
వక్ఫ్ భూములపై కుట్ర
భూపాలపల్లి రూరల్: వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి, వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆదివారం జిల్లాకేంద్రంలో జామా మసీదు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిముల ఆస్తులను హరించే కుట్ర అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, కురిమిల్ల శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు