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 11, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. మొత్తం 25 లొకేషన్లలో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాలు 4 మెగా ఫిక్సల్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తు తం పుష్కరాల నేపథ్యంలో మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్ర ధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న గ్రావెల్ రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ద మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్ట పరిసరాలు, మహా రాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్‌స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు మరో 300 వరకు ఏర్పాటు చేస్తున్నారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్‌మెడల్ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్ అంతర్జాతీయ చాంపియన్ షిప్ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మల్హర్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) వాల్యనాయక్ కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం మండలంలో తాడిచర్ల, ఎడ్లపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని, కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, రైతులు ఉన్నారు. రేపు ఉద్యమకారుల ఫోరం సమావేశం కాళేశ్వరం : ఈనెల 10న (శనివారం) హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో ఉద్యమకారుల ఫోరం దక్షిణ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయుబోద్దిన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ నందగిరి రజినీకాంత్ పిలుపుమేరకు ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్‌రావు, మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొనన్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీలను రద్దుచేయాలి భూపాలపల్లి రూరల్: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అధికారులకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతిగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్‌తో పొన్నం భిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులును పక్కదారి పట్టిస్తున్నారని ఆరో పించారు. నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఓంకార్, నాయకులు మురారి సదానందం, నియోజకవర్గ అధ్యక్షుడు కొయ్యడ దామోదర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పాల్గొన్నారు. పరికరాల పంపిణీ భూపాలపల్లి అర్బన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం క్రీడా సామగ్రిని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అందజేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ వేసవి క్రీడా శిబిరాలకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ చిర్ర రఘు, సిబ్బంది శివ, క్రీడా కోచ్‌లు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి కాటారం: స్వశక్తి సంఘాల మహిళలు ఆర్థిక ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర నాన్ ఫార్మ్ సెర్ఫ్ డైరెక్టర్ జాన్సన్ అన్నారు. మండలకేంద్రంలోని జీవనజ్యోతి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ల శిక్షణ, కొత్తపెల్లి గ్రామంలో మహిళా శక్తి క్యాంటీన్లను గురువారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలను నాణ్యత ప్రమాణాలతో కుట్టి సకాలంలో అందించాలని సూచించారు. మహిళల ఆర్థిక బలోపేతానికి సెర్ఫ్ ద్వారా మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంలు రవి, నారాయణ, వీఓ సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
రేగొండ: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం మండలంలోని దమ్మన్నపేట, తిరుమలగిరి గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్ట్‌గా రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుంచి భూసమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, రైతులు ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీ చేసి, ప్రజలకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, కాంగ్రెస్ నాయకులు గంగుల రమణారెడ్డి, గంట గోపాల్, వెంకటస్వామి, పన్నాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహరిద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్‌మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్‌ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్‌క్వార్టర్స్‌కు మృతదేహాల తరలింపు -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ సౌజన్యంతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయడంతో పాటు, ప్రతీరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడికి లోనవుతారని అన్నారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 650 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబసభ్యులకు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీతో పాటు పలు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు డి.నరేష్కుమార్, మల్లేష్, యశోద ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. -
విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
కల్యాణలక్ష్మి నిరుపేదలకు వరం
చిట్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 52మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ కృష్ణ, మండల నాయకులు మూల శంకర్‌గౌడ్, చిలుకల రాయకొంరు, కిష్టయ్య, కుమార్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నిలిచిన దేవాదుల పంపింగ్
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలోని దేవాదుల మోటార్ల పంపింగ్‌ను నిలిపివేశారు. గత కొద్ది రోజుల నుంచి ఒక మోటార్ ద్వారా పంపింగ్‌ను కొనసాగించిన అధికారులు గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం పంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేశారు. పంపింగ్ వద్ద 10మోటార్లు ఉండగా గతంలో కొన్ని మోటార్లతో పంపింగ్‌ను కొనసాగించి వారం క్రితం బంద్‌చేసి ఒక మోటార్‌ను మాత్రమే పంపింగ్‌లో ఉంచారు. మంగళవారం వరకు ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేసిన అధికారులు బుధవారం ఒక మోటారు పంపింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంపింగ్ వద్ద 71.65 మీటర్ల నీటి మట్టం ఉంది. సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద.. తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కొన్ని రోజులుగా ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.727టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పూర్తిలెవల్ 83మీటర్లు కాగా 72.10 మీటర్లకు చేరుకుంది. బ్యారేజీలో 59గేట్లు ఉండగా అందులో 58 గేట్లను మూసి ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు 200క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో తగ్గిన నీటిమట్టం సమ్మక్క బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ -
ఖాళీ సీట్లకు లక్కీడ్రా
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకులంలో ఖాళీగా ఉన్న సీట్లకు నేడు(గురువారం) లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు గురుకుల ప్రిన్సిపల్ రవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించనున్నట్లు చెప్పారు. హానికర రసాయనాలు వాడొద్దు మల్హర్: మామిడికాయలు మాగబెట్టే ప్రక్రియలో హానికారక రసాయనాలు వాడొద్దని జిల్లా ఉద్యాన అధికారి సునీల్ అన్నారు. మామిడికాయలు మాగబెట్టే విధానంపై సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ ఆధ్వర్యంలో బుధవారం తాడిచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాయల పక్వత, కాయలు నిల్వచేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్‌రావు, డివిజన్ ఉద్యాన అధికారి మణి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, రైతులు సుద్దతి రాజేశ్వర్‌రావు, గంగుల రవి, నరేష్, బండి రాజేందర్, ఓదెలు, కుమార్ పాల్గొన్నారు. విశ్రాంతి గది ప్రారంభం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన విశ్రాంతి గదిని బుధవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగులు 35మంది పని చేస్తున్నారని, మహిళల భాగస్వామ్యం పెరిగిన దృష్ట్యా విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, వెంకటరమణ, జాకీర్‌హుస్సేన్, కార్మిక సంఘాల నాయకులు తిరుపతి, గట్టు రాజు పాల్గొన్నారు. పుష్కరాల పనులను పరిశీలించిన సీఎండీ కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మన్‌ను ప్రారంభించారు. ఆయనతో రాజుచౌహాన్, ఎస్ఈ మల్చూరు నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ కమిషనర్ పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు బుధవారం దర్శించుకున్నారు. ఆయన రాజగోపురం వద్దకు రాగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి దర్శనం అనంతరం కమిషనర్‌ను అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ శనిగెల మహేష్ స్వామి వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ సంధ్యారాణి, ఏసీ సునీత, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు భూధార్ కార్డులు
రేగొండ(కొత్తపల్లిగోరి): ఆధార్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్ (భూధార్ కార్డు)ను కేటాయిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తెలిపారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక రైతువేదికలో ఫార్మర్ రిజిస్ట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోందన్నారు. రైతు యూనిక్ కోడ్ పొందాలంటే ఆధార్‌కార్డుతో పాటు లింక్ చేసిన సెల్‌ఫోన్ నంబరు, పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు తమ వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్, రైతులుపాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలి
కాటారం: రైతులు ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటా రం మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గారెపల్లి, ధన్వాడ, శంకరాంపల్లి, రేగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం డీసీఓ పరిశీలించారు. ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు సాగుతున్న ప్రక్రియ, రవాణా తదితర అంశాలపై ఆరాతీశారు. ధాన్యం నాణ్యత, తేమశాతం పరిశీలించారు. కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని పీఏసీఎస్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని వెను వెంటనే తరలించాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీసీఓ వెంట మానిటరింగ్ ఆఫీసర్ రిలీఫ్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీశ్, సిబ్బంది ఉన్నారు. -
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
– 8లోuఉపాధి పనులపై ఎండల ప్రభావం ● ప్రభుత్వం ప్రకటించింది రూ.307 ● జిల్లాలో మాత్రం రూ.185 నుంచి రూ.240 వరకే.. ● పనే వేతనానికి ప్రామాణికం అంటున్న అధికారులు కాటారం: ఉపాధి హామీ పథకంలో కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం రోజుకు రూ.307 ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం సగటు కూలి కేవలం రూ.224 మాత్రమే అందుతోంది. సిబ్బంది కూలీలకు నిర్దేశిత కొలతలు (మార్కింగ్) ఇస్తున్నప్పటికీ ఆ దిశగా పనులు చేయకపోవడంతోనే గిట్టుబాటు కూలి దక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, పనుల ప్రగతిపై పకడ్బందీగా ఆడిట్ నిర్వహిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కాగా కొలతలు నమోదు చేస్తున్నారు. దీంతో కూలీలకు గిట్టుబాటు కూలి అందకపోవడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు పనుల్లో త్వరగా అలసిపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన కూలి దక్కించుకోవడంలో విఫలమవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.న్యూస్రీల్జిల్లాలో ఉపాధి హామీ వివరాలు..ఉపాధి హామీ అమలయ్యే మండలాలు 11 గ్రామపంచాయతీలు 244 గ్రామాలు 391 జాబ్‌కార్డులు 1,09,843 కూలీల సంఖ్య 2,41,667 -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
చిట్యాల: కొనుగోలు కేంద్రాలలో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని సెంటర్ ఇన్‌చార్జ్‌లు త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సెంటర్ సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎఈఓ సన్నీ, రైతులు పాల్గొన్నారు. ఫార్మర్ ఐడీ తీసుకోవాలి టేకుమట్ల: రైతులందరూ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి కల్యాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు వలే రైతులందరికీ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాహుల్, భరత్, అరుణ్, యోగిత పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్‌ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్‌రోల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారిఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్‌నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్‌నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
హేమాచలుడి బ్రహ్మోత్సవాలు
మంగపేట: మల్లూరుగుట్టపై స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) రేపటి(గురువారం) నుంచి పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు (వేదపండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవంగా దేవతామూర్తుల కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం 12వ తేదీ ఉదయం 9గంటలకు ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తుల కల్యాణం, మధ్యాహ్నం 12.23 గంటలకు లభిజిన్ లగ్నంలో ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఆలయం, అభయాంజనేయస్వామి, దైత అమ్మవారి ఆలయంతో పాటు తదితర ఆలయాలు, ప్రధాన ఆర్చీలను వివిధ రాకల రంగులతో అలంకరించారు. జాతర ప్రాంగణంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. భారీగా తరలిరానున్న భక్తులు జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవాదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవాన్ని కూర్చోని తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేటినుంచి 10 రోజుల పాటు జాతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు -
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ రేగొండ: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మడ్తపల్లి, పొనగండ్ల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రజాక్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, వినోద్, నరేందర్ పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ఎస్‌ఎస్‌తాడ్వాయి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఆశ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఆశ డేను పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని కొడిశాల పీహెచ్‌సీని సందర్శించి ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ ఆశ కార్యకర్త విధిగా తెమడ పరీక్షలు చేయించాలన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్ధం చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుట్టపై తాత్కాలికంగా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్‌లు, నీడకోసం ఏర్పాటు చేస్తున్న తడుకల పందిల్లు, పార్కింగ్ స్థలం, సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాల వివరాలను ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి చేయాలని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఇరిగేషన్, పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రు, పంచాయతీ కార్యదర్శి అజ్మత్ తదితరులు ఉన్నారు. -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్‌లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్‌లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరిని అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్‌కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్‌లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా పేచీ.. -
మార్క్సిజంతోనే ప్రజా సమస్యల పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కారల్‌మార్క్స్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మార్క్సిజం పరిష్కారం చూపుతుందన్నారు. మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడి అతి కొద్ది మంది చేతుల్లో పోగుబడి ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ -
భద్రకాళి అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వక్యాన ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన అనంతరం అమ్మవారి స్వపనమూర్తికి గంధంతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. పూజాకార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల పద్మశాలి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడెపు రవీందర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కోఆర్డినేటర్ పడ్నాల నరేందర్, కుసుమ సతీష్, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
రేగొండ: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ, లింగాల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టం ద్వారా రైతులకు భూమి హక్కు రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారన్నారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రజాక్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, బోయిని వినోద్, కోసరి నరేందర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
భూ సమస్యలే ఎక్కువ..
