
యువత సన్మార్గంలో నడవాలి
పలిమెల: యువత చెడు వ్యసనాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉంటూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా సన్మార్గంలో నడవాలని ఎస్పీ కిరణ్‌ఖరే సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి (మహారాష్ట్ర), బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్), ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను సోమవారం పలిమెల మండలకేంద్రంలో ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. సరిహద్దు ప్రజలు, యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో 105 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్, కాటారం సీఐలు రామచందర్ రావు, నాగార్జునరావు, పలిమెల ఎస్సై జె.రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే

యువత సన్మార్గంలో నడవాలి