
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
చిట్యాల/మొగుళ్లపల్లి: భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి మండలకేంద్రాల్లో గురువారం భూ భారతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులపై ఆర్డీఓ విచారణ చేసి అర్హత ఉన్న వారికి భూహక్కులు జారీచేస్తారని అన్నారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, పంగిడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీదేవి, వైస్ ఛైర్మన్ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, టేకుమట్ల మండల ప్రత్యేకాధికారి శైలజ, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
27న మెగా జాబ్‌మేళా
భూపాలపల్లి రూరల్: ఈనెల 27వ తేదీన జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగే మెగా జాబ్‌మేళాను నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. జాబ్ మేళా నిర్వహణపై సింగరేణి అధికారులతో పుష్ప గార్డెన్‌లో గురువారం ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు సుమారు 15వేల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. జాబ్‌మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్‌రావు, జిల్లా, మండల, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్‌శర్మ