
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్, దామరంచపల్లి, చిన్నకొడెపాక, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లి, జగ్గయ్యపేట, చెంచుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి గులాబీ జెండాతో రజతోత్సవ సభకు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు జూపాక నీలాంబరం, కానుగంటి శ్రీనివాస్, ఐలయ్య, మహేందర్, యుగందర్ పాల్గొన్నారు.
పెయింటర్‌ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద కల్వర్టు సైడ్ వాల్‌పై బీఆర్‌ఎస్ వాల్‌పెయింట్‌ను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పేరుతో వేయడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే పెయింటర్‌ను అడ్డుకున్నారు.