
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ప్రసంగిస్తున్న కేసీఆర్,
అభివాదం చేస్తున్న
కేసీఆర్
ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలు
సాక్షిప్రతినిధి, వరంగల్:
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్‌రోడ్‌లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది.
తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది
6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్
కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్‌ఎస్‌పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు.
వైఎస్సార్ పాలనను..
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు.
సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు
రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు..
పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
మరిన్ని సభా విశేషాలు
కట్టిపడేసిన ఆటాపాట..
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్‌కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.
గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి
రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి,
నక్సల్స్‌తో చర్చించాలి..
తీర్మానానికి సభ ఆమోదం
అట్టహాసంగా బీఆర్‌ఎస్
రజతోత్సవ సభ
శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం
మృతులకు నివాళి అర్పించి..
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్‌ఎస్ రథసారథి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు.

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం