సివిల్స్‌లో మెరిశారు.. | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో మెరిశారు..

Published Wed, Apr 23 2025 7:59 AM | Last Updated on Wed, Apr 23 2025 9:03 AM

ఐదోసారి ఐఏఎస్‌ కొట్టాడు..

ఇప్పటికే ఐపీఎస్‌ శిక్షణలో జయసింహారెడ్డి

తాజాగా ఆల్‌ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు

హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్‌ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్‌ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్‌ వచ్చింది. ప్రస్తుతం నేషనల్‌ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్‌ఆర్‌ ఎడ్యు స్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్‌ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్‌ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా..

నలుగురు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు

నెలరోజుల్లో డబుల్‌ ధమాకా

మొన్న గ్రూప్‌ వన్‌, ఇప్పుడు సివిల్స్‌

సత్తాచాటిన వరంగల్‌ వాసి

తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని

సాక్షి, వరంగల్‌: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్స్‌ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్‌ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్‌ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్‌–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్‌ సాధించి ఔరా అనిపించారు. వరంగల్‌ శివనగర్‌ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్‌ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్‌ రిప్రంజెటివ్‌గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది.

దేశ అత్యున్నత సర్వీస్‌ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్‌ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్‌ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్‌ జితేందర్‌ నాయక్‌ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు తెలిపారు.

నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్‌ సాధించాడు

తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు

ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్‌ సివిల్స్‌ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్‌ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్‌ తండ్రి కిషన్‌ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్‌ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్‌(ఎలక్రికల్‌)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు.

నాన్న ప్రోత్సాహంతో..

మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్‌ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్‌ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్‌ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్‌, సివిల్స్‌ 255 ర్యాంకర్‌

కొడుకు కలెక్టర్‌ కావాలనుకున్నా..

నా కొడుకును కలెక్టర్‌ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్‌ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్‌, హరిప్రసాద్‌ తండ్రి

ఎలాంటి శిక్షణ లేకుండా ప్రిపేర్‌..

సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్‌ నాయక్‌

భూపాలపల్లి అర్బన్‌: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్‌ జితేందర్‌ నాయక్‌ మెరిశారు. ఐపీఎస్‌ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్‌ తండ్రి హేమానాయక్‌ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్‌ 2021లో బీటెక్‌ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్‌ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్‌ పేర్కొన్నారు.

సివిల్స్‌లో మెరిశారు..1
1/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..2
2/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..3
3/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..4
4/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..5
5/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..6
6/7

సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..7
7/7

సివిల్స్‌లో మెరిశారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement