
స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు బుర్ర అశోక్, జితేందర్, వినోద్, రమేష్, విజయ్, ప్రశాంత్, విక్రమ్, రాజేష్, రాజు, సదానందం, సునిల్, తదితరులు పాల్గొన్నారు.