
సభకు భారీగా తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగసభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, వజినపల్లి, గొర్లవీడు, గుడాడ్‌పల్లి, కొంపెల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సాగర్‌రెడ్డి, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు నీలంబరం, గుడాడ్‌పల్లి మాజీ సర్పంచ్ ఐలయ్య, మందల రవీందర్‌రెడ్డి, పింగిలి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి