
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
భూపాలపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల విచారణ ప్ర క్రియ, మండలస్థాయిలో విచారణ టీముల ఏర్పాటుపై ఎల్డీఎం, డీఆర్‌డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షే మ శాఖల అధికారులు, ఎంపీడీఓ లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల విచారణ ప్రక్రి య ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ని ష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగా లని, పొరపాట్లకు తావులేకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆయా శా ఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చట్టాల అమలు బాధ్యత
కలెక్టర్లదే..
చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
మన్ననలు పొందాలి...
విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