
ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకో వాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడూ తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్,
వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్)