భూపాలపల్లి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 52 దరఖాస్తులు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వినతులను కలెక్టర్ రాహుల్‌శర్మ స్వీకరించి, పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వే నంబర్ లేదు.. పట్టా లేదు.. నా పేరు మేదరి వీరస్వామి. మాది చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామం. నాకు ముచినిపర్తి శివారులో 14 గుంటల భూమి ఉంది. ఇప్పటివరకు ఆ భూమికి సర్వే నంబర్ లేదు. పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. ఈ విషయమై తహసీల్దార్, కలెక్టర్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయించలేదు. మళ్లీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా. భూమి మా ఆధీనంలో ఉన్నా ఎటువంటి కాగితం లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. భూమికి పరిహారం ఇప్పించండి.. మా ఊరు వెలిశాల శివారులోని 359 సర్వే నంబర్లో నాకు 12 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి మీదుగా మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం జరగబోతుంది. నాకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. నష్ట పరిహారం అందించలేదు. ఇప్పటికై నా తగు విచారణ జరిపించి భూమికి పరిహారం ఇప్పించండి. – ఎండీ నైమా, వెలిశాల, టేకుమట్ల నా భూమిని కబ్జా చేశారు.. మా ఊరి శివారులోని సర్వే నంబర్ 831లో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాతగారి పేరుపై ఉన్న ఆ భూమిని 2017లో పెద్ద మనుషుల సమక్షంలో మా నాన్న బండారి రమేష్, పెద్దనాన్న పోషాలు పంచుకున్నారు. కానీ మాకు తెలియకుండా 2018లో ఆ భూమి మొత్తాన్ని మా పెద్దనాన్న తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. ఇప్పటికై నా గ్రామంలో విచారణ చేపట్టి, ఆ పట్టాను రద్దు చేసి మాకు సగ భాగం వచ్చేలా చూడాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను. – బండారి వేణు, జగ్గయ్యపేట, కొత్తపల్లిగోరి ప్రజావాణికి 52దరఖాస్తులు వినతులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్‌శర్మ -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, పలువురికి విద్యుత్ సేఫ్టీ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దన్నారు. తడి చేతులు, కాళ్లకు చెప్పులు లేకుండా కరెంటు వస్తువులను తాకొద్దని వివరించారు. విద్యుత్ వైర్లు తెగి రోడ్ల మీద పడినప్పుడు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ అశోక్, లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్యతో పాటు లైన్మెన్లు రాజమౌళి, రవి, శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్లు అమర్, సతీష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందించాలి
భూపాలపల్లి రూరల్: ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్‌లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో 16మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాధితుల సమస్యలు సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. చర్యలు తీసుకోవాలి భూపాలపల్లి రూరల్: గ్యాస్ సిలండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ గోదాముల యాజమానులపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భిక్షపతి మాట్లాడారు. లబ్ధిదారులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ సిలెండర్లను రూ.100నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ ఏజెన్సీలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు బెల్పగొండ మహేందర్, మేకల ఓంకార్, మురారి సదానందం, కొయ్యడ దామోదర్ ఉన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలో 18 సంవత్సరాల బాలబాలికలు పీఎంఆర్బీపీ పురష్కారం కోసం జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏరంగంలోనైనా, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్ టెక్నాలజీలలో ప్రతిభ కనబర్చిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 94910 51676 నంబర్లో సంప్రదించాలన్నారు. ముగిసిన జాతర వేలం పాటలు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) వేలం పాటలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ వేలం పాటలను ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. జాతర సందర్భంగా మే 8వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణం పరిధిలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారుచేసి విక్రయించేందుకు మల్లూరుకు చెందిన మారబోయిన గోవర్ధన్ రూ 3,19,116, స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు జగిత్యాలకు చెందిన ప్రసాదం రాంబాబు రూ 2,17,000లకు వేలం పాటను దక్కించుకున్నట్లు ఈఓ సత్యనారాయణ తెలిపారు. రేపు తెలుగుభాష పరిరక్షణపై చర్చా గోష్టి హన్మకొండ కల్చరల్ : తెలుగుభాష పరిరక్షణపై ఈనెల 7న ఉదయం 10 గంటలకు హనుమకొండ పింజర్లరోడ్లోని రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో చర్చా గోష్టి నిర్వహిస్తున్నట్లు కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ విద్యలో రెండో ఆప్షన్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ జీఓ జారీ చేసిందని, దీనిని వ్యతిరేకిస్తూ తెలుగు భాషాభిమానులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కవులు, రచయితలు నిరసన వ్యక్తం చేయగా జీఓ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా ఇప్పటి వరకు కళాశాలలకు ఉత్తర్వులు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొనాలని కోరారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
– 8లోuనా పేరు గోగుల సమ్మక్క. మాది మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామం. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమి ఇస్తే గ్రామ పంచాయతీలో పని ఇస్తామని చెప్పడంతో మా భూమి ఇచ్చాము. 2018లో నా భర్త బ్రహ్మయ్యను పంప్ ఆపరేటర్‌గా తీసుకున్నారు. 2022లో నా భర్త చనిపోయాక నన్ను పీఎండబ్ల్యూ వర్కర్, పంప్ ఆపరేటర్‌గా తీసుకున్నారు. అయితే ఆన్లైన్ చేయలేదు. వేతనం పెంచడం లేదు. ఇప్పటికి 11 నెలల జీతం రావాలి. పూట గడవడం ఇబ్బందిగా ఉంది. నా ఉద్యోగాన్ని ఆన్లైన్ చేసి ఏ నెల జీతం ఆ నెల వచ్చేలా చూడాలి. 11 నెలల జీతం చెల్లించండి..న్యూస్‌రీల్ -
ములుగులో మోడల్ బస్టాండ్
ములుగు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు వచ్చే నెలలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఈడీతో మాట్లాడి ప్రతినెలా చేపడుతున్న పనులపై నివేదిక ఇచ్చి పనుల్లో వేగం పెంచాలని సూచించామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 32గుంటల స్థలంలో రూ.4.81 కోట్ల వ్యయంతో గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్గా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 1989లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క చెప్పగానే వెంటనే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మోడల్ బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మంగపేట మండలంలో రూ.50లక్షలతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏటూరునాగారం డివిజన్లో చేపట్టనున్న బస్‌డిపో పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గట్టమ్మ ఆలయం సమీపంలోని గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ భవనం, వైద్య కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మినీ బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారని, అధికారులు నివేదిక అంచనా ఇస్తే రూ.45లక్షలతో పనులు చేపడతామని వివరించారు. బీసీలకు 42శాతం అమలుకు కృషి అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వివరించారు. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో ఉన్న కారణంగా రవాణా పరంగా ఆర్టీసీ సేవలు అవసరం అని చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి అడిగినన్ని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ప్రభాకర్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన మంత్రి పొన్నం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ నుంచి పార్టీ కార్యకర్తల భారీ బైక్‌ర్యాలీ నడుమ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు భారీ గజమాలతో సత్కరించారు. దేవగిరిపట్నం గ్రామంలో బాలబ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, నందీశ్వర, ధ్వజస్తంభ, గణపతి, దక్షిణామూర్తి, సుబ్రమణ్యేశ్వర స్వాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ఘనంగా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. లీలాగార్టెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తాం.. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
డేంజర్ మలుపులు
పొంచి ఉన్న ప్రమాదం.. ఈనెల 15నుంచి సరస్వతి పుష్కరాలుకాళేశ్వరం: పన్నెండేళ్లకొకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా రానున్నారు. ఈనెల 15నుంచి 26వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారు. కాటారం టు కాళేశ్వరం వంతెన వరకు ఎన్‌హెచ్ 353(సీ) రహదారిపై 20కిపైగా మలుపులు ఉన్నాయి. కాళేశ్వరం టు వయా మద్దుపల్లి మీదుగా గంగారం వరకు ఆర్అండ్బీ రోడ్డుకు సంబంధించి పలుచోట్ల ‘మహా’డేంజర్ మలుపులు ఉన్నాయి. తెలియని వారు ఆదమరిచి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచికబోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే ప్రయాణం సాఫీగా సాగనుంది. పలురాష్ట్రాల భక్తుల రాక.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేయనున్నారు. భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ రహదారుల వెంట వస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి.. పుష్కరాలు జరిగే రోజుల్లో పోలీసులు వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి. మద్యం మత్తులో మలుపులు తెలియక అడవిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలకు ఢీకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ దిశగా అధికార యంత్రాంగం దృష్టిసారించాలి.సూచిక బోర్డులేవి..రహదారుల వెంట సూచికబోర్డులు, ఫ్లెక్సీలు దారులు తెలిపేలాగా అమర్చితే ప్రమాదాలు నివారించొచ్చు. మలుపులపై అవగాహన లేకపోతే రోడ్డు ప్రమాదాల భారినపడే ప్రమాదం ఉంది. ఇటీవల మహాశివరాత్రి రోజు స్కూటీపై దర్శనానికి వచ్చి వెళ్తున్న దంపతులు అన్నారం మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. భార్య భాగ్యలక్ష్మి (50) అక్కడికక్కడే మృతిచెందింది. వారం రోజు కిందట మంథనికి చెందిన కుడుదుల అనిల్(20)బైక్‌పై వచ్చి ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డాడు. మలుపుల వద్ద అధికారులు దృష్టి సారించకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచిక బోర్డులు, ప్రమాదాలు జరిగే ప్రదేశం లాంటి ప్లెక్సీలు పెడితే డ్రైవర్లకు అవగాహన వస్తుంది.ఆదమరిస్తే అంతే..కాటారం టు కాళేశ్వరం వరకు, కాళేశ్వరం టు గంగారం రహదారుల్లో మలుపులు చాలా వరకు ఉన్నాయి. కాళేశ్వరం వంతెన నుంచి మహదేవపూర్ వరకు సుమారు 18వరకు మలుపులు ఉన్నాయి. గంగారం దారిలో 10కి పైగా మలుపులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఆదమరిస్తే ప్రాణాలు గాలిలో కలువాల్సిందే. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు గంగారం వరకు పలుచోట్ల మలుపులు ఆదమరిచి వాహనాల్లో ప్రయాణిస్తే ప్రమాదాలకు అవకాశం మలుపుల వద్ద సూచిక బోర్డులు కరువుప్రమాదాలు జరగకుండా చర్యలు.. సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నాం. ఫ్లెక్సీలు, సూచిక బోర్డులు ప్రైవేట్ ఏజెన్సీకి ఎండోమెంట్‌శాఖ అప్పగించింది. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తాం. – రామచందర్‌రావు, సీఐ, మహదేవపూర్ -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ ఆలయంలో మంత్రి పూజలు
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి స్వగ్రామం కాటారం మండలం ధన్వాడలోని శ్రీదత్తాత్రేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సం వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు కృష్ణమోహన్‌శర్మ ఆధ్వర్యంలో 32మంది వేద బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు కొనసాగించారు. మంత్రి చేతుల మీదుగా పుణ్యాహవాచనము, గణపతి పూజ, 54 కళశములతో పూజ, మూల విరాట్ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పార్చన, దత్తహోమం జరిపించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ వార్షికోత్సవ, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటుగా పాల్గొన్నారు. విప్‌ను మంత్రి శాలువాతో సత్కరించి ఆలయ మెమోంటోను బహుకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఆయన తల్లి జయమ్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రికి వినతుల వెల్లువ.. ధన్వాడకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుకు పలువురు ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధిక సంఖ్యలో ప్రజలు మంత్రికి విన్నవించారు. దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఇవ్వబోమని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. -
సరస్వతి అమ్మవారి విగ్రహం వచ్చేసింది..
తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో సరస్వతి అమ్మవారి విగ్రహం, నాలుగు వేదమూర్తుల విగ్రహాలు ఆదివారం సాయంత్రం కాళేశ్వరానికి వచ్చాయి. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం త్రివేణి సంగమ తీరంపైన దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.కోటితో బేస్మెంట్స్టాండ్ నిర్మాణం, విగ్రహ తయారీ పనులు చేపట్టారు. సోమవారం విగ్రహాన్ని కాంక్రీటు బేస్మెంట్ స్టాండ్‌పై ఇన్స్టాల్ చేయనున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూర వేదమూర్తులను ఆసీనులు చేస్తారు. తరువాత లాన్, ఇతర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. – కాళేశ్వరం -
భూ సమస్యలు పరిష్కరించే దిశగా..
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జిల్లాలో అమల్లోకి రానుంది. ౖపైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో రేగొండ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. నేటినుంచి ఇద్దరు తహసీల్దార్లు, అధికారులు, సిబ్బందితో కూడిన రెండు బృందాలు రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే జిల్లాలో గతనెల 17నుంచి ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. పైలెట్‌గా రేగొండ మండలం సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రెండు బృందాలను నియమించారు. ఈ బృందాలకు రైతులు నేరుగా భూ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. భూ తగాదాలు, వారసత్వ బదిలీలు, మ్యూటేషన్లు, ఏ సమస్య ఉన్నా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించనున్నారు. వెనువెంటనే సమస్యలు పరిష్కారం కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేక మంది తమ భూమి హక్కుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో భూ ప్రక్షాళన సందర్భంగా అనేక తప్పులు దొర్లడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గతంలో సుమారు 50 వేలకు పైగానే సాదాబైనామాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ చట్టం రావడంతో పరిష్కారమయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసైన్డ్, అటవీ భూముల వద్ద కూడా వివాదాలున్నాయి. పార్ట్–బీలో పేర్కొన్న నిషేధ జాబితాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతి భూమికి భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య నంబర్లు సైతం ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టాన్ని రూపొందించారు. తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సైతం మ్యూటేషన్ అధికారం కల్పించడం వంటివి ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రస్తుతం రేగొండ మండలంలో దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. నూతన చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తే చాలామందికి ఉపశమనం కలుగనుంది. ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదన్నది దరఖాస్తు చేసుకున్న రైతులకు నివేదిక అందిస్తారు. జిల్లా మొత్తం అమలైతే భూ సమస్యలు దాదాపుగా తీరే అవకాశాలుంటాయి. టీమ్–2 సత్యనారాయణస్వామి గణపురం తహసీల్దార్ భరత్, డీటీ దేవేందర్, ఆర్ఐ నిరజంన్, సర్వేయర్ రహ్మత్‌పాషా, ఆర్ఐ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ హరీష్‌కుమార్, ఆపరేటర్ పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..) లింగాల 5వ తేది పొనగండ్ల 6వ తేది భాగిర్థిపేట 7వ తేది రామన్నగూడెం 8వ తేది దమ్మన్నపేట 9వ తేది టీమ్–1 శ్వేత, రేగొండ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, డీటీ భరత్‌కుమార్, ఆర్ఐ వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతి, సర్వేయర్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ రాజు, ఆపరేటర్ పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..) కొడవటంచ 5వ తేది మడ్తపల్లి 6వ తేది రేగొండ 7వ తేది తిరుమలగిరి 8వ తేది కనిపర్తి 9వ తేది రేపాక 12వ తేదిపైలట్ ప్రాజెక్ట్టుగా రేగొండ మండలం ఎంపిక నేటినుంచి 12వరకు గ్రామాల్లో పర్యటన -
వెంకటరమణకు గోల్డ్‌మెడల్
చిట్యాల: యాంటీ పైరసీ నివారణలో మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన అప్పాల వెంకటరమణ ముంబయిలో జరిగిన కార్యక్రమంలో శనివారం సినీనటుడు అమీర్‌ఖాన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. సోషల్‌మీడియాలో యాంటీపైరసీ నివారణ, సినిమా రంగం, టెలివిజన్లపై ముంబయిలో నాలుగు రోజులుగా ప్రపంచ స్ధాయి వేవ్స్ సమ్మిట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు న్యూరోనిక్స్ ల్యాబ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపీనికి చెందిన వెంకటరమణ, కమిటీ సభ్యుడు సినీ దర్శకుడు తేజ హాజరయ్యారు. 32 కేటగిరిలో యాంటీ పైరసీ కేటగిరిలో సాఫ్ట్వేర్ ఎలా నివారించాలనే విభాగంలో అప్పాల వెంకటరమణ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను సబ్మిట్ చేయగా ఆయన గోల్డ్‌మెడల్‌కు ఎంపికై అవార్డు అందుకున్నారు. -
పేదల కోసమే సన్నబియ్యం పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదోడి కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆమె పర్యటించారు. పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతినగర్ కాలనీలో పేద దళితుల ఇంట్లో కాలనీవాసులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఇన్చార్జ్ కుమారి, స్టేట్ సెక్రటరీ హారిక, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు సుగుణ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు -
రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని అన్ని గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జీఎం బొగ్గు ఉత్పత్తి, ఉత్పదాకతపై జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్లు, షిప్ట్ ఇన్‌చార్జ్‌లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులకు తప్పనిసరిగా ఇన్సెంటివ్ రావాలంటే నిర్దేశించిన టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చూడాలన్నారు. కార్మికులు 22రోజులకు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ప్రాజెక్ట్ అధికారులు, ఏజెంట్లు భిక్షమయ్య, వెంకటరమణ, అధికార ప్రతినిధి మారుతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు సింగరేణి ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అభినందించి ప్రోత్సాహక బహుమతులను అందించారు. 548మార్కులు సాఽధించిన ఎం.ఆశ్రితతో పాటు 500పై మార్కులు సాధించిన విద్యార్థులకు జీఎం కార్యాలయంలో శనివారం ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, అధికారులు రాజు, శ్రావణ్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి -
రోడ్లపైనే సిట్టింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని వైన్‌షాపుల ఎదుట బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు సిట్టింగ్ చేస్తున్నారు. సుభాష్‌కాలనీ, హన్మాన్నగర్, జవహర్‌నగర్ కాలనీల సమీపాల్లో ఉన్న వైన్‌షాపులకు పర్మిట్ రూమ్‌లు ఉన్నప్పటికీ పలువురు మందుబాబులు షాపుల ఎదురుగా, పక్కన రోడ్లపై, ఇతర దుకాణాల ఎదుట బహిరంగానే మద్యం సేవిస్తున్నారు. షాపుల పక్కన కాలనీల మహిళలు, దారి వెంట వెళ్లే మహిళలు, బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మద్యపానంతో రోడ్డుపైనే మలమూత్ర విసర్జన చేయడం ఖాళీ సీసాలను పగలకొట్టడం లాంటి వికృత చేష్టలు చేపడుతున్నారని కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. సుభాష్‌కాలనీలోని వైన్‌షాపును తొలగించాలని గతంలో మహిళలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై జిల్లాకేంద్రంలో పోలీస్‌యంత్రాంగం ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై వాహనాలను పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా కనీసం అటువైపు చూడటం లేదు. జిల్లా కేంద్రంలో పొద్దంతా బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా నడుస్తుంది. వార సంత, కేటీకే–5వ గని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకాల, అంబేడ్కర్ క్రీడా మైదానం, బాంబులగడ్డ, మంజూర్‌నగర్‌లో వెంచర్ల ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా బహిరంగ మద్యపానం ఇబ్బందులు పడుతున్న మహిళలు -
ఏర్పాట్ల పరిశీలన
ములుగు: జిల్లాకేంద్రంలో నూతన బస్‌స్టేషన్ పనులను ప్రారంభించడానికి నేడు మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ముందుగా ఉదయం 9గంటలకు గట్టమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌కు బైక్ ర్యాలీగా వస్తారు. బస్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం లీలా గార్డెన్లో నిర్వహించే సభకు మంత్రులు హాజరవుతారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ రవీందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుశాఖ తరఫున భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన
రేగొండ: మండలంలోని కనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల స్థలాలను శనివారం పరిశీలించారు. ఇళ్ల సర్వే ను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పద్మ, తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా రేగొండ రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిలో భూ సమస్యల పరిష్కారం కోసం రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు తహసీల్దార్ శ్వేత తెలిపారు. ఈ నెల 5నుంచి 20వరకు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో అధికారులు రైతుల సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. రెవెన్యూ సదస్సులపై సలహాలు, సూచనల కోసం మండలకేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6న జాబ్‌మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాఽధి కల్పన అధికారి శ్యామల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీవీసీ మోటార్స్ ప్రైవేట్ కంపెనీలలో ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌కేర్, టెలికాలర్, యాక్సెసరీస్ ఎగ్జిక్యూటివ్స్ల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పదవ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. 18నుంచి 28సంవత్సరాలలోపు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97010 78288, 95814 32500 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. రేపు కాళేశ్వరంలో బీఆర్ఎస్ బృందం పర్యటన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ శాసన సభ్యుల బృందం 5న సోమవారం ఉదయం 11గంటలకు పర్యటిస్తున్నట్లు మాజీ సర్పంచ్‌లు శ్రీపతి బాపు, వెన్నపురెడ్డి వసంతమోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎండగొట్టి అటు రైతులకు సాగునీరు, తాగునీరు లేకుండా చేసిందన్నారు. త్వరలో జరగనున్న సరస్వతినది పుష్కరాలకు పుష్కర స్నానానికి కూడా గోదావరి నది అడుగంటిపోతున్న సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పంటనష్టం పరిశీలన భూపాలపల్లి రూరల్: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్‌కుమార్, మహదేవపూర్ డివిజన్ అధికారి మణి శనివారం పరిశీలించారు. గణపురం మండలం బుర్రకాయలగూడెంలోని మామిడి తోటలతో పాటు రేగొండ మండలంలోని రేపాక, బాగిర్థిపేటలోని అరటి తోటలను పరిశీలించారు. మహాముత్తారం మండలం పోలారంలో మునగ తోటలను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశానుసారం పంట నష్టం అంచనా వేస్తున్నామని, పూర్తిగా నష్టం వివరాలను సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారి సునీల్ తెలిపారు. పంటలు నష్టం జరిగితే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు గాని, మండల వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఎండోమెంట్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. పనులు త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. -
రైతుకు గుర్తింపు..
ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్యకాటారం: అన్నదాతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఆధార్‌కార్డు తరహాలో భూధార్ కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. 11 నంబర్లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన భూధార్‌కార్డు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 5నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే భూధార్కార్డుల జారీకి అవసరమైన వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఈఓలకు తగు సూచనలు చేశారు. రైతు సమగ్ర సమాచారం ఒకే చోట.. రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలను ఒకే చోట ఉండేలా నూతన విధానానికి కేంద్రం సంకల్పించింది. దేశ పౌరులకు ఆధార్‌కార్డు మాదిరిగా రైతులకు భూధార్ కార్డులతో గుర్తింపు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుకు సంబంధించిన భూ కమతానికి 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్)ను కేటాయించనున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అధికారులకు శిక్షణ ఇచ్చారు. రైతులకు కేటాయించిన భూధార్‌కార్డు నంబర్ క్లిక్‌చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. సర్వే నంబర్లు, రైతు స్వగ్రామం, భూమి ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది, అది సారవంతమైనదేనా..? ఆ భూమి ఏ పంటలకు అనువైనది..దానిపై సదరు రైతుకు బ్యాంకు అప్పు ఎంత ఇవ్వొచ్చు అనే వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్ నిధి, పంటనష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందపరచనున్నారు. ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టా పాస్‌బుక్, ఇతర పత్రాలను రైతు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెలనంబర్ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది. ఈ–ఫార్మర్ రిజిస్ట్రీ.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీచేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ–ఫార్మర్ రిజిస్ట్రీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలులోకి తెచ్చిన ఈ విధానం విజయవంతం అయింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతో పాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్(ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డాటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల ఈ–ఫార్మర్ రిజిస్ట్రీని రూపొందిస్తారు. భూధార్‌కార్డు ఉంటేనే.. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతి రైతుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసి భూధార్‌కార్డులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు చేపట్టి రైతులకు భూధార్కార్డులపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్డుల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వ్యవసాయశాఖ అధికారులు వివరించనున్నారు. ఈ కార్డులు ఉంటేనే ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు రైతులు పొందగలుగుతారు. రైతుకు సంబంధించిన ప్రతి వివరాలు కాగితాలు లేకుండానే ఆన్లైన్లో చూసుకోవడానికి కార్డు నంబర్ ఉపయోగపడుతుంది. ప్రతీ రైతుకు భూధార్‌కార్డు.. జిల్లాలోని ప్రతి రైతుకు భూధార్‌కార్డు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. రైతువేదికల వద్ద వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన వివరాలు సేకరించి ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో పొందుపరుస్తారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ–ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి ఏఓ, ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ నెల 5నుంచి 15వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. – వీరూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అందుబాటులోకి ప్రత్యేక యాప్ పీఎం కిసాన్ సమ్మాన్‌కు ఈ కార్డు తప్పనిసరి గ్రామాల్లో రైతు వేదికల వద్ద వివరాలు నమోదు -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
IIలోరాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డి పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష -
15 వరకు టెన్త్ సప్లిమెంటరీ ఫీజు గడువు
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు సబ్జెక్ట్‌ల వారీగా ఎటువంటి అపరాద రుసుం లేకుండా అన్లైన్లో ఫీజు చెల్లించాలని సూచించారు. మొదటి నెలలో 70 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ మాసంలో బొగ్గు ఉత్పత్తి 70శాతమే సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ఏరియాలో ఉత్పత్తి వివరాలను శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గడిచిన మాసంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 3.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. 2.70లక్షల ట న్నుల బొగ్గును వెలికి తీసినట్లు తెలిపారు. 3.85లక్షల టన్నుల బొగ్గు రవాణాకు 3.25లక్ష ల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఓసీ 2, 3 ప్రాజెక్ట్‌లో 1.35లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉండగా 1.10లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీసినట్లు తెలిపారు. ఏరియాలో ఉత్పత్తిని పెంచడానికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ పని గంటలను పెంచడానికి, రక్షణ నియమాలు పాటిస్తూ పని చేయాలని సూచించారు. పునరుద్ధరణ పనుల పరిశీలన రేగొండ: మండలంలోని తిరుమలగిరి, రామన్నగూడెం, కొత్తపల్లి బి, కొత్తపల్లిగోరి మండలంలోని కొనరావుపేట, జగయ్యపేట గ్రామాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో వీచిన వర్షానికి చెట్లు విరిగి తీగల మీద పడడంతో స్థంభాలు విరిగి, ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. కాగా శుక్రవారం విద్యుత్ పునరుద్ధరణ పనులను సీఎండీ కర్నాటీ వరుణ్‌రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. విరిగిపడిపోయిన స్థంబాల పునరద్ధరణ పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందించాలన్నారు. కా ర్యక్రమంలో సీజీఎం రాజుచౌహన్, జీఎం సు రేందర్, ఎస్ఈ మల్సూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈలు రాజు, వెంకటరమణ, సురేష్, విశ్వాసరెడ్డి పాల్గొన్నారు. వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కేంద్రంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రఘు శుక్రవారం ప్రారంభించారు. 14 సంవత్సరాల లోపు ఆసక్తిగల పిల్లలు ఈ శిబిరంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలపాటు జూన్ 6వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్కారి ప్రభాకర్, కోచ్ మోటం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 63 మంది పోలీసు సిబ్బంది బదిలీ భూపాలపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా 63 మంది పోలీసు సిబ్బందిని వివిధ పోలీస్స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లపాటు పని చేసిన సిబ్బందికి స్థానచలనం కల్పించారు. పోలీస్స్టేషన్లలో ఖాళీల ను సిబ్బందికి తెలుపుతూ, సీనియారిటీ ప్రకా రం ఆయా ఠాణాలకు కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బదిలీ ల్లో మొత్తం 63 మంది ట్రాన్స్ఫర్ కాగా 52 మంది కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఎస్సైలు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఓ వసీం ఫర్హాన, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ సీఎంఆర్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్‌గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్‌టైమ్‌లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్‌గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్‌లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్‌లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వొద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబ య్యకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు. -
నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
● డీపీఓ వీరభద్రయ్య రేగొండ: వేసవిలో నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య సూచించారు. మండలంలోని రంగయ్యపల్లి గ్రామపంచాయతీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలోని పలు రికార్డులను పరి శీలించారు. అలాగే సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. అనంతరం కొడవంటచ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జీవిత పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి ● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ మల్హర్: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాడిచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించి ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించా రు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా తక్షణమే కేటా యించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో తాలు, తరు గు పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేయొద్దని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్య త లేదని కేంద్రాలు ఇన్‌చార్జ్‌లు పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ మాయంక్సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, తహసీల్దార్ రవికుమార్, రైతులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
కాళేశ్వరం: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపా రు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరు వు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గు రువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నష్టపోయిన రైతుల పంటల వివరాలను నమో దు నివేదిక అందించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు, సహకార శాఖ అధికారి వాల్యనాయక్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి భూపాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి వేసవినేపథ్యంలో ప్రజలు ఎండల నుంచి రక్షణ పొందేందుకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, వడదెబ్బ తగలకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. నిల్వ ఉన్న ఆహారం, వేపుళ్లు, ఆరు బయట ఆహార పదార్థాలు తినొద్దని తెలిపారు. ఒక మండలాన్ని ఎంపిక చేయాలి.. మే 5 నుంచి 20 వరకు జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: వచ్చే స్పెషల్ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు ఆదేశించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బ్యాంకులు, కోర్టులలో పెండింగులో ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసులను పరిష్కారం చేయడానికి బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులు కలిసిరావాలని అన్నారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడం అవసరమన్నారు. జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, న్యాయవాదులు రవీందర్, విష్ణువర్ధన్‌రావు, రాజేందర్, కవిత, ప్రియాంక, శివకుమార్, రాకేష్, రమేష్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అతలాకుతలం
రేగొండ: జిల్లా కేంద్రంతో పాటు రేగొండ, కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం రాత్రి అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని సుభాష్‌కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద చెట్టు కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. ఎస్ఎం కొత్తపల్లిలో కర్ణాటకపు రమేష్‌కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. రేగొండ మండలం కొత్తపల్లి (బీ)లో ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. బాగిర్తిపేట క్రాస్ రోడ్డు నుంచి మూల కొత్తపల్లి వరకు రోడ్డుకిరువైపులా చెట్టు నేలవాలడంతో ఎస్సై సందీప్‌కుమార్ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. భూపాలపల్లి, రేగొండ, మహాముత్తారం, కాటారం మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహాముత్తారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. దీంతో కేంద్రం వద్ద ఉన్న రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఒక శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయి స్థానంలో తగ్గింది. గతేడాది 15వ స్థానంలో నిలవగా.. ఈసారి తగ్గడం గమన్హారం. బాలురతో పోలిస్తే బాలికలు ఒక శాతం పైచేయి సాధించారు. జిల్లాలో 66 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10మంది ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులు 550కిపైగా మార్కులు సాధించారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3,221 మంది విద్యార్థుల పాస్ జిల్లాలో 121 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటినుంచి 3,443మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,221 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 1,725 మందికి 1,606మంది (93.10శాతం) ఉత్తీర్ణులు కాగా.. బాలికల విభాగంలో 1,718మందికి 1,615మంది (94శాతం) ఉత్తీర్ణులయ్యారు. 222మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిలయ్యారు.పరీక్ష రాసిన విద్యార్థులు 3,443 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 3,221సాధించిన శాతం 93.52ఫెయిల్ అయిన విద్యార్థులు 222వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 66సంవత్సరం సాఽధించిన స్థానం 2016–17 14 2017–18 5 2018–19 7 2021–22 8 2022–23 5 2023–24 16 2024–25 22 (ప్రస్తుతం) కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేదు. ఉత్తీర్ణత శాతం పెరిగినా తగ్గిన స్థానం పలువురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి మార్కులు 66 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత -
దేవాలయాల అభివృద్ధికి కృషి..
భూపాలపల్లి రూరల్: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీలో బుధవారం పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ గుడి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంభూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పెద్దకుంటనల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోద్దన్నారు.అధికారుల సేవలు మరువలేనివిభూపాలపల్లి: జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ జిల్లాకు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. నారాయణరావు, శైలజ ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం రాత్రి ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై వారిని సన్మానించారు. -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్‌గా తీసుకోవాలి...
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్‌గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు
సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్‌లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు. హనుమకొండ12,010వరంగల్9,237జయశంకర్ భూపాలపల్లి6,2383,4493,134 8,194మానుకోట దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్‌తో ముందుకెళ్లొచ్చు పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు -
నేడు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయంలో నేడు(బుధవారం) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పోచమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని మూడు రోజులుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం హోమం, కుంకుమార్చన, సాయంత్రం శట్కోనం పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. నేడు ఉదయం 9 గంటలకు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.ఏరియాలో పర్యటించిన సెక్యూరిటీ జీఎంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ జీఎం లక్ష్మినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఏరియాలోని సింగరేణి భూములు, ఖాళీ స్థలాలు, బొగ్గు నిల్వలు, సోలార్ ప్లాంట్ భద్రతలను పరిశీలించి, సీసీ కెమెరాలను పర్యవేక్షించి రికార్డులను తనిఖీచేశారు. బొగ్గు దొంగతనం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్‌తో చర్చించారు. స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలిభూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై పింగలి అమరేందర్‌రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పూలమాలవేసి, శాలువాతో సత్కరించి గృహోపకరణాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్, అమరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభంభూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్‌పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం ఉచిత వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ఎస్వోటు జీఎం పోశమల్లు హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల పిల్లలు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా పిల్లలు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. సెల్‌ఫోన్ ద్వారా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, అరుణ్‌ప్రసాద్, యూనియన్ నాయకులు బేతెల్లి మధుకర్‌రెడ్డి, మోటపలుకుల రమేష్, సీనియర్ పీఓ శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, కోచులు తిరుపతి, రఘువీర్, శరత్, నెహ్రూ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. పంట కోసిన తర్వాత వరి ధాన్యం చాలా తేమతో కూడుకొని ఉంటుంది. పది, పదిహేను రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. సరైన ఫ్లాట్‌ఫాంలు లేక రోడ్డపైన, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబెడుతున్నాం. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధాన్యం ఆరబోతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. ఫ్లాట్‌ఫాంల నిర్మాణానికి సహకరించాలి. – తిరుపతిగౌడ్, రైతు, వెంకట్రావుపల్లి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే.. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. మూడేళ్లుగా ఆ పథకం నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే రైతులకు తెలియజేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి● -
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్‌కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి నది పుష్కరాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ వీఐపీ ఘాటు విస్తరణ పనులు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటీ ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, వంద గదుల గెస్ట్‌హౌస్, జాయ్‌రైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ వీఐపీ ఘాట్ వద్ద టెంట్ సిటీ, ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు, స్టాళ్లు, కిడ్స్ జోన్ తదితర ఏర్పాటు చేసేందుకు స్థలాలకు మార్కింగ్ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వెళ్లే రహదారి నిర్మాణానికి మార్కింగ్ చేయాలన్నారు. హెలికాప్టర్లో జాయ్‌రైడ్ చేసేందుకు కౌంటర్ ఏర్పాటుచేయాలని తెలిపారు. పుష్కరాల్లో భక్తులకు ప్రత్యేక ఘాట్లు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజీ ఏర్పాట్లు, విద్యుద్ధీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి విద్యుద్ధీకరణ చేయాలని సూచించారు. విధుల్లో ఉండే సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్, ఆర్టీసీ ప్రదేశాల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎండోమెంట్‌కు సంబంధించిన శ్రాద్ధ మండపం, సరస్వతిమాత విగ్రహం పనులు, ప్రసాదం కౌంటర్ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. మే 4వరకు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ కనకదుర్గా ప్రసాద్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, నిర్మల, ఆబ్కారీ ఈఎస్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచందర్‌రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. మే 4వరకు పూర్తిచేయాలని ఆదేశం కలెక్టర్ రాహుల్‌శర్మ -
బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి రూరల్: బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్ట్రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ వెల్పేర్ అసోసియేషన్ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగ రాజ్‌కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన రూ.లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి -
యువత సన్మార్గంలో నడవాలి
పలిమెల: యువత చెడు వ్యసనాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉంటూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా సన్మార్గంలో నడవాలని ఎస్పీ కిరణ్‌ఖరే సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి (మహారాష్ట్ర), బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్), ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను సోమవారం పలిమెల మండలకేంద్రంలో ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. సరిహద్దు ప్రజలు, యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 105 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్, కాటారం సీఐలు రామచందర్ రావు, నాగార్జునరావు, పలిమెల ఎస్సై జె.రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
కాళేశ్వరం/పలిమెల: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రం, పలిమెల మండలకేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, అనిల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వ్యవసాయ అధికారి సుప్ర జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా..
నా పేరు సమ్మక్క. నాకు పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి పడిపోయింది. నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసమని గణపురంలో చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ సదరం సర్టిఫికెట్ కావాలన్నరు. జిల్లా ఆస్పత్రికి పోగా 65 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిర్రు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తు చేసిన. అయినా పింఛన్ రాకపోవడంతో కలెక్టరేట్‌కు వస్తున్నా. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడుసార్లు దరఖాస్తు ఇచ్చిన. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నాకు భూమి జాగా లేదు. ఆస్పత్రిలో చూయించుకోవడం, ఇంటి ఖర్చులకు ఇబ్బంది అయితాంది. – చివిటిబోయిన సమ్మక్క, చెల్పూరు, గణపురం -
చెరువుల్లో మట్టి దోపిడీని అరికట్టాలి..
కాటారం సబ్ డివిజన్ పరిధి పలు చెరువుల్లోని మట్టిని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా చెరువులను చెరబడుతున్నారు. పలుమార్లు తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కాటారం పరిధిలోని పోతులవాయి శివారులోని నల్లగుంట, విలాసాగారం, శంకరంపల్లి, దేవరాంపల్లి, పరికిపల్లి చెరువుల్లో ప్రతీరోజు రాత్రి జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాల మూలంగా చెరువులు దెబ్బతింటున్నాయి. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించా. – ఆత్కూరి శ్రీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ హాస్టళ్లు, మెస్‌లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. హన్మకొండ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్ద నుంచి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొత్తగా వాట్సాప్ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా తమ సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ఉపాధి కల్పిస్తామని ఉసురు తీస్తున్నారు..
గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌లో తమ గ్రామ సమస్యపై అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారి మాటల్లోనే.. 2003 సంవత్సరంలో భూగర్భ గని ఏర్పాటులో భాగంగా సింగరేణి యాజమాన్యం మా వ్యవసాయ భూములను తీసుకొని పరిహారం చెల్లించింది. ఇప్పుడు ఆ గనిని తొలగించి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ 3 ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో బాంబు బ్లాస్టింగ్ల మూలంగా మా ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చిన్నచిన్న గుడిసెలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలు, బాంబు బ్లాసింగ్‌లతో గాలి కాలుష్యమై మా ఊరి వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. కొంతమంది శ్వాసకోస ఇబ్బందులకు గురై మృతి చెందారు. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇక్కడ మేము ఉండలేమని, మా గ్రామాన్ని సేకరించి పరిహారం చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మా గ్రామాన్ని తరలించి పునరావాసం, ప్యాకేజీ అందజేయాలి. -
‘ఇరిగేషన్’లో ఏసీబీ గుబులు!
ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్‌పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి... శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్ర భుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోని వివిధ కేడర్లలో ఉన్న 17 మందిపై క్రిమినల్ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలను సిఫారసు చేశారు. ఇ దే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అ ధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గు ర్తించి ప్రాజెక్టు ఎండీ హరీరామ్ ఇళ్లలో సోదాలు ని ర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విచారణలతో ఉక్కిరిబిక్కిరి... మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికా రులు పెండింగ్‌లో పెట్టారు. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా, శాఖాపరమైన చర్యలా? క్రిమినల్ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చర్చనీయాంశంగా ఎండీ హరీరామ్పై దాడులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి వాళ్లే.. ఇప్పటికే 17మందిపై క్రిమినల్ కేసులు 30మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబును ఎస్పీ కిరణ్ ఖరే మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలో న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్‌చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు భూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు. నేడు కలెక్టర్ సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతి నది పుష్కరాల అభివద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు. సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం భూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్‌ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్‌ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను అభినందించారు.మేడే వాల్‌పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన నిర్వహించనున్న మేడే ఉత్సవాల వాల్ పోస్టర్‌ను ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఏరియాలోని వివిధ గనులలో ఆవిష్కరించారు. ఏరియాలోని కేటీకే ఒకటవ గనిలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ హాజరై మాట్లాడారు. మేడేను అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ చందర్, శ్రీనివాసు, చంద్రమౌళి, సదయ్య, నరేష్, అరుణ్ పాల్గొన్నారు. -
ముమ్మరంగా నిర్మాణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం (వీఐపీ) జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బేస్స్టాండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.కోటితో సరస్వతిమాత విగ్రహం, చుట్టూర నలుగురు వేదమూర్తుల విగ్రహాలు, లాన్ నిర్మించనున్నారు. సరస్వతిమాత విగ్రహం తమిళనాడులోని మహాబలిపురంలో తుది మెరుగులు దిద్దుకున్నట్లు ఆలయవర్గాలు పేర్కొంటున్నాయి. మే మొదటివారంలో విగ్రహాన్ని హైడ్రాలిక్‌తో స్టాండ్ బేస్‌పై ఎరక్షన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్‌రోడ్‌లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్‌కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్‌ను ఆపాలి, నక్సల్స్‌తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. -
రోడ్డు మధ్యలో ‘బోరు’
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ల వ్యవహారం. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించింది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ రోడ్డులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో బోరును అలాగే వదిలేశారు. రోడ్డు మధ్యలో అడ్డుగా ఉన్న బోరును చూసినవారంతా నవ్వుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు మధ్యలో బోరును వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. – కాళేశ్వరం -
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్: నిరుద్యోగ సమస్యను రూపు మాపుతామని, నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్లో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలోని సుమారు 75 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 12వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికై న 280మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. కలెక్టర్ పంజాబ్ నుంచి, ఎస్పీ మహారాష్ట్ర నుంచి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడాలని స్పష్టంచేశారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ జిల్లాలో 10వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరవేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మే 5న అర్చక పోస్టులకు పరీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టులకు మే 5న రాతి, మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల దేవాదాయశాఖ ఐదు అర్చక పోస్టుల కోసం నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 41మంది దరఖాస్తులు ఈఓ కార్యాలయంలో సమర్పించారు. మే 5న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 15నుంచి జరుగు సరస్వతి పుష్కరాల వరకు అర్చకుల నియామకం చేయడానికి దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అకాల వర్షం కాటారం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామాల్లో రైతులు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొంత మేర తడిసింది. రాత్రిపూట ధాన్యం కుప్పలపై పరదాలు కప్పి తడవకుండా రక్షించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వర్షాభావ సూచనలతో రైతులు అప్రమత్తమయ్యారు. -
ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్
భూపాలపల్లి అర్బన్: ఏరియా వర్క్‌షాపు ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్‌ను నియమించినట్లు బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఫిట్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్, ఎలక్ట్రిషన్ సేఫ్టీ కమిటీ సభ్యులుగా జి.కొమురయ్య, రమేష్, పిల్లి రవి, వర్క్ కమిటీగా కరుణాకర్, శ్రీనివా స్, గరిగ రమేష్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, విజేందర్, రవికుమార్ పాల్గొన్నారు. ఫార్మసిస్టుల హర్షం భూపాలపల్లి అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్టుల హోదాను ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఫార్మసిస్టు గ్రేడ్–2లను ఫార్మసీ ఆఫీసర్స్‌గా, ఫార్మసిస్టు గ్రేడ్–1లను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్స్‌గా, ఫార్మసీ సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్పు చేస్తూ ఈ నెల 25వ తేదీన జీఓ జారీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు. వృత్తి విద్య కోర్సులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నిషియన్, వెల్డింగ్ అండ్ ప్రాబ్సికేషన్ టెక్నిషియన్, ఆటోమొబైల్ అండ్ టూ వీల్లర్స్, ఎక్సకవేటర్ ఆపరేటర్, ఫుడ్ బెవరేజీస్ అసిస్టెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ హోటల్ మేనేజ్మెంట్, ఆఫీసర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ఫీల్ట్, టెక్నిషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు నెలల శిక్షణ, భోజన వసతి సదుపాయం, నిపుణుల ద్వారా సాఫ్ట్ స్కిల్ శిక్షణ, శిక్షణ పొందిన అనంతరం ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోసం సంబంధిత కోర్సులో విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల వారు ఏరియాలోని ఎంవీటీసీ కార్యాలయంలో సంపద్రించాలన్నారు. సర్వే పనుల అడ్డగింత మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకపోతే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సునీత, ఆర్ఐ శివరామ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియామకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్‌బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియో(అర్చక)తో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్‌బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంథనికి చెందిన కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ అవధాని మోహన్శర్మకు పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
● కలెక్టర్ రాహుల్‌శర్మ కాటారం/మల్హర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం, మల్హర్ మండలం కొయ్యూరులో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్‌రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్‌ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
భరోసా నింపని ఉపాధి..
కాటారం: గ్రామాల్లో వలసలు నివారించి పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉపాధిహామీ పథకం నిరుపేద కూలీలకు భరోసా నింపడం లేదు. మూడేళ్లుగా వచ్చిన నూతన మార్పులతో పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. క్షేత్రస్థాయిలో పనులు చేసిన కూలీలకు రోజుల తరబడి వేతనాలు అందకపోవడంతో పాటు పనులకు వద్దామని అనుకునే అర్హులైన కూలీలకు జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. దీంతో ఇటు పనిచేసిన కూలీలు, అటు ఉపాధి పొందాలని అనుకునే కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పనులు నిర్వహించినప్పటికీ కూలీలకు కూలి గిట్టుబాటు అవడం లేదు. ఇలా అనేక లోటుపాట్లతో ఉపాధిహామీ పథకంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా నిలిచిన ఉపాధి వేతనాలు.. జిల్లాలో 2.41లక్షల మంది కూలీలు ఉండగా.. 1.31లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఫాంఫండ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, బ్యాగ్ ఫిల్లింగ్, మొక్కల సంరక్షణ చర్యల పనులను కూలీలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీలకు ఇప్పటివరకు కూలి డబ్బులు అందలేదు. ఒక్కో కూలీకి సగటున రూ.1500నుంచి రూ.2వేల వరకు కూలి డబ్బులు అందాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు జాప్యంలో అధికారులకు సైతం పూర్తి సమాచారం లేదు. కూలీలకు వేతనాలు ఎప్పుడు జమ అవుతాయనే స్పష్టత కరువైంది. అసలే వేసవికాలం కావడంతో కూలీలు ఇతర పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలి డబ్బులు వస్తేనే వారి కుటుంబ పోషణ ముందుకు సాగుతోంది. రోజుల తరబడి కూలి డబ్బులు చేతికి రాక ఉపాధి కూలీలు తమ పూట గడుపుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూలీల నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు. నూతన జాబ్‌కార్డుల ఊసే లేదు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కారణంగా ఉపాధిహామీ పథకానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. కనీసం 20రోజుల పనిదినాలు చేసి ఉండాలనే నిబంధనతో కూలీలు అధికంగా ఉపాధి పనులవైపు మొగ్గు చూపుతున్నారు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉండటంతో నూతన జాబ్‌కార్డులు, వేరుగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో కొంతకాలంగా జిల్లాలో నూతన జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటికీ జాబ్‌కార్డు మంజూరు కాలేదని సమాచారం. జాబ్‌కార్డులో పేరు మార్పు, తొలగింపు లాంటి సవరణలకు సైతం అవకాశం లేకుండా పోయింది. దీంతో అర్హులైన నిరుపేద కూలీలు సైతం ఉపాధి పనులకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు నూతన జాబ్‌కార్డుల కోసం సుమారు 200పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఖాతాల్లో జమ అవుతాయి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మూడు నెలలకు సంబంధించిన ఉపాధి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేసిన కూలీల ఖాతాల్లో త్వరలోనే కూలి డబ్బులు జమవుతాయి. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వ ఆదేశాలతో నూతన జాబ్‌కార్డుల జారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అనుమతి రాగానే నూతన కార్డులు మంజూరు చేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 2,41,6671,09,84324412గ్రామపంచాయతీలు జాబ్‌కార్డుల సంఖ్యమూడు నెలలుగా కూలీలకు అందని డబ్బులు మంజూరుకు నోచుకోని నూతన జాబ్‌కార్డులు ఆందోళనలో ఉపాధిహామీ కూలీలు -
పలిమెలలో వాలీబాల్ టోర్నమెంట్
భూపాలపల్లి: ఈ నెల 28వ తేదీ నుంచి పలిమెల మండలంలో పోలీస్ ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులో గల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.25వేలు, రెండవ బహుమతి రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలతో పాటు ట్రోఫీలు బహుకరిస్తామన్నారు. టోర్నమెంట్‌కు ఎంట్రీ ఫీజు లేదన్నారు. క్రీడాకారులకు భోజన వసతి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 73961 47071, 73069 07549 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ కిరణ్ ఖరే -
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి అవరణలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. -
సభను జయప్రదం చేయాలి
టేకుమట్ల: ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మోసంచేస్తున్న కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రజలను సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల ను నిత్యం మోసంచేస్తున్నారన్నారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ కార్యక్రమానికి మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కశ్మీర్ పహల్గాం పర్యాటకుల మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మా జీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ఆది రఘు, బందెల నరేష్, ఉమేందర్రావు, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
వాహనాలు జరభద్రం..!
ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనంలోనైనా ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్‌చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్డుల్లో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంటుంది. – ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్ -
వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!
ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం.పవన్‌కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు. – డాక్టర్ ఎం.పవన్‌కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లి ● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది. ● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి ● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి. ● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది. ● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. ● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి. ● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్‌గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు. ● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. -
కొనుగోళ్లపై రైతుల్లో ఆవేదన
భూపాలపల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో చాలా ఆవేదన ఉందని, ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. రైతులకు నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 4 సంఘాలు ఎంపిక ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025, రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి’ అనే అంశంపై కలెక్టర్ రాహుల్‌శర్మ అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ వ్యవసాయరంగాన్ని సహకార రంగంతో ముడివేసి జాతీయస్థాయిలో సుమారు 10వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు భారత సహకార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా తెలంగాణలో 311 సంఘాలను ఎంపిక చేశారని.. వాటిలో మన జిల్లాలో నాలుగు సంఘాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్, సింగిల్ విండో చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఉపేక్షించం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకో వాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడూ తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్) -
సింగరేణి ప్రైవేటీకరణను రద్దుచేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టి జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం సింగరేణి గనులను వేలం వేయడం వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్‌పరం కాకుండా సింగరేణికి కేటాయించాలని కోరారు. కార్మిక వాడల్లో మెరుగైన తాగునీటిని అందించాలని, సింగరేణిలోనే కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, అవినాష్, మధు, కుమారస్వామి, వెంకట్రాజం, సుంకరి గోవర్దన్, మొగిలి, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలిగిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెం కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి. – కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్ -
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కులాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీకేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్డువెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి. – నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట -
ఎండను ఎదుర్కొందాం..
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలుఉమ్మడి వరంగల్జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్‌బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం పది గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్‌గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..డీహైడ్రేషన్‌కు గురికావొద్దు.. భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఓపెన్‌కాస్టులోని పని ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా ఉంటుంది. మొదటి షిప్టులో పనిచేసే కార్మికులు పూర్తిగా ఎండలోనే పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఐదు లీటర్లకు మించి చల్లటి నీరు తాగాలి. ప్రతి రోజు ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. తలపాగ ఉపయోగించడం మంచిది. ఆయిల్ ఫుడ్ తినొద్దు. ఎండలో పనిచేయడం వలన నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడి బారి, నాలుక ఆరిపోతుండడం, వాంతులు, విరోచనాలు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ దెబ్బకు గురైన వెంటనే నీడకు చేర్చి చల్లగా ఉండే పలుచని దుస్తులను వేయాలి. తడి గుడ్డతో తుడవాలి. ప్రమాద తీవ్రత అఽధికంగా ఉంటే సింగరేణి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ పద్మజ, సింగరేణి ఏరియా ఆస్పత్రి ఏసీఎంఓ -
మలేరియా నియంత్రణకు చర్యలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రతి ఏడాది మలేరియా కేసులు నమోదవుతున్నాయని వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ మధుసూదన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు గ్రామాలు ఏజెన్సీలో ఉండటం వలన సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని.. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇంటి పరిసరాల్లో మురికి నీరు, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మలేరియా పట్ల అవగాహన కల్పించిన పలువురికి ఈ సందర్భంగా అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, ఉమాదేవి, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
చిట్యాల/మొగుళ్లపల్లి: భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి మండలకేంద్రాల్లో గురువారం భూ భారతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులపై ఆర్డీఓ విచారణ చేసి అర్హత ఉన్న వారికి భూహక్కులు జారీచేస్తారని అన్నారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, పంగిడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీదేవి, వైస్ ఛైర్మన్ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, టేకుమట్ల మండల ప్రత్యేకాధికారి శైలజ, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 27న మెగా జాబ్‌మేళా భూపాలపల్లి రూరల్: ఈనెల 27వ తేదీన జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్‌మేళాను నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. జాబ్ మేళా నిర్వహణపై సింగరేణి అధికారులతో పుష్ప గార్డెన్లో గురువారం ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు సుమారు 15వేల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. జాబ్‌మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్‌రావు, జిల్లా, మండల, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్‌శర్మ -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పు న టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లా కు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్‌గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్‌కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్‌కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్‌కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్లయ్య, కై లాష్లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. ‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు.. ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులుడీసీసీ పీఠం కోసం పోటాపోటీ.... ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీ కమిటీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజు, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌నే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడి నిర్ణయం కీలకంగా కానుంది. -
28నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 28వ తేదీ నుంచి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలతో పాటు పట్టణ, సమీప గ్రామాలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. మహిళకు ఆపరేషన్.. క్యాన్సర్ గడ్డ తొలగింపు భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం నూతన వైద్యానికి శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రానికి చెందిన అల్లూరి రాధ కొద్దిరోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. వారం రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చింది. పలు రకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్ అభినందించారు. కాల్వల పనుల అడ్డగింత కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఆదివారంపేట చెరువు నుంచి సాగు నీటి సరఫరా కోసం చేపట్టనున్న కాల్వల నిర్మాణం భూ సర్వేను గుమ్మాళ్లపల్లి వద్ద రైతులు గురువారం అడ్డుకున్నారు. కాల్వల నిర్మాణం కోసం తాము విలువైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తమకు న్యాయం చేకూరదని అభ్యంతరం తెలిపారు. కాల్వల నిర్మాణం అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. సర్వే అధికారులు నచ్చజెప్పినప్పటికీ రైతులు ఒప్పుకోలేదు. సర్వేలో డీఐ రాములు, సర్వేయర్లు రామకృష్ణ పాల్గొన్నారు. 29న హేమాచల క్షేత్రంలో జాతర వేలంమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1నుంచి 31వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్‌కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కర పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పర్యవేక్షణ చేయలేకపోతే జిల్లా విడిచి వెళ్లాలని.. జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణకు ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ అధికారులుగా నియమించామని, ప్రతి రోజు పనులు పర్యవేక్షణ చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు చేయడం మన లక్ష్యమని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవగాహనకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యర్ధాలు నిర్వహణకు ఇన్సినినేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకు మెడికల్ క్యాంపులు భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలలో ఏర్పాటు చేసే క్యాంపులు, సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు. ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్‌ను నియమించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ వివరించారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం) ర్యాలీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారుల నియామకం కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతినది పుష్కరాల పనులను వేగవంతం చేయడం కోసం కలెక్టర్ రాహుల్‌శర్మ పర్యవేక్షణకు గురువారం ప్రత్యేకాధికారులను నియమించారు. అధికారులు నిత్యం పనుల పురోగతిని సమీక్షించి, వాట్సాప్ గ్రూపుల్లో పనుల వివరాలు, ఫొటోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంది. కాళేశ్వరానికి ప్రపంచ సుందరీమణులు? పుష్కరాలకు ప్రపంచ సుందరీమణులను ఆహ్వానించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఆలోచన చేసినట్లు సమాచారం. మే 14న ములుగు జిల్లా రామప్ప ఆలయానికి 30మంది ప్రపంచ సుందరీమణుల బృందం రానున్న షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో వారిని కాళేశ్వరాలయానికి ఆహ్వానించడానికి బుధవారం కాళేశ్వరంలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో చర్చకు వచ్చి ఆ శాఖ ఉన్నతాధికారి ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం.కలెక్టర్ రాహుల్ శర్మ -
సివిల్స్ ర్యాంకర్‌ను సన్మానించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన బానోతు జితేంద్రనాయక్ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో సన్మానించారు. జితేంద్రనాయక్ తండ్రి ఏరియా వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేంద్రనాయక్తో పాటు అతడి తల్లిదండ్రులను జీఎం శాలువతో సత్కరించారు. సింగరేణి ఉద్యోగి కుమారుడు సివిల్స్‌లో ప్రతిభకనబర్చడం సంతోషకరమైన విషయమని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎస్వోటు జీఎం పోషమల్లు, అధికారులు వెంకటరమణ, జోతి, అరుణ్‌ప్రసాద్, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియ న్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగా లు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మల్లయ్య, కమలాకర్, మహేష్ శేఖర్ పాల్గొన్నారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్‌నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసిన ట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతలను అడి గి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చా ర్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలుసభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయ క్, నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80.12శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రణవి, రితీష్ నాయక్, స్ఫూర్తి, నితీష్, కీర్తన, చైత్రను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మా ట్లాడుతూ ఎంత నేర్చుకున్నాం.. అనేది ముఖ్యం కాదని.. నేర్చుకున్నది ఎవరికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యమని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ముందుకురావాలని తెలిపారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుతో పాటు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అసిఫాబాద్ జిల్లాలు ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలవడం అభినందనీయమన్నారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో అవార్డులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
భూపాలపల్లి రూరల్: కాశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టించిన మరణకాండను ప్రతిఒక్కరూ ఖండించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి అన్నారు. కాశ్మీర్లో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ అధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం నిశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడికి బీజేపీ ప్రభుత్వం ధీగాటుగా సమాధానం చెబుతుందన్నారు. దాడిలో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, రాజమౌళిగౌడ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి -
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పత్తి పంటను సాగుచేయగా అధిక వర్షాలకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో పత్తి పంటను తొలగించి నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోత కోసి ఆరేందుకు పొలంలోనే ఉంచాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజుకు సమాచారం అందించారు. రైతులంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితంలేకుండాపోయింది. నాలుగు ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.4 లక్షల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. అలాగే మరో రైతు సూదనబోయిన కృష్ణకు చెందిన రెండు ఎకరాలల్లోని మొక్కజొన్న పంట కోసి పొలంలో ఆరబెట్టగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.జడ్జి బాధ్యతల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణబాబు బదిలీ కాగా ఆయన స్థానంలో రమేష్‌బాబు వరంగల్ నుంచి బదిలీ చేశారు. ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన నారాయణబాబు హనుమకొండకు బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి దంపతులు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సన్మానించారు. పుష్కరాలకు 40 ఎకరాల్లో పార్కింగ్ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల కోసం 40 ఎకరాల్లో మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. విఐపీ ఘాటు వద్ద 25 ఎకరాలు, ఇప్పలబోరు సమీపంలో 15 ఎకరాలు, హనుమాన్ నగర్ వద్ద 5 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. అవే కాకుండా హరితహోటల్ సమీపంలో కూడా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. -
6
సివిల్స్‌లో మెరిశారు..రాష్ట్రస్థాయిలోజిల్లాకువ స్థానం● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలనే లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్ ప్రభుత్వ కళాశాలల్లో టాపర్లు వీరే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల స్థాయిలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ప్రథథమ సంవత్సరంలో జిల్లా ప్రథమ స్థానంలో ఎంపీసీ గ్రూప్‌లో భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కె.రోహిత్ 470 మార్కులకు 463 మార్కులు, బైపీసీలో మెడల్ స్కూల్ కొర్కిశాలకు చెందిన నేహ 440కి 407 మార్కులు, సీఈసీలో భవాని 500కి 437 మార్కులు, ద్వితీయ సంవత్సరం బైపీసీలో కేజీబీవీ టేకుమట్లకు చెందిన ఎం.శిరిష 962, ఎంపీసీలో మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల మోడల్ స్కూల్‌కు చెందిన నిఖిత 928, సీఈసీలో ఎన్.శ్రీంజి 831 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 73శాతం, ప్రథమ సంవత్సరంలో 58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ త సాధించారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గింది. జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 3,491మంది విద్యార్థులు ఉండగా 2,309 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్, 6 మోడల్, 5 ప్రైవేట్, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, 10 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో వచ్చిన ఫలితాలు 2024–25 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 1,820 మంది విద్యార్థులకు 1,077 మంది (59శాతం) ద్వితీయ సంవత్సరంలో 1,671 మందికి 1,232 మంది విద్యార్థులు (73శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే మెరుగు.. జిల్లా 2022–23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 19వ, 2023–24లో 8వ స్థానంలో ఉండగా ఏడాది రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 58 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అత్యధికంగా మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. కేజీబీవీల్లో 83శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 10 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 458 మంది విద్యార్థులు హాజరుకాగా 384మంది ఉత్తీర్ణులై 83శాతం సాధించారు. ప్రథమ సంవత్సరంలో 266 మందికి 212 ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 192మందికి 173 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టేకుమట్ల, మల్హర్, మొగుళ్లపల్లి కేజీబీవీల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అధ్యాపకుల కృషితోనే.. జిల్లాలో ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో 73 శాతం మార్కులు సాధించడం సంతోషకర విషయం. జిల్లాలో గత రెండేళ్లుగా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. వారి ప్రేరణతోనే మార్కుల శాతం పెరిగింది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తాం. – వెంకన్న, ఇంటర్ విద్యానోడల్ అధికారి– వివరాలు 10లోuఇంటర్ సెకండియర్‌లో 73శాతం ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరంలో 58శాతం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉత్తమ మార్కులు బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత జిల్లాలోని ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే అధిక సంఖ్యలో పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 68.46 శాతం, బాలురు 43.58శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.32 శాతం, బాలురు 65.2శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రతిభ కనబరిచారు. ఉత్తీర్ణత సాధించడంలో బాలురు వెనుకబడిపోయారు.మే 22నుంచి సప్ల్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. -
‘భూ భారతి’తో ప్రజలకు మేలు
చిట్యాల: భూ భారతి చట్టంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూ భారతి చట్టంపై మంగళవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతి చట్టం రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందన్నారు. ఽగత ప్రభుత్వంలో ధరణిలో అప్పీలు చేయడానికి అవకాశం లేదని సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండడం వల్ల పది సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థకు తీరని కళంకం తెచ్చారన్నారు. వచ్చే నెలలో మన జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి భూ భారతి చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. జూన్ 2నుంచి చట్టం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తామని అవినీతి రహిత సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో రూల్స్ ఫ్రేమ్ చేశారని అన్నారు. అనంతరం నవాబుపేట, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
భూపాలపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల విచారణ ప్ర క్రియ, మండలస్థాయిలో విచారణ టీముల ఏర్పాటుపై ఎల్డీఎం, డీఆర్డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షే మ శాఖల అధికారులు, ఎంపీడీఓ లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల విచారణ ప్రక్రి య ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ని ష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగా లని, పొరపాట్లకు తావులేకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆయా శా ఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చట్టాల అమలు బాధ్యత కలెక్టర్లదే.. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. మన్ననలు పొందాలి... విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
రేగొండ: తలపై రోకలి బండతో కొట్టి కన్న కొడుకును తండ్రి కడతేర్చిన ఘటన మండలంలోని రేపాకపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందిన కాసం మొండయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఓదెలు (35) 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఓదెలుకు పరకాల మండలానికి చెందిన దేవితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొన్ని సంవత్సరాల నుంచి కోడలితో మొండయ్య అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓదెలు పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటుండగా తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఎలాగైనా కొడుకును అడ్డు తొలగించి కోడలిని దక్కించుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం ఓదెలు తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా తలపై రోకలిబండతో కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు రేగొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేష్ పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. పెళ్లిరోజు వేడుకల్లో గొడవ మరుసటి రోజే విషాదం -
‘మేఘా’కే టెంట్‌సిటీ నిర్మాణం?
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టి తాత్కాలిక టెంట్‌సిటీ నిర్మాణం పనులు మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టనున్నట్లు సమాచారం. రూ.83లక్షల వ్యయంతో భక్తుల కోసం వీఐపీ (సరస్వతి)ఘాటు వద్ద నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. దీంతో టూరిజంశాఖతో నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆ సంస్థ శ్రద్ధ చూపలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని మేఘా సంస్థతో తాత్కాలిక టెంట్‌సిటీ నిర్మాణాలు సుమారు 50వరకు నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేవస్థానం గుడిమాన్యం ఆరు ఎకరాల స్థలాన్ని టెంట్‌సిటీకి అప్పగించి, ఆ భూమిలో మిర్చి పంట వేసిన రైతులకు రూ.4లక్షల వరకు పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. -
‘సువిధ్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిధ్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షన్ముణ ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్‌రెడ్డి అభినందించారు. -
సివిల్స్‌లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి ఎలాంటి శిక్షణ లేకుండా ప్రిపేర్.. ● సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పెర్’కు ప్రథమ ర్యాంకు
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పెర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
భూముల సర్వే అడ్డగింత
● పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన భూపాలపల్లి రూరల్: మల్హర్ మండలం తాడిచెర్ల ఓసీ నుంచి గణపురం మండలం చెల్పూరు జెన్కో వరకు నిర్మిస్తున్న కన్వేయర్ బెల్డ్ సర్వే పనులను రైతులు మంగళవారం అడ్డుకున్నారు. కన్వేయర్ బెల్డ్ కోసం పచ్చని సాగు భూములు ఇవ్వబోమని, బెల్ట్ తోవను గ్రామం పక్కనుంచి తీసుకోవాలని పనులను అడ్డుకొని పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. గ్రామంనుంచి కన్వేయర్ బెల్ట్ వేయడం వలన బెల్ట్నుంచి సుమారుగా రెండు కిలోమీటర్లు బొగ్గు ద్వారా వాతావరణం కలుషితమై పంటలు పండవన్న విషయం అందరికీ తెలుసన్నారు. అధికారులు మాత్రం బెల్ట్ కింద కోల్పోయిన భూముల వరకు మాత్రమే 2013 జీఓ ప్రకారం మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారన్నారు. బెల్ట్ కింది భూములతో పాటు బెల్ట్నుంచి రెండు కిలో మీటర్లు వరకు ఉన్న సాగు భూములకు 2013 జీఓ ప్రకారం కాకుండా ఇప్పటి మార్కెట్ ధర చెల్లిస్తే భూములను ఇస్తామని తెలిపారు. గ్రామంలో సుమారుగా 25 కుటుంబాలు ఉంటాయని, గ్రామాన్ని తరలిస్తే ఇన్నిరోజులు కలిసున్న తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, అధికారులు, ఆర్ఆర్ ప్యాకేజీలు ఇస్తామని రైతులను విభజిస్తూ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి చర్చలు జరపాలని కోరారు. అధికారులు రైతులతో మాట్లాడకుండా గ్రామంలో సర్వేలు నిర్వహిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాతో హెచ్చరించారు. నిరసనలో రైతులు విప్లవకుమార్రెడ్డి, రొంటాల బాపురెడ్డి, సుధాకర్‌రెడ్డి, సద్దిమహేష్, రొంటాల దేవేందర్, కొకురే రంజిత్‌కుమార్, రమ, జ్యోతి, గొడుగు సదయ్య, గజ్జి ఒదెలు, బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సు బేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో నీటి సామర్ధ్యం నిశితంగా గమనిస్తూ ఉండాలని, గడిచిన 21 రోజుల నుంచి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటిమీటర్లు నీరు తగ్గిందన్నారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటిమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేష్, డీఈలు పాల్గొన్నారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌లకు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ సరస్వతి పుష్కరాల పనుల పురోగతిపై సమీక్ష -
స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు బుర్ర అశోక్, జితేందర్, వినోద్, రమేష్, విజయ్, ప్రశాంత్, విక్రమ్, రాజేష్, రాజు, సదానందం, సునిల్, తదితరులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, శ్యామ్‌నగర్, కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రతీ గ్రామం నుంచి 100 మందికి తక్కువ కాకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం చిట్యాల: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దూద్‌పల్లి, లక్ష్మీపూర్‌తండా, ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపూర్ గ్రామాల్లో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హాజరై మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జగ్గి శ్యామల. 2020లో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, శ్యామల వ్యవసాయ కూలీ పనికి వెళ్తుంది. కులాంతర వివాహం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సాయం అందకపోగా దరఖాస్తు పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు తెలపడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది.న్యూస్‌రీల్ -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
‘భూ భారతి’తో భూములకు హక్కులు
భూపాలపల్లి: నూతన భూ భారతి చట్టంతో భూముల హక్కులకు భద్రతతో పాటు భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ధరణి పేరుతో ప్రజల భూములను దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి వాళ్ల కడుపులు నింపుకున్నారని ఆరోపించారు. కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామంలో సుమారు 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్‌బుక్‌లు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూతన చట్టం ప్రకారం వారందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతితో అన్ని రికార్డులు పకడ్బందీగా నమోదు చేయబడతాయన్నారు. సాగులో ఉంటే విచారణ నిర్వహించి పట్టా ఇచ్చే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టంలో లబ్ధిదారులకు మేలు చేసే విధంగా రూపొందించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇక పకడ్బందీగా భూ రికార్డులు కలెక్టర్ రాహుల్ శర్మ -
అవే సమస్యలు..
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువభూపాలపల్లి: ప్రజావాణికి భూ సమస్య, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వినతులే వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే స మస్యలు కూడా కలెక్టరేట్‌కే వస్తున్నాయి. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్ సెల్లో మొత్తం 52 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఎక్కడా అమలు కావడంలేదు. రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజావాణిల్లో దరఖాస్తులు ఇస్తున్నా. కనీసం ఒక్క జిల్లాలో అమలు చేసి పదిమందికి అవకాశం ఇచ్చినా నా ఉద్యమానికి ఫలితం దక్కుతుంది. – కట్ట ప్రసాద్, జాతీయ దివ్యాంగుల హక్కుల న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడుడ్రిప్ సామగ్రి సరిగా ఇవ్వలేదు నాకున్న ఎనిమిది ఎకరాల్లో 2022–2023 సంవత్సరంలో పామాయిల్ తోట సాగు చేసిన. సబ్సిడీపై డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. డ్రిప్ కంపెనీ వారు ఓ రోజు రాత్రి నా వ్యవసాయ భూమి దగ్గర సామగ్రి దించిపోయారు. తెల్లవారుజామున చూస్తే అందులో మొత్తం సామగ్రి లేదు. దీంతో అధికారులు, డ్రిప్ కంపెనీ వారిని అడిగితే ఎవరూ స్పందించలేదు. నా సొంత డబ్బులతో పనులు చేయించుకున్న. హార్టికల్చర్ అధికారులపై చర్య తీసుకోవాలి. – సామల వెంకటేశ్వర్లు, చల్లగరిగె, చిట్యాల భూమి, పింఛన్ సమస్యలే ఎక్కువ గ్రీవెన్స్‌లో 52 వినతులు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు: కలెక్టర్ రాహుల్ శర్మ -
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్‌షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పూజలు నిర్వహించారు. -
సభకు భారీగా తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగసభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, వజినపల్లి, గొర్లవీడు, గుడాడ్పల్లి, కొంపెల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సాగర్‌రెడ్డి, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు నీలంబరం, గుడాడ్పల్లి మాజీ సర్పంచ్ ఐలయ్య, మందల రవీందర్‌రెడ్డి, పింగిలి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
వక్ఫ్ భూములపై కుట్ర
భూపాలపల్లి రూరల్: వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి, వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆదివారం జిల్లాకేంద్రంలో జామా మసీదు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిముల ఆస్తులను హరించే కుట్ర అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, కురిమిల్ల శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
శివాలయ నిర్మాణానికి విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందిన కాల్వ రాజారెడ్డి రూ.1,11,116 కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్‌రెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిళ్ల సత్యనారాయణరెడ్డి, మోత్కూరి నరేష్, కాల్వ సమ్మిరెడ్డి, మోత్కూరి రాజు, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం, పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి కాటారం: కాటారం మండలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భారత ఐక్య యువజన సమాఖ్య(యూవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను యూవైఎఫ్‌ఐ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాటారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాయకుల, అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు దెయ్యం పోచయ్య, ఎంసీపీఐ నాయకులు రాజమణి, రమ్య, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ పరీక్షకు 369 మంది విద్యార్థులకు గాను 346 మంది, టెన్త్ పరీక్షకు 197మంది విద్యార్థులకు గాను 172మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు ఒకదాని వెనుకాల ఒకటి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
లీకేజీలు.. పట్టవా..!
భూపాలపల్లి మున్సిపల్ పరిధి రెడ్డికాలనీ, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంతం, బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంతం, హనుమాన్‌నగర్, కృష్ణకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు, గేట్ వాల్స్ నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ పరిస్థితి జిల్లాకేంద్రంలో నెలల తరబడి నుంచి కొనసాగుతోంది. లీకేజీలతో సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై సిబ్బందికి తెలిసినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. మరమ్మతులు చేయాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. అధికారులు సైతం నామమాత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తలెత్తకముందే లీకేజీలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ -
గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
చిట్యాల: గర్భిణులు, బాలింతలు సంవృద్ధిగా పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భం దాల్చిన నుంచి వేయి రోజుల వరకు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ ఆరు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ , ఒడితల వైద్యురాలు మౌనిక, ఎస్సై ఈశ్వరయ్య, ఎంఈఓ రఘుపతి మాట్లాడారు. అనంతరం ముగ్గురు గర్భిణులకు సీమంతం, ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన, ఐదుగురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025క్రీడల్లో శిక్షణ.. ‘దేశం బలిష్టం కావాలంటే యువత మైదానాల్లో చెమట చిందించాలి’ అని ఓ కవి చెప్పినట్లు.. విద్యార్థులు మైదానాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణ కోసం కరాటే, కుస్తీ పట్టడం నేర్చుకోవచ్చు. జిల్లా క్రీడల, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో, హనుమకొండలోని జేఎన్ఎస్లో పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాలి● ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. ● సెల్‌ఫోన్‌ను దూరం పెట్టాలి.. పుస్తకాలను చేరువ చేయాలి ● ఆ బాధ్యత తల్లిదండ్రులదే..సజీవ కళ చిత్రలేఖనం.. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. కొన్ని వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పుతున్నారు.నృత్య, సంగీతంలో.. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్‌రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తక పఠనం.. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేథను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్లలను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని జూపార్క్, సైన్స్‌సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ జిల్లా వికాసతరంగణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు వ్యాసరచన, భగవద్గీత శ్లోకం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వలంటీర్‌గా సేవలందించవచ్చు. ఆర్ఎస్ఎస్, ఎన్ఎస్ఎస్లో విద్యార్థులు శిక్షణ తీసుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరిగెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. ఇస్రో ప్రతీ యేటా వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థులను ఎంపిక చేస్తోంది. స్థానికంగా ఉన్న కంప్యూటర్ శిక్షణలో చేరి కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి. పుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్‌ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్‌లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్ -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్, దామరంచపల్లి, చిన్నకొడెపాక, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లి, జగ్గయ్యపేట, చెంచుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి గులాబీ జెండాతో రజతోత్సవ సభకు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు జూపాక నీలాంబరం, కానుగంటి శ్రీనివాస్, ఐలయ్య, మహేందర్, యుగందర్ పాల్గొన్నారు. పెయింటర్‌ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద కల్వర్టు సైడ్ వాల్‌పై బీఆర్ఎస్ వాల్పెయింట్ను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పేరుతో వేయడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే పెయింటర్‌ను అడ్డుకున్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలను కలెక్టర్, అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని.. నిర్దేశ సమయంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, కలెక్టర్ అక్కడి నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్‌కు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు భూ చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించి ఇతరులతో చర్చించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఆధార్‌కార్డు లాగే భూదార్కార్డు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ భారతిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్దార్ నాగరాజు, నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ బాబు, ఆర్ఐ వెంకన్న, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పాల్గొన్నారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మపనుల్లో నాణ్యత పాటించాలి కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణాలపై వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించి, నిర్దేశిత సమయానికి సరస్వతి పుష్కరాల పనులను పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, ఎస్సై తమాషారెడ్డి, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రటి ఎండలో కాలినడకన.. కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్‌కలెక్టర్ మయాంక్సింగ్లతో పాటు ఇతర అధికారులు 41 డిగ్రీల ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం సుమారు 600మీటర్లు కాలినడక వీఐపీఘాటు వద్దకు వెళ్లారు. పనుల పరిశీలన అనంతరం తిరిగి అదేదారిలో నడుచుకుంటూ వచ్చారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంగపేట: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆలయాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఆకాంక్షతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీకత్క పనిచేస్తున్నారన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని, ఆ సదస్సులో అర్చక ఉద్యోగుల దూపదీప నైవేద్యం, అర్చకుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలను ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు చేయాలనే సంకల్పంతో ఏర్పా ట్లు చేస్తున్నారన్నారు. భక్తులు తరలివచ్చి పవిత్రమైన పుణ్య స్నానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ గౌరవ అధ్యక్షుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోuu -
317జీఓ బాధితులకు న్యాయం చేయాలి
భూపాలపల్లి అర్బన్: 317 జీఓ బాధితులకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ కోరారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు. ఆర్థిక నష్టం లేనటువంటి 317 జీఓ బాధితులకు న్యాయం చేసి వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్, నాయకులు చంద్రయ్య, వెంకటేష్, రమేష్, పున్నంచందర్, సాగర్, తాడిచర్ల రవి పాల్గొన్నారు. -
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాకు కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డెరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. భూపాలపల్లి ఏరియాను శుక్రవారం సందర్శించి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధించాలని ఆదేశించారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బొగ్గు రవాణ లక్ష్యం కూడా తప్పక సాధించాలని అధికారులను కోరారు. ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూ సేకరణ, మట్టి వెలికితీయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తక్షణమే పరిష్కరించుకొ ని ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కార్మికులకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఓసీ–2 పీఓ వెంకటరామరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఓసీ–3 పీఓ భిక్షమయ్య పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ -
ప్లీనరీ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ 21న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ.. మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్‌లోని సీతాఫల్ మండిలో ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు గుర్తించి కార్డులు, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు సునితారెడ్డి, ప్రసన్న శారద, రాజేశ్వరి, రమాదేవి, లక్ష్మి, లత, పుష్ప పాల్గొన్నారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ -
మోక్షం ఎప్పుడో..!
సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్● 2020 సంవత్సరంలో స్వీకరణ.. ● ఇప్పటివరకు పట్టా పాస్‌బుక్‌లు లేవు ● కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● జిల్లావ్యాప్తంగా 51,347 దరఖాస్తులు ● భూభారతిపైనే ఆశలు..భూమి మార్పిడి సాదాబైనామాల కోసం దరఖాస్తుకు ప్రభుత్వం మొదట 2020 అక్టోబర్ 31వ వరకు గడువు విధించగా మరోమారు నవంబర్ 10వరకు పెంచింది. ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల కంటే ముందు అక్టోబర్ 28వరకు జిల్లాలో 1,896 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనంతరం 51,347 మంది సాదాబైనామాల కోసం దరకాస్తు చేసుకున్నవారు అయోమయంలో పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. కొత్త చట్టం ప్రకారం మార్గదర్శకాలు వస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పట్టాపాసుపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.భూపాలపల్లి అర్బన్: సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించి ఐదేళ్లు కావస్తుంది. వాటికి ఇప్పటివరకు మోక్షం కలుగడం లేదు. ధరణి సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పటికీ సాదాబైనామా గురించి గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాల భూముల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో రైతుల నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో తెల్ల కాగితాలపై రాసుకుని విక్రయాలు జరిపిన కాగితాలపై తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 51,347 దరఖాస్తులు అందాయి. నాటినుంచి దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి కొత్త పట్టాలు మంజూరు చేయాలని రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ‘భూమాత’ను ప్రారంభించింది. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు పనిష్కారం అవుతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు 2014 జూన్ 2కు ముందు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌కు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 2020 అక్టోబర్ 31వరకు వివిధ మండలాల నుంచి వచ్చాయి. మొదట వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాల్లోని వాటికి మాత్రమే అవకాశం కల్పించింది. అనంతరం నవంబర్ 1నుంచి 10వరకు గడువు పొడిగించింది. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వారికి సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది. పది రోజుల వ్యవధిలోనే 51,347 వరకు దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించి క్రయవిక్రయదారుల ఆమోదంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు ఉంటాయని దరఖాస్తుదారులు భావిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాలతో అయోమయంలో పడ్డారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించడంతో అప్పుడే ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. గత చట్టంతో తిరకాసు.. -
ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి
భూపాలపల్లి అర్బన్: ఏసుప్రభు బోధనలు ప్రపంచ మానవాళికి దిక్సూచి అని సీఎస్ఐ ఫాస్ట్రేట్ కమిటీ చైర్మన్ రెవరెండ్ ఎం.కనకరత్నం తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చితో పాటు జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరత్నం మాట్లాడుతూ.. మానవులంతా క్షమాగుణం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో సీఎస్ఐ చర్చి సంఘ సెక్రటరీ దుప్పటి మొగిలి, ట్రెజరర్ రవికుమార్, స్టీవార్డు ఇమ్మానియేల్ అమ్మగారు సంకీర్తన, సీ్త్రల మైత్రి, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే15 నుంచి 26 వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన రూ.కోటితో చేపట్టిన ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్ల ప్రగతిని ఆ శాఖ సీఈ రాజుచౌహాన్ పరిశీలించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరంలో జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించారు. సలహాలు, సూచనలు అందజేశారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు. మట్టి తరలిస్తున్న లారీల అడ్డగింత కాటారం: శంకరాంపల్లి నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. మట్టి తరలింపు నిలిపేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, పలువురు దళారులు గ్రామ సమీపంలోని చేల నుంచి అనుమతులు లేకుండా నిత్యం మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. చేలలో సుమారు 20 ఫీట్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మున్ముందు రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో మట్టి లారీలు గ్రామం మధ్య నుంచి తిరుగుతుండటంతో దుమ్ము అధికంగా లేవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగజాల అశోక్, బోనగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు. కేసీఆర్‌ను కలిసిన జక్కు శ్రీహర్షిణి కాటారం: మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్‌ను తన నివాసంలో కలిశారు. శ్రీహర్షిణి జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ముందునడవాలని, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కేసీఆర్ సూచించినట్లు శ్రీహర్షిణి తెలిపారు. కష్టపడి పని చేస్తే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు శ్రీహర్షిణి పేర్కొన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్ ఉన్నారు. వేముల శంకర్‌కు డాక్టరేట్ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఐటీ మాస్టర్ స్కిల్ హబ్ డైరెక్టర్, వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపకుడు వేముల శంకర్‌కు స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) వారు అంతర్జాతీయ డాక్టరేట్ అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో అవార్డును అందజేశారు. -
రైతుల పాలిట ‘భూ భారతి’ వరం
గణపురం: భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మే నెలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ధరణి ద్వారా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గణపురం మండలంలో జెన్కో, సింగరేణి సంస్థలలో భూములు కోల్పోయిన నిర్వాసిత ప్రజలు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో 10,900 ఎకరాలకు పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ చట్టం ద్వారా వారి సమస్య తీరుతుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో 70నుంచి 80శాతం సమస్యలు భూములకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
డీజీపీఎస్ పరికరంతో సర్వే వేగిరం
భూపాలపల్లి: సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు డీజీపీఎస్ పరికరం సహకరిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రూ.16.78 లక్షల విలువ గల డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) పరికరాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారికి కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చన్నారు. జిల్లాలో పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయడానికి డీజీపీఎస్ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. సిబ్బందికి ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని, ప్రాధాన్యతను గుర్తించి సర్వేలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. పంట నష్టం నివేదిక అందజేయాలి.. అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందజేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ వీరునాయక్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డులో గల ఓ పెట్రోల్‌బంకు. గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో బంకులోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్‌పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గడ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సాలు మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని వారికి అన్యాయం జరుగవద్దన్నారు. లబ్ధిదారుడికి లక్ష రూపాయలు జమ అయినట్లు ఆమె తెలిపారు. ఆమెవెంట హౌజింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సుమత ఉన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి చిట్యాల: మండలంలోని ముచినిపర్తి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ ఎన్.విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. బేస్మెంట్ వరకు పూర్తిచేసిన వారికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమఅవుతున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రామలింగం, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ మృతి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం మాజీ సర్పంచ్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గంట రామ్నారాయణగౌడ్ (70) అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భార్య లత, కుమార్తె సుజాత ఉన్నారు. భవన నిర్మాణానికి కృషి చేస్తా.. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించే ది కాకతీయ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లారీలు కొన్న ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించుకొని అసోసియేషన్‌లో చేర్పించుకోవాలని అన్నారు. లారీ యాజమానులే ట్రాన్స్‌ఫోర్ట్ ఏర్పాటు చేసుకొని బొగ్గు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు చెరుకుతోట శ్రీరాములు, ఉపాధ్యక్షుడు కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ అన్వర్ పాషా, సహాయ కార్యదర్శి ఎనగంటి రమేష్, కోశాధికారి తాళ్లపల్లి తిరుపతిరావు, టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి యాదవ్, లారీ ఓనర్లు పాల్గొన్నారు. సమష్టిగా ఉంటేనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాప్ అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఏరియాలోని కేటీకే ఓసీ–3 లో ఏఐటీయూసీ ఏడీసీ ఆధ్వర్యంలో గురువారం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అనేక సమస్యలు పరిష్కరించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజేందర్, ఆసీఫ్ పాషా, శ్రీని వాస్, సుధాకర్ రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీని గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కేతిరి సారయ్య, జిల్లా అధ్యక్షుడిగా కేతిరి రాజు, ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరి రవీందర్, ఉపాధ్యక్షులుగా పలువురు ఎన్నికయ్యారు.