తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

Published Sun, Apr 20 2025 1:08 AM | Last Updated on Sun, Apr 20 2025 1:08 AM

తర్ఫీ

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

క్రీడల్లో శిక్షణ..

‘దేశం బలిష్టం కావాలంటే యువత మైదానాల్లో చెమట చిందించాలి’ అని ఓ కవి చెప్పినట్లు.. విద్యార్థులు మైదానాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణ కోసం కరాటే, కుస్తీ పట్టడం నేర్చుకోవచ్చు. జిల్లా క్రీడల, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్‌ ఓసిటీ క్రీడా మైదానంలో, హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు.

పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాలి

ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి..

సెల్‌ఫోన్‌ను దూరం పెట్టాలి.. పుస్తకాలను చేరువ చేయాలి

ఆ బాధ్యత తల్లిదండ్రులదే..

సజీవ కళ చిత్రలేఖనం..

సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. కొన్ని వరంగల్‌ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్‌ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పుతున్నారు.

నృత్య, సంగీతంలో..

నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్‌ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్‌రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

పుస్తక పఠనం..

ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేథను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్‌, హనుమకొండలోని సెంట్రల్‌ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు.

పర్యాటక ప్రాంతాల సందర్శన

ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్లలను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని జూపార్క్‌, సైన్స్‌సెంటర్‌, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్‌కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు.

భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ

జిల్లా వికాసతరంగణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు వ్యాసరచన, భగవద్గీత శ్లోకం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వలంటీర్‌గా సేవలందించవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌లో విద్యార్థులు శిక్షణ తీసుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి..

ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరిగెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్‌ అవ్వాల్సిందే. ఇస్రో ప్రతీ యేటా వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థులను ఎంపిక చేస్తోంది. స్థానికంగా ఉన్న కంప్యూటర్‌ శిక్షణలో చేరి కంప్యూటర్‌ బేసిక్స్‌ నేర్చుకోవాలి.

పుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్‌ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్‌ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్‌ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్‌లు, బైహాట్‌లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్‌ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్‌, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్‌

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..1
1/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..2
2/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..3
3/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..4
4/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..5
5/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..6
6/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..7
7/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..8
8/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..9
9/9

తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement