
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, శ్యామ్‌నగర్, కొత్తపల్లి(ఎస్‌ఎం) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రతీ గ్రామం నుంచి 100 మందికి తక్కువ కాకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
చిట్యాల: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దూద్‌పల్లి, లక్ష్మీపూర్‌తండా, ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపూర్ గ్రామాల్లో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హాజరై మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి