
అన్నదాతలను ముంచిన అకాల వర్షం
సాక్షి,బళ్లారి: అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందివచ్చిన పంట వర్షార్పణ అయ్యింది. జిల్లాలోని సిరుగుప్ప, కంప్లి, విజయనగర జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుంగభద్ర ఆయకట్టు కింద రబీలో సాగైన వరి పంట నేలకొరిగింది. దాదాపు 75శాతం మేర వరి కోతలు జరిగాయి. రైతులు వరిధాన్యాన్ని పొలాల్లోనే కుప్పలుగా వేసి ఆరబెట్టారు. మార్కెట్‌కు తరలించాల్సిన సమయంలో వర్షం కురవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వడగండ్ల ధాటికి వడ్లు నేలరాలాయి. పొలాల్లో ఎటు చూసినా వడ్లు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఆరటి తోటలు కూడా కుప్పకూలిపోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కపాడుకున్న పంటలు కళ్లెదుటే వర్షార్పణం కావడంతో అన్నదాత కన్నీరు పెట్టారు. ప్రభుత్వం పంటనష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.
రాయచూరులో భారీ వర్షం
రాయచూరురూరల్: ఎండలతో సతమతమవుతున్న రాయచూరు వాసులకు ఊరట కలిగించేలా రాయచూరు నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. కూర గాయల మార్కెట్, బంగీకుంట, మచ్చి బజార్, బైరూన్ కిల్లా ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి పోటెత్తింది. ఏపీఎంసీలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయ. గుంజహళిలో వడగండ్ల వర్షం కురిసింది. పెనుగాలులతో గంట పాటు విద్యుత్ సరఫరాలో నిలిచిపోయింది. వారం రోజలుగా వేసవి ఎండల తీవ్రత పెరిగింది. రోజూ 40 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు తల్లడిల్లి పోయారు. ప్రస్తుతం గంటపాటు వర్షం పడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఈదురుగాలులు, వడగండ్ల వర్షం
పలు గ్రామాల్లో నెలకొరిగిన వరిపంట
నేలపాలైన అరటిపంటలు

అన్నదాతలను ముంచిన అకాల వర్షం

అన్నదాతలను ముంచిన అకాల వర్షం

అన్నదాతలను ముంచిన అకాల వర్షం

అన్నదాతలను ముంచిన అకాల వర్షం