
ముమ్మరంగా నిర్మాణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం (వీఐపీ) జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బేస్‌స్టాండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.కోటితో సరస్వతిమాత విగ్రహం, చుట్టూర నలుగురు వేదమూర్తుల విగ్రహాలు, లాన్ నిర్మించనున్నారు. సరస్వతిమాత విగ్రహం తమిళనాడులోని మహాబలిపురంలో తుది మెరుగులు దిద్దుకున్నట్లు ఆలయవర్గాలు పేర్కొంటున్నాయి. మే మొదటివారంలో విగ్రహాన్ని హైడ్రాలిక్‌తో స్టాండ్ బేస్‌పై ఎరక్షన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.