
సివిల్స్ ర్యాంకర్‌ను సన్మానించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన బానోతు జితేంద్రనాయక్‌ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో సన్మానించారు. జితేంద్రనాయక్ తండ్రి ఏరియా వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేంద్రనాయక్‌తో పాటు అతడి తల్లిదండ్రులను జీఎం శాలువతో సత్కరించారు. సింగరేణి ఉద్యోగి కుమారుడు సివిల్స్‌లో ప్రతిభకనబర్చడం సంతోషకరమైన విషయమని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎస్‌వోటు జీఎం పోషమల్లు, అధికారులు వెంకటరమణ, జోతి, అరుణ్‌ప్రసాద్, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.