
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.
జడ్జి బాధ్యతల
స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణబాబు బదిలీ కాగా ఆయన స్థానంలో రమేష్‌బాబు వరంగల్ నుంచి బదిలీ చేశారు. ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన నారాయణబాబు హనుమకొండకు బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి దంపతులు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సన్మానించారు.
పుష్కరాలకు 40 ఎకరాల్లో పార్కింగ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల కోసం 40 ఎకరాల్లో మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. విఐపీ ఘాటు వద్ద 25 ఎకరాలు, ఇప్పలబోరు సమీపంలో 15 ఎకరాలు, హనుమాన్ నగర్ వద్ద 5 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. అవే కాకుండా హరితహోటల్ సమీపంలో కూడా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.